Monday, September 26, 2016



గుజరాత్‌లో గోగూండాలు మరోసారి దాడులకు తెగబడ్డారు. ఆవు కళేబరాన్ని తొలగించేందుకు నిరాకరించిన ఓ దళిత కుటుంబంపై పాశవికంగా దాడి చేయడమే గాక, నిండు గర్బిణి అన్న విచక్షణ కూడా లేకుండా ఆమెను చితకబాదారు. అమానుషమైన ఈ ఘటన బనస్కంత జిల్లాలోని మోటాకార్జా అనే గ్రామంలో చోటు చేసుకున్నది. గ్రామంలోని దర్బార్‌ అనే కమ్యూనిటీకి చెందిన అగ్రకులస్థులు తమ పొలంలో ఆవు చనిపోయిందని దానిని తీసి పారేసేందుకు రావాల్సిందిగా ఇదే గ్రామంలోని దళిత దంపతులైన సంగీత, నిలేశ్‌ రనవాసియాలను కోరారు. అందుకు తాము ఆ పని చేయట్లేదని సమాధానమివ్వడంతో ఆగ్రహించిన అగ్రవర్ణానికి చెందిన ఈ గో గూండాలు ఇరవై మంది ఆ దళిత కుటుంబంపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ దాడిలో ఐదు నెలల గర్బిణి ఐన సంగీతపై చేయి చేసుకోవడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. అడ్డుకోవడానికి ప్రయత్నించిన మరికొందరిని సైతం గాయపరిచారు.

No comments:

Post a Comment