Friday, July 31, 2015

Cpm workshop-manubolu











cpm manubolu mandalam workshop speech in katikala venkateswarlu.Date:-31-7-2015 Time:-5-
00pm

Vyasam. Vyasam. Prajasakti

మున్సిపల్‌ సమ్మె పోరాటం-అనుభవాలు

Posted On Thu 30 Jul 22:58:36.387079 2015
           రాష్ట్రంలో 16 రోజుల పాటు జరిగిన మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికుల సమ్మె పోరాటం కార్మికవర్గానికి అనేక అనుభవాలను ఇచ్చింది. కార్మిక సంఘాల నాయకులలో పట్టుదల, తెగింపు లేకపోతే కార్మిక వర్గానికి ఎలా అన్యాయం జరుగుతుందో తెలియజెప్పింది. కార్మి కుల ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు, కార్మికులను దెబ్బగొట్టే ందుకు ప్రభుత్వం చేసే ఎత్తులు, జిత్తులు, కుట్రలు ఎలా ఉంటా యో కూడా ఈ పోరాటం తెలియజేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రంగంలోని కార్మికులైనా విజయం సాధించా లంటే ఆ రంగంలో ఉండే వివిధ కేటగిరీలు, భిన్న కార్మిక సంఘాల మధ్య ఐక్యత ఉంటేనే సరిపోదు, అన్ని కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయ పార్టీలు, దళిత, గిరిజన, బిసి, మైనార్టీ సంఘాల మద్దతు, తోడ్పాటు ఉంటేనే సాధ్యమవుతుందని కూడా ఈ పోరాటం నేర్పుతుంది. అందుకే మున్సిపల్‌ ఉద్యోగుల, కార్మికుల పోరాటం అనేక అనుభవాల కలయిక.
'ఐక్య కార్యాచరణ' చాలా ప్రాధాన్యత గల అంశం. వేరు వేరు జెండాలు, సంఘాలను ఒక తాటిపైకి తేవాలని నాయకులు అను కుంటే అయ్యేది కాదు. ఎందుకంటే ప్రస్తుతం 'ఇగో' కాలం నడు స్తోంది. ఎవరు ఎవర్ని పిలిచారు, ముందు ఎవరు స్పందిం చారు, ఎవరో పిలిస్తే నేను ఎందుకు వెళ్ళాలి? ఇట్లాంటి అనేక యక్ష ప్రశ్నలు నాయకుల మెదళ్లను తొలుస్తుంటాయి. కానీ, అలాంటి నాయకులను సైతం ఒక చోటకు నెట్టి, కట్టకట్టేది కార్మికవర్గమే. కొన్ని సందర్భాలలో నిరంకుశ ప్రభుత్వాలు కార్మిక వర్గంపై జరిపే నిర్బంధం కూడా కార్మిక వర్గాన్ని, సంఘాలను ఐక్య కార్యా చరణకు పురికొల్పుతాయి. ఈ అంశాలు కూడా మున్సి పల్‌ సమ్మె పోరాటంలో తీపిజ్ఞాపకాలే. మున్సిపల్‌ రంగంలో ఉన్న సిఐ టియు, ఎఐటియుసి, ఐఎన్‌టియుసి, బిఎంఎస్‌, గుంటూరుకు చెందిన స్వతంత్ర సంఘాలు తొలుత జెఎసిగా ఏర్పడ్డాయి. మధ్యలో ఐఎఫ్‌టియు, వైఎస్‌ఆర్‌సి పిటియు, విశాఖ నగరానికి చెందిన గుర్తింపు సంఘం జెఎసిలో చేరాయి. అయితే విశాఖ గుర్తింపు సంఘం సమ్మె పోరాటం మధ్యలోనే ప్రభుత్వ ఒత్తిడికి లొంగిపోయి సమ్మె విరమించింది. రాష్ట్ర ప్రభుత్వ రక్తదాహానికి అనంతపురం జిల్లా పుట్టపర్తిలో వెంకటనాయుడు బలయ్యాడు.
సమ్మె డిమాండ్లు
రాష్ట్రంలో జరిగిన మున్సిపల్‌ సమ్మెలో పర్మినెంట్‌ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు, ఎన్‌ఎంఆర్‌లు, పార్ట్‌టైమర్స్‌తో సహా అన్ని సెక్షన్ల ఉద్యోగులు, కార్మికులు సుమారు 42 వేల మంది సమ్మెలో పాల్గొన్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ వారికి కనీస వేతనం (10వ పిఆర్‌సి సిఫార్సులు +కరువు భత్యం కలిపి) రూ.15,432 చెల్లించాలని, ఇంజనీరింగ్‌ విభాగం కార్మికులకు స్కిల్డ్‌, సెమీస్కిల్డ్‌ జీతాలు, ఎన్‌ఎంఆర్‌, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల రెగ్యులరైజేషన్‌, స్కూల్‌ స్వీపర్స్‌, ఇతర పార్ట్‌టైమర్స్‌కు కనీస వేతనాల వర్తింపు, పర్మి నెంట్‌ ఉద్యోగులకు జిపిఎఫ్‌ అకౌంట్లు, హెల్త్‌ కార్డులు, పదవీ విర మణ 60 ఏళ్ళకు పెంపు, విశాఖ, విజయవాడ నగరాలలోని మున్సిపల్‌ ఉద్యోగులకు 010 పద్దు ద్వారా జీతాలు, రూ.5 లక్షల ప్రమాద బీమా, ఇళ్ల స్థలాలు, క్వార్టర్లతో సహా మొత్తం 45 డిమాం డ్లపై 2015 జూన్‌ 16న రాష్ట్ర ప్రభుత్వానికి జెఎసి సమ్మె నోటీసు ఇచ్చింది.2015జులై10నుంచి నిరవధిక సమ్మె ప్రారంబ óమైంది.
సమ్మె విచ్ఛిన్నానికి సర్కారు యత్నాలు
(1) మున్సిపల్‌ రంగంలో సమ్మె అంటే చెత్తాచెదారం-మురుగు పేరుకుపోయి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటే బ్యాక్టీరియా వ్యాప్తి చెంది ప్రజానీకానికి అంటువ్యాధులు-మలేరియా, డెంగ్యూ వంటి విషజ్వరాలు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించకుండా నిర్లక్ష్యం వహించడం. (2) చర్చల పేరుతో సమస్యలు పరిష్కరించకుండా సాగదీసి కార్మికులలో నీరసం తెచ్చి సమ్మెను నీరు గార్చేందుకు యత్నించడం. (3) పుష్కరాలను అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారంటూ కార్మిక సంఘాలపై వ్యతిరేక ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించడం (4) పోటీ కార్మికులకు రోజుకు రూ.265 కూలి ఇచ్చి పని చేయించడం, వారికి అండగా పోలీసులను రంగంలోకి దించడం, వారిని అడ్డుకున్న వారిపై అక్రమ కేసులు బనాయించడం, బెదిరించడం. (5) సమ్మెలో ఉన్న పర్మినెంట్‌ ఉద్యోగులను సుప్రీం కోర్టు తీర్పుల పేరుతో సమ్మె చేస్తే ఉద్యోగాల నుంచి తీసేస్తామని వ్యక్తిగతంగా నోటీసులు ఇచ్చి బెదిరించడం (6) నాలుగు రోజుల్లో పనులు చేయించకపోతే కాంట్రాక్టులు, టెండర్లు, సొసైటీలు రద్దు చేస్తామంటూ కాంట్రాక్టర్లకు, టెండరుదార్ల సొసైటీల అధ్యక్ష, కార్యదర్శుల ఇళ్ళకు నోటీసులు అంటించడం (7) సమ్మెలో ఉన్న కార్మికులను తీసేయడం, పోటీ కార్మికులతోనే ఇక నుంచి పనిచేయిస్తా మంటూ ప్రచారం చేయడం, పోటీ కార్మికులను పాస్‌పోర్టు ఫొటోలు, రేషన్‌కార్డు జిరాక్స్‌లు తెచ్చి ఇవ్వమని చెప్పడం ద్వారా సమ్మెలో ఉన్న కార్మికులలో భయాందోళనలు పెంచేందుకు ప్రయత్నించడం (8) జులై 22న రాజమండ్రిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ''సమ్మె విరమిస్తే మున్సిపల్‌ కార్మికుల సమస్యలు సానుకూలంగా పరిశీలిస్తాం, సమ్మె విరమించకపోతే కఠినంగా వ్యవహరిస్తాం'' అంటూ తీర్మానించడం. (9) మున్సి పాలిటీలలో డబ్బుల్లేవు, ఇంతింత జీతాలు ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి? అంటూ ఎదురుదాడికి దిగడం. (10) విశాఖ గుర్తింపు సంఘాన్ని విడిగా చర్చలకు పిలిచి లొంగదీయడం (11) అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కార్మికు లపై భౌతిక దాడులకు దిగడం, కులాల పేరుతో దూషించడం, మహిళా కార్మికులను కొట్టడం (12) పోటీ కార్మికులతో పని చేయించడం లేదని అధికారులపై చర్యలు తీసుకుంటామంటూ సంకేతాలు పంపడం (13) సమ్మెలో లేకపోయినా, డ్యూటీలు సక్రమంగా చేయడం లేదు, పరోక్షంగా సమ్మెకు సహకరిస్తున్నా రంటూ పర్మినెంట్‌ వారిని సస్పెండ్‌ చేయడం వంటి అనేక రకాల కుట్రలతో సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది. విశాఖ ఉత్తర నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే విష్ణు కుమార్‌ రాజు ప్రభుత్వానికి వత్తాసు పలికి సమ్మె విచ్ఛిన్నానికి తోడ్పడ్డారు.
విశాల మద్దతును కూడగట్టుకోవడం
ప్రభుత్వ కుట్రలను ఎదుర్కొని ధైర్యంగా కార్మికులు పోరాడారు. ప్రభుత్వ నిర్బంధం, దాడులు పెరగడంతో కార్మికులలో మనోధైర్యాన్ని నింపి పోరాటాన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు తొలుత కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలన్నింటి మద్దతును కూడగట్టడం, దళిత, గిరిజన, బిసి, మైనార్టీ సంఘాలను సమీకరించడం, తెలుగుదేశం పార్టీ మినహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు కార్మికులకు అండగా కదలడం. ఈ విధంగా మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికుల పోరాటానికి ఒక విశాల మద్దతు ఏర్పడటం ప్రత్యేకించి చెప్పుకోదగ్గ విషయం. మరోవైపు పట్టణ ప్రజానీకం కూడా మున్సిపల్‌ సమ్మెకు నైతిక మద్దతును అందించారు. కాబట్టే 16 రోజులు సమ్మె కొనసా గింది. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ నిరంకుశ చర్యలకు అన్ని వైపుల నుంచి నిరసన వ్యక్తం కావడం మున్సిపల్‌ సమ్మెలో ఒక ప్రత్యేకత. అంతేకాకుండా ఈ పోరాటంలో తెలుగుదేశం పార్టీని ఒంటరిని చేయడం కూడా మరో ప్రత్యేకత. ఈ పోరాటం పరిమిత విజయమే సాధించినా సమరశీలతను ప్రదర్శించింది. మహిళా కార్మికులు పోలీసు నిర్బంధాన్ని, అవమానాలను ఎదు ర్కొని తమ కసితీరా పోరాటంలో పాల్గొన్నారు. ఈ పోరాటం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గాన్ని మున్సిపల్‌ కార్మిక వర్గం కొంతవరకు అవగాహన చేసుకోగలిగింది.
ఉద్యమంలోని కొన్ని బలహీనతలు
ప్రభుత్వ నిర్బంధాన్ని తట్టుకొని, విచ్ఛిన్న ప్రయత్నాలను తిప్పికొడుతూ పోరాటం ముందుకు సాగినా, ఇందులో కూడా కొన్ని బలహీనతలు ఉన్న మాట వాస్తవం. సమ్మె ప్రారంభానికి ముందే పర్మినెంట్‌ ఉద్యోగులందరినీ సమ్మెకు సన్నద్ధం చేయలేకపోవడం, మినిస్టీరియల్‌ ఉద్యోగులను కలుపుకొచ్చే ప్రయత్నం జరగకపోవడం, జెఎసిలోని సంఘాలు కొన్ని జిల్లాల్లో ఐక్యంగా వ్యవహరించకపోవడం, సమ్మె కాలంలో ఒక దీర్ఘకాలిక పోరాటాన్ని ముందుగానే ప్లాన్‌ చేసి నడిపేందుకు ఆటంకాలు ఏర్పడటం, జెఎసితో సంబంధం లేకుండానే కొందరు వ్యక్తిగ తంగా ఉమ్మడి డిమాండ్లకు భిన్నంగా పత్రికలకు ప్రకటనలు ఇవ్వడం వంటి లోపాలు జరిగాయి. కొన్ని యూనియన్లకు నాయకులుగా ఉన్న వారే కాంట్రాక్టర్లుగా, ప్యాకేజీదారులుగా ఉండటం, మరికొందరు వడ్డీ వ్యాపారులుగా ఉండటం వంటివి కూడా పోరాటాన్ని తీవ్రతరం చేయకుండా ఆటంకపర్చాయి.
సాధించిందేమిటి?
మొత్తం 45 డిమాండ్లు పెట్టినా చివరికి రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ వారికి 10వ పిఆర్‌సి సిఫార్సుల మేరకు రూ.13,000 కనీస వేతనం ఇవ్వడానికి నిరాకరించింది. ప్రసు ్తతమున్న వేతనాలపై రూ.2,700 చొప్పున అందరికీ వేతనాలు పెంచుతామని, 16 రోజుల సమ్మె కాలాన్ని సెలవు దినాలుగా పరిగణిస్తామని చెప్పారు. మిగిలిన డిమాండ్లను చర్చకు పెట్ట కుండా వదిలివేసింది. దీనికి కొన్ని సంఘాలు ఆమోదించి సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించాయి. సిఐటియు, గుంటూరు స్వత ంత్ర సంఘం, వైఎస్‌ఆర్‌టియు మాత్రమే వ్యతిరేకించాయి. సమ్మె డిమాండ్లు అన్నింటికీ సిఐటియు కట్టు బడి ఉంది. అయినా ఇతర సంఘాలన్నీ సమ్మె నుంచి విరమించు కోవడంతో తప్పని సరి పరిస్థితుల్లో సిఐటియు కూడా సమ్మెను విరమించాల్సి వచ్చి ంది. సిఐటియు ఒత్తిడి ఫలితంగా వేతనాల సవరణను అయిదేళ్ళ నుంచి రెండు సంవత్సరాలకు కుదించా లని, విడిఎ వర్తింప చేయాలని, ఇంజనీరింగ్‌ వారికి స్కిల్డ్‌, సెమీస్కిల్డ్‌ జీతాలు, స్కూల్‌ స్వీపర్స్‌ జీతాల పెంపు విషయాలపై కేబినెట్‌ సబ్‌ కమిటీలో 15 రోజుల్లో చర్చించి చెప్తామని ప్రభుత్వం చెప్పాల్సి వచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబె ట్టుకుని ఉద్యోగుల, కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరిం చకపోతే మరలా పోరాటాలు తప్పవు. కార్మికవర్గం తరపున పోరాటాలు నడిపేందుకు సిఐటియు ఎల్లవేళలా సిద్ధంగానే ఉంటుంది.
- కె ఉమామహేశ్వరరావు
(వ్యాసకర్త ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి)
Taags :

Vyasam. Prajasakti

దళితులకు అన్యాయం చేస్తున్న బాబు సర్కారు

Posted On Thu 30 Jul 22:59:05.256416 2015
             ఆంధ్రప్రదేశ్‌ సిఎం చంద్రబాబు రాజధాని నిర్మాణానికి లాండ్‌ పూలింగ్‌ కింద 38,000 ఎకరాలు తీసుకుంటున్నారు. రైతుల నుంచి తీసుకుంటున్న రాయితీ భూములకు ఎకరానికి వెయ్యి గజాల నివాస భూమి, 200 గజాల వాణిజ్య భూమి, జరీబు భూములకు ఎకరానికి 1,200 గజాల నివాస భూమి, 200 గజాలు వాణిజ్య భూమి అభివృద్ధి చేసింది భూ యజమానులకు ఇస్తామని ప్రకటిం చారు. ఎక్కువమంది భూ యజమానులు ఈ షరతులకు సమ్మ తించి తమ భూములు ఇచ్చారు. వారికి ఎకరాకు రూ.30 వేల కౌలు, జరీబు భూములకు ఎకరాకు రూ.50 వేల కౌలు ప్రతి సంవ త్సరం పది శాతం కౌలు మొత్తం పెంచే విధంగా ఈ సంవత్సరం చెల్లించారు. కానీ రాజధాని నిర్మాణం చేసే ఈ ప్రాంతంలో 2,200 ఎకరాలు ఎసైన్డ్‌ భూమి, 1,300 ఎకరాలు ఫీల్డ్‌ లేబర్‌ కో ఆపరేటివ్‌ సొసైటీల కింద లంక భూములు ఉన్నాయి. ఫీల్డ్‌ లేబర్‌ కో ఆపరేటివ్‌ సొసైటీల కింద భూమి ఉన్నా రైతులు వ్యక్తిగతంగానే సభ్యులు పంచుకుని సాగు చేస్తున్నారు. భూమి అభివృద్దికి, మోటార్లు, రుణం పొందటానికి రైతులు భూమిని పంచుకుని వ్యక్తిగతంగా సాగుచేస్తున్నారు. ఎసైన్డ్‌ భూములు భూమిలేని పేదలకు అమ్ముకో వడానికి వీలు లేకుండా, వంశపారంపర్యంగా అనుభవించేందుకు పట్టాలు మంజూరు చేసింది ప్రభుత్వం. కానీ భూ సమీకరణలో ప్రభుత్వం తీసుకున్న ఎసైన్డ్‌ భూమికి ఇంతవరకు కౌలు చెల్లించలేదు. లంక సొసైటీ భూములకు కౌలు చెల్లించలేదు. పైగా ఎసైన్‌మెంట్‌ భూములకు ఎకరాకు 800 గజాలు అభివృద్ధి చేసిన భూమి ఇస్తానని ప్రకటించి అమలు చేయలేదు.
రైతుల జిరాయితీ భూమికీ, ఎసైన్‌మెంటు భూమికీ లబ్ధి చేకూర్చటంలో తేడా ఎందుకు పెట్టారో చంద్రబాబు చెప్పాలి. భూమి ఇవ్వటం వలన జిరాయితీ భూముల రైతులు ఏ ప్రయోజనాలను నష్టపోతున్నారో ఎసైన్‌మెంట్‌ భూముల రైతులు కూడా అదే విధమైన నష్టాన్ని పొందుతున్నారు. మరి పరిహారం ఇవ్వటంలో, లబ్ధి చేకూర్చటంలో ఎసైన్‌మెంటు భూముల రైతుల పట్ల వివక్షత ఎందుకు? ఎసైన్‌మెంట్‌ భూముల రైతులలో అత్యధికులు దళితులు, వెనుకబడిన తరగతులవారు, పేదలు. పలుకు బడి గలవారు కాదు. నోరు తెరిచి అడగలేని వారు. వీరికి కౌలు ఇప్పటి వరకూ చెల్లించ కపోవటం, అభివృద్ధి పర్చిన భూమి తక్కువ ఇస్తామనటం. వివక్షత పాటించటమే అవుతుంది. ఈ రైతులు 1,500 మంది ఉన్నారు. ప్రభుత్వ ప్రాజెక్టులకు ఎసైన్‌మెంట్‌ భూములు తీసుకుంటే పట్టా భూములతో సమానంగా నష్ట పరిహారం ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు తీర్పు ఉన్నది. అంతేగాక ప్రభుత్వ జీవో నెంబర్‌ 135/2005 కూడా పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం ఇవ్వాలని ఉన్నది. అయినప్పటికీ చంద్రబాబు దళితులకు అన్యాయం చేస్తున్నారు. వివక్షత చూపిస్తున్నారు. భూ బదలాయింపు నిరోధక చట్టం (పిఒటి 1977) ప్రకారం భూ హక్కుదారు, రికార్డులలో నమోదైన వారికే పరిహారం (ఎక్స్‌ గ్రేషియా) చెల్లించాలి. చంద్రబాబు ఈ విషయాన్ని తేల్చకుండా నానబెట్టడం అంటే దళితులకు అన్యాయం చేయటమే. ఎసైన్‌మెంట్‌ భూములకు కూడా జిరాయితీ పట్టా భూములతో సమానంగా కౌలు చెల్లించటం, అభివృద్ధి చేసిన భూమి ఇవ్వటం చేయాలి. లేనియెడల అది కుల వివక్షతను పాటించటమే అవుతుంది.
- గద్దె చలమయ్య
Taags :

Vyasam.prajasakti

భరతజాతి ముద్దుబిడ్ద కలాం

Posted On Thu 30 Jul 23:00:48.547771 2015
           భరతజాతి ముద్దుబిడ్డ, క్షిపణి పితామహుడు, మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఎపిజె అబ్దుల్‌ కలాం అకాల మరణం యావత్‌ జాతిని దిగ్భ్రాంతి పరిచింది. సహనం, పరిపాలనా దక్షత, శాంతి, ఉక్కు సంకల్పం కలిగిన మహర్షి అబ్దుల్‌ కలాం. రాష్ట్రపతిగా నాయకత్వానికి సరికొత్త నిర్వచనమిచ్చారు. భారత సైన్యం అమ్ముల పొదికి శక్తివంతమైన అస్త్రాలను అందించిన ఘనత కలాం సొంతం. భారతీయ యువతకు శాస్త్ర, సాంకేతిక అంశాల మీద ఆసక్తిని గౌరవాన్ని ఇనుమడింపజేసిన నిత్య స్వాప్నికుడు. కలలు కనండి.. వాటి సాకారానికి కష్టపడండి అని యువతకు ఆయన ఇచ్చిన ప్రేరణ అజరామరం. క్షిపణి శాస్త్రవేత్తగా ఆయన సాధించిన ఖ్యాతి అనిర్వచనీయం. భారత క్షిపణి సామర్థ్యాలను ప్రపంచానికి తెలిసేలా ఎలా ఉండాలని ప్రజలు ఆశిస్తారో, తన వేషభాషలు, నడవడిక, జీవనశైలి ద్వారా నిర్దిష్టంగా చేసి చూపారు. బహుముఖ ప్రజ్ఞకు అసలైన చిరునామా అబ్దుల్‌ కలాం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా, అధ్యాపకుడిగా, వక్తగా, సంగీతకారుడిగా, రచయితగా నేటి తరానికి మార్గదర్శిగా నిలిచిన మహా మనీషి అ(ద్భుత)బ్దుల్‌ కలాం.
- బట్టా రామకృష్ణ దేవాంగ,సౌత్‌ మోపూరు,నెల్లూరు.
Taags :

News.prajasakti

భరతజాతి ముద్దుబిడ్ద కలాం

Posted On Thu 30 Jul 23:00:48.547771 2015
           భరతజాతి ముద్దుబిడ్డ, క్షిపణి పితామహుడు, మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఎపిజె అబ్దుల్‌ కలాం అకాల మరణం యావత్‌ జాతిని దిగ్భ్రాంతి పరిచింది. సహనం, పరిపాలనా దక్షత, శాంతి, ఉక్కు సంకల్పం కలిగిన మహర్షి అబ్దుల్‌ కలాం. రాష్ట్రపతిగా నాయకత్వానికి సరికొత్త నిర్వచనమిచ్చారు. భారత సైన్యం అమ్ముల పొదికి శక్తివంతమైన అస్త్రాలను అందించిన ఘనత కలాం సొంతం. భారతీయ యువతకు శాస్త్ర, సాంకేతిక అంశాల మీద ఆసక్తిని గౌరవాన్ని ఇనుమడింపజేసిన నిత్య స్వాప్నికుడు. కలలు కనండి.. వాటి సాకారానికి కష్టపడండి అని యువతకు ఆయన ఇచ్చిన ప్రేరణ అజరామరం. క్షిపణి శాస్త్రవేత్తగా ఆయన సాధించిన ఖ్యాతి అనిర్వచనీయం. భారత క్షిపణి సామర్థ్యాలను ప్రపంచానికి తెలిసేలా ఎలా ఉండాలని ప్రజలు ఆశిస్తారో, తన వేషభాషలు, నడవడిక, జీవనశైలి ద్వారా నిర్దిష్టంగా చేసి చూపారు. బహుముఖ ప్రజ్ఞకు అసలైన చిరునామా అబ్దుల్‌ కలాం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా, అధ్యాపకుడిగా, వక్తగా, సంగీతకారుడిగా, రచయితగా నేటి తరానికి మార్గదర్శిగా నిలిచిన మహా మనీషి అ(ద్భుత)బ్దుల్‌ కలాం.
- బట్టా రామకృష్ణ దేవాంగ,సౌత్‌ మోపూరు,నెల్లూరు.
Taags :

Sampadakeem.prajasakti

మరో ఆధార్‌ దేనికి?

Posted On Thu 30 Jul 23:01:18.719854 2015
             రాష్ట్రంలో నివసిస్తున్న పౌరులందరినీ ఆధార్‌ తరహాలో గుర్తించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా ఒక విధానం ప్రకటించి ఇప్పటికే ఉన్న కేంద్ర ఆధార్‌ను ప్రశ్నార్థకం చేసింది. ఆధార్‌తోనే నానా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు రాష్ట్ర ఆధార్‌ మరిన్ని తలనొప్పులు, గందరగోళం తెచ్చిపెట్టడం ఖాయం. ప్రజల సమస్త వివరాలనూ సేకరించేందుకు ఎపి యునిక్‌ ఐడెంటిఫికేషన్‌ ఆఫ్‌ రెసిడెంట్స్‌ పాలసీ తెస్తూ ఎపి ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిపార్టుమెంట్‌ బుధవారం వెలువరించిన 16వ నెంబర్‌ జీవోలో పేర్కొన్న పలు అంశాలు పేదలనూ, ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందుతున్న వారినీ మరింతగా వడపోసి తగ్గించేందుకు, పథకాలకు దూరం చేసేందుకు ఉద్దేశిం చినవి. అరకొర లబ్ధితో బతుకీడుస్తున్న పేదలకు ఆ మాత్రం సాయం సైతం దక్కకుండా చేసేవి. ప్రతి ప్రభుత్వ పథ కానికీ, సేవకూ డేటాను అనుసంధానం చేసి బోగస్‌ను ఏరి పారేస్తామనీ, లబ్ధిదారులను నియంత్రిస్తామనీ బహిరంగం గానే ప్రభుత్వం తన విధానంలో స్పష్టం చేసింది. కేంద్ర ఆధార్‌ వివరాలను తీసుకొని, ఆధార్‌ లేని వారి వివరాల సేకరణకు ప్రత్యేక సర్వే చేపట్టి సమాచారాన్ని ఒకే చోట క్రోడీకరించి డేటాను అందుబాటులో ఉంచుతారట. ఒక్క బటన్‌ నొక్కితే చాలు వ్యక్తుల అన్ని వివరాలూ కంప్యూటర్‌ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయట. కేంద్ర ఆధార్‌కు అనుసంధానంగా స్టేట్‌ రెసిడెంట్‌ డేటా హబ్‌ (ఎస్‌ఆర్‌డ ిహెచ్‌) పని చేస్తోంది. ఆధార్‌ ఎంత మందికి ఉందో, ఎంత మందికి లేదో అవగాహన లేకుండానే ఎపి ప్రభుత్వం వివిధ వర్గాల పింఛన్లకు, ప్రతిష్టాత్మక రైతుల రుణ మాఫీకి తప్పనిసరి చేసింది. దాంతో అన్ని అర్హతలూ ఉండి ఒక్క ఆధార్‌ లేని కారణంగా పది లక్షల మంది పింఛన్లకు దూరం అయ్యారు. ఏ ఆసరా లేక సర్కారు ఇచ్చే కొద్దిపాటి పింఛన్‌తో నెలలో కొన్ని రోజులైనా పొట్ట నింపుకుంటున్న నిర్భాగ్యుల ఉసురు తీసింది ఆధార్‌. రైతు రుణ మాఫీలో ఆధార్‌ లేదనే నెపంతో 20 లక్షల మంది రైతులను తిరస్కరించారు. అదేంటంటే ఎస్‌ఆర్‌డిహెచ్‌ సాఫ్ట్‌వేర్‌పై నెపం నెట్టి చేతులు దులుపుకుంది. సాఫ్ట్‌వేర్‌ ఎలా రూపొందిస్తే అలాగే ఫలితం వస్తుంది తప్ప దానికి దివ్యదృష్టి ఏమీ ఉండదు. రేషన్‌ దుకాణాల్లో బయోమెట్రిక్‌ విధానం పెట్టి లక్షల మందికి రేషన్‌ దూరం చేసింది. ఈ ఫీట్లన్నీ లబ్ధిదారులకు కత్తెర పెట్టి నిధులు మిగుల్చుకునేందుకే. తాజా గుర్తింపు ప్రక్రియ లక్ష్యం కూడా అదే అనుకోకుండా ఉండలేం.
కేంద్రంలో గత కాంగ్రెస్‌ ప్రభుత్వం పౌరులందరికీ ఒకటే గుర్తింపు సంఖ్య అని ఆధార్‌ను ప్రారంభించి ఆరు సంవత్సరాలవుతోంది. 2009 జనవరిలో దేశవ్యాప్త ఆధార్‌ నమోదు కోసం ప్రత్యేక ప్రాథికార సంస్థను నెలకొల్పగా ఇప్పటికి 70 శాతం మంది ప్రజలకే నెంబర్‌ కేటాయించారు. కోట్ల మందికి కార్డులు అందలేదు. ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. ఆధార్‌ ఇలా అఘోరిస్తుం డగానే మోడీ ప్రభుత్వం పౌరులకు బహుళార్ద గుర్తింపు కార్డులిస్తామంటోంది. బిజెపి ప్రభుత్వ ఉద్దేశం వేరే ఉంది. ప్రజలను మత పరంగా గుర్తించాలన్న దుర్మార్గ ఎజెండా దానిది. యుపిఎ ప్రభుత్వం గ్యాస్‌ సబ్సిడీ సహా పలు పథకాలకు నగదు బదిలీని అమలు చేసి, అందుకు ఆధారే ఆధారమని పేర్కొని ప్రజల నిరసనలతో తల బొప్పి కట్టించుకుంది. కాంగ్రెస్‌ ఓటమికి అదీ ఒక కారణమే. ప్రతి పక్షంలో ఉండగా నగదు బదిలీ, ఆధార్‌లను వ్యతిరేకించిన బిజెపి అధికారంలోకొచ్చాక అదే బాట పట్టింది. కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆధార్‌ నమోదు ప్రక్రియకు అంతూ పొంతూ లేకపోగా ఎపి ప్రభుత్వం కొత్తగా చేపట్టే పౌరుల గుర్తింపు కార్యక్రమం ఎన్నేళ్లు సాగుతుందో ఊహకందదు. కాంగ్రెస్‌ సర్కారు నందన్‌ నిలేకని కోసం ఆధార్‌ ప్రాజెక్టును తీసుకురాగా రాజధాని అమరావతి మొదలుకొని అన్ని మౌలిక సదుపాయాల కల్పనకూ సింగపూర్‌, జపాన్‌ ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం కోసం ఆర్రులు చాస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం ఎవరికి దోచి పెట్టడానికి ప్రత్యేక గుర్తింపు చేపట్టిందో సమయం గడిస్తే గానీ తెలియదు.
పౌరుల వ్యక్తిగత సమాచారం సేకరించడం రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛ హక్కుకు విఘాతం. కేంద్ర ఆధార్‌లో ఈ వివాదం తలెత్తింది. దీనికి సంబంధించిన బిల్లు పార్లమెంటులో పెండింగ్‌లో ఉంది. ఆధార్‌ లేదనే సాకుతో ప్రభుత్వ ప్రయోజనాలను తిరస్కరించొద్దని 2013లో సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర తీర్పు చెప్పింది. ఆధార్‌ నమోదు అనేది స్వచ్ఛందం తప్ప తప్పనిసరి వ్యవహారం కాదని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలను ఎపి ప్రభుత్వం పట్టించుకునే స్థితిలో లేదు. పైగా ప్రతి దానికీ ఆధార్‌ తప్పనిసరంటూ ఉత్తర్వులు జారీ చేస్తోంది. తాజాగా ప్రకటించిన విధానంలో ప్రజల డేటాను ప్రైవేటు సంస్థలకు అందుబాటులో ఉంచేందుకు సిద్ధమైంది. ప్రజల స్థితిగతులు తెలుసుకొనేందుకు పలు సర్వేలు అందు బాటులో ఉన్నాయి. ఎపి రైతుల్లో 92 శాతం మంది రుణ ఊబిలో కూరుకున్నారని నేషనల్‌ శాంపిల్‌ సర్వే తేల్చింది. రాష్ట్రంలోని ఎస్సీల్లో 95 శాతం మందికి సెంటు భూమి కూడా లేదని గతంలో వెలుగు, ప్రస్తుత సెర్ప్‌ అధ్యయనంలో వెల్లడైంది. ఆ అంకెలతో రైతులను, దళితులను ఉద్ధరిస్తే సరిపోతుంది. క్రమం తప్పకుండా ప్రణాళికా శాఖ నిర్వహించే సామాజిక, ఆర్థిక గణన, ఐరిస్‌ సహా పలు అధ్యయనాలు సర్కారుకు అందుబాటులో ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా కొన్ని కొలబద్దలతో ప్రభుత్వాలు నిర్వహిస్తున్న నివేదికలు, సర్వేలను బుట్ట దాఖలు చేసి మరొక సర్వే అనడం దేనికి?
Taags :

Thursday, July 30, 2015

Prajasakti. News

ఆర్‌ఎస్‌ సతీమణి సూర్యకాంతం కన్నుమూత

Posted On 7 hours 28 mins ago
ఆర్‌ఎస్‌ సతీమణి సూర్యకాంతం కన్నుమూత
-  చించినాడలో అంత్యక్రియలు పూర్తి
ప్రజాశక్తి-యలమంచిలి/పాలకొల్లు
         ఐద్వా సీనియర్‌ నేత రుద్రరాజు సూర్యకాంతం (83) గురువారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో కన్నుమూశారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు, మాజీ ఎంఎల్‌ఎ రుద్రరాజు సత్యనారాయణరాజు (ఆర్‌ఎస్‌) సతీమణి అయిన ఆమె కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె భారతి ఈ నెల 20న హైదరాబాద్‌లో మృతి చెందారు. దీంతో, అక్కడికి వెళ్లిన సూర్యకాంతం అకస్మాత్తుగా గురువారం తెల్లవారు జామున మృతి చెందారు. చించినాడ ఉద్యమంలో ఆమె ఆర్‌ఎస్‌తోపాటు కీలకపాత్ర వహించారు. చించినాడ పరిసర గ్రామాల్లో కుటుంబాల్లో వచ్చే సమ స్యలను తనవంతుగా పరిష్కరించేవారు. ఆమె ఐద్వా భీమవరం డివిజన్‌ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.సూర్యకాంతం భౌతికకాయాన్ని హైదరాబాద్‌ నుంచి చించినాడకు గురువారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో అంబులెన్స్‌లో తీసుకొచ్చారు. ఎంఎల్‌సి మేకా శేషుబాబు, మాజీ మంత్రులు చేగొండి హరిరావ ుజోగయ్య, కొత్తపల్లి సుబ్బా రాయుడు, మాజీ ఎంఎల్‌ఎలు ముదునూరి ప్రసాదరాజు, అల్లు వెంకట సత్యనా రాయణ, సిపిఎం పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి బి.బలరాం సూర్యకాంతం భౌతికకాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. సూర్యకాంతం అంతి మయాత్ర చించినాడ ప్రధాన వీధుల మీదుగా వశిష్ట గోదావరి ఒడ్డున శ్మశాన వాటికకు చేరుకుంది. అక్కడ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు దంపతులు సూర్య కాంతం భౌతికకాయంపై పూలమాలలు వేసి, జోహార్లర్పించారు. ఎంఎల్‌సి రాము సూర్యారావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు చింతకాయల బాబూరావు నివాళులర్పించారు. ఆర్‌ఎస్‌ సోదరుని కుమారుడు సత్యనారాయణరాజు ఆమె చితికి నిప్పంటించారు.

Tuesday, July 28, 2015

Vysalu









Sampadakeeyam. Prajasakti

సలామ్‌

Posted On Tue 28 Jul 22:19:40.040265 2015
                  మాజీ రాష్ట్రపతి, రాకెట్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ ఎపిజె అబ్దుల్‌ కలామ్‌ మృతి దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. ఆయన మృతికి సంతాప సూచికంగా భారత ప్రభుత్వం ఏడు రోజులు సంతాప దినాలను ప్రకటించింది. పార్లమెంటు ఉభయ సభలు ఆయనకు ఘనంగా నివాళులర్పించి మరుసటి రోజుకు వాయిదా పడ్డాయి. కలామ్‌ మృతితో దేశం ఒక గొప్ప శాస్త్రవేత్తను, దార్శనికుణ్ణి, స్వాప్నికుణ్ణి కోల్పోయింది. ఆయన యువతకు మరీ ముఖ్యంగా విద్యార్థులకు ప్రేరణనిచ్చే గొప్ప మోటివేటర్‌. భారతదేశాన్ని శాస్త్ర సాంకేతిక రంగంలో కొత్త పుంతలు తొక్కించాలని, రక్షణ, అంతరిక్ష రంగాల్లో ప్రపంచంలో దీటైన శక్తిగా నిలపాలనేది ఆయన తపన. చివరి క్షణం వరకు ఆ లక్ష్యంతోనే పనిచేశారు. రాష్ట్రపతిగా ఉన్నా అవకాశం వచ్చినప్పుడల్లా విద్యార్థులకు పాఠాలు బోధించేవారు. రాష్ట్రపతిగా పదవీ విరమణ చేశాక యువ శాస్త్రవేత్తలతో గడిపేందుకు ఎక్కువ మక్కువ చూపేవారు. వారు చేసే పరిశోధనలను, ప్రాజెక్టులను నిశితంగా పరిశీలించి తగు సూచనలు, సలహాలు ఇచ్చేవారు. రాష్ట్రపతి వంటి అత్యున్నత పదవిని అధిష్టించినా, భారతరత్న వంటి అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నా ఆయనలో దర్పం కానీ, భేషజం కానీ ఇసుమంతైనా కనిపించేది కాదు. 1931 అక్టోబరు15న తమిళ నాడులోని రామేశ్వరంలో ఓ పేద ముస్లిం కుటుంబంలో జన్మించిన కలామ్‌ మద్రాస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి ఏరోనా టిక్స్‌లో ఇంజనీరింగ్‌లో పట్టా పుచ్చుకున్నారు. ఆ తరువాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థలో చేరి తొలి దేశీయ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (ఎస్‌ఎల్‌వి-3) రూపకల్పన ప్రాజెక్టు డైరెక్టర్‌గా విజయవంతంగా రాణించారు. 1980లో రోహిణి ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశెపెట్టి ఇస్రోకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చారు. 1963లో ఎడ్లబండ్లపై రాకెట్‌ను లాంచింగ్‌ ప్రదేశానికి తీసుకెళ్లే స్థితి నుంచి నేడు చంద్రయాన్‌కు సన్నాహాలు చేసే స్థాయికి ఇస్రో ఎదిగిందంటే అందులో ఈ రాకెట్‌ శాస్త్రవేత్త కృషి మరువలేనిది. 1974లోనూ, 1998లోనూ పోఖ్రాన్‌ అణు పరీక్షలు నిర్వహించినప్పుడు భారత్‌పై అమెరికా తీవ్ర ఆంక్షలు విధిస్తే రష్యాతో కలిసి దేశీయంగా క్షిపణి సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో కలామ్‌ ముఖ్య భూమిక వహించారు. ప్రధాని ఇందిర, రక్షణమంత్రులు ఆర్‌ వెంకట్రామన్‌, అరుణాచలం వంటి వారికి శాస్త్రీయ సలహాదారుగా వ్యవహరించారు. కలామ్‌ను రాష్ట్రపతిని చేయడం ద్వారా ఆయనను రాజకీయ పావుగా వాడుకోవాలని బిజెపి ప్రయత్నించినా, ఆయన చాలా వరకు వివాదాలకు దూరంగా ఉంటూ హుందాగా వ్యవహరి ంచారు. రెండవ పర్యాయం రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టేందుకు బిజెపి చేసిన యత్నాలను సున్నితంగా తిరస్కరించారు. పేదరికం, అవిద్య పోవాలని, దేశం స్వావలంబన దిశగా పయనించాలని కలామ్‌ కలలుగన్నారు. ఆ కలను సాకారం చేయడమే ఆయనకు జాతి అర్పించే నిజమైన నివాళి.
Taags :

Vyasam. Prajasakti

ప్రమాద ఘంటికలు

Posted On Tue 28 Jul 00:17:55.769535 2015
            సేద్యం గిట్టుబాటు కాక, పెట్టిన పెట్టుబడులు తిరిగి రాక, రుణగ్రస్తులై నిరాశా నిస్ప్రుహలతో జీవితాలు చాలిస్తున్న రైతులను ఇప్పటి వరకు చూశాం. కానీ ఇప్పుడు ప్రభుత్వ వేధింపులు భరించలేక రోజుకో రైతు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న దుర్మార్గం మన రాష్ట్రంలో కనిపిస్తోంది. కర్నూలు జిల్లా ఓర్వకల్‌లో సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ కింద భూమి కోల్పోయిన ఒక రైతు కనీసం ఇస్తామన్న పరిహారం కూడా ఇవ్వకపోవడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. విశాఖ జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్వాశిత రైతు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. చిత్తూరు జిల్లాలో ఎయిర్‌పోర్టు బాధితులదీ అదే దారి. రాజధాని అమరావతిలో ఒకరిద్దరు ఆత్మహత్యలకు ప్రయత్నించినా ప్రభుత్వం బయటికి రానీయలేదు. ప్రభుత్వ శాఖల నిర్వాకం వలన రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం ఘోరం. విజయనగరం జిల్లాలో రెవెన్యూ అధికారుల వాలకంతో ఒక రైతు నిండు ప్రాణం తీసుకోవడం ఆందోళకరం. వివాదాల పరిష్కారంలో రెవెన్యూ విభాగం సకాలంలో స్పందించని ఫలితమిది. అదే జిల్లాలో ఇలాంటి కారణంతోనే మరో రైతు ఆత్మహత్యకు ప్రయత్నించి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. గుంటూరు జిల్లాలో దేవాలయ భూములను ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న కౌలు రైతుల భూములను దేవాదాయశాఖ వేలం వేయడంతో సామూహిక ఆత్మహత్యలకు ప్రయత్నించిన ఘటనలో ఒక రైతు ప్రాణాలు కోల్పోయాడు. అనంతపురం జిల్లాలో బ్యాంక్‌ మేనేజర్‌ వేధింపులకు యువ రైతు బలయ్యాడు. ఈ ఆత్మహత్యలన్నీ సేద్యం అచ్చిరాక పాల్పడ్డవి కావు. ప్రభుత్వ విధానాలు, పలు విభాగాల్లో నెలకొన్న అవినీతికి ప్రతి రూపాలు. ప్రాణాధారమైన భూములను బలవంతంగా లాక్కుంటున్న వైపరీత్యాన్ని తాళలేక మనసికంగా కుంగిపోయి బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న రైతుల దీన గాధలివి. వ్యవసాయ సంక్షోభం సృష్టిస్తున్న రైతుల ఆత్మహత్యల పరంపర ఆందోళకరం కాగా నవ్యాంధ్రప్రదేశ్‌ 'అభివృద్ధి' చక్రాల వేగానికి, ప్రభుత్వ శాఖల నిర్వాకానికి తాళలేక బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న అన్నదాతల ఉందంతాలు మరింత బాధాకరం. రాజధాని నిర్మాణం, కొత్త విమానాశ్రయల ఏర్పాటు, ఉన్న విమానాశ్రయాల విస్తరణ, కొత్త పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక వసతుల కల్పన ఇత్యాది కార్యక్రమాలకు సర్కారు పెద్ద ఎత్తున భూములు సేకరిస్తోంది. భూముల సేకరణలో అత్యధికంగా సమిధలయ్యేది రైతులే. వ్యవసాయం గిట్టుబాటుకాక అప్పుల ఊబిలో కూరుకుపోయినప్పటికీ తరతరాలుగా భూమిపై మమకారంతో జీవనం వెళ్లదీస్తున్న కర్షకులకు భూసేకరణ గోరుచుట్టుపై రోకలిపోటు వంటిది. అభివృద్ధి కోసం భూములు అనివార్యమైనప్పుడు నిర్వాసితులు మెచ్చేలా సహాయ పునరావాస ప్యాకేజీ ఇవ్వడం ప్రభుత్వాల కనీస బాధ్యత. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పిపిపి)లో కార్పొరేట్ల కోసం సర్కారే భూములను బలవంతంగా గుంజు కోవడం రైతులను మరింత నిరాశా నిస్ప్రుహలకు, మానసిక ఒత్తిడికి గురి చేస్తోంది. తమను రక్షించాల్సిన ప్రభుత్వమే ఇప్పుడు తమపై దాడికి దిగడంతో చేసేది లేక ఆత్మహత్యలకు పాల్పడటం ఆందోళనకరం. భూములు దక్కకకుండా పోతాయన్న మనస్థాపంతో భవిష్యత్తు కానరాక ఆత్మహత్యలకు పాల్పడే రైతులకు భరోసా ఇవ్వాల్సింది ప్రభుత్వమే. భవిష్యత్తు ప్రమాద ఘంటికలుగా భావించి సర్కారు తగు చర్యలు తీసుకోవాలి. రైతులు సైతం మనో నిబ్బరాన్ని కోల్పోకుంగా ప్రభుత్వంపై పోరాడి హక్కులు సాధించుకోవాలి.
Taags :

Vyasam. Prajasakti

ప్రభుత్వరంగ రక్షణకు మరో స్వాతంత్య్ర పోరాటం

Posted On Tue 28 Jul 21:32:56.086924 2015
                    కేంద్ర ప్రభుత్వ రంగం నశించడం ఖాయం. కొన్ని పుట్టినప్పుడు మరణి స్తాయి. కొన్ని మధ్యలో మరణిస్తాయి. ఇప్పటికీ బతి కున్న ప్రభుత్వరంగ పరిశ్ర మలు కూడా మరణించక తప్పదు. దానికి రెండే మార్గాలు. ఒకటి ఉన్న ప్రభుత్వరంగాన్ని ప్రైవేటీకరించడం, రెండోది మూసివేయడం - మోడీ
ఫిక్కీ (పారిశ్రామిక యజమానుల సంస్థ) సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ స్వయంగా చెప్పిన మాటలివి. సాక్షాత్తు ప్రధాన మంత్రి చెప్పిన దానికి అనుగుణంగానే బిజెపి ప్రభుత్వ విధానాలున్నాయని స్పష్టంగా అర్థమౌతుంది. నవరత్న ప్రభుత్వరంగ పరిశ్రమల్లోని రూ.69 వేల కోట్ల విలువ కలిగిన వాటాలను అమ్మాలని 2015-16 బడ్జెట్‌లో ప్రతిపాదించారు. వాస్తవానికి వీటి విలువ నాలుగు రెట్లకుపైగానే ఉంటుంది. ఉదహరణకు విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో 10 శాతం వాటాలు రూ.489 కోట్లకు అమ్మాలని నిర్ణయించారు. వాస్తవ విలువ దీనికి 10 రెట్లుపైగానే ఉంటుంది. ప్రభుత్వరంగ పరిశ్రమలను బలహీనపరిచే చర్యలన్నీ చేపట్టారు. హిందూస్థాన్‌ పెట్రోలియం వాటాలను ఇప్పటికే 49 శాతం ప్రైవేట్‌ వారికి అమ్మారు. గతంలో ప్రతి ప్రభుత్వరంగ పరిశ్రమకూ విస్తరణకు బడ్జెట్‌లో వేల కోట్లు కేటాయించేవారు. నేడు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. పైగా విస్తరణకు అనుమతులివ్వడానికి కూడా విపరీతంగా జాప్యం చేస్తున్నారు. ప్రైవేటు సెల్‌ఫోన్‌ కంపెనీలన్నింటికీ అనుమతులుచ్చిన పదేళ్ళ తరువాత కానీ బిఎస్‌ ఎన్‌ఎల్‌కు సెల్‌ అనుమతులు ఇవ్వలేదు. ప్రభుత్వ వర్కు ఆర్డర్లు ప్రభుత్వరంగ కంపెనీలకు ఇవ్వకుండా ప్రైవేట్‌ ఎల్‌ఎన్‌టి, రిలయన్స్‌లకు ఇస్తున్నారు. దీనివల్ల విశాఖలోని షిప్‌యార్డు, బిహెచ్‌పివి పరిశ్రమలు ఆర్డర్లు లేక వెలవెల బోతున్నాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు గనులు కేటాయించకుండా నష్టాల్లోకి నెడుతున్నారు. విశాఖ పోర్టు ట్రస్టులోని 80 శాతం బెర్తులను ప్రైవేట్‌ కంపెనీలకు ఇప్పటికే అప్పగిం చారు. విదేశాలతో వాణిజ్యం విశాఖ కేంద్రంగా నడిపిన ఎంఎంటిసి వాణిజ్య రంగం నుంచి మూసి వేశారు. హైదరాబాద్‌లోని ఇండియన్‌ డ్రగ్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌ (ఐడిపియల్‌) ప్రాథమిక మందుల కంపెనీని, దేశంలోనే ప్రతిష్టాత్మకమైన హెచ్‌యంటి వాచ్‌ కంపెనీని మూసివేశారు. నిర్మాణ రంగంలో ప్రఖ్యాతిగాంచిన హెచ్‌ఎస్‌సిఎల్‌, ఎన్‌పి సిసి కంపెనీలను మూసేశారు. పై పరిశ్రమలన్నీ అవి ఏర్పడినప్పటి నుంచీ ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డాయి. మంచి లాభాలతో నడిచాయి. కానీ కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ఈ ప్రభుత్వరంగ పరిశ్రమలన్నీ నేడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. నూతనంగా ఏర్పడిన ఆంధ్ర óప్రదేశ్‌ రాష్ట్రానికే ఈ పరిణామాలు మరింత హానికరం. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ప్రభుత్వరంగ పరిశ్రమల విస్తరణే నేటికీ ప్రధానంగా ఉంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఇటీవలే సుమారు రూ.13 వేల కోట్ల పెట్టుబడితో 63 లక్షల టన్నుల సామర్థ్యానికి వచ్చింది. హిందూస్థాన్‌ పెట్రోలియం రూ.17 వేల కోట్ల పెట్టుబడితో 1.7 కోట్ల టన్నుల సామర్థ్యం స్థాయికి విస్తరించడానికి సిద్ధమైంది. పూడిమడకలో 4 వేల మెగావాట్ల సామర్ధ్యంతో ఎన్‌టిపిసి పరిశ్రమ రూ.27 వేల కోట్ల పెట్టుబడితో నిర్మాణానికి సిద్ధమౌతున్నది.
గత 24 సంవత్సరాల నుంచి సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలతో ప్రభుత్వం ఎంత ప్రచార ఆర్భాటంచేసినా వచ్చిన ప్రైవేట్‌ కంపెనీలు నామ మాత్రం. సెజ్‌ల పేరుతో విదేశీ ఎగుమతుల లక్ష్యంతో ఏర్పడిన కంపెనీలు. బ్రాండిక్స్‌ లాంటి కంపెనీలకు వెయ్యి ఎకరాలకు సంవత్సరానికి రూ.1,000 (ఎకరానికి రూపాయ) చొప్పున ప్రభుత్వం లీజు కిచ్చింది. ఇవి సర్కస్‌ కంపెనీలాంటివి. యజమా నులు ఆధునిక జైళ్లలాగా నడుపుతున్నారు. యూని యన్‌ పెట్టాలని భావిస్తే ముందుగా ఉద్యోగాలు ఊడ బెరుకుతారు. అతి చౌకగా పనులు చేయించు కొని అత్యధిక లాభాలు గడిస్తారు. దీన్ని చీప్‌ లేబర్‌ (చౌక కార్మికులు) అంటాం. ప్రైవేట్‌ రంగం ఎప్పుడూ ప్రభుత్వరంగతో సమానం కాదు. ప్రైవేట్‌ అంటే లాభాలు. దేశంలోని పెద్ద ప్రైవేట్‌ సంస్థలుగానీ, విదేశీ కార్పొరేట్‌ కంపెనీలుగానీ లాభాల కోసం వస్తాయి. కానీ భారత ప్రభుత్వం సేవా రంగాలైన రైల్వే, రక్షణ, ఇన్సూరెన్స్‌, బ్యాంకింగ్‌ రంగాల్లో సైతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించడం దేశ ప్రయోజనాలకు తీవ్ర హానికరం.
సరళీకరణ విధానాల ఫలితంగా భూములు, గనులు, సముద్ర తీరాన్ని కార్పొరేట్లు కబళించేదానికి వీలుగా ప్రభుత్వాలు తమ విధానాలను అమలు చేస్తున్నాయి. మరో అడుగు ముందుకేసి అశేష త్యాగా లతో నిర్మించిన ప్రభుత్వరంగ పరిశ్రమలను కార్పొ రేట్లకు కైవశంచేయడానికి ప్రభుత్వాలు కుట్ర చేస్తు న్నాయి. ఈ విధానం దేశ సంపదను కొల్లగొట్టడం తప్ప మరొకటికాదు. స్వాతంత్య్రం వచ్చేనాటికి పారిశ్రా మికంగా పూర్తిగా వెనుకబడి ఉన్నాం. మౌలిక పరిశ్రమలైన స్టీలు, పెట్రోలియం, రసాయనిక ఎరువులు, ప్రాణావసర మందులు అన్నింటికీ విదే ేశాలపై ఆధారపడ్డాం. సోషలిస్టు దేశాల సహాయంతో అన్ని రంగాల్లో స్వయం సమృద్ధిని సాధించాం. అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపడంలో కూడా నేడు అగ్రస్థాయిలో ఉన్నాం. దేశంలో ప్రభుత్వరంగం బలోపేతం కావడంవల్లనే ఇది సాధ్యమైంది. దేశ పారిశ్రామికాభివృద్ధికి, ఆర్థిక స్వాలంబనకు లక్షల కోట్లు ప్రతి సంవత్సరం పన్నులు, డివిడెంట్ల రూపంలో ప్రభుత్వ బడ్జెట్‌కు నిధులు సమకూర్చుతున్నాయి. ఇటువంటి బంగారు బాతును కోసి తినే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ప్రభుత్వరంగం ఏర్పాటు ఫలితంగా దేశం ఆర్థిక, సామాజిక అభివృద్ధిని సాధించింది. అత్యధిక భారీ పరిశ్రమలను వెనుక బడిన ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం వల్ల ఆయా ప్రాంతాలు అభివృద్ధిచెందాయి. 18 లక్షల మందికి పర్మినెంట్‌ ఉపాధి రావడంతో కార్మిక కుటుంబాల ఆర్థికస్థాయి పెరిగింది. ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్లు అమలుకావడం వల్ల సామాజిక న్యాయం సాధించు కున్నాం. ''దేశమంటే మట్టి కాదోరు, దేశమంటే మనుజులోరు'' అనే గురజాడ అక్షర పలుకులకు ఆచరణలో ప్రభుత్వరంగ సంస్థలు రుజువు చేసి చూపించాయి. నేడు ప్రైవేట్‌ పరిశ్రమల్లో రిజర్వేషన్లు పాటించడంలేదు. ప్రైవేట్‌ పరిశ్రమల్లో రిజర్వేషన్లు అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వా నికి ఉంది. ప్రభుత్వరంగ పరిశ్రమల్లోని కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు విద్య, వైద్యం, రోడ్లు, నీరు, విద్యుత్‌ లాంటి సకల సౌకర్యాలు సమకూర్చబడ్డాయి. నేడు ప్రైవేట్‌ పరిశ్రమలేవీ ఈ సౌకర్యాల గురించి పట్టించుకోవడం లేదు. వారి లాభాలే వారికి ప్రధానం. వారి లాభాల సాధన కోసం యూనియన్‌లు లేకుండా చేయడం, కాంట్రాక్టీకరణ విధానాన్ని అమలు చేయడం, పిఎఫ్‌, పెన్షన్‌ సౌకర్యాన్ని కుదించడం వగైరా చేస్తున్నాయి.
కార్మివర్గం నేడు అనుభవిస్తున్న హక్కులు అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీటిపై దాడిచేయడానికి నేడు తీవ్రంగా పూనుకుంటున్నాయి. ప్రైవేటీకరణకు వ్యతిరే కంగా జరిగే పోరాటాలను అణచడానికి చట్టాల్లో తీవ్ర మార్పులు తెస్తున్నారు. ప్రభుత్వరంగ కార్మికులకు ముఖ్యంగా బేరసారాలాడే ద్వైపాక్షిక కమిటీలు కీలక పాత్ర వహిస్తున్నాయి. వీటి ఫలితంగా జీతభత్యాలు, హక్కులు మిగిలినవారి కంటే నేటికీ మెరుగ్గా ఉన్నాయని గర్వంగా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు తెస్తున్న చట్ట సవరణల ఫలితంగా కార్మికులకు సంకెళ్ళు విధించి బానిసలుగా నెట్టాలని చూస్తున్నారు. సమ్మె హక్కు, ఇతర పోరాటాల హక్కులు పూర్తిగా నాశనం చేయడానికే ఈ చట్ట సవరణలు ఉద్దేశించబడ్డాయి. ఈ చట్టసవరణలను అడ్డుకోగలిగితేనే మనం నిజమైన కార్మికులుగా ఇప్పటిలాగే తలెత్తుకొని గర్వంగా జీవించగలం.
సెప్టెంబర్‌ 2 సమ్మె ఎందుకు?
ప్రభుత్వరంగాన్ని కాపాడుకోవడం నేడు కార్మికవర్గ కర్తవ్యం. సమ్మె చేయకపోయినా తన జీతం తనకొస్తుందని ఎవరైనా భావిస్తే అంతకంటే తప్పు మరొకటిలేదు. మన ఇంటి చుల్టూ మంటలు మండు తుంటే నా ఇల్లు కాలిపోదు అని భావించి నట్లుగా ఉంటుంది. సమ్మె చేస్తే జీతం, ప్రోత్సాహకం, వగై రాలు నష్టపోవడం వాస్తవం. సమ్మె చేయకపోతే అంతకంటే ఎక్కువ నష్టపోతాం. కంపెనీలే ప్రైవేట్‌ పరం అవుతాయి. ఉద్యోగాలే ఊడిపోతాయి. మనకు ఇష్టం ఉన్నా లేకున్నా ప్రభుత్వం సృష్టించిన పరిస్థితుల వల్ల నేడు సమ్మె చేయడం అనివార్యం. బిజెపి ప్రభు త్వం కేంద్రలోనూ, టిడిపి ప్రభుత్వం రాష్ట్రం లోనూ సుమారు మరో నాలుగేళ్ళు అధికారంలో ఉంటాయి. ఇవి పచ్చి కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలు. కార్మికవర్గం తమ హక్కుల కోసం, తమ పరిశ్రమలు రక్షణ కోసం పోరాడడం అనివార్యం. 2016 నాటికి బిజెపి రాజ్య సభలో కూడా మెజార్టీ సాధిస్తుంది. బిజెపి దూకు డును పార్లమెంటులో అడ్డుకోవడం సాధ్యం కాదు. రాష్ట్ర టిడిపి గుడ్డిగా బిజెపి పల్లకీని మోస్తున్నది. పార్ల ్లమెంటు బయట భారీ పోరాటాలు, కార్మికవర్గం ఐక్యం గా నడపడం ఒక్కటే బిజెపి, టిడిపి ప్రభుత్వాలకు సరైన గుణపాఠం.
1991లో సరళీకరణ విధానాలు ప్రవేశ పెట్టినప్పుడు ప్రభుత్వరంగాన్ని కేంద్ర ప్రభుత్వమే ''తెల్ల ఏనుగుగా వర్ణించింది''. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ప్రభుత్వరంగానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తు న్నాయి. ఆనాడు రెండేళ్ళలోనే ప్రభుత్వరంగాన్ని ప్రైవేటీకరిస్తామని మన్మోహన్‌సింగ్‌ బీరాలు పలి కాడు. ఐదేళ్ళు వామ పక్షాలు మన్మోహన్‌ సింగ్‌ను ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా అడ్డుకు న్నాయి. ఒక్క ప్రభుత్వ రంగ పరిశ్రమలో ఒక్క శాతం వాటాను కూడా అమ్మని వ్వలేదు. కానీ నేడు మోడీ మరింత బరితెగింపు విధానాలతో ముందుకు వస్తున్నారు. గతం కంటే మరింత పట్టుదలతో కార్మిక వర్గం ఈ విధానాలను తిప్పికొట్టాలి. ఎన్‌డిఎ-1 ప్రభుత్వ కాలంలో విశాఖ జిల్లాలో కార్మికవర్గం పెద్దఎత్తున పోరాటాలు నడిపి ంది. ఫలితంగా హిందూస్థాన్‌ జింక్‌ మినహా మిగిలిన కంపెనీలను కాపాడుకోగలిగారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ను నేటికీ ఒక్క శాతం వాటా కూడా ప్రైవేట్‌వారికి అమ్మకుండా అడ్డుకోగలిగాం. బిహెచ్‌పి విని ఎల్‌ అండ్‌ టిి కొనాలని ప్రయత్నిస్తే కార్మికులు ఎల్‌అండ్‌టి ప్రతినిధులను కంపెనీ లోపలికి కూడా రాకుండా అడ్డు కున్నారు. ఆ విధంగా హిందూస్థాన్‌ జింక్‌లో వేదాంత గ్రూపును రాకుండా అక్కడి సంస్కరణ సంఘాలు అడ్డుకోలేక పోయాయి. పర్యవసానంగా జింక్‌లో కార్మికులను తొలగించడం, కంపెనీ లాభాల్లో ఉన్నా అన్యాయంగా మూసి వేయడం జరిగింది. 1999 నుంచి 2004 వరకు బిజెపి, టిడిపి ప్రభుత్వాలు అనుసరించిన కార్మిక వ్యతిరేక విధానాల వల్ల కార్మికుల ఆగ్రహాన్ని చవి చూడవలసి వచ్చింది. తమిళనాడులో లక్ష మంది పర్మినెంట్‌ రాష్ట్ర ఉద్యోగులను ఒక కలంపోటుతో నాటి ముఖ్యమంత్రి జయలలిత తొలగించారు. సుప్రీం తీర్పుతో ఉద్యోగులు తిరిగి పనిలో చేరారు. కానీ 2004 ఎన్నికల్లో బిజెపి కేంద్రలోనూ, జయలలిత తమిళనాడులోనూ, ఎపిలో చంద్రబాబు ఘోరంగా ఓడిపోయారు. పోరాడితే విజయం కార్మిక వర్గానిదే. కార్మికులందరూ ఐక్యతతో 2015 సెప్టెం బర్‌ 2 సమ్మె పోరాటాన్ని జయప్రదం చేయాలని కోరు తున్నాం.
 - సిహెచ్‌ నరసింగరావు
Taags :

Vyasam. Prajasakti

అమ్మకానికి గ్రీస్‌

Posted On Tue 28 Jul 00:17:09.782107 2015
              గ్రీస్‌ తన అప్పును సాంతం చెల్లించగలదని ఆశించటం అవాస్తవికమని గ్రీస్‌కు అప్పులిచ్చిన సంస్థలలో ఒకటైన ఐఎంఎఫ్‌ కూడా బహిరంగంగా గుర్తించిన విషయాన్ని కాసేపు మర్చిపోదాం. గ్రీస్‌కు అప్పును చెల్లించటంలో ఎలాంటి ఉపశమనాన్నీ ఇవ్వలేదనుకుంటే ఆ దేశం ప్రతి సంవత్సరం కొంత మొత్తాన్ని చెల్లించవలసి ఉంటుంది. ఏదిఏమైనా గ్రీస్‌ను రెండు మార్గాలలో తన అప్పును చెల్లించేలా చేయవలసి ఉంటుంది. మొదటిది, గ్రీస్‌ సరుకులను, సేవలను ఋణదాతలు కొనుగోలుచేసి ఇచ్చిన అప్పుకు సర్దుబాటు చేసుకోవాలి. విదేశీ చెల్లింపుల సమతూకానికి సంబంధించిన కరెంటు ఖాతాలో మిగులు ఉండాలి. అలా ఏర్పడిన మిగులును గ్రీస్‌ తన అప్పు తీర్చటానికి వినియోగిస్తుంది. రెండవది, గ్రీస్‌ తన ఆస్తులను ఋణదాతలకుగానీ లేక మరెవరికైనా అమ్మి తీసుకున్న అప్పును చెల్లించవలసి ఉంటుంది.
ఈ రెండు మార్గాల మధ్య ఆర్థికపరంగా అపారమైన తేడా ఉన్నది. మొదటి మార్గాన్ని పరిశీలిద్దాం. గ్రీస్‌ ఆర్థిక వ్యవస్థలో తగినంత డిమాండ్‌ లేనందున కరెంటు ఖాతాలో మిగులు ఏర్పడాలంటే ఎగుమతులను పెంచాలి. అంతేగాని 'పొదుపు చర్యల విధానం' చెబుతున్నట్లుగా దిగుమతులను తగ్గించుకుని కాదు. అదే జరిగితే గ్రీస్‌లో ఉత్పత్తి పెరుగుతుంది. దానితోపాటుగా ఉద్యోగ కల్పన కూడా పెరుగుతుంది. అంతేకాక ప్రారంభంలో పెరిగే ఉత్పత్తికి సంబంధించిన 'గుణకం' ప్రభావంతోను, పెరిగిన ఎగుమతుల మిగులుతోను మొత్తం ఉత్పత్తిలో పెరుగుదల చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు బయటి నుంచి డిమాండ్‌ ఎక్కువగా ఉండటంవల్ల పెరిగిన ఎగుమతి మిగులు 100 అనుకుంటే, ఆర్థిక వ్యవస్థలో ప్రయివేటు వినిమయం మొత్తం ఉత్పత్తిలో అలవాటుగా సగం దాకా ఉంటే ఆ తరువాత కూడా గ్రీకు ప్రభుత్వ వ్యయం, ప్రయివేటు పెట్టుబడులలో మార్పు ఏమీ ఉండదు. గ్రీకు ఆర్థిక వ్యవస్థలోని ఉత్పత్తి పెరుగుదల 200 ఉంటుంది(ఈ లెక్కలో ఉత్పత్తి పెరుగుదలకు కారణమైన దిగుమతులను పరిగణనలోకి తీసుకోలేదని అనుకోవచ్చు. అయితే అలా జరగలేదు. ఎగుమతుల మిగులు 100 పెరిగిందని అంటున్నప్పుడు దిగుమతుల విలువను ఎగుమతుల విలువ నుంచి తీసివేయగా మిగిలినదానినే లెక్కలోకి తీసుకోవటం జరిగిందని అర్థం). ఈ 200 మిగులులో ప్రయివేటు వినిమయం 100, ఎగుమతుల మిగులు 100గా ఉంటుంది.
ఇలాంటి పరిస్థితుల్లో గ్రీస్‌ తనకు ఎటువంటి ఖర్చూ లేకుండా ఋణదాతలకు 100 చెల్లించగలిగేదే. పైగా అలా చేస్తూనే తన ఉత్పత్తిని, ఉద్యోగ కల్పనను, వినిమయాన్ని పెంచుకోగలిగేదే. ఈ క్రమంలో దేశీయ పెట్టుబడిలోనూ లేక పెన్షన్లు, వేతనాలు, నగదు బదిలీల వంటి ప్రభుత్వ వ్యయంలోనూ ఎటువంటి కోతా లేకుండానే ఇది జరిగేది. ఈ అవగాహన ప్రాధాన్యతను సరిగా గుర్తించలేదు. దురదృష్టవశాత్తు గ్రీస్‌ గురించి చాలా మంది ప్రగతికాముకులు కూడా అంగీకరిస్తున్న బూర్జువా ప్రచారం ఈవిధంగా సాగుతున్నది. గ్రీకు ప్రజలు చాలా కాలంగా తమ తాహతుకు మించి బ్రతుకుతున్నారు. అంత్ణస్సూచనగా చెప్పేదేమంటే బాగా కష్టపడే జర్మన్లలా కాకుండా వారు సోమరులు, అసమర్థులు, విషయాలను తేలిగ్గా తీసుకుంటారు. చాలా కాలం తాహతుకుమించి బ్రతికిన తరువాత 'పొదుపు విధానాన్ని' అంగీకరించి సరుకుల, సేవల వినిమయంలో కోత విధించుకోవటం ద్వారా కడుపుమాడ్చుకోవటం తప్ప గ్రీకు ప్రజలకు వేరే ప్రత్యామ్నాయం ఏదీ లేదు. నిజానికి దేశీయ వినిమయంలో కోత చాలా తీవ్రంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అందుకే అప్పులు తీర్చాలంటే ముఖ్యంగా 'పొదుపు విధానం' పక్కాగా అమలుచేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఖర్మకు వారే బాధ్యులు. దీనిలో మనం బాధపడవలసిన అవసరంలేదు.
భావనాపరమైన మూర్ఖత్వం
ఈ వాదన ఆచరణలో ఎంత మూర్ఖమైందో పూర్తిగా బహిర్గతమైంది. గ్రీకు ప్రజలు సోమరులు, వళ్ళు వంచరు, ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో సంబంధంలేకుండా గ్రీస్‌ అప్పు గ్రీసుకు సంబంధించిన విషయాలతోనే ముడిబడివున్నది, గ్రీకు ప్రజలు తాహతుకు మించి జీవించారు గనుకనే ఆ దేశం అప్పు పేరుకుపోయింది, గ్రీసు అప్పు పేరుకుపోవటానికి గ్రీస్‌పై ఋణదాతలు రుద్దిన విధానాలకు ఎటువంటి సంబంధంలేదు వంటి ప్రతిపాదనలు ఏమాత్రం పసలేనివి. అయితే ఈ వాదనలోని మూర్ఖత్వం తగినంతగా బట్టబయలు కాలేదు. గతంలోనూ, నేడూ గ్రీస్‌ ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయి ఉద్యోగకల్పన కలిగివున్నదని, దానికి సరఫరా కొరత తప్ప డిమాండ్‌ కొరత లేదనే ప్రమేయంపై ఈ వాదన ఆధారపడింది. ఆర్థిక వ్యవస్థలో వనరులు నిరుపయోగంగా ఉన్నట్లయితే పొదుపుతో కడుపుమాడ్చుకునే అవసరం ఉండదు. సరఫరా కొరత గల ఆర్థిక వ్యవస్థలోనే ఆ పరిస్థితి తలెత్తుతుంది. ఎందుకంటే కేవలం అలాంటి ఆర్థిక వ్యవస్థలోనే అప్పుతీర్చటం కోసం ఎగుమతి మిగులును పొందేందుకు దేశీయ వినిమయాన్ని తగ్గించుకోవలసి ఉంటుంది. డిమాండ్‌ కొరత గల ఆర్థిక వ్యవస్థలో దేశీయ వినిమయం పెరిగినప్పటికీ, విదేశాల నుంచి ఎగుమతులకు డిమాండ్‌ ఉంటే నిరుపయోగంగా ఉన్న వనరులను ఉపయోగించి ఎగుమతుల మిగులును సాధించవచ్చు.
వేరేవిధంగా చెప్పాలంటే అప్పు తీర్చటంకోసం ఒకవేళ గ్రీకు ప్రభుత్వం ఋణదాతలకు వోచర్లను ఇస్తే, వాటిని గ్రీస్‌లో డబ్బు అవసరంలేని విహారయాత్ర చేసేందుకు వీలుకల్పిస్తూ ఆయా దేశాల ప్రజలకు పంపిణీ చేసినట్లయితే ఒక్క రాయితో అనేక పిట్టల్ని కొట్టినట్లయ్యేది. గ్రీస్‌కు అప్పులిచ్చిన దేశాల ప్రజలు గ్రీస్‌లో ఉచితంగా విహార యాత్రచేసి తమ జీవన ప్రమాణాలను మరింతగా పెంచుకోగలిగేవారు. ఆవిధంగా వోచర్ల విలువకు సరిపడా గ్రీస్‌ తన అప్పును తీర్చుకోగలిగేది. అలా విహార యాత్రీకులు గ్రీస్‌ను దర్శించటం వల్ల ఆ దేశంలో ఉద్యోగ కల్పన, ఉత్పత్తి, వినిమయం కూడా పెరిగేవి. అంతేకాకుండా యూరోజోన్‌లో ప్రజల మధ్య సౌభ్రాతృత్వం కూడా వెల్లివిరిసేది. అయితే ద్రవ్య పెట్టుబడి పనిచేసే తీరు అలా ఉండదు. తానున్న దేశాలలోని ప్రజలకు గ్రీస్‌లో ఉచిత విహార యాత్రను అందించటం ద్రవ్య పెట్టుబడికి ఆసక్తి ఉండదు. ఇంకా సాధారణీకరిస్తే గ్రీస్‌లో ఎగుమతి మిగులును సాధించటానికి తీసుకోవలసిన చర్యలు ద్రవ్య పెట్టుబడికి కంటగింపుగానే ఉంటాయి. ఈ చర్యలలో ఒక్కొక్కటీ మిగులు గల ఐరోపాలో ముఖ్యంగా జర్మనీలో డిమాండ్‌ను ఉత్తేజితం చేసేదిగా ఉంటుంది. అలా డిమాండ్‌ను ఉత్తేజితం చేయటంవల్ల వివిధ దేశాల ప్రజల వినిమయం పెరుగుతుంది(దానిలో పైన ఉదహరించిన ఉచిత గ్రీస్‌ విహార యాత్ర ఒకటి). అలా కాకపోతే అది ప్రభుత్వ వ్యయాన్ని పెంచే విధంగా కూడా ఉండవచ్చు. ఒక దేశానికి ఇవ్వవలసిన అప్పును తీర్చటానికి ఆ దేశ ప్రజల వినిమయం పెరగటమనే మార్గం పెట్టుబడిదారీ వ్యవస్థ నీతికి వ్యతిరేకం. దీని గురించి ప్రముఖ పోలిష్‌ మార్క్సిస్టు ఆర్థికవేత్త మైఖల్‌ కాలెస్కీ చెప్పిన మాటలు ఇంకా విలువగలవే. 'నీకు స్వంత వనరులుంటే తప్ప నీ బ్రతుకు బండిని లాగటానికి నువ్వు చెమటోడ్వవలసిందే'. ప్రభుత్వ వ్యయం పెరగటం విషయంలో ద్రవ్య పెట్టుబడికి ఇష్టమైనదేదైనా ఉంటే అది దానికి ఉపయోగపడేదే. ప్రస్తుత సందర్బంలో అలాంటి చర్యలతో డిమాండ్‌ ఏమాత్రం పెరగదు.
కాబట్టి దీనితో ఏం జరుగుతుందో స్పష్టంగా తెలుస్తున్నది. గ్రీస్‌ తనకు తలకుమించిన భారంగా తయారైన ఋణ సంక్షోభం నుంచి అత్యంత మానవీయంగా, అత్యంత హేతుబద్ధంగా బయటపడాలంటే ఐరోపా ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ విస్తృతమవ్వాలి. అలా జరగటం వల్ల ఐరోపా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన చెల్లింపుల సమతౌల్యానికి ఎటువంటి ప్రమాదం ఏర్పడదు. అయితే ఈ పరిష్కారం ద్రవ్య పెట్టుబడికి రుచించదు కాబట్టి ఆచరణీయం కాదు. పర్యవసానంగా ఐరోపాలో ద్రవ్య పెట్టుబడి నియంతృత్వం రాజ్యమేలుతుంది. ఈ పరిష్కారానికి బదులుగా మరింత 'పొదుపు చర్యలు' తీసుకోవాలని గ్రీస్‌ను ద్రవ్య పెట్టుబడి ఆదేశించింది. దానితో గ్రీస్‌లో మాంద్యం ఏర్పడుతుంది. నిరుద్యోగం పెరుగుతుంది. తద్వారా దిగుమతులు తగ్గుతాయి. ఈ పరిస్థితి గ్రీకు సంపద విదేశీ పెట్టుబడిదారుల పరమయ్యేందుకు దారితీస్తుంది. గ్రీస్‌ మీద రుద్దిన నూతన ఒప్పందంలో ఒక ముఖ్యమైన భాగమేమంటే హెల్లెనిక్‌ అస్సెట్‌ డెవలప్‌మెంటు ఫండ్‌ (టిఎఐపిఇడి)ను ఏర్పాటుచేయటం. ఈ ఫండ్‌ను విదేశీ అధికారులు నిర్వహిస్తారు. గ్రీస్‌ యాజమాన్యంలోని రేవులు, రైల్వేలు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఒలింపిక్‌ వెన్యూతో సహా ఆస్తులన్నింటి అమ్మకాలను ఈ సంస్థ చేపడుతుంది. అలా అమ్మగా వచ్చిన మొత్తాన్ని గ్రీస్‌కున్న అప్పుకు సర్దుబాటు చేస్తారు. ప్రపంచంలోనే అత్యంత 'నాగరిక' ప్రాంతంగా చెప్పుకునే ఐరోపా యూనియన్‌ ఈ నిర్ణయం చేయటం విడ్డూరం!
వడ్డీ వ్యాపారిని అనుకరించటం
గ్రామాలలో రైతును ప్రైవేటు వడ్డీ వ్యాపారి ఇలానే పీడిస్తాడని, చరిత్రలో ముఖ్యంగా వలస పాలనలో 'ఒప్పందాల' అమలుకు చట్టపరమైన యంత్రాంగాన్ని స్థాపించటం ప్రతి భారతీయ పిల్లవాడికీ తెలిసిందే. రైతు భూమి, ఇంట్లో వస్తువులు, రైతు భార్య తన పెళ్ళినాడు తెచ్చుకున్న చిన్నచిన్న బంగారు ఆభరణాలనూ తనకు కట్టవలసిన అప్పు కింద వడ్డీ వ్యాపారి స్వాధీనం చేసుకుంటాడు. రైతుల పట్ల వడ్డీ వ్యాపారులు కిరాతకంగా వ్యవహరించటం గురించి అనేక కథలు, నవలలు, నాటకాలు, సినిమాలు ప్రతి భారతీయ భాషలో వచ్చాయి. అయితే నేడు అత్యంత 'నాగరిక' దేశాల ప్రభుత్వాలు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వలే కొల్లగొట్టే ప్రవృతిని ప్రదర్శిస్తున్నాయి! ఇక్కడ ముఖ్యంగా రెండు అంశాలను గమనించాలి. మొదటిది, కొనసాగుతూ, తీవ్రమౌతున్న 'పొదుపు చర్యల విధానం' వల్ల సంపదను ఉపయోగించకపోవడం వల్ల దాని విలువ విపరీతంగా తగ్గిపోయింది. రెండవది, తన అప్పు తీర్చటానికి గ్రీస్‌ ఆస్తులను సాధ్యమైనంత తొందరగా అమ్మటం గ్రీస్‌ ప్రభుత్వానికి అనివార్యం. ఈ విషయం ఆ ఆస్తులను కొనదలుచుకున్నవారికి తెలుసు గనుక వారు కావలసినంత సమయం తీసుకుని వాటి ధరలను మరింతగా పతనమయ్యేలా చూస్తారు. కాబట్టి గ్రీస్‌ దేశానికి చెందిన ప్రభుత్వ ఆస్తుల యాజమాన్యం విదేశీ పెట్టుబడిదారుల చేతుల్లోకి పోవటమేకాకుండా వాటిని నామమాత్రపు ధరలకు అమ్మేలా ఆ దేశంపై ఒత్తిడి చేస్తారు! ఇలా ఆస్తులను కైవసం చేసుకున్న నూతన యజమానులకు వాటిని ఉత్పాదక ప్రయోజనాలకు ఉపయోగించటం పట్ల ఆసక్తి ఉండదు. తత్ఫలితంగా గ్రీస్‌ ఆర్థిక వ్యవస్థ వాస్తవంలో ఊరికినే నాశనమౌతూవున్నది.
25 సంవత్సరాల క్రితం జర్మన్‌ డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌(తూర్పు జర్మనీ)లో ఒక ప్రైవేటైజేషన్‌ నిధిని ఏర్పాటుచేసి ప్రభుత్వ ఆస్తులను రకరకాల వ్యక్తులకు కట్టబెట్టారు. వీరికి ఆ ఆస్తులను అమ్ముకుని సొమ్ముచేసుకోవటంలో ఉన్న ఆసక్తి వాటిని ఉపయోగించటంలో సహజంగానే ఉండదు. అలా జర్మన్‌ డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌లో జరిగిన దానికి, ప్రస్తుతం గ్రీస్‌లో జరుగుతున్న దానికి సారూప్యత ఉన్నదని విక్టర్‌ గ్రోస్‌మన్‌ మంత్లీ రివ్యూలో రాస్తూ పేర్కొన్నాడు. జర్మన్‌ పెట్టుబడి దృష్టిలో ఈ రెండు పరిస్థితుల మధ్య సారూప్యత ఉన్నది. ఈ రెండింటిలో ఒక్కో దాని విషయంలో వామపక్షాన్ని పాలనకు ఎంచుకున్నందుకు ప్రజలను శిక్షించాలనే కోరిక కనపడుతోంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన తేడా ఉన్నది. గ్రీక్‌ ఆర్థిక వ్యవస్థ నాశనమవుతుండగా అలెక్సీ సిప్రాస్‌ నాయకత్వ స్థానంలో ఉన్నట్లు జర్మన్‌ డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆర్థిక వ్యవస్థ నాశనమవుతుంటే ఎరిక్‌ హోనేకర్‌ నాయకత్వ స్థానంలో లేడు.
- ప్రభాత్‌ పట్నాయక్‌

Vyasam. Prajasakti

మలేరియాతో మన్యప్రాంతం

Posted On Sat 25 Jul 23:49:45.415279 2015
         రాష్ట్రంలో ఏ పార్టీ పాలన నడిచినా మన్య ప్రాంతంలో మాత్రం మలేరియా పాలన నడుస్తుంది. ఏటేటా వేలాదిగా గిరిజనులు మలేరియా రోగాన పడి జీవశ్చవాలుగా మారుతున్నారు. ఈ ఏడు కూడా నవ్యాంధ్రలో ఇదేపరిస్థితి పునరావృతమవ్వడం కడు దయనీయం. రాష్ట్రానికి నైరుతీ రుతుపవనాల రాక ఆలస్యమమౌతుందేమోగాని విషజ్వరాల ఋతువు టంచనుగా వచ్చి తీరుతుంది.అయినా అందుకు తగ్గ సంసిద్ధత ప్రభుత్వం తరపున పూజ్యం. అధిక శాతం గిరిజనులవి రోజువారీ కూలీబ్రతుకులు. అటు పౌష్టి కాహార లోపంతో అనారోగ్యం, ఇటు అనారోగ్య ంతో పౌష్టికాహార లోపం. ఈ పరిస్థితిని మెరుగుపర్చే అవ కాశం ప్రభుత్వం చేతిలో ఉంది. అయితే దురదృష్ట వశాత్తు ఇది తొలి ప్రాథమ్యంగా గుర్తించక పోవడమే అసలు సమస్య. లేకుంటే ఇలాంటి ఆరోగ్య అత్యధిక స్థితిలో మన్యప్రాంతంలో వైద్య సిబ్బంది, మందులు, అంబులెన్సులు కొర తలోఉండట మేమిటి? అన్ని సదుపాయాలు అందు బాటులో ఉండాల్సిన అశ్రమ పాఠాశాలల్లో సైతం ఏటేటా వందల సంఖ్యలో విద్యా ర్థుల అనారోగ్యాలు, పదుల సంఖ్యలో మరణాలు జరుగుతూనే ఉండట మేమిటి? రాజ్యాంగం ద్వారా దఖలు పడిన జీవించే హక్కు, విద్యాహక్కునూ గిరిబాలలు కోల్పోవడం కాదా? ప్రభుత్వం గిరిజన ప్రాంతంలో ఆరోగ్యం నెలకొల్పడానికి చిత్తశుద్ధితో, దీర్ఘకాలిక వ్యూహాలతో, లోపరహిత ఆచరణతో నడుంకట్టాలి. దాని కోసం గిరిజన ప్రాంతంలో రక్షిత మంచినీరు, పౌష్టికాహారం లభ్యతకు పూచీ ఇవ్వడం, వైద్య సిబ్బందిని భర్తీ చేసి మందులు, ఇతర వైద్య సదుపాయాలు పటిష్టపరిచి నిరంతరం అందుబా టులో ఉంచడం, దోమల నివారణా చర్యలు మొక్కు బడిగా జరగకుండా పర్యవే ేక్షించడం, మండల, జిల్లా పరిధుల్లో అన్ని శాఖల్ని సమన్వయ పరచి, ఆరోగ్య సేవల్ని దగ్గరుండి పర్యవేక్షించే అధికారిని ఉంచడం, నిధులు కేటాయించడం, మన్యప్రాంతంలో కనీసం మూడు ప్రత్యేక ప్రభుత్వ వైద్య కళాశాలలు నెలకొల్పడం గిరిజన ప్రాంతం లో ఆరోగ్యంపై వ్యాధులపై సర్వేలు, పరిశోధనలు, చికిత్స, నివారణా మార్గాలపై ఆ కళాశాలలు మార్గదర్శకం వహించేలా చూడటం వంటి చర్యలు చేపట్టాలి.
- డాక్టర్‌ డివిజి శంకరరావు, మాజీ ఎంపి, పార్వతీపురం, విజయనగరం జిల్లా.

సంపాదకీయం. Prajasakti

ప్రమాద ఘంటికలు

Posted On Tue 28 Jul 00:17:55.769535 2015
            సేద్యం గిట్టుబాటు కాక, పెట్టిన పెట్టుబడులు తిరిగి రాక, రుణగ్రస్తులై నిరాశా నిస్ప్రుహలతో జీవితాలు చాలిస్తున్న రైతులను ఇప్పటి వరకు చూశాం. కానీ ఇప్పుడు ప్రభుత్వ వేధింపులు భరించలేక రోజుకో రైతు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న దుర్మార్గం మన రాష్ట్రంలో కనిపిస్తోంది. కర్నూలు జిల్లా ఓర్వకల్‌లో సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ కింద భూమి కోల్పోయిన ఒక రైతు కనీసం ఇస్తామన్న పరిహారం కూడా ఇవ్వకపోవడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. విశాఖ జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్వాశిత రైతు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. చిత్తూరు జిల్లాలో ఎయిర్‌పోర్టు బాధితులదీ అదే దారి. రాజధాని అమరావతిలో ఒకరిద్దరు ఆత్మహత్యలకు ప్రయత్నించినా ప్రభుత్వం బయటికి రానీయలేదు. ప్రభుత్వ శాఖల నిర్వాకం వలన రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం ఘోరం. విజయనగరం జిల్లాలో రెవెన్యూ అధికారుల వాలకంతో ఒక రైతు నిండు ప్రాణం తీసుకోవడం ఆందోళకరం. వివాదాల పరిష్కారంలో రెవెన్యూ విభాగం సకాలంలో స్పందించని ఫలితమిది. అదే జిల్లాలో ఇలాంటి కారణంతోనే మరో రైతు ఆత్మహత్యకు ప్రయత్నించి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. గుంటూరు జిల్లాలో దేవాలయ భూములను ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న కౌలు రైతుల భూములను దేవాదాయశాఖ వేలం వేయడంతో సామూహిక ఆత్మహత్యలకు ప్రయత్నించిన ఘటనలో ఒక రైతు ప్రాణాలు కోల్పోయాడు. అనంతపురం జిల్లాలో బ్యాంక్‌ మేనేజర్‌ వేధింపులకు యువ రైతు బలయ్యాడు. ఈ ఆత్మహత్యలన్నీ సేద్యం అచ్చిరాక పాల్పడ్డవి కావు. ప్రభుత్వ విధానాలు, పలు విభాగాల్లో నెలకొన్న అవినీతికి ప్రతి రూపాలు. ప్రాణాధారమైన భూములను బలవంతంగా లాక్కుంటున్న వైపరీత్యాన్ని తాళలేక మనసికంగా కుంగిపోయి బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న రైతుల దీన గాధలివి. వ్యవసాయ సంక్షోభం సృష్టిస్తున్న రైతుల ఆత్మహత్యల పరంపర ఆందోళకరం కాగా నవ్యాంధ్రప్రదేశ్‌ 'అభివృద్ధి' చక్రాల వేగానికి, ప్రభుత్వ శాఖల నిర్వాకానికి తాళలేక బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న అన్నదాతల ఉందంతాలు మరింత బాధాకరం. రాజధాని నిర్మాణం, కొత్త విమానాశ్రయల ఏర్పాటు, ఉన్న విమానాశ్రయాల విస్తరణ, కొత్త పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక వసతుల కల్పన ఇత్యాది కార్యక్రమాలకు సర్కారు పెద్ద ఎత్తున భూములు సేకరిస్తోంది. భూముల సేకరణలో అత్యధికంగా సమిధలయ్యేది రైతులే. వ్యవసాయం గిట్టుబాటుకాక అప్పుల ఊబిలో కూరుకుపోయినప్పటికీ తరతరాలుగా భూమిపై మమకారంతో జీవనం వెళ్లదీస్తున్న కర్షకులకు భూసేకరణ గోరుచుట్టుపై రోకలిపోటు వంటిది. అభివృద్ధి కోసం భూములు అనివార్యమైనప్పుడు నిర్వాసితులు మెచ్చేలా సహాయ పునరావాస ప్యాకేజీ ఇవ్వడం ప్రభుత్వాల కనీస బాధ్యత. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పిపిపి)లో కార్పొరేట్ల కోసం సర్కారే భూములను బలవంతంగా గుంజు కోవడం రైతులను మరింత నిరాశా నిస్ప్రుహలకు, మానసిక ఒత్తిడికి గురి చేస్తోంది. తమను రక్షించాల్సిన ప్రభుత్వమే ఇప్పుడు తమపై దాడికి దిగడంతో చేసేది లేక ఆత్మహత్యలకు పాల్పడటం ఆందోళనకరం. భూములు దక్కకకుండా పోతాయన్న మనస్థాపంతో భవిష్యత్తు కానరాక ఆత్మహత్యలకు పాల్పడే రైతులకు భరోసా ఇవ్వాల్సింది ప్రభుత్వమే. భవిష్యత్తు ప్రమాద ఘంటికలుగా భావించి సర్కారు తగు చర్యలు తీసుకోవాలి. రైతులు సైతం మనో నిబ్బరాన్ని కోల్పోకుంగా ప్రభుత్వంపై పోరాడి హక్కులు సాధించుకోవాలి.

Sunday, July 26, 2015

vyasam.ap.jyoti

పంట బీమాకు ప్రీమియం (బీమా సంస్థలలో తీసుకున్న పాలసీలలో పాలసీదారు వివిధ వాయిదాలలో చెల్లిస్తూ ఉండే మొత్తాలు) చెల్లించడంలో రైతులకు సహాయపడేందుకు ఒక సబ్సిడీ పథకాన్ని అమలుపరచాలని మోదీ ప్రభుత్వం యోచిస్తోంది. దేశంలో మూడింట రెండు వంతుల రైతులు హెక్టారు కంటే తక్కువ భూమినే కలిగివున్నారు. అన్నీ అనుకూలంగా ఉన్న సంవత్సరంలో రూ.75 వేల విలువచేసే 50 క్వింటాళ్ల గోధుమలు ఉత్పత్తి చేయగలమని ఉత్తరాఖండ్‌లోని మా గ్రామ రైతులు చెప్పారు. పంట బీమా ప్రీమియం రెండు శాతం రేటు చొప్పున రూ.1500 అవుతుంది. సన్నకారు చిన్నకారు రైతులకు పంట బీమా ప్రీమియంలో పది శాతం చొప్పున చెల్లించేందుకు ఒక సబ్సిడీ పథకాన్ని ప్రభుత్వం ఇప్పటికే అమలుపరుస్తోంది. 
మోదీ ప్రభుత్వం ఆ సబ్సిడీని 20 లేదా 30 శాతానికి పెంచాలని నేను ఆశిస్తున్నాను. రైతులను ఆదుకోవడానికి మోదీ ఆ సబ్సిడీ సహాయాన్ని 50 శాతానికి పెంచారనుకోండి. అప్పుడు ఒక పంటకు రూ.750 చొప్పున రైతుకు బీమా సహాయం సమకూరుతుంది. ఇదేమీ రైతులను ఆకట్టుకోదని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకని? బీమా వ్యయంలో ప్రీమియం ఒక స్వల్ప భాగం మాత్రమే కనుక.
నా అల్టో కారుపై సమ్రగ బీమా పాలసీనొక దాన్ని నేను కొనుక్కున్నాను. ఒక చిన్న ప్రమాదం జరిగింది రూ.14 వేల రూపాయల మేరకు పరిహారం ఇవ్వాలని క్లెయిమ్‌ చేశాను. తొలుత ఆ కారును ఒక రిపేర్‌ షాప్‌కు తీసుకెళ్ళి అక్కడ ఉన్న ఒక సీనియర్‌ మెకానిక్‌ ద్వారా ప్రమాదంలో కారుకు వాటిల్లిన నష్టం పై అంచనా వేయించాను. ఆ తరువాత బీమా కంపెనీ సర్వేయర్‌కు తెలియజేశాను. ఆ మహానుభావుడు మూడు రోజుల తరువాత వచ్చాడు. కారుకు మరమ్మత్తులు జరిగాయా లేదా అనే విషయాన్ని నిర్ధారణకు రావడానికి మరో మూడు రోజుల వ్యవధిని తీసుకున్నాడు.
ఇదిలావుండగా నాకు పది రోజుల పాటు కారు సదుపాయం లేకుండాపోయింది. టాక్సీలో ప్రయాణాలు సాగించినందుకు గాను నాకు అదనంగా రూ.7000 వ్యయమయింది. క్లెయిమ్‌ ప్రక్రియ పూర్తయున తరువాత కూడా నాకు రావాల్సిన బీమా సొమ్ము అందనేలేదు. ఆరా తీయగా సర్వేయర్‌ నా క్లెయిమ్‌కు సంబంధించి ఎటువంటి నివేదిక పంపించలేదని తెలిసింది. సర్వేయర్‌తో మాట్లాడాను. అతను కొన్ని అదనపు డాక్యుమెంట్లు కోరాడు. అవి లేకపోవడం వల్లే అతను నివేదిక పంపలేదు. బహుశా అతను నా వద్ద నుంచి కొంత కమిషన్‌ను ఆశిస్తున్నాడేమో! నా అవసరాన్ని వివరించిన తరువాత అతను నివేదిక పంపాడు. అయినప్పటికీ బీమా కంపెనీ నుంచి నాకు చెక్‌ అందలేదు. ఈ విషయమై కంపెనీ వారిని అడుగగా పంపవల్సిన సొమ్మును ఇప్పటికే మీ బ్యాంకు ఖాతాకు జమ చేశామని చెప్పారు! నా ఖాతాలో ఎటువంటి సొమ్ము జమకాలేదని బ్యాంకు సిబ్బంది చెప్పారు. ఇలా రెండు వారాలు గడిచింది. నేను ఆ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవడంతో ఎట్టకేలకు ఆ డబ్బును నా ఖాతాకు జమచేశారు. అంతిమంగా నాకు లభించిన బీమాసొమ్ము రూ.7000 మాత్రమే !
మోదీ ప్రభుత్వ ప్రతిపాదిత బీమా పథక లక్ష్యం రైతును వడ్డీ వ్యాపారి దోపిడీనుంచి విముక్తి చేయడమే. అయితే ప్రభుత్వమే రైతును రుణ ఊబిలోకి దింపుతుంది సుమా! రాజస్థాన్‌లోని ఒక ఎన్‌జీఓ కృషిని నేను నిశితంగా పరిశీలించాను. ఒక స్వయం సహాయక బృందాన్ని ఆ ఎన్‌జీఓ ఏర్పాటు చేసింది. ఆ బృందానికి బ్యాంకు రుణాలు ఇప్పించింది. ఈ లబ్ధితో రైతులు గేదెలను కొనుక్కుని మంచి ఆదాయాన్ని గడిస్తున్నారు. ఐదుసంవత్సరాల క్రితం గ్రామంలో ఎన్ని గేదెలు ఉండేవి? ఇప్పుడు ఎన్ని ఉన్నాయని గ్రామస్తులను అడిగాను. అప్పుడు ఎన్ని గేదెలు ఉన్నాయో ఇప్పుడూ అన్నే గేదెలు ఉన్నాయని వారు చెప్పారు! అంటే అర్థమేమిటి? బ్యాంకుల నుంచి లభించిన రుణాన్ని గేదెలను కొనుక్కోవడానికి ఉపయోగించుకోలేదు.
నిజానికి బ్యాంకు నుంచి రుణం తీసుకోక ముందే రైతులకు గేదెలు ఉన్నాయి. ఉన్న గేదెలపైన వారు రుణం తీసుకున్నారు. గతంలో వారు ఆ గేదెలపై పదివేల రూపాయలు ఆర్జిస్తుండే వారు. ఆ సొమ్మునంతటినీ వారు తమ సొంతానికి వినియోగించుకొనేవారు. ఇప్పుడూ ఆ రైతులు పదివేల రూపాయలను ఆర్జిస్తున్నారు. అయితే రూ.1000 వడ్డీ చెల్లిస్తున్నారు. ఇక మిగిలింది రూ.9000 మాత్రమే. బ్యాంకు రుణాల వల్ల రైతులకు నిజానికి ఆదాయం తగ్గింది. ఆ రుణాన్ని పిండిమిల్లు ఏర్పాటు వంటి ఏదైనా మరింత ఉత్పాదక ప్రయోజనానికి వినియోగించుకున్నట్టయితే పరిస్థితి మరో విధంగా ఉండేది. అయితే ఆ గ్రామంలో అటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.
వ్యవసాయక ఉత్పత్తుల ధరలను ఉద్దేశపూర్వకంగా తక్కువగా ఉంచడంతో సేద్యం చాలావరకు నష్టదాయక కార్యకలాపంగా పరిణమించింది. నష్టాల్లో ఉన్న కంపెనీ బ్యాంకు రుణాలు తీసుకొని, వాటిని తిరిగి చెల్లించలేక చివరకు దివాళాతీసిన మాదిరిగా రైతుల పరిస్థితీ మారింది.
వాజపేయి, మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వాల హయాంలో ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు పన్నిన వ్యూహాల్లో భాగంగానే రైతులకీ దుస్థితి కొనసాగుతోంది సుమా! ప్రభుత్వాధికారులు, ఉద్యోగులు సదా సంతోషంగా ఉండాలంటే రైతులు నిత్యం పేదరికంలోనే ఉండాలి మరి! ఈ అభాగ్య రైతులను మరింతగా రుణ శృంఖలాల్లో బంధించాలని మోదీ భావిస్తున్నారు. ఆయన అధికారులు రైతులను బీమా సంస్థల వలలో చిక్కుకునేలా చేయాలని యోచిస్తున్నారు. తద్వారా వారు పేదలుగానే ఉండిపోతారు. బీమా క్లెయిమ్‌ల నెపంతో కమిషన్లను దండుకోవడానికి ప్రభుత్వాధికారులకు మరో అవకాశం లభిస్తుంది గదా!
- భరత్‌ ఝన్‌ఝన్‌వాలా