ప్రజలకు అందుబాటులో లేకుండా పెరిగి కొండె క్కినధరలను నియంత్రించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు ప్రారంభించాయనే వార్తలు నిరుపే దల్లో కొంత ఊరట కల్పిస్తున్నాయి. ముఖ్యంగా పప్పుది నుసులు,వంటనూనెలు,ఉల్లిపాయలు,తదితర సామాన్యు డికి అవసరమయ్యే ఆహారపదార్థాల ధరలను పెరగకుండా చూడాలని రాష్ట్రప్రభుత్వాలను కేంద్రం తాజాగా సూ చించింది. అవసరమైతే మార్కెట్ స్థిరీకరణ పథకం కింద నియంత్రించాలని రాష్ట్రాలకు స్పష్టం చేసింది. నిత్యావసర సరుకుల ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆహార పౌరసరఫరాల మంత్రిత్వశాఖ రాష్ట్ర ప్రభు త్వాలకు ఆదేశాలు జారీ చేసింది. పప్పుదినుసుల పంటల విషయంలో దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించి ఉత్పత్తులను పెంచేవిధంగా కార్యాచరణ అమలు చేయాలని కూడా సూచించింది.
ఎవరెన్ని చెప్పినా మరెన్నిపథకాలు ప్రకటించినా ఇంకె న్నిచర్యలు తీసుకుంటున్నా ధరలుమాత్రం అదుపులేకుం డా పెరిగిపోతున్నాయి. కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు ఎప్పటి కప్పుడు ఆదేశాలు జారీచేస్తూ హెచ్చరిస్తున్నా అవి అమలయ్యేపరిస్థితి కన్పించడంలేదు. రైతుల గడపదాటి ఉత్ప త్తులు బయటకివెళ్లిన మరుక్షణం నుండి ఆకాశాన్ని అంటుకున్నాయి. ఇది ఎప్పటినుంచో జరుగుతున్నది. ఉత్పత్తులు రైతులవద్ద ఉన్నంతకాలం ఒక వ్యూహంప్రకారం కొందరు బడా వర్తకులు సిండికేటుగా ఏర్పడి ధరలను వారు అనుకున్నట్లుగా నియంత్రించగలుగుతున్నారు.ఆ తర్వాత కృత్రిమకొరత సృష్టించి ఇష్టానుసారంగా పెంచుకుంటున్నారు. ఇందులో దళారులపాత్ర కీలకంగా మారుతున్నది. ప్రభుత్వ చాతకాని తనాన్ని ఆసరాగా తీసుకొని ఈ ధరలు పెరిగిపోతున్నాయనే విమర్శలు పెల్లుబుకుతున్నాయి. ఒకపక్క అదుపు చేసేందుకు అధికారులమీద అధికారులను నియమిస్తున్నారు. నల్లబజారుకు నిత్యావసర వస్తువులు తరలించేవారిపై చర్యలు తప్పవని హెచ్చరికల మీద హెచ్చరికలు జారీచేస్తున్నాయి. గంటల కొద్దిసమీక్ష లమీద సమీక్షలు చేస్తున్నారు. ఒకటి రెండు రోజులు తగ్గి నట్లుకన్పించినా ఆతర్వాత అంతకు రెట్టింపుస్థాయిలో పె రిగిపోతున్నాయి. ఎన్ని మంచి పథకాలు ప్రవేశపెట్టి వేలా ది కోట్లరూపాయలు వెచ్చించినా ధరలు పెరగడంతో ప్రజా వ్యతిరేకతకు గురవుతారనేది కాదనలేనివాస్తవం.ఇ లాంటి పరిస్థితుల్లో ప్రజాపంపిణీ వ్యవస్థ సమర్థవంతం గా పనిచేస్తే, చేయించగలిగితే కొంతవరకైనా అటు రైతులకు, ఇటు వినియోగదారులకు కష్టాలుతగ్గేవి.కానీ ఆ వ్యవస్థ విఫలమవడంతో ఈ పరిస్థితులు దాపురిస్తున్నాయే మోననిపిస్తున్నది. ఈ వ్యవస్థ ఆవిర్భావానికి ఎంతో సుదీర్ఘచరిత్రఉంది.ఇటు ధరలను అదుపుచేసి అదే సమయం లో రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర అందించి మ రొకపక్క పేదబడుగు వర్గాలకు నిత్యా వసరవస్తువ్ఞలు సబ్సిడీతో అందించే ఉద్దేశంతో దాదాపు వందేళ్ల క్రితమే ఒక వ్యవస్థను ఏర్పాటుచేశారు.కాలక్రమేణా అదే ప్రజా పంపిణీవ్యవస్థగా రూపాంతరంచెందింది.1880లో మన దేశంలో తీవ్ర క్షామం ఏర్పడి ఆకలి తీర్చుకోవడానికి సరుకులు లభించక,లభించినా ఆర్థికస్తోమతలేక వేలాదిమంది ఆకలితో ప్రాణాలు వదలడంతో ఆందోళన చెందిన ఆనా టి బ్రిటిష్‌ప్రభుత్వం అధికారికంగా ఒకకమిటీని ఏర్పాటు చేసింది.ఆహార కొరతలకు మూలకారణమైన కరువులు ఎందుకు వస్తున్నాయి? వాటిని ఎలానిరోధించాలి?ఆ పరిస్ధితుల్లో ఆహారధాన్యాలు ప్రజలకు సరమైనధరల్లో ఎలా అందుబాటులో ఉంచాలి? తదితర అంశాలపై ఆ కమిటీ సమగ్ర అధ్యయనంచేసి నిర్దిష్టమైన సూచనలతో ఒక ని వేదిక ఇచ్చింది. ఆ కమిటీ సూచనలు కొన్నింటిని ఏదో నామమాత్రంగా అమలుచేశారు. ఆ తర్వాత అంతపెద్ద కరువులు రాకపోవడంతో ఆ నివేదికను పట్టించుకోలేదు.
కానీ 1943లో వచ్చిన కరువు దేశాన్ని అల్లాడించింది. ఆ క్షామంతో భారతదేశంలో లక్షలాది మంది అసువులు బాసారు.ఒక్క బెంగాల్‌లోనే దాదాపు30లక్షల మందికిపై గా ప్రాణాలు కోల్పోగా బ్రిటిష్‌పాలకులు బెంబేలెత్తారు. అప్పుడు ఆ కమిటీచేసిన ప్రతిపాదనను బయటికితీశా రు. అప్పటి నుండి ఆ ప్రతిపాదనను అమలు చేయడం ప్రారంభించారు.స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా వా టిని కొనసాగిస్తున్నారు.దళారులవ్యవస్థను నియంత్రించేందుకు ధరలు వారి ఇష్టానుసారంగా పెంచకుండా అలా గే రైతుల వద్దనుండి కొనుగోలుచేసే సమయంలో తగ్గిం చకుండా రైతులకు గిట్టుబాటు ధరలను అందించాలని ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు కొనేందుకు భారత ఆహార సంస్థను ఏర్పాటు చేశారు. నల్లబజార్లకు సరుకులు తరలకుండా చర్యలు తీసుకున్నారు. నిత్యావ సర వస్తువుల చట్టాన్ని తీసుకువచ్చారు. కొంతకాలం ఈ వ్యవస్థపటిష్టంగానే పనిచేసింది. కానీ రానురాను ఆ వ్యవస్థలో దళారులు ప్రవేశించడం దీనికితోడు రాజకీయ జోక్యంపెరగడం,అవినీతి, అసమర్థతతో ప్రజాపంపిణీ వ్యవస్థ కొందరికి కల్పతరువుగా మారిపోయింది. ఫలితంగా ధరలు నియంత్రించేందుకు ఒక నిర్దిష్టమైన విధానం వ్యవస్థ లేకుండాపోయిందనే చెప్పొచ్చు. వ్యాపారులు లాభా లకోసమే వ్యాపారాలు చేస్తున్నారనేది వాస్తవం. కమిషన్ లకోసమే దళారులు ఉన్నారనేది కూడా నిజం. అలా వ్యవహరిస్తే అందుకు వారిని పెద్దగా తప్పుపట్టలేం. కానీ ప్రజాసంక్షేమమే తమ ధ్యేయమని చెప్పి ప్రజల ఓట్లతో పదవ్ఞలెక్కి ప్రజలుకట్టే పన్నులతో సకలసౌకర్యాలు అను భవిస్తున్న ప్రజానాయకులమని చెప్పుకుంటున్న నేతలు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుంటే ఎందుకు ధరలు పెరుగుతున్నాయో వారికి అర్థం కాకుండాపోదు.
- See more at: http://www.vaartha.com/node/1701#sthash.Rd9jnyrH.dpuf
No comments:
Post a Comment