కూలీల కడుపుకొట్టేందుకే ఉపాధి నిధుల మళ్లింపు
Posted On: Tuesday,September 20,2016
- ఏపి వ్యవసాయ కార్మిక సంఘం
ప్రజాశక్తి-విజయవాడ ప్రతినిధి :
కూలీల కడుపు కొట్టేందుకే ఉపాధి హామీ నిధులను ఇతర కార్యక్రమాల కోసం మళ్లించారని ఏపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు దడాల సుబ్బారావు, వి వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. కూలీలకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వానికి ఏ మాత్రం లేదని, ఉపాధి నిధులను పంట కుంటలు తవ్వేందుకు, సిసి రోడ్లు నిర్మాణానికి ఖర్చు పెడతామని ప్రభుత్వం ప్రకటించడం కూలీలకు ఉపాధి లేకుండా చేయడమేనని ధ్వజమెత్తారు. నాయకులు, కాంట్రాక్టర్ల లబ్ధి కోసమే ఈ విధానాలని దుయ్యబట్టారు. కూలీలకు ఉపాధి కల్పించేందుకు ఆ నిధులను వినియోగించాలని వారు కోరారు.

No comments:
Post a Comment