గ్రీస్ భవితవ్యమేమిటి?
Added At : Tue, 07/07/2015 - 17:44
Share this on your social network site
తీవ్ర రుణసంక్షోభంలో కూరుకుపోయిన గ్రీస్ దేశంలో రుణదాతల బెయిల్‌ఔట్ ప్యాకేజికి నిర్వహించిన రిఫరెండమ్‌లో అంతర్జాతీయ ఆర్థికసంస్థల ప్యాకేజిలను గ్రీస్‌ప్రజలు తిరస్కరించడంతో మరింత సం క్షోభానికి తెరలేచింది..61శాతం మంది గ్రీస్‌ప్రజలు రిఫ రండమ్‌లో 'నో అని ఓటు వేసారు.రుణదాతలు ప్రతిపా దించిన వ్యయనియంత్రణ చర్యలను కూడా గ్రీస్‌ప్రజలు వ్యతిరేకించారు.అయితే దీనివల్ల గ్రీస్‌కు మరింత ప్రమా దం ముంచుకొచ్చిపడుతోంది.యూరోజోన్‌లోని 16దేశాల కూటమినుంచి బైటకు రావాల్సినపరిస్థితి ఎదురవుతోంది. అంతేకాకుండా ఇకపై యూరో కరెన్సీ కాకుండా తన సొంత పాత కరెన్సీనే ప్రవేశపెట్టాల్సి వస్తుంది. సబ్సిడీలన్నీ ఎత్తివేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే గ్రీస్‌లోని అతిపెద్ద బ్యాంకు కుప్పకూలింది. ఆదే దారిలో మరో నాలుగు బ్యాంకులున్నాయి. అయినప్పటికీ వామపక్ష ఆధ్వర్యంలోని అలెక్సి సిప్రాస్ ప్రభుత్వం రుణదాతల ఆంక్షలు, ఉద్దీపనల ప్రతిపాదనలకు తలొగ్గడంలేదు. స్వీయనిర్ణయానికే గ్రీస్‌ప్రజలు ఓటు వేసారు. మన దేశ ప్రగతిపై అంతర్జాతీయ ఆర్థికసంస్థల పెత్తనం ఉండకూడ దన్నది ఆ దేశ ప్రధాని అభిప్రాయం. ఆర్థికసంస్థల షర తులప్రకారం నడుచుకుంటే గ్రీస్‌కు భవిష్యత్తు ఉండద న్న ఆయన వాదనను దేశ ప్రజలు సమర్ధించారు. రుణ సంక్షోభం నుంచి బైటపడేందుకు ఆయన సొంతంగా నిర్ణయించుకున్న ప్రత్యామ్నాయ ప్రణాళికలు అమలుచేయా లంటే దేశప్రజలు తనవైపే ఉన్నారన్న భరోసా కల్పించా లి. ముందుగా ఐఎంఎఫ్‌కు ఈ అంశాన్ని రుజువుచేసిచూ పించాల్సి ఉంటుంది.వారంరోజుల గడువులోనే రిఫరెెండమ్‌కు తెరతీసి ప్రజలు తన వెంటే ఉన్నారని సిప్రాస్ నిరూపించుకున్నారు.దీనికితోడు రిఫరెండమ్ ఫలితాలు వెలువడినవెంటనే గ్రీస్ ఆర్థికమంత్రి రాజీనామా చేశారు.
ఇకపై యూరోగ్రూప్‌లో జరిగే అన్ని చర్చల్లోను గ్రీస్ ఆర్థికమంత్రిస్థానంలో ప్రధాని సిప్రాస్ పాల్గొంటారు. సుమారుగా 1.10 కోట్లమందికిపైగా జనాభా ఉన్న గ్రీస్ రుణభారం ఆ దేశ స్థూలదేశీయోత్పత్తి కంటే 180శాతం అధికంగాఉంది. అంతర్జాతీయ ద్రవ్యనిధిసంస్థ (ఐఎం ఎఫ్),ఐరోపా కేంద్రబ్యాంకు (ఇసిబి)ఐరోపా కమిషన్(ఇసి) లకు గ్రీస్ భారీగా బకాయిపడింది. ఐఎంఎఫ్‌కు చెల్లించా ల్సిన 180 బిలియన్ డాలర్ల కిస్తీని చెల్లించలేమని చేతు లెత్తేసింది.దీనితో ఐఎఎంఫ్,యూరోజోన్‌లు గ్రీస్‌పై చర్య లు తీసుకునేందుకు తప్పనిపరిస్థితులు ఎదురైనాయి. వాస్తవానికి గతనెల 30వతేదీతో ఐఎంఎఫ్‌కు చెల్లించా ల్సిన గడువు తీరిపోయింది. తాము చెల్లించలేమని గ్రీస్ కూడా ఆ రోజే స్పష్టంచేసేసింది.2001లో యూరోజోన్ లో చేరిన గ్రీస్‌లో 2010నుంచి ఆర్థిక భారం పెరిగింది. గ్రీస్ ఆర్థిక సంక్షోభం నుంచి బైటపడేందుకు ఐఎంఎఫ్, యూరోజోన్‌లు 2010-2012 సంవత్సరాల్లో రెండు పర్యాయాలు ఉద్దీపనలు ప్రకటించాయి.రుణాల మంజూరుతో పాటు కఠినమైన నిబంధనలు విధించాయి.ఇదే గ్రీస్‌ప్రజల అసంతృప్తికి కారణమైంది. ఈ ఏడాది ఎన్ని కల్లో ఆ నిబంధనలకు వ్యతిరేకంగా గళమెత్తిన సిరిజా పార్టీ విజయంతో ఆ పార్టీ నాయకులు సిప్రాస్‌ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. రిఫరెండమ్‌కు ప్రజల మద్దతు లభించింది.అయితే ఐరోపా కూటమి నుంచి గ్రీస్ బయ టకు రావాల్సి వస్తుంది.అదేవిధంగా అంతర్జాతీయ రుణ దాతలు ఐఎంఎఫ్,యూరోజోన్ నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోతే గ్రీస్‌ను రుణ ఎగవేతదారుగా ప్రకటించాల్సి వస్తుంది.
గ్రీస్‌కు ఐరోపాకూటమిలో అన్నిదేశాలకంటే జర్మనీ అత్యధికంగా రుణాలిచ్చింది.ఒకవిధంగా చెప్పాలంటే ప్రస్తుత గ్రీస్ రుణసంక్షోభం జర్మనీకి గుదిబండగా మారనున్నది. ఈనెల 20లోపు ఐరోపా కేంద్రబ్యాంకుకు గ్రీస్ 3.46 బిలియన్ డాలర్లు చెల్లించాల్సిఉంది.ఒకవేళ రుణ మొత్తం చెల్లించకపోతే బ్యాంకు నుంచి అత్యవసర రుణాలన్నీ బంద్ అవుతాయి. దీనితో గ్రీస్‌లో ఆర్థిక సంక్షోభం మరింత పెరుగుతుంది. బ్యాంకులు దివాలాతీస్తాయి. ఉద్యోగులకు వేతనాలు, పింఛన్ల చెల్లింపులు కూడా నిలి చిపోయే ప్రమాదాలు ఉంటాయి. ప్రజలకు నిత్యావసర వస్తువుల సరఫరాకూడా స్తంభించేప్రమాదాలు మున్ముందు రానున్నట్లు అంతర్జాతీయ ఆర్థిక నిపుణుల విశ్లేషణ. యూరోజోన్‌లో జర్మనీతోపాటు ఫ్రాన్స్‌కూడా గ్రీస్‌కు ఎక్కువ రుణాలిచ్చింది.దీనితో రుణదాతలతో డీల్ సత్వరమే కుదుర్చుకోగలమని గ్రీస్ ప్రభుత్వప్రతినిధులు చెబు తున్నారు.అలాగే ప్రస్తుతం గ్రీస్‌కు అత్యవసర నిధులు అందిస్తున్న యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్‌ను మరింతగా నిధులు పెంచాలని కోరే అవకాశం ఉంది. బెయిల్ ఔట్ పాకేజి నిలిచిన తర్వాత గ్రీస్ బ్యాంకులకు పరిమిత యూరోలను సరఫరాచేస్తోంది. ఈ నిధులు తక్కువగా ఉన్నాయని గ్రీస్ వాదిస్తోంది.మరోపక్కప్రజలు ఎటిఎంల లో నుంచి తీసుకునే మొత్తం 60యూరోలకు మించకూ డదని ప్రభుత్వం విధించిన షరతులు మరికొంత పెరిగే ప్రమాదం కూడా లేకపోలేదు.స్వేఛ్ఛగా,నిశ్చింతగా జీవిం చాలనేది మా ప్రజల హక్కు అని ఈ అంశాన్ని ఎవ్వరూ కాదనలేరని ప్రధాని సిప్రాస్ చెపుతున్నారు.గ్రీస్‌వాసులు తమ తలరాత తామే నిర్ణయించుకోగలరన్న విశ్వాసం ప్రకటించారు.అధికారికంగా గ్రీస్ దివాలాతీసిందని యూ రోపియన్ యూనియన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక గ్రీస్ కూటమి నుంచి వైదొలిగిన పక్షంలో సొంత కరెన్సీతోపాటు సత్వర ఉపశమన చర్యలకు ఆ దేశ ప్రజలను సమాయత్తం చేయాల్సిన బాధ్యత సిప్రాస్ ప్రభుత్వ భుజస్కంధాలపైనే ఉందని చెప్పకతప్పదు
- See more at: http://www.vaartha.com/%E0%B0%B8%E0%B0%82%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A6%E0%B0%95%E0%B1%80%E0%B0%AF%E0%B0%82/%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%B8%E0%B1%8D%E2%80%8C-%E0%B0%AD%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%AE%E0%B1%87%E0%B0%AE%E0%B0%BF%E0%B0%9F%E0%B0%BF#sthash.vHHtquZu.dpuf
No comments:
Post a Comment