కార్పొరేట్లకు అటవీభూమి
Posted On 4 hours 19 mins ago
- రాజధానిలో 60 శాతం కంపెనీలకు
- లక్ష ఎకరాల భూమార్పిడి
- ప్రత్యామ్నాయ కేటాయింపునకు నో
- పరిహారమూ నామమాత్రమే
- పర్యావరణానికి పెనుముప్పు
ప్రజాశక్తి, హైదరాబాద్ బ్యూరో
రాజధాని నిర్మాణంపేరతో ఇప్పటికే 50 వేల ఎకరాల్లో పచ్చటి వ్యవసాయ భూముల విధ్వంసానికి పాల్పడిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అటవీ భూములపై కన్నేసింది. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో ఈ మేరకు అవకాశం కల్పించడంతో ఆ దిశలో సన్నాహాలు ప్రారంభించింది. పరిశ్రమలు, అభివృద్ధి కార్యక్రమాల కోసం ల్యాండ్‌బ్యాంక్ పేరిట అడవులను డినోటిఫై చేయనుంది. క్రిడా పరిధిలోని లక్ష కు పైగా ఎకరాల అడవులను భూమార్పిడి చేసి విదేశీ స్వదేశీ కంపెనీల జాయింట్ వెంచర్లు, స్పెషల్ పర్పస్ వెహికల్స్‌కు అప్పచెప్పడానికి రంగం సిద్దం చేసింది. ఈ పేరుతో టిడిపికి చెందిన పారిశ్రామిక వేత్తలు, ఆ పార్టీ అనుకూల స్వాములకు కూడా భూ పందారం చేయనుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిబంధనలను తుంగలో తొక్కనుందని సమాచారం. చట్ట ప్రకారం చూపాల్సిన ప్రత్యామ్నాయ భూములకు సర్కారు నో చెప్పనుంది. అటవీశాఖకు చెల్లించాల్సిన పరిహారాన్ని కూడా నామమాత్రానికి పరిమితం చేయనుందని తెలిసింది. ఈ పరిణామాలు పర్యావరణానికి పెను ముప్పుగా మారుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కృష్ణా, గుంటూరు జిల్లాలలో క్రిడా పరిధిలోకి వచ్చే మొత్తం 40,198.12 హెక్టార్ల అటవీభూమిని డినోటిఫై చేసేందుకు రంగం సిద్ధమైంది. మొత్తం 45 ఫారెస్టు బ్లాకులలో 11,188.1 హెక్టార్ల విస్తీర్ణం కలిగిన 12 బ్లాకులు గుంటూరు జిల్లాలో వున్నాయి. మరో 29,010.02 హెక్టార్ల విస్తీర్ణంలోని 33 బ్లాక్ లు కృష్ణా జిల్లా పరిధిలోకి వస్తాయి. వీటి డీ నోటిఫై దిశలో ఇప్పటికే ఎపి పర్యావరణ, అటవీ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. కలెక్టర్ల స్థాయిలో కమిటీలు ఈ ప్రక్రియ నడిపించేందుకు ఇప్పటికే రంగంలోకి దిగాయి. ఈ భూమే కాకుండా కాక తిరుపతికి 10కిలోమీటర్లు పరిధిలో, వైజాగ్‌లో 20 కిలో మీటర్లు పరిధిలో అటవీ భూముల భూమార్పిడి చేయాలని ఎపి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.
నిబంధనలు ఇలా బేఖాతరు ఫారెస్టు కన్జర్వేషన్ చట్టం ప్రకారం అటవీ భూముల కన్వర్షన్‌కు మాత్రమే అవకాశం వుంది. దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఎంత భూమిని మార్పిడి కోరుతుందో అందుకు రెండు రెట్లు భూమిని కొత్తగా అడవుల పెంపకానికి అటవీశాఖకు అప్పగించాలి. లేదా భూమి ఖరీదు చెల్లించాలి. అంతే కాదు, అటవీ సాంద్రతను బట్టి కొత్తగా అడవిని అభివృద్ధిపరచే ఖర్చును చెల్లించాలి. 0.4శాతం సాంద్రత వున్న అడవికి హెక్టార్ కు 5.8లక్షలు చెల్లించాలి. 0.4నుంచి 0.6శాతం సాంద్రత వున్న అడవికి మొక్కల పెంపకానికి హెక్టారుకు 8లక్షలు చెల్లించాలి. 0.8శాతం నుంచి 1శాతం సాంద్రత వున్న హెక్టారుకు 11లక్షలు పైన చెల్లించాలి. విజిటిఎం ఉడా పరిధిలోని భూములను 0.4శాతం నుంచి 0.6శాతం సాంద్రత వున్న అడవులుగా వర్గీకరించారు. వీటికి వాస్తవ ధరను పరిగణలోకి తీసుకుంటే వందల కోట్ల రూపాయలు చెల్లించాల్సివస్తుది. అయితే, రికార్డుల మేరకు ప్రభుత్వం రేటు చెల్లించనుంది. దీని ప్రకారం హెక్టార్‌కు 10వేల నుంచి లక్షరూపాయలకు మించదు. మొక్కల అభివృద్ధికి చెల్లించాల్సిన మొత్తం కూడా పరిగణనలోకి తీసుకుంటే ఎకరానికి కొన్ని లక్షలకు మించదని కొందరు నిపుణులు అంటున్నారు. పైపెచ్చు విభజన కష్టాలను చూపి కన్వర్జన్ నిబంధనల ప్రకారం అప్పగించాల్సిన భూమిని ఎగవేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. బలహీన వర్గాల భూపంపిణీకి పోరంబాకు భూములన్నీ అయిపోయాయని, అడవుల పెంపకానికి భూములను ప్రత్యామ్నాయ భూములను ఇవ్వలేమని ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి మొరబెట్టుకున్నట్లు చెప్పుకుంటున్నారు. అడవి పెంపకానికి పోరంబాకు భూమినే కేటాయించనప్పుడు ఇక మొక్కల పెంపకానికి నిధుల అవసరమే ఉండదు. సహజవనరుల దోపిడికి రాజమార్గం అంటున్న మేధావులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని నిర్మాణం పేరుతో చెలగాటమాడుతోందని మేధావులు విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూదాహం రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో అవసరానికి మించిన సప్లైకి దారితీసి అమెరికా తరహా హౌసింగ్ సంక్షోభాన్ని సృష్టించడమే కాక, పర్యావరణ విధ్వంసానికి దారితీస్తుందని ఐఐసిటి మాజీ శాస్త్రవేత్త, పర్యావరణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ బాబురావు విమర్శిస్తున్నారు. రాజధాని నిర్మాణం పేరుతో తుళ్ళూరు ప్రాంతంలోని దాదాపు 50వేల ఎకరాలలో వ్యవసాయ భూముల విధ్వంసానికి పాల్పడిన చంద్రబాబు రాజధాని ప్రాంతంలోని దాదాపు 60శాతం అడవిని ధ్వంసం చేయడానికి పూనుకోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. సహజవనరులను దోచుకోవడానికి ఎపి సిఎం రాజమార్గం చూపుతున్నారన్నారు.
ఇదిబ్లేజ్ వాడలోని ఉష్ణతాపాన్ని మరింత పెంచడమే కాక కార్బన్ ఎమిషన్స్ మరింత పెరిగేందుకు దారితీస్తుందన్నారు. నిబంధనల ప్రకారం కనీసం 33శాతం భూవిస్తీర్ణంలో అడవులు వుండేలా చూసుకోవాలన్న ఆలోచన లేని సిఎం గ్రీన్ క్యాపిటల్ నిర్మిస్తారని ఎలా విశ్వసిస్తామని ఆయన ప్రశ్నించారు.

Taags :
మరిన్ని సంబందిత వార్తలు
- ✦ మామిడి ధరల్లో మాయాజాలం
- ✦ కొవ్వొత్తులతో నివాళులర్పించిన ఎపిడబ్ల్యుజెఫ్ నాయకులు గంట్ల శ్రీనుబాబు నారాయణ్ తదితరులు
- ✦ రాజమండ్రి ఘటనకు చంద్రబాబే కారణం
- ✦ క్రిష్ణ కీర్తన్ ను విచారించి పంపిన ఏసీబీ
- ✦ స్థిరంగా ఉపరితల ద్రోణి
- ✦ చదరపు మీటర్‌కు పదిమంది!
- ✦ 63 శాతం వర్షపు లోటు
- ✦ 'అక్రమ నియామకాలపై విచారణ చేపట్టాలి'
- ✦ నేడు టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
- ✦ ఉసురు తీసిన 'పుష్కరం'
- ✦ రేపు విజయవాడలో ఇఫ్తార్, వనమహోత్సవం
- ✦ అనంతలో సౌరవిద్యుత్ కేంద్రం
- ✦ ''బాబు'' ప్రచార పిచ్చి కారణంగానే తొక్కిసలాట
- ✦ అన్ని ఘాట్లకూ తరలించండి : సిఎం
- ✦ సమస్యలు పరిష్కరించకపోతే స్తంభింపచేస్తాం
- ✦ మున్సిపల్ కార్మికుల సమ్మెను పరిష్కరించాలి
- ✦ పట్టణ సమస్యలపై ప్రజాందోళన : సిపిఎం
- ✦ అత్యుత్సాహమే కొంపముంచింది : విహెచ్
- ✦ 18న అట్లాంటాలో వైఎస్ఆర్ జయంతి
- ✦ ప్రభుత్వ హత్యలే
No comments:
Post a Comment