భరతజాతి ముద్దుబిడ్ద కలాం
Posted On Thu 30 Jul 23:00:48.547771 2015
భరతజాతి ముద్దుబిడ్డ, క్షిపణి పితామహుడు, మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఎపిజె అబ్దుల్ కలాం అకాల మరణం యావత్ జాతిని దిగ్భ్రాంతి పరిచింది. సహనం, పరిపాలనా దక్షత, శాంతి, ఉక్కు సంకల్పం కలిగిన మహర్షి అబ్దుల్ కలాం. రాష్ట్రపతిగా నాయకత్వానికి సరికొత్త నిర్వచనమిచ్చారు. భారత సైన్యం అమ్ముల పొదికి శక్తివంతమైన అస్త్రాలను అందించిన ఘనత కలాం సొంతం. భారతీయ యువతకు శాస్త్ర, సాంకేతిక అంశాల మీద ఆసక్తిని గౌరవాన్ని ఇనుమడింపజేసిన నిత్య స్వాప్నికుడు. కలలు కనండి.. వాటి సాకారానికి కష్టపడండి అని యువతకు ఆయన ఇచ్చిన ప్రేరణ అజరామరం. క్షిపణి శాస్త్రవేత్తగా ఆయన సాధించిన ఖ్యాతి అనిర్వచనీయం. భారత క్షిపణి సామర్థ్యాలను ప్రపంచానికి తెలిసేలా ఎలా ఉండాలని ప్రజలు ఆశిస్తారో, తన వేషభాషలు, నడవడిక, జీవనశైలి ద్వారా నిర్దిష్టంగా చేసి చూపారు. బహుముఖ ప్రజ్ఞకు అసలైన చిరునామా అబ్దుల్ కలాం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా, అధ్యాపకుడిగా, వక్తగా, సంగీతకారుడిగా, రచయితగా నేటి తరానికి మార్గదర్శిగా నిలిచిన మహా మనీషి అ(ద్భుత)బ్దుల్ కలాం.
- బట్టా రామకృష్ణ దేవాంగ,సౌత్ మోపూరు,నెల్లూరు.
- బట్టా రామకృష్ణ దేవాంగ,సౌత్ మోపూరు,నెల్లూరు.
Taags :
No comments:
Post a Comment