మున్సిపల్ సమ్మె పోరాటం-అనుభవాలు
Posted On Thu 30 Jul 22:58:36.387079 2015
రాష్ట్రంలో 16 రోజుల పాటు జరిగిన మున్సిపల్ ఉద్యోగులు, కార్మికుల సమ్మె పోరాటం కార్మికవర్గానికి అనేక అనుభవాలను ఇచ్చింది. కార్మిక సంఘాల నాయకులలో పట్టుదల, తెగింపు లేకపోతే కార్మిక వర్గానికి ఎలా అన్యాయం జరుగుతుందో తెలియజెప్పింది. కార్మి కుల ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు, కార్మికులను దెబ్బగొట్టే ందుకు ప్రభుత్వం చేసే ఎత్తులు, జిత్తులు, కుట్రలు ఎలా ఉంటా యో కూడా ఈ పోరాటం తెలియజేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రంగంలోని కార్మికులైనా విజయం సాధించా లంటే ఆ రంగంలో ఉండే వివిధ కేటగిరీలు, భిన్న కార్మిక సంఘాల మధ్య ఐక్యత ఉంటేనే సరిపోదు, అన్ని కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయ పార్టీలు, దళిత, గిరిజన, బిసి, మైనార్టీ సంఘాల మద్దతు, తోడ్పాటు ఉంటేనే సాధ్యమవుతుందని కూడా ఈ పోరాటం నేర్పుతుంది. అందుకే మున్సిపల్ ఉద్యోగుల, కార్మికుల పోరాటం అనేక అనుభవాల కలయిక.
'ఐక్య కార్యాచరణ' చాలా ప్రాధాన్యత గల అంశం. వేరు వేరు జెండాలు, సంఘాలను ఒక తాటిపైకి తేవాలని నాయకులు అను కుంటే అయ్యేది కాదు. ఎందుకంటే ప్రస్తుతం 'ఇగో' కాలం నడు స్తోంది. ఎవరు ఎవర్ని పిలిచారు, ముందు ఎవరు స్పందిం చారు, ఎవరో పిలిస్తే నేను ఎందుకు వెళ్ళాలి? ఇట్లాంటి అనేక యక్ష ప్రశ్నలు నాయకుల మెదళ్లను తొలుస్తుంటాయి. కానీ, అలాంటి నాయకులను సైతం ఒక చోటకు నెట్టి, కట్టకట్టేది కార్మికవర్గమే. కొన్ని సందర్భాలలో నిరంకుశ ప్రభుత్వాలు కార్మిక వర్గంపై జరిపే నిర్బంధం కూడా కార్మిక వర్గాన్ని, సంఘాలను ఐక్య కార్యా చరణకు పురికొల్పుతాయి. ఈ అంశాలు కూడా మున్సి పల్ సమ్మె పోరాటంలో తీపిజ్ఞాపకాలే. మున్సిపల్ రంగంలో ఉన్న సిఐ టియు, ఎఐటియుసి, ఐఎన్‌టియుసి, బిఎంఎస్, గుంటూరుకు చెందిన స్వతంత్ర సంఘాలు తొలుత జెఎసిగా ఏర్పడ్డాయి. మధ్యలో ఐఎఫ్‌టియు, వైఎస్‌ఆర్‌సి పిటియు, విశాఖ నగరానికి చెందిన గుర్తింపు సంఘం జెఎసిలో చేరాయి. అయితే విశాఖ గుర్తింపు సంఘం సమ్మె పోరాటం మధ్యలోనే ప్రభుత్వ ఒత్తిడికి లొంగిపోయి సమ్మె విరమించింది. రాష్ట్ర ప్రభుత్వ రక్తదాహానికి అనంతపురం జిల్లా పుట్టపర్తిలో వెంకటనాయుడు బలయ్యాడు.
సమ్మె డిమాండ్లు
రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ సమ్మెలో పర్మినెంట్ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులు, ఎన్‌ఎంఆర్‌లు, పార్ట్‌టైమర్స్‌తో సహా అన్ని సెక్షన్ల ఉద్యోగులు, కార్మికులు సుమారు 42 వేల మంది సమ్మెలో పాల్గొన్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ వారికి కనీస వేతనం (10వ పిఆర్‌సి సిఫార్సులు +కరువు భత్యం కలిపి) రూ.15,432 చెల్లించాలని, ఇంజనీరింగ్ విభాగం కార్మికులకు స్కిల్డ్, సెమీస్కిల్డ్ జీతాలు, ఎన్‌ఎంఆర్, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికుల రెగ్యులరైజేషన్, స్కూల్ స్వీపర్స్, ఇతర పార్ట్‌టైమర్స్‌కు కనీస వేతనాల వర్తింపు, పర్మి నెంట్ ఉద్యోగులకు జిపిఎఫ్ అకౌంట్లు, హెల్త్ కార్డులు, పదవీ విర మణ 60 ఏళ్ళకు పెంపు, విశాఖ, విజయవాడ నగరాలలోని మున్సిపల్ ఉద్యోగులకు 010 పద్దు ద్వారా జీతాలు, రూ.5 లక్షల ప్రమాద బీమా, ఇళ్ల స్థలాలు, క్వార్టర్లతో సహా మొత్తం 45 డిమాం డ్లపై 2015 జూన్ 16న రాష్ట్ర ప్రభుత్వానికి జెఎసి సమ్మె నోటీసు ఇచ్చింది.2015జులై10నుంచి నిరవధిక సమ్మె ప్రారంబ óమైంది.
సమ్మె విచ్ఛిన్నానికి సర్కారు యత్నాలు
(1) మున్సిపల్ రంగంలో సమ్మె అంటే చెత్తాచెదారం-మురుగు పేరుకుపోయి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటే బ్యాక్టీరియా వ్యాప్తి చెంది ప్రజానీకానికి అంటువ్యాధులు-మలేరియా, డెంగ్యూ వంటి విషజ్వరాలు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించకుండా నిర్లక్ష్యం వహించడం. (2) చర్చల పేరుతో సమస్యలు పరిష్కరించకుండా సాగదీసి కార్మికులలో నీరసం తెచ్చి సమ్మెను నీరు గార్చేందుకు యత్నించడం. (3) పుష్కరాలను అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారంటూ కార్మిక సంఘాలపై వ్యతిరేక ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించడం (4) పోటీ కార్మికులకు రోజుకు రూ.265 కూలి ఇచ్చి పని చేయించడం, వారికి అండగా పోలీసులను రంగంలోకి దించడం, వారిని అడ్డుకున్న వారిపై అక్రమ కేసులు బనాయించడం, బెదిరించడం. (5) సమ్మెలో ఉన్న పర్మినెంట్ ఉద్యోగులను సుప్రీం కోర్టు తీర్పుల పేరుతో సమ్మె చేస్తే ఉద్యోగాల నుంచి తీసేస్తామని వ్యక్తిగతంగా నోటీసులు ఇచ్చి బెదిరించడం (6) నాలుగు రోజుల్లో పనులు చేయించకపోతే కాంట్రాక్టులు, టెండర్లు, సొసైటీలు రద్దు చేస్తామంటూ కాంట్రాక్టర్లకు, టెండరుదార్ల సొసైటీల అధ్యక్ష, కార్యదర్శుల ఇళ్ళకు నోటీసులు అంటించడం (7) సమ్మెలో ఉన్న కార్మికులను తీసేయడం, పోటీ కార్మికులతోనే ఇక నుంచి పనిచేయిస్తా మంటూ ప్రచారం చేయడం, పోటీ కార్మికులను పాస్‌పోర్టు ఫొటోలు, రేషన్‌కార్డు జిరాక్స్‌లు తెచ్చి ఇవ్వమని చెప్పడం ద్వారా సమ్మెలో ఉన్న కార్మికులలో భయాందోళనలు పెంచేందుకు ప్రయత్నించడం (8) జులై 22న రాజమండ్రిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ''సమ్మె విరమిస్తే మున్సిపల్ కార్మికుల సమస్యలు సానుకూలంగా పరిశీలిస్తాం, సమ్మె విరమించకపోతే కఠినంగా వ్యవహరిస్తాం'' అంటూ తీర్మానించడం. (9) మున్సి పాలిటీలలో డబ్బుల్లేవు, ఇంతింత జీతాలు ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి? అంటూ ఎదురుదాడికి దిగడం. (10) విశాఖ గుర్తింపు సంఘాన్ని విడిగా చర్చలకు పిలిచి లొంగదీయడం (11) అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కార్మికు లపై భౌతిక దాడులకు దిగడం, కులాల పేరుతో దూషించడం, మహిళా కార్మికులను కొట్టడం (12) పోటీ కార్మికులతో పని చేయించడం లేదని అధికారులపై చర్యలు తీసుకుంటామంటూ సంకేతాలు పంపడం (13) సమ్మెలో లేకపోయినా, డ్యూటీలు సక్రమంగా చేయడం లేదు, పరోక్షంగా సమ్మెకు సహకరిస్తున్నా రంటూ పర్మినెంట్ వారిని సస్పెండ్ చేయడం వంటి అనేక రకాల కుట్రలతో సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది. విశాఖ ఉత్తర నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ప్రభుత్వానికి వత్తాసు పలికి సమ్మె విచ్ఛిన్నానికి తోడ్పడ్డారు.
విశాల మద్దతును కూడగట్టుకోవడం
ప్రభుత్వ కుట్రలను ఎదుర్కొని ధైర్యంగా కార్మికులు పోరాడారు. ప్రభుత్వ నిర్బంధం, దాడులు పెరగడంతో కార్మికులలో మనోధైర్యాన్ని నింపి పోరాటాన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు తొలుత కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలన్నింటి మద్దతును కూడగట్టడం, దళిత, గిరిజన, బిసి, మైనార్టీ సంఘాలను సమీకరించడం, తెలుగుదేశం పార్టీ మినహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు కార్మికులకు అండగా కదలడం. ఈ విధంగా మున్సిపల్ ఉద్యోగులు, కార్మికుల పోరాటానికి ఒక విశాల మద్దతు ఏర్పడటం ప్రత్యేకించి చెప్పుకోదగ్గ విషయం. మరోవైపు పట్టణ ప్రజానీకం కూడా మున్సిపల్ సమ్మెకు నైతిక మద్దతును అందించారు. కాబట్టే 16 రోజులు సమ్మె కొనసా గింది. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ నిరంకుశ చర్యలకు అన్ని వైపుల నుంచి నిరసన వ్యక్తం కావడం మున్సిపల్ సమ్మెలో ఒక ప్రత్యేకత. అంతేకాకుండా ఈ పోరాటంలో తెలుగుదేశం పార్టీని ఒంటరిని చేయడం కూడా మరో ప్రత్యేకత. ఈ పోరాటం పరిమిత విజయమే సాధించినా సమరశీలతను ప్రదర్శించింది. మహిళా కార్మికులు పోలీసు నిర్బంధాన్ని, అవమానాలను ఎదు ర్కొని తమ కసితీరా పోరాటంలో పాల్గొన్నారు. ఈ పోరాటం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గాన్ని మున్సిపల్ కార్మిక వర్గం కొంతవరకు అవగాహన చేసుకోగలిగింది.
ఉద్యమంలోని కొన్ని బలహీనతలు
ప్రభుత్వ నిర్బంధాన్ని తట్టుకొని, విచ్ఛిన్న ప్రయత్నాలను తిప్పికొడుతూ పోరాటం ముందుకు సాగినా, ఇందులో కూడా కొన్ని బలహీనతలు ఉన్న మాట వాస్తవం. సమ్మె ప్రారంభానికి ముందే పర్మినెంట్ ఉద్యోగులందరినీ సమ్మెకు సన్నద్ధం చేయలేకపోవడం, మినిస్టీరియల్ ఉద్యోగులను కలుపుకొచ్చే ప్రయత్నం జరగకపోవడం, జెఎసిలోని సంఘాలు కొన్ని జిల్లాల్లో ఐక్యంగా వ్యవహరించకపోవడం, సమ్మె కాలంలో ఒక దీర్ఘకాలిక పోరాటాన్ని ముందుగానే ప్లాన్ చేసి నడిపేందుకు ఆటంకాలు ఏర్పడటం, జెఎసితో సంబంధం లేకుండానే కొందరు వ్యక్తిగ తంగా ఉమ్మడి డిమాండ్లకు భిన్నంగా పత్రికలకు ప్రకటనలు ఇవ్వడం వంటి లోపాలు జరిగాయి. కొన్ని యూనియన్లకు నాయకులుగా ఉన్న వారే కాంట్రాక్టర్లుగా, ప్యాకేజీదారులుగా ఉండటం, మరికొందరు వడ్డీ వ్యాపారులుగా ఉండటం వంటివి కూడా పోరాటాన్ని తీవ్రతరం చేయకుండా ఆటంకపర్చాయి.
సాధించిందేమిటి?
మొత్తం 45 డిమాండ్లు పెట్టినా చివరికి రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ వారికి 10వ పిఆర్‌సి సిఫార్సుల మేరకు రూ.13,000 కనీస వేతనం ఇవ్వడానికి నిరాకరించింది. ప్రసు ్తతమున్న వేతనాలపై రూ.2,700 చొప్పున అందరికీ వేతనాలు పెంచుతామని, 16 రోజుల సమ్మె కాలాన్ని సెలవు దినాలుగా పరిగణిస్తామని చెప్పారు. మిగిలిన డిమాండ్లను చర్చకు పెట్ట కుండా వదిలివేసింది. దీనికి కొన్ని సంఘాలు ఆమోదించి సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించాయి. సిఐటియు, గుంటూరు స్వత ంత్ర సంఘం, వైఎస్‌ఆర్‌టియు మాత్రమే వ్యతిరేకించాయి. సమ్మె డిమాండ్లు అన్నింటికీ సిఐటియు కట్టు బడి ఉంది. అయినా ఇతర సంఘాలన్నీ సమ్మె నుంచి విరమించు కోవడంతో తప్పని సరి పరిస్థితుల్లో సిఐటియు కూడా సమ్మెను విరమించాల్సి వచ్చి ంది. సిఐటియు ఒత్తిడి ఫలితంగా వేతనాల సవరణను అయిదేళ్ళ నుంచి రెండు సంవత్సరాలకు కుదించా లని, విడిఎ వర్తింప చేయాలని, ఇంజనీరింగ్ వారికి స్కిల్డ్, సెమీస్కిల్డ్ జీతాలు, స్కూల్ స్వీపర్స్ జీతాల పెంపు విషయాలపై కేబినెట్ సబ్ కమిటీలో 15 రోజుల్లో చర్చించి చెప్తామని ప్రభుత్వం చెప్పాల్సి వచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబె ట్టుకుని ఉద్యోగుల, కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరిం చకపోతే మరలా పోరాటాలు తప్పవు. కార్మికవర్గం తరపున పోరాటాలు నడిపేందుకు సిఐటియు ఎల్లవేళలా సిద్ధంగానే ఉంటుంది.
- కె ఉమామహేశ్వరరావు
(వ్యాసకర్త ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి)

Taags :
No comments:
Post a Comment