Sunday, September 11, 2016

న్యూఢిల్లీ : స్వయంగా ఒక వ్యాపార ప్రకటనలో ప్రధాని స్థాయి వ్యక్తి ఫొటో వాడటాన్ని కేంద్రమంత్రి సమర్థించుకున్న తీరు ఆశ్చర్యపరుస్తోంది.జియో యాడ్‌లో ప్రధాని ఫొటో పెట్టడంపై వస్తున్న విమర్శలను టెలికాం శాఖామంత్రి మనోజ్‌సిన్హా కొట్టిపారేశారు. డిజిటల్‌ ఇండియా కలలు కంటున్న ప్రధానిని ఎవరూ తప్పుపట్టడానికి వీళ్లేదని వ్యాఖ్యానించారు. రిలయన్స్‌ సంస్థ విడుదలచేసిన జియోసిమ్‌ యాడ్‌లో ఒక పూర్తి పేజీ ప్రకటనలో ప్రధాని ఫొటో పెట్టడం తెలిసిందే.దేశీయ, విదేశీ పెట్టుబడులు ఆకర్షించడంలో మోడీ కీలక పాత్ర వహించారని, ఆయన రాకతోనే పెట్టుబడిదారులు పునరుద్ధరింపబడుతున్నారని ఈ సందర్భంగా పేర్కొనడం విశేషం. జాతీయ ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్వర్క్‌ రూపుదిద్దడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని 2018 నాటికి 2.5 లక్షల పంచాయితీలలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టడానికి తమ ప్రభుత్వం ఆశిస్తుందని తెలిపారు.

No comments:

Post a Comment