మార్నింగ్ వాక్
Posted On Tue 21 Jul 23:04:18.410943 2015
ఉదయం ఏడు గంటలకు శంకర్‌కు ఫోను.
'ఆయన లేరన్నయ్యా, మార్నింగ్ వాక్‌కు వెళ్లారు.'
'అలాగేనమ్మా, ఫోన్ చేశానని చెప్పండి' శివుడు చెప్పాడు.
తిరిగి సాయంకాలం ఏడుకు ఫోను, శివుడే, శంకర్‌కే.
'ఆయన లేరన్నయ్యా ఈవినింగ్ వాక్‌కు వెళ్లారు.'
'ఉదయం కూడా...'
'అవునన్నయ్యా డాక్టర్‌గారు చెప్పారు' మాట పూర్తి కాకుండానే.
'సరేనమ్మా ఆరోగ్యం జాగ్రత్త, మీ ఆయనకు' అప్పిచ్చినవాడు తీసుకున్నవాడు నిండా నూరేళ్లు, అదీ ఆరోగ్యంతో సంపాదిస్తూ ఉండాలని కోరుకోవటంలో తప్పులేదు.
మళ్లీ ఆదివారం మధ్యాహ్నం శివుడి ఫోను.
'ఉన్నాడా లేక మధ్యాహ్నం వాకింగుకు వెళ్లాడామ్మా?'
'లేదన్నయ్యా నిద్రపోయారు, డాక్టర్ చెబితే'
'అలాగేనమ్మా' అని పైకి అని 'అప్పుతీసుకున్న వాడెప్పుడూ హాయిగా నిద్రపోతాడు. ఇచ్చినవాడికే నిద్రమాత్రలేసుకుంటే గాని నిద్ర రాదు. ఉదయం మార్నింగు వాక్, సాయంకాలం ఈవినింగు వాక్' శివుడు నిట్టూర్చాడు. మాక్‌బెత్ కథ చదివితే నిద్రలో కూడా నడిచే 'సోమ్‌నాంబులిస్టుల' గురించీ తెలుసుకోవచ్చు.
ఉరుకులు పరుగుల జీవితం అని విసుక్కునే వారుంటారు కానీ మనం నిజంగా పరిగెడుతున్నామా? బండిలోనో, కారులోనో స్పీడుగా పోయినంత మాత్రాన గొప్ప కాదు. పనులెక్కువగా చేసినంత మాత్రాన ఇంకోటీ కాదు. నిజంగా పరిగెడుతున్నావా, కనీసం నడుస్తున్నావా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నడవటం అన్నది మనిషికెంతో మేలు చేస్తుంది. రక్తప్రసరణ ఎక్కువ చేసి మెదడుకు ఆక్సిజన్‌ను అందించి చురుగ్గా ఉంచుతుంది. దాని వల్ల ఎన్నో ఐడియాలొస్తాయి. ఉదయాన వీచే చల్లని గాలులతో హాయిగా కూడా ఉంటుంది.
ఉదయం చేస్తే మార్నింగు వాక్, సాయంకాలం ఈవినింగు వాక్. ఏదైనా ఒకటే కదా అనుకునేరు. ఇదే పేజీలో మన మాస్టారు రామయ్యగారు రాసిన ఒక వ్యాసంలో ఉదయం నడక చిన్నప్పుడు చదువుకున్న చదువు లాంటిదైతే, సాయంకాలం నడక పెద్దయ్యాక చదువుకున్న చదువులాంటిదన్నారు. అంటే అడల్ట్ ఎడ్యుకేషన్లాం టిదన్నారు. ఉదయానికి రాత్రికి, సాయంకాలానికి రాత్రికి మధ్య ఉన్న నిడివిని మనం గమనించాలిక్కడ. చదువుకున్న చదువు కానీ, నడిచిన నడక కానీ ఎంత కాలం ఉపయోగపడతాయ న్నదే ఇక్కడ సారాంశం.
బీపీ, సుగర్, థైరాయిడ్ మామూలైపోయాయిప్పుడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉదయం పూట బాగా నడవాలి. ఎవరైనా ఈ భూమిపైన ఉన్నన్ని నాళ్లు ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు. అందులో తప్పే లేదు. అందుకని ఉదయాన్నే నడుస్తూ పోతుంటే ఎవరెవరో ఎదురొస్తుంటారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఒక్క గుడ్‌మార్నింగ్ కొట్టి పెద్దపెద్ద వాళ్లను మనవైపు తిప్పుకోవచ్చు. అలాగే మనల్ని బుట్టలో వేసుకునేవారు ఉంటారన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇన్సూరెన్స్ ఏజెంట్లు మాత్రం తప్పక మార్నింగ్ వాక్ చేయాలి.
మనకవసరమైనవాళ్లు ఎదురుపడాలని మనమను కుంటే, ఎవ్వరికీ దొరక్కూడదని ఇంకొకళ్లు అనుకోవచ్చు. అప్పిచ్చినవాడు ఎదురైతే ఇబ్బంది, అదే ముందురోజే బాకీ తీర్చేసి ఉంటే వెన్నెముక నిటారుగా ఉంటుంది. ఎన్నికలకు ముందు అందరికీ నమస్కారాలు పెట్టినవాళ్లు ఆ తరువాత మనతో నమస్కారాలు పెట్టించుకుంటారు. ఇది లోక సహజం.
సిమెంటు, తారు రోడ్లపై నడిస్తే మోకాలి చిప్పలు అరిగి పోతాయన్న విషయం చాలామందికి తెలియదు. గడ్డిపైన గాని, నేలపైన గాని నడవాలి. మోకాలి చిప్పలు అరిగిపోతే మళ్లీ ఆలోచిం చటం కష్టం. అంటే మెదడు విషయం ఇక్కడ చెప్పటం లేదు. శరీరం లో ఏదైనా అవయవం దెబ్బతింటే చిరాకుగా ఉండి ఏ పనీ చేయని వ్వదు. అరికాలి సంగతీ అంతే. ఇక ఈ అరికాలూ, మోకాలూ రెండూ ఉదయం లేదా సాయంకాలం నడిచే నడకలో ముఖ్య పాత్ర వహి స్తాయి. ఎవరి కాళ్లపై వారు నిలబడటం ఇప్పుడు పాతమాట. ఎవరి కాళ్లతో వాళ్లు నడవటం ఇప్పుడు అవసరమైన మాట. నీకోసం నీవు ఏంచేస్తున్నావ్ అని ఎవరైనా అడిగితే రోజూ ఇన్ని కిలోమీటర్లు నడుస్తున్నాను అని కూడా చెప్పుకోవచ్చు. దేశం కోసం, ప్రజల కోసం ఏంచేస్తున్నావని ఎవరైనా అడిగితే మాత్రం అంత వీజీగా సమా ధానం దొరకదు. అలా అడిగినవారి నుంచి తప్పించుకో వాలంటే ఒక్క నడక మాత్రం వస్తే సరిపోదు. పరిగెత్తటమూ రావాలి మరి.
మనిషి నిటారుగా నిలబడటం నేర్చుకున్నప్పటి నుంచి నడు స్తూనే ఉన్నాడు. ఆ నడక ఇప్పటిదాకా ఆగలేదు. పరుగులు పెడు తోంది. తానేకాదు రోబోలనూ నడిపిస్తున్నాడు. తాను కూడా శూన్యం లో అంటే స్పేస్‌లో నడిచాడు. చంద్రుడిపై నడిచాడు. ఇంకా ఇతర గ్రహాలపై నడవాలనుకుంటున్నాడు కూడా. అయితే నడవట మొక్కటే మనిషి లక్షణమని పొరబడుతున్నాడు. మనిషి లక్షణాలు లేని నడక పొద్దున చేసినా, సాయంకాలం చేసినా ఒక్కటే అన్న విషయం మరువరాదు.
- జంధ్యాల రఘుబాబుp

No comments:
Post a Comment