Sunday, July 26, 2015

sampadkeeyam. vaartha

గిరిజన సంక్షేమం,అభ్యున్నతే ధ్యేయంగా పని చేస్తున్నామని వేలాది కోట్లరూపాయలు వె చ్చి స్తున్నట్లు పాలకులు గొప్పలు చెప్పుకుంటున్నా మరొక పక్క కనీస వైద్యసదుపాయాలు లేక అర్థాకలితో అల్లాడుతున్న కోట్లాదిమంది గిరిపుత్రుల బాధలు రోజు రోజుకు వర్ణనాతీతంగా మారుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడచూసినా ఆదివాసీల జీవనవిధానంలో సారూప త్య కన్పిస్తోంది.భూమి వనరులపైనేవారి జీవనం ఆధార పడి ఉంటుంది. అడవులతో వారి దైనందిక జీవనం ముడిపడి ఉంటుంది. అయితే స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి వేలాదికోట్లు వారి అభ్యున్నతికి వెచ్చించినట్లు లెక్కలు చెప్తున్నా ఆశించిన ఫలితాలు కన్పించడంలేదు. కనీస అవసరాలు తీర్చడంలో కూడా పాలకులు విఫల మయ్యారు.వైద్య,విద్య సదుపాయాలు అటుంచి కడుపు నిండా తిండిలేక పౌష్టికాహారం లోపించి వేలాదిమంది గిరిజనులు రోగాల బారినపడుతున్నారు. అందులో కొందరు అంధులుగా మారుతున్నారనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నది. భావిభారత పౌరులుగా ఎదగాల్సిన గిరిపు త్రుల బాలలు రేచీకటి,గ్లోకోమో, క్యాటరాక్ట్‌,విట మిన్‌- ఎ లోపం కారణంగా అంధులుగా మారుతున్నారని వార్తలు వెలువడుతున్నాయి. సర్వేంద్రియాల్లో కళ్లు అత్యంత ప్రధానమైనవనేది అందరికి తెలిసిందే. అంధులుగా మా రితే ఆ వ్యక్తితోపాటు ఆ కుటుంబ పరిస్థితి ఎంత దారు ణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు.
2001 జనాభా లెక్కల ప్రకారం భారత్‌ జనాభాలో దాదాపు ఎనిమిదిన్నరకోట్లు ఆదివాసుల జనాభా ఉన్నద ని అధికార రికార్డులే వెల్లడిస్తున్నాయి. ఈ జనాభాలో 460పైగా ఆదివాసీ తెగలు ఉండగా అందులో 90 శా తంపైగా అటవీప్రాంతాల్లో వ్యవసాయం,అటవీ ఉత్పత్తు లపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. రాజ్యాంగం పదవ భాగంలోని ఐదు, ఆరు షెడ్యూల్‌ ప్రత్యేకంగా గిరి జన ప్రాంతాల సంరక్షణ కోసం నిర్దేశించబడ్డాయి. ఐదో షెడ్యూల్‌లోబీహార్‌, గుజరాత్‌, ఉమ్మడిఆంధ్రప్రదేశ్‌, మధ్య ప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాలలో గిరిజనులు అధికంగా నివసిస్తున్నారు. ఈశా న్య రాష్ట్రాలైన మేఘాలయా, మిజోరం, నాగాలాండ్‌, త్రిపురలలోని గిరిజన ప్రాంతాలు ఆరో షెడ్యూల్‌లో ఉ న్నాయి. గిరిజనులకు పూర్వం నుంచి ఉన్న సాంప్రదాయ హక్కులను భవిష్యత్తులో స్వేచ్చగా అనుభవించేలా చూ డటానికి షెడ్యూల్‌ తెగలు నివసించే ప్రాంతాలను అభి వృద్ధిచేసి గిరిజన ఆర్థికవిద్య, సామాజిక ప్రగతిపై ప్రత్యేక శ్రద్ధ చూపడానికి ఆ ప్రాంతాలను షెడ్యూల్‌ ప్రాంతాలు గా ప్రకటించారు. వీటి ఆధారంగానే స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత భారత్‌లో ఆదివాసీల సామాజిక అభివృద్ధికి ప్రత్యేకంగా చట్టాలుచేశారు.కానీ ఇవేమి అంతగా ఆచరణ రూపం దాల్చడం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా వైద్యం విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారనే చెప్పొచ్చు. ప్రతి ఏటా ఎండాకాలం వెళ్లి వర్షాకాలం ప్రవేశంతో వచ్చే వానలు తీసుకువచ్చే రోగాలతో గిరిజనులు పడుతున్న బాధ లు అన్నీఇన్నీకావు. పాతనీరు,కొత్తనీరు కలయికలతోపా టు వాతావరణంలో వచ్చేమార్పులవల్ల వ్యాధులు విజృం భించడం దేశవ్యాప్తంగా వేలాదిమంది గిరిజనులు అసు వ్ఞలు బాయడం ప్రతిఏటా సర్వసాధారణమైపోయింది. గత ఐదారేళ్లుగా అంధత్వం పెరిగిపోతున్నదనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.ఈ గిరిజనులకష్టాలను కూడా రాజకీయ అవసరాలకోసం వాడుకోవడం అత్యంత బాధా కరం.ఇతర విషయాలు ఎలాఉన్నా గిరిజనుల విషయం లో వైద్య సేవలు నిర్లక్ష్యం చేయడం ఏమాత్రం క్షమార్హం కాదు. వైద్యం, విద్య విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించి వారికి కేటాయించిన నిధులు వారికే అందేలా చూడటం లో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 1970లో ము ఖ్యమంత్రిగాఉన్న స్వర్గీయ పి.వి నరసింహారావు సాంఘి క సంక్షేమ శాఖ నుంచి విడదీసి ప్రత్యేకంగా గిరిజన సం క్షేమశాఖను ఏర్పాటుచేశారు.అదిలాబాద్‌ జిల్లాకు చెందిన కొట్నాక భీమ్‌రావ్‌ను తొలి గిరిజనసంక్షేమ శాఖా మంత్రి గా నియమించారు. ఆయన మంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టగానే ఎంతోకాలంగా మూలనపడి ఉన్న హేమండా ర్స్‌నివేదికలోని సిఫార్సులను అమలుచేసేందుకు నడుం బిగించారు.ఆనాడే గిరిజనప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేకం గా ఐటిడిఎల ఏర్పాట్లకు నాందిపలికారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో తొమ్మిదిఐటిడిఎల ద్వారా ప్రత్యేకంగా గిరిజను ల కోసమే రూ.800 కోట్లు వెచ్చించేందుకు శ్రీకారం చు ట్టారు. గిరిజనప్రాంతాల ఆరోగ్య కేంద్రాలను ప్రారంభిం చారు.భవనాలు నిర్మించారు.డాక్టర్లను,కిందిస్థాయిసిబ్బం దిని నియమించారు కాని నేటికీవారందరిని అక్కడికి పం పడంలోమాత్రం పాలకులు విఫలమవ్ఞతున్నారని చెప్పొ చ్చు.ఏటా ఇన్ని వందలకోట్లు ఖర్చుపెడుతున్నా వైద్యులు అందుబాటులో ఉంచలేకపోవడంతోపాటు సరఫరా అవుతున్న మందులు నాసిరకం ఉండటంతో రోగాలు తగ్గక నమ్మకంసన్నగిల్లి గిరిజనులు నాటువైద్యం వైపే మొగ్గు చూపుతున్నారు. పసర్లు,వేర్లతో వచ్చిరాని వైద్యం చేసు కొని ఆరోగ్యం చెడగొట్టుకొని కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వేలాది కోట్లరూపాయలు గిరిజనాభివృద్ధికి వెచ్చించామని చెప్పుకుంటున్న నిధుల్లో ఐదోవంతు వారికి చేరినా ఈ పరిస్థితి దాపురించేఅవకాశంలేదు.రాజకీయాలకు అతీతం గా వారిఅభ్యున్నతికి పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ముఖ్యంగా విద్యా,వైద్యం వంటి కనీస సదుపాయాలు అందించాల్సిన గురుతరబాధ్యత పాలకులపైఉంది.
- See more at: http://www.vaartha.com/node/2284#sthash.WD05wI2X.dpuf

No comments:

Post a Comment