పంట బీమాకు ప్రీమియం (బీమా సంస్థలలో తీసుకున్న పాలసీలలో పాలసీదారు వివిధ వాయిదాలలో చెల్లిస్తూ ఉండే మొత్తాలు) చెల్లించడంలో రైతులకు సహాయపడేందుకు ఒక సబ్సిడీ పథకాన్ని అమలుపరచాలని మోదీ ప్రభుత్వం యోచిస్తోంది. దేశంలో మూడింట రెండు వంతుల రైతులు హెక్టారు కంటే తక్కువ భూమినే కలిగివున్నారు. అన్నీ అనుకూలంగా ఉన్న సంవత్సరంలో రూ.75 వేల విలువచేసే 50 క్వింటాళ్ల గోధుమలు ఉత్పత్తి చేయగలమని ఉత్తరాఖండ్‌లోని మా గ్రామ రైతులు చెప్పారు. పంట బీమా ప్రీమియం రెండు శాతం రేటు చొప్పున రూ.1500 అవుతుంది. సన్నకారు చిన్నకారు రైతులకు పంట బీమా ప్రీమియంలో పది శాతం చొప్పున చెల్లించేందుకు ఒక సబ్సిడీ పథకాన్ని ప్రభుత్వం ఇప్పటికే అమలుపరుస్తోంది.
మోదీ ప్రభుత్వం ఆ సబ్సిడీని 20 లేదా 30 శాతానికి పెంచాలని నేను ఆశిస్తున్నాను. రైతులను ఆదుకోవడానికి మోదీ ఆ సబ్సిడీ సహాయాన్ని 50 శాతానికి పెంచారనుకోండి. అప్పుడు ఒక పంటకు రూ.750 చొప్పున రైతుకు బీమా సహాయం సమకూరుతుంది. ఇదేమీ రైతులను ఆకట్టుకోదని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకని? బీమా వ్యయంలో ప్రీమియం ఒక స్వల్ప భాగం మాత్రమే కనుక.
మోదీ ప్రభుత్వం ఆ సబ్సిడీని 20 లేదా 30 శాతానికి పెంచాలని నేను ఆశిస్తున్నాను. రైతులను ఆదుకోవడానికి మోదీ ఆ సబ్సిడీ సహాయాన్ని 50 శాతానికి పెంచారనుకోండి. అప్పుడు ఒక పంటకు రూ.750 చొప్పున రైతుకు బీమా సహాయం సమకూరుతుంది. ఇదేమీ రైతులను ఆకట్టుకోదని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకని? బీమా వ్యయంలో ప్రీమియం ఒక స్వల్ప భాగం మాత్రమే కనుక.
నా అల్టో కారుపై సమ్రగ బీమా పాలసీనొక దాన్ని నేను కొనుక్కున్నాను. ఒక చిన్న ప్రమాదం జరిగింది రూ.14 వేల రూపాయల మేరకు పరిహారం ఇవ్వాలని క్లెయిమ్ చేశాను. తొలుత ఆ కారును ఒక రిపేర్ షాప్‌కు తీసుకెళ్ళి అక్కడ ఉన్న ఒక సీనియర్ మెకానిక్ ద్వారా ప్రమాదంలో కారుకు వాటిల్లిన నష్టం పై అంచనా వేయించాను. ఆ తరువాత బీమా కంపెనీ సర్వేయర్‌కు తెలియజేశాను. ఆ మహానుభావుడు మూడు రోజుల తరువాత వచ్చాడు. కారుకు మరమ్మత్తులు జరిగాయా లేదా అనే విషయాన్ని నిర్ధారణకు రావడానికి మరో మూడు రోజుల వ్యవధిని తీసుకున్నాడు.
ఇదిలావుండగా నాకు పది రోజుల పాటు కారు సదుపాయం లేకుండాపోయింది. టాక్సీలో ప్రయాణాలు సాగించినందుకు గాను నాకు అదనంగా రూ.7000 వ్యయమయింది. క్లెయిమ్ ప్రక్రియ పూర్తయున తరువాత కూడా నాకు రావాల్సిన బీమా సొమ్ము అందనేలేదు. ఆరా తీయగా సర్వేయర్ నా క్లెయిమ్‌కు సంబంధించి ఎటువంటి నివేదిక పంపించలేదని తెలిసింది. సర్వేయర్‌తో మాట్లాడాను. అతను కొన్ని అదనపు డాక్యుమెంట్లు కోరాడు. అవి లేకపోవడం వల్లే అతను నివేదిక పంపలేదు. బహుశా అతను నా వద్ద నుంచి కొంత కమిషన్‌ను ఆశిస్తున్నాడేమో! నా అవసరాన్ని వివరించిన తరువాత అతను నివేదిక పంపాడు. అయినప్పటికీ బీమా కంపెనీ నుంచి నాకు చెక్ అందలేదు. ఈ విషయమై కంపెనీ వారిని అడుగగా పంపవల్సిన సొమ్మును ఇప్పటికే మీ బ్యాంకు ఖాతాకు జమ చేశామని చెప్పారు! నా ఖాతాలో ఎటువంటి సొమ్ము జమకాలేదని బ్యాంకు సిబ్బంది చెప్పారు. ఇలా రెండు వారాలు గడిచింది. నేను ఆ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవడంతో ఎట్టకేలకు ఆ డబ్బును నా ఖాతాకు జమచేశారు. అంతిమంగా నాకు లభించిన బీమాసొమ్ము రూ.7000 మాత్రమే !
మోదీ ప్రభుత్వ ప్రతిపాదిత బీమా పథక లక్ష్యం రైతును వడ్డీ వ్యాపారి దోపిడీనుంచి విముక్తి చేయడమే. అయితే ప్రభుత్వమే రైతును రుణ ఊబిలోకి దింపుతుంది సుమా! రాజస్థాన్‌లోని ఒక ఎన్‌జీఓ కృషిని నేను నిశితంగా పరిశీలించాను. ఒక స్వయం సహాయక బృందాన్ని ఆ ఎన్‌జీఓ ఏర్పాటు చేసింది. ఆ బృందానికి బ్యాంకు రుణాలు ఇప్పించింది. ఈ లబ్ధితో రైతులు గేదెలను కొనుక్కుని మంచి ఆదాయాన్ని గడిస్తున్నారు. ఐదుసంవత్సరాల క్రితం గ్రామంలో ఎన్ని గేదెలు ఉండేవి? ఇప్పుడు ఎన్ని ఉన్నాయని గ్రామస్తులను అడిగాను. అప్పుడు ఎన్ని గేదెలు ఉన్నాయో ఇప్పుడూ అన్నే గేదెలు ఉన్నాయని వారు చెప్పారు! అంటే అర్థమేమిటి? బ్యాంకుల నుంచి లభించిన రుణాన్ని గేదెలను కొనుక్కోవడానికి ఉపయోగించుకోలేదు.
నిజానికి బ్యాంకు నుంచి రుణం తీసుకోక ముందే రైతులకు గేదెలు ఉన్నాయి. ఉన్న గేదెలపైన వారు రుణం తీసుకున్నారు. గతంలో వారు ఆ గేదెలపై పదివేల రూపాయలు ఆర్జిస్తుండే వారు. ఆ సొమ్మునంతటినీ వారు తమ సొంతానికి వినియోగించుకొనేవారు. ఇప్పుడూ ఆ రైతులు పదివేల రూపాయలను ఆర్జిస్తున్నారు. అయితే రూ.1000 వడ్డీ చెల్లిస్తున్నారు. ఇక మిగిలింది రూ.9000 మాత్రమే. బ్యాంకు రుణాల వల్ల రైతులకు నిజానికి ఆదాయం తగ్గింది. ఆ రుణాన్ని పిండిమిల్లు ఏర్పాటు వంటి ఏదైనా మరింత ఉత్పాదక ప్రయోజనానికి వినియోగించుకున్నట్టయితే పరిస్థితి మరో విధంగా ఉండేది. అయితే ఆ గ్రామంలో అటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.
వ్యవసాయక ఉత్పత్తుల ధరలను ఉద్దేశపూర్వకంగా తక్కువగా ఉంచడంతో సేద్యం చాలావరకు నష్టదాయక కార్యకలాపంగా పరిణమించింది. నష్టాల్లో ఉన్న కంపెనీ బ్యాంకు రుణాలు తీసుకొని, వాటిని తిరిగి చెల్లించలేక చివరకు దివాళాతీసిన మాదిరిగా రైతుల పరిస్థితీ మారింది.
వాజపేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల హయాంలో ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు పన్నిన వ్యూహాల్లో భాగంగానే రైతులకీ దుస్థితి కొనసాగుతోంది సుమా! ప్రభుత్వాధికారులు, ఉద్యోగులు సదా సంతోషంగా ఉండాలంటే రైతులు నిత్యం పేదరికంలోనే ఉండాలి మరి! ఈ అభాగ్య రైతులను మరింతగా రుణ శృంఖలాల్లో బంధించాలని మోదీ భావిస్తున్నారు. ఆయన అధికారులు రైతులను బీమా సంస్థల వలలో చిక్కుకునేలా చేయాలని యోచిస్తున్నారు. తద్వారా వారు పేదలుగానే ఉండిపోతారు. బీమా క్లెయిమ్‌ల నెపంతో కమిషన్లను దండుకోవడానికి ప్రభుత్వాధికారులకు మరో అవకాశం లభిస్తుంది గదా!
- భరత్ ఝన్‌ఝన్‌వాలా
No comments:
Post a Comment