సంక్షేమంలో సంచార జాతుల స్థానం ఎక్కడ ?
Posted On Fri 17 Jul 04:08:06.514522 2015
సంచారజాతికి చెందిన ప్రజలు దేశంలో 13 కోట్ల మంది ఉన్నారు. వీరికి స్థిరనివాసం ఉండదు. ప్రధానంగా చెరువు, కాలువ కట్టలు, రోడ్డు పక్కనో లేదా మురికివాడల దగ్గరో గుడారాలు వేసుకొని తలదాచుకుంటారు. వీరికి ఇల్లూవాకిలీలాంటివి లేవు. తిండీ, బట్టా, పనీ, రేషన్‌కార్డులూ, ఆధార్‌కార్డులూ అసలే ఉండవు. ఆహారం, బట్టలూ ఎవరో ఒకరిని యాచించి బతుకుతుంటారు. సంప్రదాయ వినోదాన్ని అందిస్తూ భిక్షాటన చేస్తూ, చిన్నా చితకా పనులతో పొట్ట నింపుకుంటారు. వీరినే సంచార జాతులు, అర్ధ సంచార జాతులు, విముక్త జాతులు అంటారు.
8 శాతం వృద్ధిరేటుతో దేశంలోని పేదరికాన్ని నిర్మూలిస్తామని కేంద్ర, ప్రభుత్వం ప్రతినబూనాయి. కానీ వారు ప్రవేశపెట్టేె అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల్లో ఈ సంచార, విముక్తి జాతుల ఊసే లేదు. అలాంటప్పుడు పేదరిక నిర్మూలన ఎలా సాధ్యం? ఈ 69 ఏళ్ళ కాలంలో ఎన్ని సంచార జాతుల సమూహాలున్నాయో లెక్కించనే లేదు. ప్రణాళికాసంఘం కూడా వీరిపై దృష్టి సారించలేదు. ప్రభుత్వాలు సంక్షేమ పథకాలపై ప్రచారార్భాటం చేసినా వాటిల్లో సంచార జాతులకు అందినవి టార్చిలైట్ వేసి గమనించినా కానరావు. వీరి సమస్య గురించి ఏనాడూ అసెంబ్లీల్లో చర్చించిన పాపాన పోలేదు. ఏ రాజకీయ పార్టీ వీరి సమస్యలపై ఉద్యమించిందీ లేదు. అట్టడుగు ప్రజలైన సంచారజాతులు స్వదేశంలోనే విదేశీయులుగా, నిరంతరం వలస జీవితాలు గడిపే కాందిశీకులుగా దుర్భర జీవితం గడుపుతున్నారు. వీరు సమాజాభివృద్ధి చట్రానికి వెలుపల ఉండి పోయారు. సమకాలీన భారతదేశంలో అగౌరవంగా, నీచంగా చూడడం వలన దొంగలుగా, దారిదోపిడీదారులుగా, బందిపోట్ల స్థాయికి నెట్టబడ్డారు. ప్రభుత్వసంస్థలు ముఖ్యంగా పోలీసులు వీరిని కులం, జాతి ఆధారంగా తిట్టి అవమానాలకూ, వేధింపులకూ గురిచేస్తున్నారు. ఈమధ్యే వారంతా ఒక్కటై ఒక గౌరవస్థానం కోసం పోరాడుతున్నారు.
సామాజిక, ఆర్థిక స్థితిగతులు
ఎస్‌సి, ఎస్‌టి, బిసి కమిషన్లు తమకు లభించిన సమాచారం ప్రకారం కొన్ని సంచారజాతులను తమ కులాల జాబితాలో చేర్చుకున్నాయి. నేటికీి ఏ కులంలో చేరని సంచారజాతులు అనేకం. స్వాతంత్య్రానికి ముందు భారత సమాజంలోని వివిధ ప్రాంతాల ప్రజలూ, వృత్తుల మధ్య సామాజిక-సాంస్కృతిక సంబంధాలు నెలకొల్పడంలో సంచారజాతులు కీలకపాత్ర పోషించాయి. సంచారజాతులు తమ కుల రూపాలతో వినోదాన్ని పంచేవారు. బ్రిటీష్ దళాలు కూడా కొంతకాలం ఈ వినోదాన్ని ఆస్వాదించినవే. కానీ ఈ జాతులు తమ కదలికలను, సంఖ్యా బలాన్ని, లోటుపాట్లను స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనే సైనికులకు అందజేస్తున్నారని అనతికాలంలోనే బ్రిటీష్ వాళ్లు గమనించారు. ఈ సాహసోపేతమైన గూఢచర్యానికి పాల్పడుతున్న వారిని నేరస్థులుగా ప్రకటించారు. ఈ విధంగా 1857 మొదటి స్వాతంత్య్ర సంగ్రామం సమయంలో వీరందించిన సహకారం మరువలేనిది. ఇది తట్టుకోలేని బ్రిటీష్ వాళ్లు వీరిని తిరుగుబాటుదారులుగా, నేరస్తులుగా ముద్ర వేశారు. 1871 క్రిమినల్ ట్రైబ్స్ చట్టం ద్వారా వీరిలోని దాదాపు 200 సంచారజాతులను క్రిమినల్ ట్రైబ్స్‌గా గుర్తించి అణచివేతకు గురిచేశారు. ప్రపంచంలో ఎక్కడా ఒక జాతి మొత్తాన్ని దొంగలుగా ముద్ర వేయలేదు. ఆ పనిని మన దేశంలో బ్రిటీష్‌వాళ్లు చేశారు.
సంచార జాతులను ఆరు రకాల సమూహాలుగా గుర్తించారు. 1. ఉప్పు, అటవీ ఉత్పత్తులను పశువులపై రవాణా చేసి ఇతర గ్రామాలకు సరఫరా చేసేవారు. 2. వాయిద్య కళాకారులూ, నాట్యకారులూ, పాటలు పాడుతూ కథలు వినిపించేవారు. గారడీవిద్య, తోలుబొమ్మలాటలు, తీగలపై విన్యాసాలు చేసేవారు. 3. ఎలుగుబంట్లు, కోతులు, పాములు, గుడ్లగూబలు, వివిధ రకాల పక్షులతో ప్రదర్శనలు నిర్వహించేవారు. 4. జంతువులను వేటాడుతూ లేదా పెంచిపోషిస్తూ పాలూ, మాంసం వ్యాపారం చేసేవారు. 5. వెదురు, ఇనుము, మట్టి, తదితరమైన వాటితో ఉత్పత్తులను తయారుచేసి గ్రామాల్లో అమ్మేవారు. 6. సాంప్రదాయ బద్ధంగా భక్తిపాటలు, కథలుచెబుతూ యాచించే వారు. వివిధ వనమూలికలతో మందులు తయారుచేసే వారు, జ్యోతిష్యం చెప్పేవారు. స్వర్శ ద్వారా రోగాలు నయం చేసేవారు. వివిధ తెగల సాధువులు, పకీర్లు, ఇతర సంబంధిత సమూహాలను నేర చట్టం కిందికి తెచ్చారు. నాగరిక సమాజంలో కలిసి జీవించే అవకాశాన్ని హరించారు. స్వాతంత్య్రం తొలిరోజుల్లో భారత ప్రభుత్వం (1952లో క్రిమినల్స్ చట్టం నుంచి మినహాయించింది.) వీరిని ఢనోీటిఫై చేసింది. అప్పటి నుంచీ వారిని డీ నోటిఫైడ్ తెగలుగా లేదా విముక్తజాతులుగా పిలుస్తున్నారు. నేటికీ ప్రభుత్వ యంత్రాంగం వీరిని ఇంకా నేరస్తులుగా వెలేసినవారిగా చూస్తోంది.
బాలకృష్ణ్ణ సింద్రం రెన్‌కె కమిషన్ నివేదిక
2005లో సంచారజాతుల నుంచి వచ్చిన బాలకృష్ణ రెన్‌కె అధ్యక్షతన సంచార జాతుల, అర్ధ సంచారజాతుల, విముక్తజాతుల వారికి సంబంధించిన వివిధ అంశాల అధ్యయనానికి కమిషన్ వేశారు. వారి నివేదిక ప్రకారం 148 ఎస్‌సి కులాలను, 260 ఎస్‌టి తెగలను, 301 బిసి కులాలను మొత్తంగా ఇతర కులాలతో కలిపి 829 తెగలను, సమూహాలను సంచారజాతులుగా, విముక్త జాతులుగా కమిషన్ గుర్తించింది. దేశజనాభాలో వారు 10 నుంచి 12 శాతంగా ఉన్నారని నిర్ధారించింది. ప్రభుత్వ విధానాల ఫలితంగా సంచారజాతులు తీవ్ర కష్టనష్టాలు ఎదుర్కొంటున్నారు. రెన్‌కె నివేదిక ప్రకారం సంచారజాతులలో 94 శాతం ప్రజలు పేదరికపు గీతకు దిగువన జీవిస్తున్నారు. 98 శాతం ప్రజలకు భూమి లేదు. 81 శాతం గుడిసెల్లో జీవిస్తారు. 72 శాతం జనానికి రేషన్‌కార్డుల్లేవు. 72 శాతం పిల్లలు స్కూల్‌కు వెళ్లట్లేదు. 62 శాతం మందికి వైద్య సదుపాయం లేదు. 29 శాతం ప్రజలకు శ్మశానవాటికల్లేవు. 88 శాతం ప్రజలు సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్స్‌లో లేరు. సగటున ఏడేండ్ల వయస్సులో బాలబాలికలకు పెళ్ళిళ్ళవుతున్నాయి. మొదటిబిడ్డ కనేనాటికి ఆ తల్లి వయస్సు 14 ఏళ్ళు. వడ్డీవ్యాపారులకు 15 శాతం నుంచి 36 శాతం వరకు వడ్డీ కడతారని కమిషన్ అధ్యయనంలో తేలింది.
దారుణమైన విషయం ఏమంటే వీరిలో సగానికిపైగా జనాభా రోడ్డు పక్కనే జన్మించడం. వీరి పుట్టుక గానీ, మరణం గానీ ప్రభుత్వ రికార్డుల్లో నమోదు కాకపోవడం. జీవితానికి భద్రత లేదు. శ్మశానవాటికల్లేక శవాలక్కూడా దిక్కులేని పరిస్థితి. ప్రపంచీకరణ వలన వీరి వృత్తులూ, జానపద కళలూ నశించిపోయి కూటికోసం పాత సామానులూ లేదా చిన్నపిల్లలను పనులకు పంపడం, దొంగతనాలు చేయడానికి సిద్ధపడుతున్నారు. చివరికి తమ కుటుంబాల్లో మహిళలను వ్యభిచారవృత్తిలోకి నెడుతున్నారు.
భారతప్రభుత్వం కులాన్నే గీటురాయిగా ఎంచుకొని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. అందుకే ఇప్పటికైనా బిసి కమిషన్ నియమించి వీరి విద్య, సామాజిక హోదా, ఆర్థికస్థాయిలను బట్టి బిసిల కులాలపై ఆధారపడి బతికే వీరిని కుల జాబితాలో చేర్చి విద్య, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలి. వీరికి సంక్షేమ పథకాలు అమలుచేయాలి. 2008లో బాలకృష్ణ రెన్‌కె కమిషన్ నివేదిక అందించినా అప్పటి యుపిఎ కానీ, నేటి ఎన్‌డిఎ కానీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. 2014 ఎన్నికల్లో టిఆర్‌ఎస్, టిడిపిలు తమ ఎన్నికల ప్రణాళికలో వీరిని ఆదుకుంటామని హామీనిచ్చి, ఎన్నికల అనంతరం హామీలను చెత్తబుట్టలో వేశాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి సమాజంలో అట్టడుగు ప్రజలుగా ఉన్న ఈ సంచారజాతులను అభివృద్ధిలోకి తీసుకొచ్చి సామాజిక జీవనంలో భాగస్వామ్యం చేయాలి.
- మెట్టు శ్రీనివాస్

Taags :
No comments:
Post a Comment