విదేశీయులకు భూములు కట్టబెడితే ఊరుకోం:సిపిఎం
Posted On Fri 10 Jul 23:27:48.526281 2015
ప్రజాశక్తి-మనుబోలు
తీర ప్రాంతాల్లోని విలువైన పేదల భూములను విదేశీ కంపెనీలకు కట్టబెడితే ఊరుకోబోమని మండల సిపిఎం కార్యదర్శి కటికాల వెంకటేశ్వర్లు హెచ్చరించారు. శుక్రవారం స్థానిక సిపిఎం కార్యా లయంలో పార్టీ సమావేశం నిర్వహించారు. రైతాంగాన్ని కూడకట్టుకుని విదేశీ కంపెనీల దోపిడీని అడ్డుకుంటామన్నారు. రైతుల నోట్లో మట్టి కొట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పేదలకు పంచాల్సిన భూములను సిఓబిలో చేర్చడం మంచి పద్ధతి కాదన్నారు. ఆ భూములను పేదలకు పంచి వారికి వ్యవసాయం చేసుకునేలా అన్ని విధాలుగా సదుపాయాలు కల్పించాలన్నారు. డేగపూడి వద్ద కనుపూరు కాలువను కండలేరులో కలపాలన్నారు. దీని వల్ల 20 వేలకు పైగా ఎకరాలు పూర్తి స్థాయిలో పండుతుందన్నారు. తమ పార్టీ పిలుపు మేరకు అన్ని గ్రామాల్లో సమగ్ర సర్వే చేపడుతామన్నారు. ఆయా సమస్యల పై ఆగష్టు 14 న మండల కార్యాలయాలు ముట్టడి చేస్తా మన్నారు. పాల ఉత్పత్తి ధరలు పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు నరేంద్ర, మాసు రమణయ్య, వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి బిసి భాస్కర్, సిపిఎం నాయకులు దేవదానం, మోహన్‌లు పాల్గొన్నారు.

No comments:
Post a Comment