1200 మంది నేతన్నలకు నోటీసులు
Posted On 4 hours 53 mins ago
- రుణమాఫీ అమలుకాని ఫలితం
- కోర్టు ద్వారా ఒత్తిడి తెస్తున్న బ్యాంకర్లు
ప్రజాశక్తి - చీరాల
ముఖ్యమంత్రి చంద్రబాబు వాగ్దానాలు చేనేత కార్మికులను నిలు వునా ముంచాయి. ప్రమాణ స్వీకారం చేసే రోజు చేసిన తొలి సంత కాల్లో చేనేత రుణమాఫీ కూడా ఒకటి. రైతులు, డాక్రా మహిళలతో పాటు చేనేత కార్మికులకూ రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు.. ఆ తర్వాత చేసిన ప్రకటనలు కార్యరూపం దాల్చలేదు. దీంతో చీరాల ప్రాంతంలో బ్యాంకర్ల నుంచి దాదాపు 1200 మంది నేతన్నలకు కోర్టు నుంచి తాఖీదులు అందాయి. ఏడాది కాలంగా రుణాలు చెల్లించా లంటూ బ్యాంకర్లు నోటీసులు ఇస్తూ వచ్చారు. దీనిపై కార్మికుల నుంచి ఆందోళన వ్యక్తమవడంతో గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో మరికొంత గడువు ఇస్తున్నట్లు తెలిపారు. రుణమాఫీతో తమకు సంబంధంలేదని స్పష్టం చేస్తూ బ్యాంకు అధికారులు ఏకంగా కోర్టు నుండి దావా నోటీసులు పంపారు. చీరాల మండలంలో గుర్తింపు కార్డుల ఆధారంగా సిండికేట్ బ్యాంకులో తోటవారిపాలెం, ఈపూరుపా లెం, సిండికేట్ వీవర్స్ కాలనీకి చెందిన 1200మంది రూ.30వేల చొప్పున రుణాలు తీసుకున్నారు. ఈ మొత్తాన్ని ఒకే సారి పూర్తిగా చెల్లించాలని, లేకుంటే ఆస్తులను జప్తు చేస్తామని బ్యాంకు అధికారులు కోర్టు ద్వారా నోటీసులు పంపడంతో లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈనెల 24వ తేదీన కొందరు, 27వ తేదీన కొందరు కోర్టులో హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈపూరుపాలెం ఎస్‌బిఐ, చీరాల కార్పోరేషన్ బ్యాంకు, ఐఒబి, ఇతర బ్యాంకుల్లో రుణా లు తీసుకున్న చేనేత కార్మికులకూ ఇదే విధమైన నోటీసులు అందుతు న్నాయి. ఇంతకాలంగా రుణమాఫీ చేస్తుందని నమ్మిన కార్మికులు ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు. తాము కోర్టుల్లో నిందితులగా మారాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజు గడవడమే కష్టమైన పరిస్థితుల్లో రుణాలు ఎలా చెల్లించాలని తలలు పట్టుకుంటు న్నారు. దావా నోటీసులు పంపడాన్ని నిరసిస్తూ చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నాడు చీరాలలో ఆందోళన చేపట్టనున్నట్లు నాయకులు ప్రకటించారు.

Taags :
No comments:
Post a Comment