వివేచన
Posted On Sat 18 Jul 23:10:55.506764 2015
''తెలుగునాట భక్తిరసం తెప్పలుగా పారుతోంది /డ్రైనేజీ స్కీము లేక డేంజరుగా మారుతోంది'' అని దాదాపు నాలుగు దశాబ్దాల కిందటనే ఓ కవి అన్నారు. ఆనాటితో పోలిస్తే ఇవాళ భక్తి ఓ బీభత్సరసంగా ఉప్పొంగుతోంది. ఉన్మాదమై ఆవహించింది. హద్దుల్లేని వాణిజ్యంగా విస్తరించింది. నీట మునిగితే పవిత్రులవుతారని సాక్షాత్తూ ప్రభుత్వమే చెప్పడం దుర్మార్గం. రాజ్యాంగ విరుద్ధం. లౌకిక విలువలు కాపాడ తామని చేసిన ప్రమాణాలను అక్షరాలా ఉల్లంఘిస్తూ విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. నలభయ్యేళ్ళ కిందటితో పోలిస్తే శాస్త్ర, సాంకేతిక రంగాల పురోగమన నేపథ్యంలో శాస్త్రీయ వివేచన ఇనుమడించాలి. మూఢ విశ్వాసాల పట్ల విముఖత పెరగాలి. అందుకు భిన్నంగా నేడు యువత కూడా భక్తిరసంలో కొట్టుకు పోవడం కరకు వాస్తవం. టెక్నాలజీ కల్పించిన సౌఖ్యాలను అందిపుచ్చుకుంటూనే మూఢభక్తిలో మునకలేయడం అత్యాధునిక విషాదం. పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలని చిలుకూరు బాలాజీ గుడి చుట్టూ నూటొక్క ప్రదక్షిణలు చేయడం అర్ధరహితం.
తెలియని ఏ అతీతశక్తులో నడిపిస్తే నడిచే కాలం కాదిది. ప్రతి పరిణామానికీ మూలాలు ఎక్కడున్నాయో తెలుసు. ప్రకృతి గమనం, ప్రకృతి శక్తుల పరిణామ వికాసాలన్నీ క్షణాల్లో తెలుసుకునే విజ్ఞానం ఇవాళ మనిషి సొంతం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని విషయాలకూ వాడుకుంటూనే అరచేతిలో మొబైల్ పట్టుకొని, అందులో ఆ రోజు మంచి ఘడియల కోసం వెదకడం అజ్ఞానం. చీకటిలో, అజ్ఞానంలో ఏ క్షణం ఎలా పరిణమిస్తుందో తెలియని ఆదిమ యుగంలో మనం లేము అనే స్పృహ కూడా విద్యావంతుల్లోనూ, విజ్ఞానులమని చెప్పుకునేవారిలోనూ లేకపోవడం మన దౌర్భాగ్యం. క్షణక్షణం ప్రకృతి ప్రయాణం, ప్రపంచ గమనం తెలిసే అధునాతన విజ్ఞానం పరిఢవిల్లే కాలంలో జీవిస్తున్నాం. అయినప్పటికీ నదీస్నానం పరమ పవిత్రం, పాప వినాశన మార్గం అని తలపోయడం ఏ విజ్ఞానపు వెలుగులకు ప్రమాణం? పైగా ప్రజలకు శాస్త్రీయ దృక్పథాన్ని అందిచాల్సిన పాలకులే పుష్కరాలకు రండి, నదిలో మునిగి పవిత్రులు కండని ప్రచారం చేయడం ఏమి శాస్త్రీయత? నిరూపించగల సామర్థ్యం ఉన్న మహితాత్ములు ఎవరో ఆలోచిస్తే, వివేచిస్తే, తర్కిస్తే అంతా అందమైన అబద్ధాల పుట్ట అని తెలుస్తుంది.
వివేచించాల్సిన సందర్భమిది. ఆలోచించాల్సిన సన్నివేశమిది. విశ్లేషించాల్సిన సమయమిది. ఆకస్మికంగా ఒక స్థలానికి మహిమల్ని, ప్రత్యేకతల్ని, పవిత్రతల్ని ఆపాదించడం దోపిడీశక్తుల కుట్రపూరిత వ్యూహం. ప్రజలను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తూ వారి దృష్టి మళ్ళించేందుకు పాలకులు ఇలా చేయడం గర్హనీయం. నదులయినా, ప్రదేశాలయినా వాటి మానాన అవి మనుగడ సాగిస్తున్నాయి. వాటికి ప్రత్యేకతల్ని ఆపాదించి సామూహిక ఉన్మాదాన్ని ప్రేరేపించడం ఇంగితం ఉన్న పాలకులు చేయాల్సిన పని కాదు. రాజనీతిజ్ఞత అసలే కాదు. ఆలోచనాపరులు మౌనంగా ఉంటే, ప్రశ్నించకుంటే అసమర్థులే రాజ్యమేలుతారు. జనాల్ని పక్కదోవ పట్టించి పబ్బం గడుపుకోడానికి ప్రయత్నిస్తారు. శిథిలమైపోతున్న చారిత్రక స్థలాలను కాపాడలేని అసమర్థ ప్రభుత్వాలు, కొండల్ని, గుట్టల్ని పరమ పవిత్ర స్థలాలుగా, ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రాలుగా మారుస్తామని చెప్పడం విడ్డూరం.
నిలదీసి, నిగ్గదీసి అడగాల్సిన యువత ఒత్తిడికి లోనవుతోంది. కెరీర్ బాటలో ఎక్కాల్సిన నిచ్చెనలు ఎక్కగలమో, లేదో అనే ఆందోళనలో అలమటిస్తోంది. అవకాశాలనేకమనే భ్రమలు కల్పిస్తూనే అశాంతి పాలుజేయడం ప్రపంచీకరణ స్వభావంలోని మరో పార్శ్వం. ఈ కారణంగానే యువత కనిపించని దేవుళ్ళనూ, మహిమల పేరిట బురిడీ కొట్టించే బాబాలనూ ఆశ్రయిస్తోంది. ఇరవయ్యేళ్ళకు పైగా చదివిన చదువులు బతుక్కి ఒక బాట చూపని, శాస్త్రీయదృష్టిని ప్రేరేపించని దుస్థితిలోకి నెట్టిన పరిస్థితులలో యువతరం భక్తిపారవశ్యంలో తమను తాము కోల్పోతోంది. ఏ పుట్టలో ఏ పాముందోనన్నట్టు, ఎవరు ఏ దేవుడి గురించి చెప్పినా ఆ దేవుణ్ణి జపిస్తున్నారు. ఎవరు ఎవరి గురించి రాయమన్నా శతకోటి నామాలు రాస్తున్నారు. పాఠ్యపుస్తకాల కన్నా ఎక్కువగా ఆధ్యాత్మిక పుస్తకాల్ని పఠిస్తున్నారు. మహిమలంటూ ఏమీ లేవని తెలిసినప్పటికీ ఎక్కడో ఏదో కలిసి వస్తుందన్న భ్రమాపూరిత వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. అసలు కారణాల్ని పసిగట్టి వ్యవహరించే చైతన్యం కొరవడిన ఫలితమిది. ఆ చైతన్యాన్ని ప్రోది చేయాల్సిన శక్తులు బలంగా లేకపోతే వాటిల్లే ప్రమాదమిది. ఎందుకంటే మతశక్తులు ప్రత్యేకించి హిందూత్వ శక్తులు సంప్రదాయం, సంస్కృతి, ఆచారాల పేరిట యువత ఆలోచనల్ని పక్కదారి పట్టించే దుర్మార్గమిది. దీనిని సమర్థంగా ఎదుర్కొనే వివేచన యువతలో వ్యాప్తి కావాలి. నిష్క్రియాపరుల్ని చేసే హిందూయిజం అసలు నైజాన్ని బహిర్గతం చేయాలి. ప్రముఖ తత్వవేత్త యూజీ కృష్ణమూర్తి చెప్పినట్టు ''హిందూయిజం మామూలు అర్థంలో అన్నిటిమల్లే ఓ మతం కాదు. అది ఎన్నో విషయాల, గందరగోళాల కలగాపులగం. అది వందలకొద్ది దుకాణాలుండే బజారు లాంటిది''. అంటే వాణిజ్యమే ధ్యేయంగా వర్థిల్లే వ్యవస్థ వంటిది. కనుకనే భక్తి పేరిట వివేచననీ, హేతుదృష్టినీ నిరాకరించే విధానాలను నిరసించాలి. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా ఏదీ జరగదనే భౌతికవాద దృక్పథాన్ని ప్రోది చేయాలి. ఈ దిశగా చేసే ప్రయత్నాల ద్వారానే ఉప్పొంగే భక్తిరసాలను నిలువరించడం సాధ్యం.

Taags :
No comments:
Post a Comment