సిపిఎం సీనియర్ నేత చిట్టేటి రమణారెడ్డి మృతి
Posted On Fri 10 Jul 23:44:10.195259 2015
ప్రజాశక్తి- నెల్లూరు సిటీప్రతినిధి
సిపిఎం సీనియర్ నేత చిట్టేటి రమణారెడ్డి (87) అనారోగ్యం, వయోభారంతో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు మృతి చెందారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పల్లిపా డు దిబ్బలో ఆయన పెద్దకుమారుని ఇంట్లో ఉంటున్నారు. గత కొంతకాలంగా ఆయన ఆరోగ్యం బాగోలేదు. మరింత క్షీణిచండంతో ఆయన మరణించారు. ఆయన భార్య దేవమ్మ గతంలోనే మరణించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
మిలిటెంట్ పోరాటం నడిపిన నేత
ఆయన నెల్లూరు రూరల్ మండలలం పెనుబర్తిలో భూస్వామ్య కుటుంబంలో పుల్లారెడ్డి, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. గ్రామంలోని వెదనపర్తి సుందరరామిరెడ్డి ప్రోద్బలంతో కమ్యూనిస్టుపార్టీపై మక్కువ పెంచుకున్నారు. కమ్యూనిస్టు పార్టీలో చేరి 1952లో జరిగిన జనరల్ ఎన్నికల్లో పార్టీ తరుపున విశేష కృషి చేశారు. చెరువు లోతట్టు భూములను పేదలు సాగు చేసుకునేదానికి పోరాటం చేసి విజయం సాధించారు. అనంతరం నెల్లూరు తాలూకా పార్టీ సభ్యునిగా చేరారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ విడిపోయిన తరుణంలో సిపిఎం అభివృద్ధికి విశేషకృషి చేశారు. గ్రామంలో భూస్వాములకు, హరిజను లకు తగాదాలు వచ్చినప్పుడు ఆయన హరిజను లకు అండగా నిలబడ్డారు. 1967లో నెల్లూరు తాలుకా పార్టీ కార్యదర్శిగా పనిచేశారు. సిపిఎం నుంచి నక్సలైట్లుగా విడిపోయిన కొంతమంది పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తుంటే ముందు వరుసలో ఉండి ఎదురెడ్డి పోరాటం చేశారు. నగరంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా అంద రూ కలిసి ఉండాలని పోరాటాలు చేశారు. రాజీవ్ గాంధీ హత్యకు గురైనప్పుడు నగరంలో జరిగిన అల్లర్లలో వ్యాపారులకు ఆయన అండగా నిలిచారు. ఆయన ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తూ నెల్లూరు తాలుకాలో పార్టీ విస్తరణకు అవిరళ కృషి చేశారు. రైతుల సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించారు. కొంతకాలం వరకు పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుగా ఉన్నారు. వయోభారం, మరోవైపు ఆరోగ్యం సహకరించక కొంతకాలం నుంచి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈనేపథ్యంలోనే ఆయన మరణించారు. సిపిఎం సీనియర్ నాయకులు జక్కా వెంకయ్య, జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.మోహన్‌రావు, పి. శ్రీరాములు, మాదాల వెంకటేశ్వర్లు, మూలం రమేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జొన్నల గడ్డ వెంకమరాజు, పి. శ్రీరాములు, ఉపాధ్యక్షులు పొట్టేపాళెం చంద్రమోళి, మూలి వెంగయ్య, నాయకులు అల్లాడి గోపాల్, తదితరులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన పార్టీకి, రైతు సంఘానికి చేసిన కృషిని కొనియాడారు.
నేడు అంత్యక్రియలు
ఆయన భౌతికకాయానికి శనివారం ఉదయం 9 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. పల్లిపాడు దిబ్బలోని తమ పొలంలో ఈ అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు

No comments:
Post a Comment