సిపిఎం ఆధ్వర్యాన కోరంగి కంపెనీ భూముల్లో పేదల సాగు
Posted On 6 hours 58 mins ago
ప్రజాశక్తి - తాళ్లరేవు
సిపిఎం ఆధ్వర్యాన తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు కోరంగి కంపెనీ భూముల్లో పోలెకుర్రు పంచాయతీకి చెందిన పేదలు గురువారం నుంచీ వ్యవసాయ సాగు ప్రారంభించారు. జూలై 13న కోరంగి కంపెనీ భూములను సిపిఎం ఆధ్వర్యంలో ఎర్రజెండాలు పాతి పేదలు స్వాధీనం చేసుకున్నారు. తూర్పుపేట, జైభీమ్‌పేట, జార్జిపేట, తూర్పుపేట బిసి కాలనీ, ఎస్‌సి కాలనీలకు చెందిన సుమారు 200 మంది ప్రజలు ఈ భూముల్లో ప్రవేశించి గురువారం దుక్కిదున్నారు. సుమారు 25 ఎకరాల భూములను వీరు కష్టపడి సాగులోకి తెచ్చారు. 15 ఎకరాల భూముల్లో విత్తనాలు వెదజల్లారు. ఈ భూములను 30 ఏళ్లుగా భూస్వాములు అనుభవించారు. వీటిని తమకు పంచాలని పేదలు ఎప్పటి నుంచో పోరాడుతున్నారని కోరంగి కంపెనీ భూముల పోరాట కమిటీ నాయకులు తమ్మిడి వీర్రాజు, పలివెల శేషారావు, గుత్తుల సత్యనారాయణ తెలిపారు. సుమారు 15 బస్తాల వరి విత్తనాలను నాటామని తెలిపారు. సిపిఎం నాయకులు టేకుమూడి ఈశ్వరరావు, కమిడి సత్య శ్రీనివాస్ తదితరులు పేదలకు అండగా నిలిచారు.

No comments:
Post a Comment