కార్మిక చట్టాల నిర్వీర్యానికి కేంద్రం
Posted On 4 hours 50 mins ago
- విధానాల అమలులో యుపిఎ, ఎన్‌డిఎ ఒక్కటే...
- ఐదేళ్లుగా డిమాండ్లు ఉన్నాయి...
- సిఐటియు జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్
- కార్మిక సంఘాల నాయకులకు ప్రధాని తేనేటి విందు...
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల నిర్వీర్యనికి కుట్ర పన్నుతుందని సిఐటియు ఆలిండియా ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ విమర్శించారు. జాతీయ కార్మిక సంఘాలతో కేంద్ర మంత్రుల ఉపసంఘం భేటీ అయ్యింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అధ్యక్షతన శ్రమశక్తి భవన్‌లోఆదివారం జరిగిన ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి దర్మేంద్ర ప్రధాన్, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూస్ గోయల్, పదకొండు జాతీయ కార్మిక సంఘాలు నాయకులు పాల్గొన్నారు. సుమారు నలబై నిమిషాలు పాటు జరిగిన ఈ సమావేశంలో కార్మిక సంఘాలు లేవనెత్తిన డిమాండ్లపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా చర్చించిన అంశాలను మీడి యాకు తపన్ సేన్ వివరించారు...12 డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందుంచామని వెల్లడించారు. ఈ డిమాండ్లు ఇప్పటి కావని, గత ఐదేళ్లుగా అపరిష్కృతంగా ఉనన్నాయని విమర్శించారు. కార్మికుల పట్ల నాటి యుపిఎ అనుసరించిన విధానాలనే నేడు ఎన్‌డిఎ అనుసరిస్తున్నదని తపన్ సేన్ విమర్శించారు.
ఒక పక్క కార్మిక చట్టాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరుతుంటే కార్మిక హక్కులను దెబ్బతీసే విధానాలను కేంద్రం చేపడుతోందని. కార్మిక హక్కులను, డిమాండ్లను పూర్తి స్థాయిలో అమలు పరచాలని కేంద్రాన్ని కోరినట్లు వివరించారు. ఇప్పటికైనా కేంద్రం చిత్త శుద్దితో కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, లేని పక్షంలో తరువాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే భాద్యత వహించాల్సి వుంటుందని హెచ్చరించారు. కార్మికుల డిమాండ్లపై భవిష్యత్‌లో విస్తృత చర్చలు జరగాలని కార్మిక సంఘాలు కోరినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సిఐటియు, ఎఐటియుసి, ఐఎన్‌టియుసి, బిఎమ్‌ఎస్, ఎఐయుటియుసి, ఎఐసిసిటియు, హెచ్ ఎమ్ ఎస్ తదితర పదకొండు జాతీయ కార్మిక సంఘాల నాయకులు, కేంద్ర కార్మిక శాఖ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
చర్చలు అనుకూల వాతవరణంలో...
కేేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ
జాతీయ కార్మిక సంఘాలతో చర్చలు సామరస్యపూరిత వాతావరణంలో జరిగాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఎఫ్‌డిఐ, బోనస్ చట్టం, కార్మిక చట్టాల సవరణ, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు, ఔట్‌సోర్సింగ్ కార్మికుల సమస్యలు, కనీస వేతనం చట్టం తదితర అంశాలపై చర్చించామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ప్రభుత్వానికి, కార్మిక సంఘాలకు మధ్య దూరాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
డిమాండ్స్
కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ.కనీస వేతనం రూ15,000 ఇవ్వాలి.కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలి. కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు, గృహ వసతి కల్పించాలి.ప్రైవేటీకరణను రద్దు చేయాలి. కార్మికులకు రూ.3000 పెన్షన్ ఇవ్వాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో విదేశీ పెట్టుబడులను ఉపసంహరించుకోవాలి. కార్మిక చట్టాల రద్దు యోచనను విరమించుకోవాలి.పిఎఫ్, బోనస్ కల్పనకు అవరోదాలుగా ఉన్న వాటన్నిటిని తొలగించాలి. సాధారణ ఉద్యోగుల మాదిరే...కాంట్రాక్ట్ ఉద్యోగులకు అన్ని ప్రయోజనాలు కల్పించాలి. దరఖాస్తు సమర్పించిన 45 రోజుల్లో కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్ చేయాలి.ఐఎల్‌ఓ సమావేశాలు తక్షణమే నిర్వహించాలి.సి87, సి98ను వెంటనే ధ్రువీకరించాలి.

Taags
No comments:
Post a Comment