వ్యవసాయంలో పెట్టుబడిదారీ విధానం
వ్యవసాయ రంగంలో బడా కంపెనీలు భారీ పెట్టుబడులతో ఉత్పత్తి ప్రక్రియపై బహుళజాతి కంపెనీలు పట్టు సాధించడానికి కొత్త మార్గాలు ఏర్పడ్డాయి. ధనం, రాజకీయ వినియోగం అనేక రూపాలు తీసుకోవచ్చు. భూమి కొనుగోలు ద్వారా భూమిపైన, ఉత్పత్తి పైన ప్రత్యక్ష పట్టు సాధించడం మొట్టమొదటిది. వ్యవసాయ సరఫరాల చైన్ గణనీయంగా విస్తరించిన ఆఫ్రికా దేశాల్లో ఇది ఎక్కువగా జరిగింది. ఆ దేశాల్లో పూర్తి యాజమాన్య హక్కు ద్వారా లేదా దీర్ఘకాలిక లీజు ద్వారా కంపెనీ లకు భూమిపై పెత్తనం లభించింది. కాంట్రాక్టు వ్యవసాయం/ ఔట్ గ్రోయర్ మోడల్ రెండవ రకం. దీని ద్వారా భూమిపై యాజమాన్యహక్కు లేకపోయినా ఆ భూమిలోని ఉత్పత్తిపై మాత్రం ఆ కంపెనీలే పూర్తి పట్టు సాధించాయి. పరపతి, ఉత్పాదకాల సరఫరా, ధరలు, మార్కెట్ వ్యవహా రాలు తదితరాలన్నీ కంపెనీలే నిర్వహిస్తాయి. కాబట్టి రైతు చట్ట రీత్యా భూయజమాని మాత్రమే తప్ప ఉత్పత్తి కార్యకలాపాలన్నీ కంపెనీల కనుసన్నలలోనే జరుగుతాయి.
టెక్నాలజీ, డబ్బు, మార్కెట్‌పై తమకున్న పట్టుతో కార్పొరేట్లు ఒక కొత్త తరహా పెట్టుబడి దారులు - భూస్వాముల్లా ఉద్భవిస్తున్నారు. కాబట్టి గ్రామ సీమల్లో ఉత్పత్తి సంబంధాలను రీస్ట్రక్చర్ (పునర్ని ర్మాణం) చేసే అంశాల్లో ద్రవ్య పెట్టుబడి కీలకంగా వుంది.
వ్యవసాయంలో కార్పొరేట్ భూమి ఒప్పందాలు (అమ్మకాలు) :
క్రమ పద్ధతిలోగల సమాచారం లేకపోయినా వున్న పరిమిత సమాచారం ఆధా రంగా పరిశీలిస్తే దక్షిణార్థ గోళంలో బహుళజాతి సంస్థల పెట్టుబడులు వ్యవసాయ రంగంలో పెరిగాయని నిస్సందేహంగా చెప్ప వచ్చు. ల్యాండ్ మాట్రిక్స్ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం గత దశాబ్ద కాలంలో బహుళజాతి కంపెనీల ఒప్పందాలు (కొనుగోళ్ళు) పెరిగాయి. (పట్టిక చూడండి)
వ్యవసాయ భూమికోసం బహుళజాతి సంస్థల పెట్టుబడులు పెరుగుతున్నాయని పై టేబుల్ ద్వారా స్పష్టమవుతున్నది. మౌఖిక లేదా రాతమూలక కాంట్రాక్టు ద్వారా జరిగిన లీజు ఒప్పందాల్లో మూడింట రెండువంతులకు పైగా బహుళజాతి సంస్థలతో జరిగినవే. ఓషియానా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్ తదితర దేశాలు, లాటిన్ అమెరికా, ఆఫ్రికాలలో ఇది ఎక్కువగా వుంది. ఆసియాలో 50%గా వుంది.
భారత్‌కు సంబంధించిన 77 దేశీయ, బహుళజాతి ఒప్పందాలలో అత్యధికం మైనిం గ్‌కి సంబంధించినవే కావడం గమనార్హం. ఇందులో ఏడు మాత్రమే వ్యవసాయానికి సంబంధించినవి కాగా వాటిలో ఐదు బహుళ జాతి కంపెనీలవే. దేశీయ ఒప్పందాల్లో కూడా అన్నీ సెకండరీ ఇన్వెస్టర్స్ (పెట్టుబడి పెట్టేవి) బహుళజాతి కంపెనీలవే. వాటిలో బ్రిటన్‌కు చెందిన నందన్ బయోటెక్ ప్రధానమైనది. భారత్‌లో వ్యవసాయ భూమి మైనింగ్ కోసం విస్తారంగా మళ్ళించబడుతోంది.
ఆఫ్రికాలో వ్యవసాయం కోసం భూమిపై పెట్టుబడులు పెడుతున్న మొదటి ఐదు దేశాల్లో భారత్ ఒకటి కావడం గమనించవలసిన ముఖ్యాంశం.
ఆయా కంపెనీలు పెడుతున్న పెట్టుబడులు స్వభావాన్ని పరిశీలించడం అవసరం. (ఈ విషయంలో పరిమితమైన సమాచారం కేవలం ల్యాండ్ మెట్రిక్స్‌లోనే లభిస్తోంది) ఆఫ్రికా, ఆసియా దేశాల్లో ఆహారేతర పంటలు (ఎగుమతి ఆధారిత వ్యవసాయం, ఫ్లెక్సిబుల్ పంటలు) బహుళ ప్రయోజన పంటలు (మొక్కజొన్న, చెరకు మొదలైనవి) ఎక్కువగా వున్నాయి. పెట్టుబడుల లోనూ, పంటల సరళిలోనూ మార్పుల మూలం గా రైతాంగంపై తీవ్ర ప్రభావం పడుతుంది. బహుళ ప్రయోజన పంటలతో వ్యవసాయ రంగంలో డబ్బు పాత్ర పెరిగింది. దాంతో రైతు రుణభారం పెరిగిందని ఆఫ్రికా దేశాల వ్యవసాయంపై చేసిన అనేక అధ్యయనాలు నిర్ధారించాయి. అంతేగాక రైతాంగం ఈ పంటలనుండి వేరే వాటికి మారడానికి కూడా వీలు కావడంలేదని ఆఫ్రికా వ్యవసాయ అధ్యయ నాలు స్పష్టం చేశాయి. రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోవడాన్ని కూడా ధృవపరిచాయి.
ఔట్ గ్రోయర్ మోడల్ :
కార్పొరేట్ కంపెనీలు కాంట్రాక్టు వ్యవసా యం/ ఔట్ గ్రోయర్ విధానాలను అనుసరిస్తు న్నాయి. దానివల్ల భూమిపై ప్రత్యక్ష పట్టు లేకపోయినా ఉత్పాదకాల మొదలు మార్కెటింగ్ వరకు అన్ని దశల్లోనూ బహుళజాతి కంపెనీల పెత్తనమే ఉంటుంది. ఈ అంశంపై అనేక కేస్ స్టడీస్ ఉన్నాయి.
ఐటిసి కంపెనీ మధ్యప్రదేశ్‌లో చేపట్టిన ఈ చౌపల్ ప్రాజెక్టు బహుశా మొదటి వెంచర్ అయి వుండవచ్చు. సోయాబిన్ సేద్యంలో సన్న, చిన్నకారు రైతులను సంఘటితంజేయడంలో ఐటిసి కంపెనీకి సహాయపడిన పెద్ద, ధనిక రైతులే ఇందులో భాగస్వాములు. ఇలాంటి పెద్ద రైతులను అన్ని ప్రాంతల్లోనూ ఐటిసి సమీకరించి వారితో ఆధునిక వ్యవసాయ పద్ధతులను మొదట ఉపయోగించి మిగిలిన రైతులను ప్రభావితం చేస్తారు. దీనివలన ఆ పెద్ద రైతులు ఐటిసికి ట్రాన్సాక్షన్ (నిర్వహణ) ఖర్చులు మిగిలిస్తారు. ప్రతి ఆధునిక/ పెద్ద రైతు 15-20 మంది రైతుల వ్యవసాయ ఉత్పత్తిని పర్యవేక్షిస్తూ వారికి సాంకేతిక సమాచారాన్ని, విజ్ఞానాన్ని అందజేస్తారు. అంటే ప్రయోగాలు చేయడానికి, రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడే పెద్ద రైతులు కార్పొరేట్ కంపెనీలతో మిలాఖత్ అవుతారు. సన్న,చిన్నకారు రైతులకు, పెట్టుబడికి వారు మధ్యవర్తులన్నమాట. ప్రత్తి వ్యవసాయంలో 90% ఉత్పత్తిని, 6 కోట్లమంది రైతులు వాడే ఉత్పాదకాలను మోన్సాంటో కంపెనీ నియంత్రి స్తున్నదని తాజా గణాంకాలు వెల్లడించాయి.
ఔట్ గ్రోయర్ పద్ధతిలో రైతులను గ్రూపులుగా ఏర్పాటుచేసి ఉత్పత్తి సాగిస్తారు. ఔట్‌గ్రోయర్ పద్ధతికి బయట ఉన్న రైతులు తమ ఉత్పత్తులు అమ్ముకోవడానికిగానీ, వ్యవ సాయానికవసరమైన రుణాలకోసంగానీ, సాంకే తిక పరిజ్ఞానంకోసంగానీ కార్పొరేట్ కంపెనీలపై ఆధారపడవలసి వస్తోందని ఓక్‌లాండ్ ఇనిస్టి ట్యూట్ (2015) అధ్యయనం నిర్ధారించింది.
వ్యవసాయ రంగంలో ఎగుమతి ఆధా రిత వ్యవసాయ విధానం, బహుళజాతి సంస్థ లపై ఆధారపడే పరిస్థితి, భూమిపై కార్పొరేట్ల పట్టు పెరుగుతోంది. భారతదేశ పరిస్తితుల్లో త్వరితిగతిన వ్యవసాయ రంగంలో వస్తున్న ఈ మార్పులను కార్యకర్తలు, మేధావులు నిర్దిష్టంగా అధ్యయనం చేసి కీలకమైన వాటిని గుర్తించాలి.
ఒక అంశంపై సరియైన అవగాహనకు రావడం ప్రతిఘటనకు సంబంధించిన మొట్ట మొదటి అడుగు అన్న విషయం మరువరాదు. గ్రామీణ భారతంలో వస్తున్న మార్పులను అవగాహన చేసుకోవాలి. నానాటికి మన రైతాంగం సెమీ ప్రొలిటేరియనైజేషన్ (సొంత ఆస్తి కోల్పోతూ శ్రమ మాత్రమే చేయగలవారు) అవుతున్నారు.
స్వేచ్ఛానువాదం : బి.తులసీదాస్
- డా|| అర్చనా ప్రసాద్
రచయిత జెఎన్‌టియు
ప్రొఫెసర్

No comments:
Post a Comment