ప్లాన్ కోసం సింగపూర్‌కు లక్ష కోట్లు !
Posted On 4 hours 1 min ago
- సర్కార్ నజరానా ఇచ్చిందన్న వైసిపి ఎమ్మెల్యే రోజా
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
ఆంధ్రప్రదేశ్ రాజధాని మాస్టర్ ప్లాన్ కోసం టిడిపి ప్రభుత్వం సింగపూర్‌కు లక్ష కోట్లు నజరానా ఇచ్చిందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు సేవ చేయడానికి సింగపూరేమైనా దార్మిక సంస్ధా అని ప్రశ్నించారు. మాస్లర్ ప్లాన్‌ను ఫ్రీగా ఇవ్వడానికి సింగపూర్ తెలుగుదేశం పార్టీ నేతలకు సింగపూర్ మేనమామనా అని మండిపడ్డారు. సింగపూర్ పెద్ద బిజినెస్ ( వ్యాపార ) దేశమని, మాస్టర్ ప్లాన్‌ను ఎందుకు ప్రీగా ఇస్తుందని అన్నారు. మాస్టర్ ప్లాన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం లక్ష కోట్లు సింగపూర్‌కు నజరానా ఇచ్చిందనే ప్రచారం జరుగుతుందన్నారు. ప్రపంచ దేశాల్లో బారతీయులు అన్ని రంగాల్లో ముందంజలో ఉంటే..రాజధాని నిర్మాణాన్ని సింగపూర్‌కు అప్పగించి తెలుగువారిని అవమానించారని మండిపడ్డారు. ఏపి రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదా..? లేక సింగపూర్ ప్రభుత్వానిదా ఆమె ప్రశ్నించారు. మాస్టర్ ప్లాన్ చూస్తుంటే మగధీర, బాహుబలి సినిమా ట్రైలర్లు చూసిన ట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. అది మాస్టర్ ప్లాన్ కాదని, చంద్రబాబు నాయుడు డైవర్షన్ ప్లాన్ అని ఎద్దేవా చేశారు. ప్లాన్‌లో రైతులు, బడుగు లకు స్థానం ఎక్కడుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

No comments:
Post a Comment