దళితులకు అన్యాయం చేస్తున్న బాబు సర్కారు
Posted On Thu 30 Jul 22:59:05.256416 2015
ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు రాజధాని నిర్మాణానికి లాండ్ పూలింగ్ కింద 38,000 ఎకరాలు తీసుకుంటున్నారు. రైతుల నుంచి తీసుకుంటున్న రాయితీ భూములకు ఎకరానికి వెయ్యి గజాల నివాస భూమి, 200 గజాల వాణిజ్య భూమి, జరీబు భూములకు ఎకరానికి 1,200 గజాల నివాస భూమి, 200 గజాలు వాణిజ్య భూమి అభివృద్ధి చేసింది భూ యజమానులకు ఇస్తామని ప్రకటిం చారు. ఎక్కువమంది భూ యజమానులు ఈ షరతులకు సమ్మ తించి తమ భూములు ఇచ్చారు. వారికి ఎకరాకు రూ.30 వేల కౌలు, జరీబు భూములకు ఎకరాకు రూ.50 వేల కౌలు ప్రతి సంవ త్సరం పది శాతం కౌలు మొత్తం పెంచే విధంగా ఈ సంవత్సరం చెల్లించారు. కానీ రాజధాని నిర్మాణం చేసే ఈ ప్రాంతంలో 2,200 ఎకరాలు ఎసైన్డ్ భూమి, 1,300 ఎకరాలు ఫీల్డ్ లేబర్ కో ఆపరేటివ్ సొసైటీల కింద లంక భూములు ఉన్నాయి. ఫీల్డ్ లేబర్ కో ఆపరేటివ్ సొసైటీల కింద భూమి ఉన్నా రైతులు వ్యక్తిగతంగానే సభ్యులు పంచుకుని సాగు చేస్తున్నారు. భూమి అభివృద్దికి, మోటార్లు, రుణం పొందటానికి రైతులు భూమిని పంచుకుని వ్యక్తిగతంగా సాగుచేస్తున్నారు. ఎసైన్డ్ భూములు భూమిలేని పేదలకు అమ్ముకో వడానికి వీలు లేకుండా, వంశపారంపర్యంగా అనుభవించేందుకు పట్టాలు మంజూరు చేసింది ప్రభుత్వం. కానీ భూ సమీకరణలో ప్రభుత్వం తీసుకున్న ఎసైన్డ్ భూమికి ఇంతవరకు కౌలు చెల్లించలేదు. లంక సొసైటీ భూములకు కౌలు చెల్లించలేదు. పైగా ఎసైన్‌మెంట్ భూములకు ఎకరాకు 800 గజాలు అభివృద్ధి చేసిన భూమి ఇస్తానని ప్రకటించి అమలు చేయలేదు.
రైతుల జిరాయితీ భూమికీ, ఎసైన్‌మెంటు భూమికీ లబ్ధి చేకూర్చటంలో తేడా ఎందుకు పెట్టారో చంద్రబాబు చెప్పాలి. భూమి ఇవ్వటం వలన జిరాయితీ భూముల రైతులు ఏ ప్రయోజనాలను నష్టపోతున్నారో ఎసైన్‌మెంట్ భూముల రైతులు కూడా అదే విధమైన నష్టాన్ని పొందుతున్నారు. మరి పరిహారం ఇవ్వటంలో, లబ్ధి చేకూర్చటంలో ఎసైన్‌మెంటు భూముల రైతుల పట్ల వివక్షత ఎందుకు? ఎసైన్‌మెంట్ భూముల రైతులలో అత్యధికులు దళితులు, వెనుకబడిన తరగతులవారు, పేదలు. పలుకు బడి గలవారు కాదు. నోరు తెరిచి అడగలేని వారు. వీరికి కౌలు ఇప్పటి వరకూ చెల్లించ కపోవటం, అభివృద్ధి పర్చిన భూమి తక్కువ ఇస్తామనటం. వివక్షత పాటించటమే అవుతుంది. ఈ రైతులు 1,500 మంది ఉన్నారు. ప్రభుత్వ ప్రాజెక్టులకు ఎసైన్‌మెంట్ భూములు తీసుకుంటే పట్టా భూములతో సమానంగా నష్ట పరిహారం ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు తీర్పు ఉన్నది. అంతేగాక ప్రభుత్వ జీవో నెంబర్ 135/2005 కూడా పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం ఇవ్వాలని ఉన్నది. అయినప్పటికీ చంద్రబాబు దళితులకు అన్యాయం చేస్తున్నారు. వివక్షత చూపిస్తున్నారు. భూ బదలాయింపు నిరోధక చట్టం (పిఒటి 1977) ప్రకారం భూ హక్కుదారు, రికార్డులలో నమోదైన వారికే పరిహారం (ఎక్స్ గ్రేషియా) చెల్లించాలి. చంద్రబాబు ఈ విషయాన్ని తేల్చకుండా నానబెట్టడం అంటే దళితులకు అన్యాయం చేయటమే. ఎసైన్‌మెంట్ భూములకు కూడా జిరాయితీ పట్టా భూములతో సమానంగా కౌలు చెల్లించటం, అభివృద్ధి చేసిన భూమి ఇవ్వటం చేయాలి. లేనియెడల అది కుల వివక్షతను పాటించటమే అవుతుంది.
- గద్దె చలమయ్య

Taags :
No comments:
Post a Comment