సరళీకరణ విధానాలు ప్రజారోగ్యం
భారతదేశంలో 1991లో ప్రారంభమైన సరళీకరణ ఆర్థిక విధానాల ఫలితంగా ఏర్పడిన దుష్పలితాలను ఎదుర్కొంటున్న వాటిలో 'ప్రజారోగ్యం' ఒకటి. బ్రెటన్‌ఉడ్ సంస్థలు (ప్రపం చ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి) వ్యవస్థాగత సంస్కరణల కార్యక్రమాన్ని భారత దేశంలో నిర్వహించాలని ఒత్తిడిచేశాయి. ఆనాటి నుండే నయా ఉదారవాద ఆర్థిక విధానాలు ఇంతకు ముందున్న ప్రభుత్వాలు అమలు చేస్తూ వచ్చాయి. 20వ శతాబ్దం చివరిలో అభివృద్ధి చెందిన దేశాల చేత స్థాపించబడిన ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూ.టి.ఓ.) ఆదేశాల ప్రకారం ఉదారవాద ఆర్థిక విధానాల అమలు ఫలితం పరోక్షంగా ఔషధాల ధరలపై, ప్రత్యక్షంగా ఆరోగ్య భద్రత కల్పన కొరకు ప్రభుత్వ పెట్టుబ డులు, వైద్య విద్యపై ప్రభావం చూపుతున్నాయి.
1980 ప్రారంభంలో అభివృద్ధి చెందిన దేశాలు ముందుకు తెచ్చిన 'ప్రపంచీకరణ' కొనసాగింపు ఫలితమే అభివృద్ధి చెందుతున్న దేశాలలో 'ఆర్థిక సంస్కరణలు'. నాటి నుండి ఈ ప్రపంచీకరణే ప్రపంచవ్యాప్తంగా పరిపాలన, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థలకు పునాదిని రూపొం దించింది. ప్రపంచస్థాయిలో ఆరోగ్య భద్రతా వ్యవస్థను నియంత్రించిన అనేక ప్రముఖ సంస్థల నిర్మాణాలలో, విధానాలలో మార్పులు సంభ వించడానికి కారణం ఈ ప్రపంచీకరణే. ఐక్య రాజ్యసమితి, దానియొక్క అంగాల మసకబారి పోయిన పాత్రతో ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య భద్రతా సలహాదారుగా, జాతీయంగా ఆరోగ్య భద్రతా పాలకవర్గంగా ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.ఓ.) బలహీనపడడానికి ప్రపంచీకరణ దారితీసింది. ప్రపంచ దేశాలలో ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.ఓ.) పాత్ర క్షీణిస్తున్నది. జాతీయస్థాయిలో ఆరోగ్య విధి విధానాల రూపకల్పనలో ప్రపంచ బ్యాంకే ఒక బలీయమైన శక్తిగా ముందుకు వచ్చింది.
1987లో ప్రపంచ బ్యాంక్ ''ఫైనాన్సింగ్ హెల్త్ సర్వీసెస్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్'' అనే పేరుతో కొన్ని పత్రాలతో బయటికి వచ్చినపుడే ఈ స్థితి ప్రారంభమైంది. 8 పత్రాల సిఫారసు లు, ఆర్థిక సంస్కరణలు చేపట్టిన దేశాలలోని ఆరోగ్య రంగంపై ఆ సిఫారసులు ఒక నిర్ణయా త్మక ప్రభావం చూపడం ప్రారంభించాయి.
ఎ) ప్రభుత్వరంగ ఆరోగ్య సేవలకు రోగులు చెల్లించే మొత్తాన్ని పెంచడం బి) ప్రైవేట్ ఆరోగ్య బీమా పథకాలను అభివృద్ధి చేయడం సి) ప్రైవేట్ రంగం యొక్క పాత్రను విస్తరించడం.డి) ప్రభుత్వ ఆరోగ్య భద్రతా సేవలను వికేంద్రీకరించడం.
ఈ సిఫారసులు తరువాత మార్చబడి 1993లో 'ఇన్వెస్టింగ్ ఇన్ హెల్త్' పేరుతో విడుదల చేసిన ప్రపంచ అభివృద్ధి నివేదికలో నొక్కి చెప్పబడినాయి. దాని ఫలితంగా ఆరోగ్య భద్రత అనేది ప్రజలకు ఉపయోగపడే సేవగా పరిగణిం చబడకుండా, ప్రపంచీకరణ విధానంలో వ్యాపార సేవగా, మార్కెట్‌లో దొరికే ఒక సరుకు గా పరిగణించబడింది. ఈ ప్రపంచ బ్యాంకు సిఫారసులు ఉదారవాద విధానాల కొనసాగిం పులో భాగంగా అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలలో అమలు పరచబడుతున్నాయి. ఆయా దేశాలు వాటి యొక్క ఆర్థిక సంక్షోభాల నుండి బయటపడటానికి ప్రపంచ బ్యాంకు అప్పు ఇవ్వడానికి విధించిన షరతులు అవి. సిఫారసు లపై వచ్చిన తీవ్రమైన విమర్శలను దృష్టిలో ఉంచుకొని ప్రపంచ బ్యాంక్ ప్రభుత్వరంగ సేవల మార్పును గురించి నొక్కి చెప్పడం తగ్గించింది. ప్రాథమిక ఆరోగ్య భద్రతను సంరక్షించే బాధ్యత లను తగ్గించి, ప్రైవేటు రంగం పాత్రను పెంచే విధానాలను ప్రభుత్వాలు కొనసాగించేటట్లు చేసింది.
దీని ఫలితంగా భారతదేశంలో ఆరోగ్య భద్రతను కల్పించే బాధ్యత నుండి ప్రభుత్వం నెమ్మదిగా తప్పుకుంటున్నది. ప్రపంచ బ్యాంక్ ఆదేశానుసారం గత రెండు దశాబ్దాలుగా ఆరోగ్య భద్రతా విధానం కొన్ని మార్పులకు గురవుతూ వచ్చింది. అవి ఎ) ప్రజారోగ్యంపై పెట్టుబడుల క్షీణత, సేవా పన్నులు లేదా యూజ ర్ ఛార్జీల వసూళ్ళు. ప్రజా ఆరోగ్య భద్రతలో భాగంగా రోగనిర్ధారణ పరీక్షలు చేయించడం, ప్రైవేట్ రంగం సేవలను భరించలేని పేదలను బలవంతంగా ఆ రంగం సేవల కొరకు పంప డం బి) ఆరోగ్య బీమాను ప్రవేశపెట్టడం. ఇది ప్రజారోగ్య భద్రతను బలహీనపరుస్తుంది. ఎందు కంటే ఉచిత ఆరోగ్య సేవలు లేదా తక్కువ ఖర్చుతో కూడుకున్న సేవలు అందుబాటులో ఉన్నపుడు ప్రైవేట్ ఆరోగ్య బీమా అవసరం ఉండదు సి) ఆరోగ్య భద్రత కల్పనలో ప్రైవేట్ రంగం యొక్క భాగస్వామ్యాన్ని పెంచడం. ఇది ప్రధానంగా లాభాపేక్షతో కూడుకున్న, జబ్బు రాకుండా తీసుకునే జాగ్రత్తలకు భిన్నంగా జబ్బును తగ్గించే లక్ష్యంగా, ఎక్కువ డబ్బు సంపాదించే విధంగా ఆరోగ్య సేవలను అంది స్తుంది. డి) ఆరోగ్య పరిరక్షణలో ప్రభుత్వం యొక్క పాత్రను మార్చివేసి స్థానికంగా ఉండే కమ్యూనిటీలకు, ప్రభుత్వేతర సంస్థలకు బాధ్యతలను అప్పజెప్పడం జరిగింది. చాలా సంస్థలు పెద్ద ఎత్తున జీవనశైలికి సంబంధించిన హెచ్.ఐ.వి., ఎయిడ్స్ లాంటి జబ్బులపై కేంద్రీ కరించడం జరిగింది. అలాంటి జబ్బులకు ప్రభు త్వేతర సంస్థలకు అంతర్జాతీయంగా నిధులు చాలా తేలికగా సమకూర్చడం జరుగుతుంది.
స్థూల దేశీయ ఉత్పత్తి (జి.డి.పి.)లో 5 శాతం ప్రజా ఆరోగ్య ఖర్చులకు నిధులు కేటా యించాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు లకు భిన్నంగా, భారతదేశ ప్రభుత్వం గత రెండు దశాబ్దాలుగా నిధుల కేటాయింపును కేవలం 1 శాతం వద్దే నిలిపివేసింది. 11వ పంచవర్ష ప్రణాళిక చివరి నాటికి స్థూల దేశీయ ఉత్పత్తి (జి.డి.పి.)లో 2 శాతం కేటాయింపులకు గాను కేవలం 1.09 శాతం మాత్రమే కేటాయింపు లను సాధించడం జరిగింది. 12వ పంచవర్ష ప్రణాళికలో, ప్రణాళికా కమీషన్ 11వ పంచ వర్ష ప్రణాళికలో పెట్టుకున్న లక్ష్యం కన్నా తక్కువ లక్ష్యాన్నే పెట్టుకోవడం జరిగింది. 12వ పంచ వర్ష ప్రణాళికా కమీషన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పా టైన 'ఉన్నతస్థాయి నిపుణుల గ్రూపు' (హెచ్.ఎల్. ఇ.జి.) సిఫారసు చేసిన 2.5 శాతం నిధుల కేటాయింపుకు భిన్నంగా 12వ పంచవర్ష ప్రణాళిక కేవలం 1.58 శాతం కేటాయింపులను మాత్రమే సాధించింది. గత నాలుగు సంవత్స రాల బడ్జెట్ కేటాయింపుల సంఖ్యను బట్టి, రానున్న కాలంలో కేటాయింపులు దాదాపు 1.2 శాతంగా ఉండవచ్చు.
ప్రైవేట్ రంగం ఇంత పెద్ద శూన్యాన్ని పూడ్చ డానికి లోపలికి అడుగుపెట్టింది. ఈ రంగంలో జాతీయంగా అయిన ఖర్చులో 75 శాతం ప్రైవేట్ రంగానిదే. ఇది ప్రపంచంలోనే అత్యధి కంగా అయిన ఖర్చులలో ఒకటిగా ఉంటుంది. ఆరోగ్య రంగంలో పెట్టుబడులు లేని ఫలితంగా సరియైన సంఖ్యలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పి.హెచ్.సి.లు), ద్వితీయస్థాయి కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు (సి.హెచ్.సి.లు) అందు బాటులో లేని కారణంగా గ్రామీణ వ్యవస్థలో ప్రాథమిక ఆరోగ్య భద్రతను వదిలివేయడం, పేదలను సుదూర ప్రాంతాలలో ఉన్న పట్టణా లకు, ప్రైవేట్ ఆసుపత్రులకు పంపించడం జరుగుతున్నది. దీని వలన సగటు మానవుడు ఆరోగ్యంపై పెద్ద మొత్తంలో జేబులో నుండి తీసి ఖర్చు చేయటం జరుగుతున్నది. ఆరోగ్యం పై ఖర్చులో 65 శాతం స్వంతంగా భరించాల్సి రావటం ధనికులకు, పేదలకు మధ్య ఆరోగ్య భద్రత విషయంలో పెద్ద తేడా ఏర్పడడానికి అవుతున్నది.
ఔషధాలపై పెట్టే ఖర్చు, కుటుంబానికయ్యే ఖర్చులో 10 శాతంకు పైగా ఉంటున్నదని, ఆ కారణంగానే పేదలు అప్పులు తీర్చలేక పోతున్నారని అనేక అధ్యయనాలు తెలియ జేశాయి. ఒక అంచనా ప్రకారం, దీని ఫలితంగా ప్రతి ఏటా 4 కోట్ల మంది ప్రజలు దారిద్య్రరేఖకు దిగువకు నెట్టబడుతున్నారు. ప్రైవేట్ పెట్టుబడి యొక్క ప్రాథమిక కర్తవ్యం లాభం పొందడం, అదే విధంగా ప్రవేట్ రంగానికి ప్రాథమిక ఆరోగ్య భద్రత పట్ల కొంత శ్రద్ద కూడా ఉన్నది. లాభాలను అధికం చేసుకోవడానికి, ప్రైవేట్ రంగం యొక్క దృష్టి ఖరీదైన వైద్యంపై ఎక్కువగా ఉంటుంది. ఆ వైద్యం పేదవారికి అంతగా ముఖ్యమైనది కాదు. అంటురోగాల బారినపడి, అత్యవసర ప్రాథమిక చికిత్స పొందవలసిన పేదలకు, ఆ ఖరీదైన వైద్యం ఉపయోగపడదు. ప్రైవేట్ రంగంలో ధరలు కూడా చాలా వేగంగా పెరుగుతున్నాయి. సరళీకరణ విధానాలు అమలు అయిన దగ్గర నుండి ధరలు 300 శాతం పెరిగాయి. ప్రైవేట్ ఆరోగ్య భద్రత అంటే ఆరోగ్య భద్రత యొక్క కార్పొరేటీకరణ. ఆరోగ్య రంగంలో వ్యాపారం కొరకు ప్రవేశించిన కార్పొరేట్ శక్తులతో కూడుకున్న, ఆరోగ్య భద్రత యొక్క కార్పొరేటీకరణ అని నేడున్న పరిస్థితులలో అర్థం చేసుకోవాలి.
మన దేశం 25 సంవత్సరాల ఆర్థిక సంస్కరణల మైలురాయిని దాటింది. ఆ సంస్కరణలలో భాగంగా ఆరోగ్య రంగంలో సంస్కరణలు, రాష్ట్రాలలో పెరిగిపోయిన రోగాల ఫలితంగా పెరిగిన ఇబ్బందులు, ఆరోగ్య భద్రతలో, ఆరోగ్య సూచికలలో సబ్ సహారా ఆఫ్రికాకు దగ్గరగా మారుతున్నా ప్రభుత్వం ప్రైవేటురంగాన్ని ప్రోత్సహించే విధానాలనే ముందుకు తీసుకుపోతున్నది. గత యూ.పి.ఎ. ప్రభుత్వంలో ఈ రంగంలో ఏ విధమైన పెట్టుబడులు లేకపోయినప్పటికీ జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్.ఆర్.హెచ్.ఎం.) ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య భద్రతా విధానాన్ని విస్తరించి, బలోపేతం చేసింది. ఇది (ఎన్.ఆర్.హెచ్.ఎం.) ప్రస్తుతం ఉనికిలో ఉన్న ప్రజా ఆరోగ్య విధానం, పరిమిత వనరుల తో సానుకూలమైన మార్పులు సాధించవచ్చునని నిరూపించింది. కానీ దీని ద్వారా వచ్చిన ముఖ్యమైన గుణపాఠాలు మాత్రం విధాన రూపకల్పన చేసేవారికి, పాలకులకు అతి ముఖ్య మైనవిగా కనిపించడం లేదు. ప్రజలకు కల్పిం చాల్సిన ఆరోగ్య భద్రత పట్ల వహించవల్సిన బాధ్యతను మాత్రం నెరవేర్చ నిరాకరిస్తున్నారు.
మొట్ట మొదటిసారిగా నయా ఉదారవాద విధానాలు ప్రభుత్వ చర్చలో, విధాన నిర్ణయా లలో భాగం అయిన దగ్గర నుండి ప్రణాళికా కమీషన్ 12వ పంచవర్ష ప్రణాళికలో ఆరోగ్యం పై విడుదల చేసిన పత్రాలు, జాతీయ ఆరోగ్య విధానం (ఎన్.హెచ్.పి.) చిత్తుప్రతి 2015, బహిరంగంగా ప్రజా ఆరోగ్య భద్రత ప్రైవేటీకరిం చబడవలసిన అవసరాన్ని నొక్కి చెపుతూ వచ్చాయి. వాస్తవానికి ప్రజా రోగ్యాన్ని ప్రైవేట్ రంగానికి నెమ్మదిగా తనఖా పెట్టించడానికి పథ కం రచించిన జాతీయ ఆరోగ్య విధానం (ఎన్. హెచ్.పి.) 2015, ప్రజా ఆరోగ్యానికి తక్కువ నిధులు ఖర్చు చేయాలన్న విధానాన్ని సమర్థించింది.
ప్రభుత్వ - ప్రైవేట్ భాగస్వామ్యం Ê
ప్రైవేట్ బీమా
ఆరోగ్య భద్రతకు సంబంధించి, పెరుగు తున్న ప్రైవేట్ రంగం యొక్క భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనుసరించిన పద్దతులలో ప్రభుత్వ - ప్రైవేట్ భాగస్వామ్యం ఒకటి. ఈ పద్దతిలో ఉన్నటువంటి లోపాలు చాలా విస్తృతంగా చర్చించబడినాయి. సరియైన పద్దతులలో పరిశీలన చేయకుండా ప్రభుత్వ - ప్రైవేట్ భాగస్వామ్య పద్దతులను పాటించడం వల్ల ప్రైవేట్ రంగం లాభం పొందే విధంగా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయబడతాయి అని అనేక అధ్యయనాలు వెల్లడించాయి.
ప్రైవేట్ రంగం యొక్క ప్రవేశాన్ని ప్రోత్స హించిన ప్రపంచ బ్యాంక్‌చే సిఫారసు చేయబడిన 'ఆరోగ్య బీమా' ను ప్రవేశపెట్టడం, కేంద్ర ప్రభుత్వం అనుసరించిన మరొక పద్దతి. ప్రపం చంలోనే ఖరీదైన ఆరోగ్య విధానం అమలులో ఉన్న అమెరికా తప్ప, బాగా అభివృద్ధి చేయబడిన ఆరోగ్య భద్రతా విధానం అమలులో ఉన్న అన్ని పారిశ్రామిక దేశాలలో 'ఆరోగ్య బీమా' ఉనికిలో ఉన్నది. ఈ అన్ని దేశాలలో ప్రభుత్వ బీమా పథకాల భాగస్వామ్యమే చాలా ఎక్కువగా ఉన్నది. కానీ భారతదేశంలో ఆరోగ్య భద్రతను ప్రైవేటీకరణ దిశగా ప్రోత్సహిస్తున్నారు. ఎందు కంటే మన దేశంలో ఆరోగ్య బీమా యంత్రాం గం ఎక్కువగా ప్రైవేట్ రంగానికి సంబంధించినదే.
12వ పంచవర్ష ప్రణాళిక పత్రంలో ఆరోగ్య విధానంలో ఆరోగ్య బీమాను చేర్చే విధంగా ఉనికిలో ఉన్నటువంటి ఆరోగ్య విధానాన్ని పునర్నిర్మించనున్నట్లు స్పష్టంగా చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఆరోగ్య విధానం 'సేవ, బీమా' ల మిశ్రమంగా ఉంటుంది. పునర్నిర్మించడం అంటే అర్థం ఆరోగ్య భద్రతా విధానాన్ని జాగ్రత్తగా నియంత్రించేతీరు. ఇది ప్రభుత్వ నిధులతో ఆరోగ్య భద్రతను నిర్వహించే తీరు నుండి ప్రభుత్వమే ఒక 'మేనేజర్' గా ఉంటూ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఆరోగ్య సేవలు నిర్వహించబడే విధానం వైపు కదులుతున్నట్లు స్పష్టంగా అర్థం అవుతున్నది. ఇప్పటికే బలపడిన కార్పొరేట్ శక్తులచే నడిపించబడుతున్న ప్రైవేట్ ఆరోగ్య భద్రతా విధానాన్ని మరింత పటిష్ట పరుస్తూ, ప్రజా ధనంతో ఆరోగ్య భద్రతను కొనుగోలు చేసే కొనుగోలుదారునిగా ప్రభుత్వం మారుతోంది.
యూ.పి.ఎ. ప్రభుత్వం దేశవ్యాప్తంగా రాష్ట్రీ య స్వాస్థ్య బీయా యోజన (ఆర్.ఎస్.బి.వై.) అనే పథకాన్ని ఈ తలంపుతోనే ప్రారంభిం చింది. ఇది భవిష్యత్‌లో ప్రజా ఆరోగ్య భద్రత ఏ విధంగా ఉండబోతోందో సూచిస్తుంది. ఉన్నతస్థాయి నిపుణుల గ్రూపు (హెచ్.ఎల్.ఇ.జి.) ప్రస్తుత ఆరోగ్య బీయా పథకాలకు వ్యతిరేకంగా కొన్ని సిఫారసులు చేసినప్పటికీ, 12వ పంచవర్ష ప్రణాళిక పత్రం వాస్తవంగా ఆర్.ఎస్.బి.వై. లాంటి బీమా పథకాలను విస్తరించడానికి పూను కున్నది. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఒక జాతీయ బీమా విధానం ద్వారా అందరికీ ఆరోగ్య బీమాను వర్తింపజేయనున్నట్లు ప్రకటించింది.
ప్రపంచీకరణ విధానం అమలులో భాగం గా 1990లో స్థాపించబడిన ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూ.టి.ఓ.) యొక్క మద్దతుతో జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్ (జి.ఎ.టి. ఎస్.) చేసుకున్న ఒప్పందం ఫలితంగానే బీమా రంగంలో ప్రైవేట్ వ్యక్తులకు ప్రవేశం కల్పిం చడం వల్లనే వారికి విదేశీ బీమా ఏజెన్సీలలో భాగస్వామ్యం ఏర్పడింది. ప్రపంచ వాణిజ్య సంస్థ ఆధ్వర్యంలో జరిగిన పరిణామాల ఫలితం గా ఆరోగ్య భద్రతా యాజమాన్య సంస్థలు, ఆరోగ్య భద్రతకు సంబంధించిన సాంకేతిక కంపెనీలు పాశ్చాత్య ఫార్మాస్యూటికల్ పరిశ్రమ లు, బీమా కంపెనీలు భారతీయ మార్కెట్ లోపలికి చొచ్చుకొనివచ్చాయి.
ట్రిప్స్ పేటెంట్లు
ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూ.టి.ఓ.)తో జరిగిన చర్చల్లో ఆరోగ్య రంగంపైన ప్రభావాన్ని చూపించిన దాని ఫలితమే ట్రేడ్ రిలేటెడ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ (ట్రిప్స్) ఒప్పందం. ఈ ఒప్పందం వలన స్వదేశీ మందుల పరిశ్రమలకు, మందులను పేటెంట్ క్రిందకు రానీయకుండా సేవలందించిన ఇండియన్ పేటెంట్ చట్టం, 1970ని భారత ప్రభుత్వం మార్చింది. ట్రిప్స్ నియమ నిబంధనలు వర్తింపచేస్తూ మందులు ఉత్పత్తి చేసుకునే విధంగా ఇండియన్ పేటెంట్ యాక్ట్ 2005ను తీసుకొనివచ్చింది. 1970 చట్టం ప్రకారం పరిమిత కాలంలోనే భారతీయ ఫార్మా పరిశ్రమ పేటెంట్ రక్షణకు సంబంధించిన ఇబ్బందులు ఏమీ లేకుండానే విదేశాలలో పేటెంట్ అనుమతించిన మందులను క్రొత్త రసాయన, భిన్నమైన పద్దతి ప్రకారం పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేసే ఒక కొత్త విధానాన్ని ఉపయోగించు కున్నది. ఫలితంగా శక్తివంతమైన జనరిక్ మందుల పరిశ్రమ దేశంలో ఏర్పాటు అయింది.
1980వ సంవత్సరం నాటికి భారతీయ ఫార్మా పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న దేశాలలో అభివృద్ధి చెందిన పరిశ్రమలలో ఒకటిగా తయారైంది. మందులు ఈ విధంగా తయారు చేయబడడం అనేది, పాశ్చాత్య దేశాల నుండి పేటెంట్ మందుల ధరలో ఒక చిన్న భాగంగా ఉండడం వలన 1990 నాటికి భారతదేశం అభివృద్ధి చెందుతున్న ప్రపంచానికి ఫార్మా కంపెనీగా గుర్తింపురావడం జరిగింది. మన పరిశ్రమ ప్రపంచ మార్కెట్‌లోకి, పేటెంట్ మందుల నిర్ణీత గడువు సమయం (ఎక్స్‌పైరీ) పూర్తి అవడానికి ముందే, కొత్త మందులను అతి తక్కువ ధరలకు అందుబాటులో ఉంచగలిగింది. ఆ విధంగా భారతదేశం ఆఫ్రికా లో అంటువ్యాధులు ప్రబలంగా ఉన్న ప్రాంతాల కు, ఇతర మూడవ ప్రపంచ దేశాలకు పెద్ద మొత్తంలో మందులను సరఫరా చేయగలిగింది.
వామపక్షపార్టీలు ప్రతిపక్షంలో ఉన్నం దున 2005 పేటెంట్ చట్టంలో కొన్ని ఆరోగ్య రక్షణా చర్యలు సవరణలుగా ప్రవేశపెట్టబడి నాయి. ఈ సవరించబడిన పేటెంట్ చట్టంలో ముఖ్యమైనదేమంటే భారతీయ జనరిక్ మందుల ఉత్పత్తిదారులు 1995-2005 మధ్య కాలంలో ప్రవేశపెట్టిన పేటెంట్ మందుల ఉత్పత్తులను కొనసాగించవచ్చును. ఈ కొత్త చట్టం పాక్షికం గానైనా ఆరోగ్య రంగంపై అపాయకరమైన ప్రభావం పడకుండా కొంతమేరకు తగ్గించింది.
కానీ ఆరోగ్య సంరక్షణ చట్టం పరిధికి లోబడి మందులను తయారుచేసే న్యాయబద్దమైన హక్కు భారతీయ మందుల కంపెనీలకు ఉన్నప్పటికీ, బహుళజాతి కంపెనీలు ఆర్థిక బలంతో, అధికా రంతో భారతీయ మందుల కంపెనీలకు వ్యతిరే కంగా కేసులు వేస్తూ వస్తున్నాయి. కానీ ఈ మధ్య కాలంలో భారతీయ కంపెనీలు వారికి ఉన్న పరిమితమైన బలంతో బహుళజాతి కంపెనీలను నిలువరించలేకపోతున్నాయి. కొన్ని సందర్భాలలో కోర్టులలో వాదనలకు తట్టుకోలేక పోరాటాల నుండి తప్పుకుంటున్నాయి. మరీ కొద్దికాలంగా బహుళజాతి కంపెనీలతో భార తీయ కంపెనీలు రాజీపడుతూ వస్తున్న సందర్భా లు అనేకం ఉన్నాయి. అంతేకాక వారి (బహుళ జాతి కంపెనీల) యొక్క పేటెంట్ మందులకు భారతీయ కంపెనీలు మార్కెటింగ్ ఏజెంట్లుగా తయారౌతున్నాయి.
కానీ గత కొన్ని సంవత్సరాలుగా కొత్త పేటెంట్ చట్టం యొక్క ప్రత్యక్ష ప్రభావం స్పష్టంగా కనపడుతున్నది. 2014లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం 140 పేటెంట్ మందు ల ఉత్పత్తులలో కేవలం 92 ఉత్పత్తులకు సంబంధించి అవి భారతదేశంలో తయారు చేయ బడుతున్నాయా లేదా అనే విషయం పరిశీలిస్తే కేవలం 4 రకాలు మాత్రమే భారత దేశంలో తయారవుతున్నాయన్న విషయం బయటపడింది. మిగిలిన 88 రకాలను దిగుమతి చేసుకొని భారతదేశ మార్కెట్‌లో అత్యంత ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. 2012లో ఏర్పాటు చేయబడిన మందుల ధరల నియంత్రణ ఆర్డర్ (డి.పి.సి.ఓ.) కు ఈ మందుల (పేటెంట్) ధరలను నియం త్రించే అధికారం లేదు. ఒక మందుపై పేటెంట్ కలిగిన వ్యక్తి తనకున్న పేటెంట్‌ను ఉపయోగిం చనపుడు లేదా ప్రజారోగ్యాన్ని సంరక్షించే ఆ పేటెంట్ మందు కొనగలిగిన ధరలో అందు బాటులో లేనపుడు భారతీయ మందుల తయారీదారులకు ఆ పేటెంట్ మందును తయారుచేయడానికి అనుమతించే కంపల్సరీ లైసెన్సింగ్ (సి.ఎల్.) చట్టం ఈ కేసులో అంతగా ఉపయోగించబడడం లేదు. దాని ఫలితంగా కొన్ని మందుల ధరలు సగటు మానవుని కొనుగోలు శక్తికి మించి ఎక్కువగా ఉంటున్నాయి.
వైద్య పర్యటనలు ( మెడికల్ టూరిజం)
ప్రపంచీకరణ అనంతరం ఆరోగ్య భద్రత లో ప్రైవేట్ రంగం యొక్క మితిమీరిన జోక్యంతో ఈ మధ్య కొత్తగా పెద్ద ఎత్తున పెరిగిపోయిన ''వైద్య పర్యటన'' ఒకటి. ఇది ముఖ్యంగా ప్రైవేట్ రంగం, భారతీయ ప్రజానీకానికి ఆరోగ్య భద్రత సేవలు అందించాల్సిన ప్రభుత్వంచే ముందుకు తీసుకొని వెళ్ళబడింది. ఉదాహరణకు 2002 జాతీయ ఆరోగ్య విధానం ఈ విధంగా చెబు తుంది. ''ద్వితీయ, తృతీయ రంగాలలో మన దేశ ప్రజలు అనుభవిస్తున్న ఆరోగ్య సౌకర్యాలలో ధరల అనుకూలతను వినియోగించుకొని మన ఆరోగ్య విధానం విదేశాలలోని రోగులకు చెల్లిం పులతో కూడుకున్న వైద్య సేవలను ప్రోత్స హిస్తుంది. ఆ విధంగా విదేశీ మారకంతో అందించబడుతున్న సేవలు ''ఎగుమతులు''గా పరిగణించబడతాయి. ముఖేష్ అంబానీ, కుమార మంగళం నాయకత్వంలోని ఇంతకు ముందున్న ప్రధానమంత్రి యొక్క ''వాణిజ్య, పరిశ్రమల సలహామండలి'' చేత తయారు చేయబడిన ''ఆరోగ్య భద్రతలో సంస్కరణలు'' అనే పత్రంలో ఈ అంశాలను చెప్పారు. కార్పొ రేట్ రంగంచే తయారు చేయబడిన సిఫారసుల ఆధారంగా పై విధానం అమలు చేయబడింది.
ముఖ్యంగా ఖర్చుతో కూడుకున్న వైద్య సేవలను భరించగలిగిన భారతీయ జనాభాలో కొద్దిశాతం మంది ప్రజలకు అందించిన ప్రైవేట్ రంగం గత దశాబ్దకాలంగా తన లాభాలను పెంచుకొనేందుకు, ఇతర అవకాశాల కొరకు ఎదురుచూస్తుంది. భారతదేశం కన్నా విదేశా లలో వైద్య ఖర్చులు ఎక్కువగా ఉండడంతో అక్కడి ప్రజలు భారతదేశానికి వచ్చి ప్రైవేట్ రంగంలో వైద్య సేవలను పొందుతున్నారు. ఆ విధంగా విదేశాలలో ఆరోగ్యాన్ని కోరుకునే వారికి భారతదేశం ఒక ప్రధానమైన కేంద్రంగా తయారయింది. వైద్య పర్యటనా పరిశ్రమ సంవత్సరానికి 30 శాతం పెరుగుదలను తాకింది. ఒక తాజా అంచనా ప్రకారం వైద్య పర్యటన 2015 నాటికి 3 బిలియన్ డాలర్లు ఉండగా, 2020 నాటికి 8 బిలియన్ డాలర్లను తాకనున్నది.
వైద్య పర్యటనా పరిశ్రమ కార్పొరేట్లచే నడపబడుతున్న పెద్ద ప్రత్యేకమైన ఆసుపత్రులకు పరిమితమైయున్నది. గడచిన దశాబ్దకాలంలోనే ఆ పరిశ్రమ చాలా ఎక్కువగా పెరిగిపోయింది. వైద్య పర్యటన ద్వారా పెద్ద మొత్తంలో వచ్చిన ఆదాయాన్ని, దిగజారిపోతున్న ప్రజారోగ్య సేవ లకు ప్రైవేట్ రంగం వినియోగిస్తుందని ఎవ్వరూ ఊహించలేరు. అంతేకాకుండా ప్రభుత్వాలు ఆరోగ్య భద్రతలో ప్రైవేట్ రంగం వారిని భాగ స్వామ్యం చేయడానికి గాను సబ్సిడీలు, ముఖ్యం గా భూములను ఉచితంగా ఇవ్వడం లాంటి కార్యక్రమానికి ప్రతిఫలంగా రోగులలో కొంత శాతం ఉచితంగా ఇన్‌పేషెంట్స్, అవుట్ పేషెంట్స్‌కు వైద్య సేవలందిస్తామన్న వారి (ప్రైవేట్‌రంగం) మాటను నిలబెట్టుకోలేదు. నేడు ప్రైవేట్ ఆసుపత్రులలో మంచి అనుభవం ఉన్న వైద్యులు అందరూ కూడా ప్రభుత్వ రంగం నుండి వచ్చినవారే. ఆ విధంగా వైద్య పర్యటన అంతర్గతంగా ఆరోగ్య రంగంలో నిష్ణాతులైన వైద్యులను ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళేటట్లు ప్రోత్సహిస్తుంది. ఇప్పటికే సరళీకరణ విధానాలు ఆరోగ్య భద్రతను కాపాడే భారతీయ వైద్యులను (దాదాపు 60 శాతం) నగరాలలో నివశించేటట్లు చేశాయి. వైద్య పర్యటన ఆరోగ్య భద్రతను కాపాడే వైద్యులను పెద్ద పెద్ద నగరాల లోని కేంద్రాలకు, ముఖ్యంగా కార్పొరేట్ సంస్థలు నడిపే ప్రత్యేక వైద్య విద్యా సంస్థలకు వెళ్ళేటట్లు చేసింది.
బ్రెటన్‌ఉడ్స్ సంస్థలు ప్రజా సంక్షేమ విధానంపై ప్రభుత్వ ఖర్చును తగ్గించడాన్ని ప్రోత్సహించాయి. దాని ఫలితంగా సరళీకరణ విధానాలు ఇతర సామాజిక అంశాలు అంటే ఆహారం, పౌష్టికాహార భద్రత, వ్యవసాయం మొదలగు రంగాలపై పెట్టుబడులు పెట్టడానికి అననుకూలమైన ప్రభావాన్ని చూపించాయి. అదే విధంగా సేవా రంగంలో భాగంగా ఉన్న విద్యా రంగంలో కూడా అత్యంత ఖర్చుతో కూడుకున్న విద్యను అందించడంలో ప్రైవేట్ రంగం చాలా పెద్ద పాత్రను పోషిస్తుంది. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వైద్య విద్యా సంస్థలు సందేహాత్మక మైన వైద్యులను తయారుచేస్తున్నాయి. ఫలితంగా ఈ మధ్య కాలంలో ఆరోగ్య భద్రతపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపాయి.
అనువాదం: బోడపట్ల రవీందర్
- ఆర్. రామచంద్రన్

No comments:
Post a Comment