Sunday, July 12, 2015

nellore dr.ramachandrareddy

ప్రజారోగ్యం ప్రభుత్వాల బాధ్యతే

Posted On 5 hours 3 mins ago
ప్రజారోగ్యం ప్రభుత్వాల బాధ్యతే
-  పిహెచ్‌సిలను బలోపేతం చేయాలి
-  విశ్రాంత ఐఎఎస్‌ అధికారి సుజాతారావు 
-  ఘనంగా డాక్టర్‌ రామచంద్రారెడ్డి శత జయంతి
ప్రజాశక్తి - నెల్లూరు సిటీ ప్రతినిధి
              ప్రజారోగ్యమనేది ప్రభుత్వాల ప్రధాన బాధ్యతని నెల్లూరు జిల్లా మాజీ కలెక్టర్‌, వుమన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ శాఖ విశ్రాంత కార్యదర్శి కె. సుజాతారావు అన్నారు. డాక్టర్‌ రామచంద్రారెడ్డి శత జయంతి ఉత్సవాల సందర్భంగా డాక్టర్‌ రామచంద్రారెడ్డి ఆసుపత్రి, డాక్టర్‌ జెట్టి శేషారెడ్డి మెమోరియల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని ఎంసిఎస్‌ కల్యాణ మండపంలో 'ప్రజారోగ్యం పరిరక్షణ' అనే అంశంపై ఆదివారం సెమినార్‌ జరిగింది. వ్యాధులు - ఆరోగ్యం, ఎపిలో ప్రస్తుత ఆరోగ్య స్థితిగతులు, సేవారంగం నుంచి వ్యాపారరంగంగా మారిన ఆరోగ్యం, సామాన్య ప్రజల ఆరోగ్య రక్షణ - ప్రపంచ అనుభవాలు, ఆరోగ్య రంగంలో ఎన్‌జిఓల పాత్ర అనే అంశాలపై పలువురు మేథావులు చర్చించారు. తొలుత డాక్టర్‌ రామచంద్రారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నిర్మాహకులు, ఆహ్వాని తులు నివాళులర్పించారు. సెమినార్‌లో చర్చలను ప్రారంభించిన సుజాతరావు మాట్లాడుతూ నేడు ఆరోగ్యరంగం వ్యాపారంగా మారిపోయిందని ఆవేద న వ్యక్తం చేశారు. కోట్లు ఖర్చు పెట్టి మెడికల్‌ సీట్లు కొనుక్కుంటున్నారని అన్నారు. పల్లెల్లో వైద్యసేవలందించేందుకు వైద్యులు ముందుకు రావడం లేదన్నారు. వైద్యం వ్యాపారంగా మారడమే అందుకు కారణమన్నారు. ఆరోగ్యం అనేది ప్రభుత్వం చేతిలోనే ఉండాలన్నారు. ఇంగ్లాండ్‌, అమెరికాల్లో కూడా ఆరోగ్యరంగం 80శాతం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తుందని వివరించారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఆస్తులు అమ్ముకో వాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. గుండె పోటు, మలేరియా లాంటి వ్యాధులొస్తే డబ్బుతో సంబం ధం లేకుండా సమయానికి సేవలందే పరిస్థితి ఉండాల న్నారు. వైద్యులు, మందులు, ఆస్పత్రులుంటేనే ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం అందదన్నారు. రక్షిత మంచినీరు, పారిశుధ్యం, పోషకాహారం వంటి సామాజిక అంశాలపై ప్రజారోగ్యం ఆధారపడి ఉంటుందన్నారు. ఈ సామాజిక సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనన్నారు. ఆంధ్రప్రదేశ్‌ కన్నా కేరళ, తమిళనాడులో ఆరోగ్య పరిస్థితులు చాలా మెరుగ్గా ఉన్నాయని తెలిపారు. 1972 నాటి నుంచే పిహెచ్‌సిలను ఏర్పాటు చేసినా నేటికీ అవి డాక్టర్లు, సిబ్బంది, మందుల కొరతతో ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ మంచిదేనని, అయితే పిహెచ్‌సిల నిధులకు కోత పెట్టి ఆ పథకానికి మళ్లించడం తగదన్నారు. రాష్ట్రంలో ఏటేటా సుమారు ఐదు లక్షల మంది డయేరియాతో బాధపడుతున్నారని వివరించారు. సకాలంలో సెలైన్లు, ఓఆర్‌ఎస్‌ లాంటి అతి తక్కువ ఖర్చులేని వైద్యమందిస్తేనే ఆ వ్యాధి నయమవు తుందన్నారు. దానికి కూడా తగిన బడ్జెట్‌ లేక పోవడం దారుణమన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా 80 శాతం నిధులను ప్రయివేటు ఆసుపత్రులే పొందుతు న్నాయన్నారు. 90శాతం మంది వైద్యసేవలు పిహెచ్‌సిల్లోనే పొందుతున్నారని అన్నారు. జిల్లా ఆసుపత్రికి తొమ్మిది శాతం మందే రావాల్సి ఉంటుందన్నారు. కేవలం ఒక్క శాతం రోగులే సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రులకు వెళ్తున్నారని అన్నారు. ఎన్‌టిఆర్‌ ఆరోగ్య సేవలో కేవలం రూ.2.50లక్షలకు మాత్రమే వైద్య సేవలందుతాయని తెలిపారు. అంతకన్నా ఎక్కు ఖర్చు అయితే రోగికి వైద్య సేవలు నిలిపేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇకనైనా ప్రభుత్వం తగిన నిధులు వైద్య రంగానికి కేటాయించే విధంగా ప్రజలు డిమాండ్‌ చేయాలన్నారు. డాక్టర్‌ రామచం ద్రారెడ్డి ప్రజావైద్యశాలలో మాదిరిగా జీతాలు తీసుకుంటూ వైద్యసేవలందించేవారు ముందుకు రావాలని కోరారు. ప్రముఖ నెఫ్రాలజిస్టు డాక్టర్‌ ఎస్‌విఎల్‌ నారాయణరావు మాట్లాడుతూ మానవు డు సంచారి జీవిగా కాలం గడిపినంత కాలం అంటువ్యాధులు లేదని, స్థిర నివాసం ఏర్పరుచుకుని పశు పక్ష్యాదులను పెంచుకోవడం మొదలైన తర్వాతే అవి ప్రబలాయని అన్నారు. ప్రకృతి అందించే ఆకుకూరలు, కాయకూరలు తింటే ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. చక్కెర, ఉప్పు, నూనెలు వాడాల్సిన అవసరం లేదన్నారు. డాక్టర్‌ సుందర రామన్‌, డాక్టర్‌ రాకాల్‌ ప్రజారోగ్యం కాపాడుకునేం దుకు చేపట్టాల్సిన చర్యలు గురించి వివరించారు. కార్యక్రమంలో ప్రజావైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అజరుకుమార్‌, ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్‌ గేయానంద్‌, సిపిఎం సీనియర్‌ నాయకులు జక్కా వెంకయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్‌, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వైద్య నిపుణులు సదస్సుల్లో పాల్గొన్నారు.

No comments:

Post a Comment