వాళ్ళు ఆవులను ప్రేమిస్తారో లేదో కానీ మనుషులను మాత్రం ద్వేషిస్తారు !
ఆవులను రక్షించే పేరుతో మనుషులపై దుర్మార్గమైన దాడులు పెరిగి పోయాయి. వాళ్ళే ఆరోపణలు చేస్తూ వాళ్ళే శిక్షలు విధిస్తూ అటు పోలీసులపని ఇటు కోర్టుల పనిని కూడా ఆవురక్షకులే భుజాన వేసుకున్నారు. గుజరాత్ లో ఆవు చర్మాలను తరలిస్తున్నారన్న అనుమానంతో నలుగురు యువకులపై గోసంరక్షణ సమితి కార్యకర్తలు అమానుషంగా దాడి చేశారు. నలుగురు యువకులను దుస్తులు విప్పించి, కారుకు కట్టేసి కర్రలతో చితకబాదారు. గిర్ సోమ్ నాథ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ దృశ్యాలను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియలో పోస్ట్ చేశారు.
గో సంరక్షణ సమితి కార్యకర్తలు.. నలుగురు యువకులను దూషిస్తూ వారి పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఒకరి తర్వాత మరొకరు కర్రలు తీసుకుని వారిని చితకబాదారు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఐదుగురు నిందితుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

No comments:
Post a Comment