వాన్‌పిక్ భూముల్లో కేంద్రం పాగా!
Posted On Sun 12 Jul 23:13:25.456846 2015
- స్వాధీన ప్రకటన బోర్డులు ఏర్పాటు
- ఆర్థిక నేరాల నిరోధక చట్టం ప్రయోగం
- కేంద్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఆధీనంలో 541.69 ఎకరాలు
దమ్ము విజయభాస్కర్, చీరాల
వాన్‌పిక్... పదేళ్ల కిందట అదో పెద్ద సంచలనాత్మక అభివృద్ధి కేంద్రం! ఆ తర్వాత అతి పెద్ద కుంభకోణం!! ఇప్పుడు అదో త్రిశంకుస్వర్గం!!! రాష్ట్రంలో వాన్‌పిక్‌ను (వాడరేవు మరియు నిజాం పట్నం పోర్ట్స్ ఇండిస్టియల్ కారిడార్ ప్రాజెక్ట్) వైఎస్ హయాంలో ప్రారంభించారు. దాని భూ సేకరణలో అక్రమాలు జరిగాయని అప్పట్లో ఆందోళనలు జరిగాయి. సిబిఐ విచారణ జరిగింది. ఆ విచారణ నేపథ్యంలో వెల్లడైన అంశాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఆ భూముల్లో ప్రస్తుతం పాగా వేసింది. కేంద్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ సంయుక్త సంచాలకులు కొన్ని భూములను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండలం మోటుపల్లి గ్రామ పరిధిలోని 541.69 ఎకరాల భూమిని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయా భూముల్లో బోర్డులను ఏర్పాటు చేశారు. సర్వే నంబర్లతో సహా బోర్డులో నమోదు చేశారు. వాన్‌పిక్ భూముల్లో కేంద్ర ప్రభుత్వ బోర్డులు చూసిన స్థానికులు ఆశ్చర్య పోయారు. అసైన్‌మెంట్ భూములను, అటవీ శాఖ భూములను వాన్‌పిక్‌కు అప్పగిస్తూ అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వ భూములతో పాటు రైతుల పట్టా భూములను కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వ విలువ ప్రకారం ఎకరాకు రూ.3లక్షల నుండి రూ.7లక్షల వరకూ రైతులకు చెల్లించినట్లు రికార్డుల్లో రాసుకున్నారు. అయితే వాస్తవంగా రైతులకు రూ.3లక్షలలోపే ఇచ్చినట్లు సిబిఐ విచారణలో తేలింది. దీంతో ఆ ప్రాంతంలో భూము లు కోల్పోయిన రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ అవన్నీ వాన్‌పిక్ పేరుతో రిజిష్టర్ కావడంతో భూములు వదులుకోవాల్సి వచ్చింది. నిత్యం కూరగాయలు పండించుకునే భూములతో పాటు సరివి తోటలు సాగు చేస్తున్న భూములన్నీ ఇప్పుడు బీడుభూములుగా దర్శనమిస్తున్నాయి.
అభివృద్ధి ఎండమావే...!
మోటుపల్లిలో పోర్టు వస్తుందని, పోర్టు ఆధారిత పరిశ్రమలు వస్తాయని అప్పట్లో ఇక్కడి ప్రజలను నమ్మించారు. ఎనిమిదేళ్ల క్రితం ప్రజల నుండి బలవంతంగా భూములు స్వాధీనం చేసుకున్నారు. పదేళ్లలో తీరంలో పరిశ్రమలు వెలుస్తాయని, అప్పుడు ఎవ్వరూ పొమ్మనకుండానే కాలుష్యం తట్టుకోలేక మీరే వెళ్లాల్సి వస్తుందని అప్పటి జిల్లా యంత్రాంగం ఆయా గ్రామాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి మరీ భూములు లాక్కుంది. స్వచ్ఛందంగా వెళితే పరిహారం ఎవ్వరూ ఇవ్వరని, పరిహారం తీసుకుని ఇప్పుడే భూములు ఇవ్వాలని అప్పట్లో హెచ్చరికలు జారీ చేశారు. అధికారుల మాటలకు ఇష్టంలేకున్నా రైతులు తమ భూములు వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎటువంటి అభివృద్ధికీ ఆ ప్రాంతం నోచుకోలేదు. పరిశ్రమలు దరిదాపుల్లో వచ్చే పరిస్థితి లేదు. ఎప్పుడు ఎవరొచ్చి భూముల్లో ఎం చేస్తారోనన్న భయం రైతులను వెంటాడుతోంది. వాన్‌పిక్ పేరుతో రిజిస్ట్రేషన్ జరిగినప్పటికీ కొన్ని భూములు రైతుల ఆధీనంలోనే సాగులో ఉన్నాయి. అసైన్డ్, ప్రభుత్వ భూముల్లో లబ్దిదారులుగా ఉన్న పేదలు మాత్రం భూములను కోల్పోయారు. వారి భూముల్లో కొందరు రొయ్యల చెరువులను సాగు చేసుకుంటున్నారు. ప్రభుత్వ అసైన్డు భూముల్లో లబ్దిదారులుగా ఉండి వాన్‌పిక్ భూసేకరణలో భూములు కోల్పోయిన పేదలు ఇప్పుడు ఇతర ప్రాంతాలకు వలస కూలీలుగా మారారు. మరోవైపు వాన్‌పిక్ భూములను తిరిగి రైతులకు ఇవ్వాలని ప్రతిపక్షంలో ఉండగా పాదయాత్రలు చేసిన చంద్రబాబు ఇప్పుడా భూముల గురించి ఏమీ మాట్లాడటం లేదు. సందట్లో సడేమియాగా ఆ భూములను కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంటోంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

No comments:
Post a Comment