ఆరేళ్ల నుండి ప్రభుత్వ బావులకు చెందిన గ్యాస్ నిక్షేపాలను హైజాక్ అవుతుంటే కనిపెట్టలేని దుస్థితిలో ప్రభుత్వాలు ఉంటున్నాయా..? ఒకవేళ తెలిసే గ్యాస్ చోరీ ఉదంతాన్ని దాచిపెట్టారా..?ఈ కోణంలోనూ సమగ్ర దర్యాప్తు జరగాలి. కోటి కాదు.. రెండు కోట్లు కాదు ఏకంగా రూ.10వేల కోట్ల పైబడి విలువ చేసే 900 కోట్ల క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను విక్రయించుకుని సొమ్ము చేసుకుంటుంటే ఏమి చేస్తున్నారు. ఇంత పెద్దఎత్తున ప్రజాసంపద లూఠీ అవుతుంటే అడ్డుకోవాల్సిన బాధ్యత అప్పటి ప్రభుత్వంపై లేదా..? రిలయన్స్‌తో పాటు ఇందుకు బాధ్యులైన వారందరిపైనా చర్యలు తీసుకోవాలి.
No comments:
Post a Comment