క్విడ్‌ప్రోకో దోపిడీకి హైకోర్ట్ అడ్డుకట్ట
సింగపూర్ కంపెనీల స్విస్‌ఛాలెంజ్ ప్రతిపాదనలు, అందుకు ప్రభుత్వం ఒప్పుకున్న నిబంధనలను గమనిస్తే క్విడ్‌ప్రోకో దోపిడీ సులభంగానే అర్థమవుతుంది. కేవలం రూ.306 కోట్లు పెట్టుబడిపెట్టి సీడ్‌కేపిటల్‌లో 1,691 ఎకరాలను సింగపూర్ కన్సార్టియం చదునుచేసి ప్లాట్లు వేసి అమ్ముతుంది. సచివాలయం, రాజ్‌భవన్ వంటి ప్రధాన నిర్మాణాల జోలికిపోదు. ఆ మాత్రానికే కన్సార్టియంకు 58 శాతం వాటా ఇస్తారట. మౌలిక సదుపాయాలతో సహా రూ.5,271 కోట్లు పెట్టుబడిపెట్టే సర్కారు వాటా 42 శాతమేనట. భూమి లీజు 33 నుంచి 99 సంవత్సరాల పెంపు, వివాదాలొస్తే లండన్ కోర్టులో పరిష్కారం చేసుకోవడం ఇవన్నీ సింగపూర్ కన్సార్టియానికి సర్కారు జీహుజూర్ అనేవే. రైతుల నుంచి సేకరించిన భూములపై రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఒకానొక కుతంత్రానికి పక్కా ప్లాన్ ఇది. విచారణ సందర్భంలో హైకోర్టు లేవనెత్తిన సందేహాలను పరిశీలిస్తే సింగపూర్ కంపెనీల కోసమే టెండర్ నిబంధనలు రూపొందాయనీ తెలుస్తుంది.
No comments:
Post a Comment