దేవాలయ భూ' కౌలుదార్లకు రక్షణేది?
Posted On Sat 18 Jul 23:09:58.228548 2015
అమృతలూరు మండలం కోరు తాడిపర్రు గ్రామంలోని పేద రైతులు ఆత్మహత్యాయత్నం చేశారు. వారిలో ఇద్దరు మృతిచెందారు. ఆ భూములపై దేవస్థానానికి, సాగుదారులకు చాలాకాలంగా వివాదం నడుస్తున్నది. పేదలైన సాగుదారులు తొమ్మిది దశాబ్దాలుగా తమ తాతల కాలం నుంచి సాగుచేసుకుంటున్నామని సిసిఎల్‌ఎ కోర్టులో అప్పీలు చేసుకున్నారు. సిసిఎల్‌ఎ ఆ భూముల్లోకి ఎవరూ వెళ్ళ వదని ఆదేశించింది. అయినా దేవాదాయ శాఖ అధికారులు ఆ భూములకు వేలంపాట నిర్వహించారు. తట్టుకోలేని సాగుదారులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దేవదాయశాఖ దుర్మార్గాలలో ఇది తొలి ఘటన కాదు. వీరి ఆగడాలను అడ్డుకోకపోతే చివరి ఘటన కూడా కాకపోవచ్చు.
1983లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం దేవాలయ భూముల సమస్యపై చల్లా కొండయ్య కమిషన్‌ను నియమించింది. ఆ కమిషన్ దేవాలయ భూమలను విక్రయించి వచ్చిన డబ్బును బ్యాంకులో పెట్టి, వచ్చే వడ్డీతో దేవాలయాలు నిర్వహించాలని సలహా ఇచ్చింది. దానిని కౌలు రైతాంగం రాష్ట్రవ్యాప్తంగా తీవ్రంగా వ్యతిరేకించారు. 1987లో దేవదాయ, ధర్మదాయ చట్టంలో 82 సెక్షన్ ప్రకారం కౌలుదారులను తొలగించడానికి ఎమ్‌ఎస్ నెం 456 జీవో తెచ్చింది. ఆ జీవోను వ్యతిరేకిస్తూ రైతాంగం ఆందోళనలకు దిగారు. రాష్ట్రంలోని దేవాలయ భూముల కౌలు రైతులందరూ సంఘంగా ఏర్పడి సమస్యను హైకోర్టుకు, తర్వాత సుప్రీంకోర్టుకు తీసుకెళ్లారు. సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వ జీవోను సమర్థిస్తూనే స్వంత భూమితో సహా రెండున్నర ఎకరాల మాగాణి లేదా అయిదు ఎకరాల మెట్ట సాగుచేస్తున్న పేద సాగుదార్లకు రక్షణ కల్పించాలని చెప్పింది. ఆ తీర్పు ప్రకారం గుర్తింపు పొందిన పేద కౌలు దారులకు అమలులో ఉన్న కౌలులో మూడింట రెండు వంతులు మాత్రమే తీసుకోవాలని, కౌలుదారు భూమిని కొనుగోలు చేయగలిగితే మార్కెట్ రేటులో 75 శాతం రేటుకు సాగుదారుకు ఇవ్వాలి. వారికి ఆ సొమ్ము మొత్తాన్ని నాలుగు వాయిదాల్లో చెల్లించుకునే అవకాశం ఉంది.
సుప్రీంకోర్టు తీర్పు అనంతరం 2003వ సంవత్సరంలో ప్రభుత్వం 379 నెంబర్ గల జీవోను విడుదలచేసింది. పేద కౌలు రైతుకు రక్షణ కల్పించాలనే తీర్పులోని భాగాన్ని అమలు పర్చకుండా వేలంపాటలలకు సిద్ధపడింది. రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం ఆందోళనకు గురైంది. ఆ సమయంలో శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలో సంపతిరావు అనే పేద కౌలు రైతు గుండె ఆగిచనిపోగా, పొందూరు ప్రసాదరావు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా కౌలుదారులు వేలంపాటలను అడ్డగించడంతో అర్హత కలిగిన వారిని గుర్తించి పూర్ పెజెంట్ సర్టిఫికెట్ ఇవ్వటానికి అంగీకరించారు. సర్టిఫికెట్ ఇవ్వటానికి కూడా అనేక ఆటంకాలు కల్పించారు. సర్టిఫికెట్లు ఇచ్చిన వారికి కూడా మూడింట రెండు వంతుల కౌలు అమలు పర్చటానికి, కొనుగోలుకు అవకాశం కల్పించడం లేదు. ఆ తర్వాత అనేక సవరణలతో జీవోలు తెచ్చి ప్రతి మూడు సంవత్సరాలకు 10 శాతం కౌలు పెంచుతున్నారు. లేకపోతే ఖాళీ చేయిస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆనాడు 3 లక్షల 60 వేల ఎకరాల దేవాలయ భూములు ఉన్నాయి. 1 లక్ష 75 వేల మంది సాగుదార్లు ఉన్నారు. భూస్వాముల అక్రమణలో ఉన్న చోట్ల సబ్‌లీజులుగా ఇచ్చారు. ఈ క్రింది ప్రదేశంలో 3 లక్షల 3 వేల ఎకరాలు ఉంది. లక్ష మందికిపైగా సాగుదార్లు ఉన్నారు. ఈ సాగుదార్లంతా నూతనంగా వచ్చిన ట్రస్టీ యాజమాన్యాలతోనూ, దేవదాయ శాఖ అధికారులతోనూ ఏదో ఒక వేదింపులకు గురవుతూనే ఉన్నారు.
కౌలు వసూళ్లు
పేదసాగుదారుగా గుర్తించిన వారికి గతంలోనున్న కౌలులో మూడింట రెండు వంతుల కౌలు మాత్రమే తీసుకోవాల్సి ఉంది. రకరకాల కారణాలు చెప్పి పూర్తి కౌలు వసూలు చేస్తున్నారు. మూడు సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంటు అయిపోయిందని చెప్పి 10 శాతం కౌలు పెంచుతున్నారు. కౌలుదారు సాధారణ రకం ధాన్యం పండించినా బిపిటి రకం రేటు లెక్కగట్టి వసూలు చేస్తున్నారు. సకాలంలో చెల్లించలేదని చెప్పి 2 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు. మార్కెటులో ధర పడిపోయి రైతు తక్కువకు అమ్ముకున్నా నిర్ణయించిన ధర వసూలు చేస్తున్నారు.
వైపరీత్యాలు
ప్రకృతి వైపరీత్యాలకు అందరితో పాటు దేవాలయ భూముల రైతులు కూడా నష్టపోతారు. అయినా కౌలు తగ్గించరు. 2006లో ఓగ్ని తుపానుతో తీవ్రంగా నష్టపోయినందున రాష్ట్ర ప్రభుత్వం దేవాలయ భూముల కౌలుదారులకు కమిషన్ ఇస్తూ జీవో ఇచ్చింది. అయినా అధికారులు వసూలుకు పూనుకున్నారు. రైతాంగం ఆందోళన చేసిన దగ్గర మాత్రమే అమలు చేశారు. ఆందోళన చేయని చోట్ల బకాయి కింద రాసి మరుసటి సంవత్సరం వసూలు చేశారు. జిల్లా కలెక్టర్ సర్టిఫికెట్ ఇచ్చినా అంగీకరించటంలేదు.
భూమి కొనుగోలు అవకాశం
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం భూమి కొనుక్కోవటానికి సిద్ధపడినా ట్రస్టు బోర్డు అంగీకరించటం లేదు. ఇటీవల కృష్ణాజిల్లా యనమలకుదురు గ్రామంలో చాలాకాలంగా నివాసముంటున్న పేదలకు కొనుగోలు కమిషనర్ అవకాశం కల్పించారు. అయినా ట్రస్టు యాజమాన్యం, అధికారులు మగవారు ఇళ్లలో లేని సమయంలో పొక్లెయిన్‌లు తీసుకొని వెళ్లి పక్కాగా వేసుకున్న ఇళ్లను కూల్చేశారు. కోటి రుపాయల ఆస్తిని నష్ట పరిచారు.
ఆగిరిపల్లి గ్రామంలో 695 ఎకరాల ఈనాము భూములను 80, 90 ఏళ్ళ నుంచి 1,135 మంది సాగుదార్లు సాగులో ఉన్నారు. 700 మంది ఇళ్లు వేసుకుని ఉన్నారు. ఇటీవల వారందరినీ ఖాళీ చేయమని నోటీసులు ఇచ్చారు. వివాదం కోర్టుకు చేరింది. వాస్తవానికి ఈ భూములకు ధర చెల్లించి రిజిష్టర్ చేయించటానికి స్వయానా చల్లా కొండయ్య గారే అగ్రిమెంటు చేయించారు. ఒక రైతు రిజిష్టర్ చేయించగానే దేవాలయానికి ఆ భూములపై హక్కు లేదని తేలటంతో రిజిస్ట్రేషన్ అధికారులు రిజిస్ట్రేషన్ చేయ నిరాకరించారు.
వేంపాడు భూములు
కృష్ణా జిల్లా వేంపాడు భూములు 3,200 ఎకరాలు 50 ఏళ్ళ నుంచి కోర్టులలో ఉంది. జిల్లా కోర్టు, హైకోర్టు ఈనాము ఎస్టేటుగా తీర్పుచెప్పి పట్టాలు ఇవ్వాలని చెప్పినా దేవదాయ శాఖ దేవాలయ నిర్వాహణకు ఇప్పించాలని సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును ఖారారు చేసింది. ఈ భూములలో అనాదిగా సాగులో ఉన్నవారిని మినహాయించి ఇటీవల కోనుగోలు చేసిన 1,600 ఎకరాలలోని రైతులు మాత్రం ఎకరాకు 1 క్వింటా వేరుశనగ లుదా అందుకు సమానమైన నగదును అవశ్యకంగా ఇవ్వాలని చెప్పింది. అనాదిగా సాగులో ఉన్న 700 మంది రైతులను మినహాయించింది. వీరందరికీ పట్టాలు ఇవ్వటం కోసం గవర్నర్ ఆర్డరుతో గెజిట్ నోటిఫై చేసి ఫీల్డ్ సర్వే, పొజిషన్ సర్వే పూర్తిచేశారు. ఈ దశలో అక్రమంగా పేదల భూమి స్వాధీనం చేసుకున్న ఒక భూస్వామితో భూమి దేవస్థానానిదేనని, తన తండ్రి కాలం నుండి కౌలు చేస్తున్నామని వాంగ్మూలం ఇప్పించి, మొత్తం భూములకు పాత బకాయిలతో సహా చెల్లించాలని, అనాదిగా సాగుచేసుకుంటున్న నిరుపేదలైన దళిత, వెనుకబడిన కులాల రైతులందరికీ నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం జాయింట్ కమిషనర్ అప్పీలో ఉంది. ఏ క్షణాన ఏమవుతుందోనని సాగుదార్లు ఆందోళన చెందుతున్నారు.
పై ఉదంతాలు దేవాదాయ శాఖ లీలలలో కొన్ని మాత్రమే. రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటివి చాలానే ఉన్నాయి. తిరిగి తెలుగుదేశం అధికారంలోకి రావడంతో నూతన ట్రస్టీలు రంగం మీదికి వచ్చారు. ఎప్పుడు ఎక్కడ ఏ దేవాలయ పరిధిలో సాగుదారులకు ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఈ స్థితిలో జరిగిన కోరు తాడిపర్రు గ్రామ ఘటన దేవాలయ భూముల సాగుదార్లలో భయాందోళనలు రేపుతున్నాయి. ఎక్కడికక్కడ దేవాలయ భూముల సాగుదార్లు ఐక్యంగా నిలబడి భూములను కాపాడుకోవాల్సిందే.
- వై కేశవరావు
(వ్యాసకర్త కృష్ణాజిల్లా రైతు సంఘం అధ్యక్షులు)

Taags :
No comments:
Post a Comment