ప్రజలందరి హక్కుగా ఆరోగ్యం
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 47 'ప్రజా ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు ప్రజల పౌష్టికాహారం, జీవన ప్రమా ణాన్ని పెంపొందించడం ప్రభు త్వం బాధ్యత' అని ఆదేశించింది. అందరికీ ఆరోగ్యం విధానంలో భాగంగా 'ఆరోగ్యం, సౌభాగ్యం, జీవన ప్రమాణాల పెంపు, వైద్య సేవల మెరుగుదల, అనారోగ్య సందర్భాల్లో పిల్లలు, తల్లుల భద్రత కీలకాంశంగా చూడాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. యుడిహెచ్‌ఆర్ (యూని వర్సల్ డిక్లరేషన్ ఆన్ హ్యూమన్‌రైట్స్) 'జీవించే హక్కు, స్వేచ్ఛ, జీవన భద్రత'' ఇవి ప్రతిమానవుడి హక్కు అని ఆర్టికల్ ఎల్3 స్పష్టంగా చెబుతోంది. 'జీవించే హక్కు'లోనే మంచి ఆహారం, ఆరోగ్యపు హక్కు కూడా ఉన్నదని ఒక సహజ అవగాహన అని మన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది. మన పాలకవర్గాలకు ప్రజల ఆరోగ్యం, భద్రత పట్టడంలేదు. దేశంలో 1983, 2004 సంవత్సరాలలో రూపొందించిన 'జాతీయ ఆరోగ్య విధానం' అసమగ్రంగా ఉంది. గత రెండేళ్లుగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం జాతీయ ఆరోగ్య విధానంపై నోరూరిస్తోంది తప్ప ప్రజారోగ్యంపై సమగ్ర విధానం రూపొందించలేదు. 2009లో 'అందరికీ విద్య' చట్టం రూపం దాల్చినట్లే, 'అందరికీ ఆరోగ్యం' కూడా చట్టం చేయాలి. ఐదు నుంచి పద్నాలుగేళ్ల లోపు బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్య తప్పని సరిచేస్తూ విద్యా హక్కు చట్టం తీసుకొచ్చినట్లే, అందరికీ వైద్యం అందేలా చట్టం చేయాలి. విద్య, వైద్యం అభివృద్ధికాకుండా ఏ దేశమూ అభివృద్ధి కాలేదు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 65 ఏళ్లవుతున్నా వైద్యం అమలు ఎలా వుందో పరిశీలిస్తే పాలకుల డొల్లతనం బయటపడుతోంది.
'ఈసురోమనిమనుషులుంటే-దేశమేగతి బాగుపడు నోరు' అని గురజాడ అన్నట్లు ప్రజలు అనారోగ్యం పాలైతే ఏ దేశమైనా ఎలా అభివృద్ధి చెందుతుంది. ప్రజలు ఆరోగ్యంగా లేని దేశాన్ని వ్యాధిగ్రస్త దేశంగా భావించాలి. ఆరోగ్యపరంగా ప్రజలను చైతన్యపరచవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. ప్రభుత్వం ఈ బాధ్యత తీసుకోకపోడంతో మన కంటే వెనుకబడిన అనేక దేశాలు ఆరోగ్యపరంగా ఎంతో ముందు న్నాయి. ఏ దేశమైనా ఆర్థికంగా అభివృద్ధి చెందిన తరువాత సామాజిక అభివృద్ధిని సాధించవచ్చన్న విధానాన్ని ప్రపంచ ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ అమర్త్యసేన్ తీవ్రంగా తప్పుపట్టారు. చైనా ప్రారంభం నుంచీ విద్య, వైద్యానికి బాగా ఖర్చు చేయడం వల్లే చైనా అభివృద్ధి సాధించిందని వివరించారు. భారత్, చైనాల అభివృద్ధి సూచికలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. చైనా తమ దేశ జిడిపిలో 5 శాతానికి పైగా ఆరోగ్యానికి ఖర్చు చేస్తుంటే, భారతదేశంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా 1.5 శాతానికి మించి ఆరోగ్యానికి ఖర్చు చేయడం లేదు. చైనా, క్యూబా, బ్రిటన్ వలె భారత్‌లో కూడా ఆరోగ్యానికి అదనంగా ఖర్చు చేయగలిగి నప్పుడు ప్రజలు ఆరోగ్యంగా ఉండి ఇతర దేశాలతో సమా నంగా పోటీపడగల స్థితికి చేరుకుంటారు. ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధికాగలుగుతారు. ఆటల్లోనూ రాణించగలుగుతారు.
ఆందోళనకరంగా ఆరోగ్య పరిస్థితి
ప్రపంచంలో చిన్న, పెద్ద దేశాలు అంటు వ్యాధులను అరికట్టగలిగాయి. మన దేశంలో కూడా పోలియోను అరికట్ట గలిగాం. మలేరియా, మాతాశిశు మరణాలను అరికట్టలేక పోతున్నాం. మన దేశంలో ఏటా అంటు రోగాలు, విషజ్వరాలతో పది లక్షల మందికి పైగా మరణిస్తున్నారు. చిన్నపిల్లలు పురిటిలోనూ, మూడేళ్లలోపు పిల్లలు 7.3 లక్షల మంది చనిపోవడం బాధాకరం. పౌష్టికాహార లోపం, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటమే మరణాలకు ప్రధాన కారణం. పోలియోను అరికట్టడంలో ప్రముఖ పాత్ర అంగన్‌వాడీ, 'ఆశ'లదే. 'ఆశ' వ్యవస్థ చాలా అద్భుతమైనది. ఆదివాసీ మారుమూల గ్రామాలతో సహా ఎక్కడ అనారోగ్య లక్షణాలు కనిపించినా 24 గంటల్లో ఆరోగ్య కేంద్రాలకు సమాచారం చేరవేస్తున్నారు. 'ఆశ'కు ముందు అటువంటి అవకాశంలేదు. అంగన్‌వాడీ ద్వారా తల్లీపిల్లల ఆరోగ్య అభి వృద్ధికి ఎంతో కృషి జరుగుతున్నది. కానీ ప్రభుత్వాలు వీటిని బలోపేతం చేయకుండా బలహీనపరుస్తున్నాయి. భారత బడ్జెట్ 2014-15లో స్త్రీశిశు సంక్షేమానికి రూ.16,415 కోట్లు కేటాయించగా, 2016-17లో రూ.15,873 కోట్లకు కుదించింది. బడ్జెట్లో రూ.542 కోట్లు తగ్గించింది.
మారుతున్న పరిస్థితుల్లో సుగర్, బిపి, ఊబకాయం వంటి వ్యాధులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. శారీరక శ్రమ రోజు రోజుకూ తగ్గుతున్నది. ఫాస్టుఫుడ్స్, సాప్ట్ డ్రింక్స్ వాడకం బాగా పెరుగుతున్నాయి. దేశంలో ఊబకాయంతో (ఒబేసిటి) 13 శాతం జనాభా బాధపడుతోంది. ఒక మనిషి సాధారణ బరువు కంటే 20 శాతం అదనంగా ఉంటే ఊబకాయం ఉన్నట్లు భావించాలి. సుగర్ వ్యాధి ప్రభావం మరింత ఆందోళనకరంగా ఉంది. మన దేశంలో ప్రతి సంవత్సరం రెండు లక్షల మంది సుగర్ వ్యాధితో చని పోతున్నారు. స్త్రీలలో ప్రతి నలుగురిలో ఒకరు గర్భిణీ కాలేకపోతున్నారు. యువకుల్లో ప్రతి నలుగురిలో ఒకరు నపుంసకులుగా మారుతున్నారు. బిపి వ్యాధి వేగంగా పెరుగుతున్నది. ముఖ్యంగా నగరాలు సుగర్, బిపిలకు నిలయంగా మారుతున్నాయి. నగరాల్లో ఒకవైపు కాలుష్యం పెరగడం, మరోవైపు ఆహారంలో పోషక విలువలు తగ్గడంతో వ్యాధుల తీవ్రత పెరుగుతోంది. పేదల్లో పౌష్టికాహార లోపం తీవ్రంగా ఉంది. పౌష్టికాహార లోపం వల్ల మన దేశంలో టిబిని అరికట్టలేకపోతున్నాం. పేదవారికి ఆకలి జబ్బు, ఉన్నవారికి అరగని జబ్బు సమాజంలో ఆరోగ్యంపై ప్రభావం చూపు తున్నాయి. సరైన ఆహారం, వ్యాయామం ద్వారా వ్యాధులు రాకుండా అరికట్టవచ్చు. మందుల ద్వారా రోగాలను నియం త్రించవచ్చు. కానీ మందులు మాత్రమే రోగాలను అరికట్ట లేవు. కాన్వెంట్ చదువులు, చైతన్య, నారాయణ కాలేజీల వంటి ప్రయివేటు విద్యా సంస్థల్లో ఆటస్థలాల్లేవు. వయస్సుకు తగిన వ్యాయామం శరీరానికి లేకుండాపోతోంది.
వైద్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి?
ఆరోగ్యం అభివృద్ధి చెందాలంటే మంచినీరు, మరుగుదొడ్లు, పౌష్టికాహారం తప్పనిసరిగా ప్రజలకు లభించాలి. రక్షిత మంచినీరు మన రాష్ట్రంలో 50 శాతం మందికి అందడం లేదు. మురికినీరు తాగి డయేరియా, కామెర్ల జబ్బులకు గురవుతున్నారు. ప్రతి సంవత్సరం ప్రపంచంలో 18 లక్షల మంది మరణిస్తున్నారు. మంచినీరు వ్యాపార వస్తువుగా మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం వాగ్దానం చేసిన ఎన్‌టిఆర్ సుజల స్రవంతి ప్రకటనలకే పరిమితమైంది. వాటర్ మిషన్ ప్రకటించినా రాష్ట్ర ప్రభుత్వం దీని అమలుకు చిత్తశుద్ధితో కృషి చేయడం లేదు. స్వచ్ఛ భారత్ పేరుతో మరుగుదొడ్లపై ఆర్భాటం కన్పిస్తోంది తప్ప నిర్మాణాల్లో పురోగతిలేదు. పబ్లిక్ మరుగుదొడ్లు కూడా ప్రజలకు అందుబాటులో లేవు. నిర్వహణలో లోపాలు తీవ్రంగా ఉన్నాయి. నిర్వహణ సక్రమంగా లేక, రన్నింగ్ వాటర్‌లేక కంపుకొడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్భాటంగా 55 లక్షల మరుగుదొడ్లు నిర్మించాలని ప్రకటిం చింది. 2016-17 నాటికి పది లక్షల మరుగుదొడ్లు నిర్మించా లనే లక్ష్యం పెట్టింది తప్ప నిధులు విడుదల చేయడంలేదు.
ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతంలో 65 శాతం మంది పౌష్టికాహార లోపానికి గురవుతున్నారు. సరళీకరణ విధానాల వల్ల ఆహార సబ్సిడీ క్రమేణా తగ్గుతోంది. ఎరువుల సబ్సిడీ తగ్గింపు వల్ల వ్యవసాయం మీద తీవ్ర ప్రభావం పడింది. కిరోసిన్, గ్యాస్ సబ్సిడీల తగ్గింపు వల్ల పేదరికాన్ని మరింత పెంచుతున్నారు. పేదలకు పౌష్టికాహారాన్ని సబ్సిడీతో అందించగలిగినప్పుడే అత్యధిక మంది పేదలు రోగాల బారినపడకుండా కాపాడబడతారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్య అభివృద్ధికి ప్రయివేటీకరణ సర్వరోగ నివారిణిగా భావిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని తొమ్మిది జిల్లాల్లో జిల్లా ఆస్పత్రులను ప్రయివేట్‌వారికి అప్పగించాలని నిర్ణయించింది. 193 అర్బన్ హెల్త్ సెంటర్లను కూడా అక్టోబర్ 2016 నుంచి ప్రయివేట్ వారికి అప్పగిస్తున్నది. వైద్య పరీక్ష కేంద్రాలను రాష్ట్రవ్యాప్తంగా మెడాల్ అనే తమిళనాడుకు చెందిన ప్రయివేట్ సంస్థకు ఇప్పటికే అప్పగించింది. వీటి నిర్వహణకు భారీగా నిధులు పెంచింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిధులు పెంచి, ప్రభుత్వ వైద్యాన్ని అభివృద్ధి చేయవచ్చు. కానీ ప్రభుత్వ ప్రయివేట్ పిచ్చి వల్ల ప్రయివేట్‌ను ప్రధాన మంత్రంగా జపిస్తున్నది. ప్రపంచంలో ఎక్కడా ప్రయివేటీకరణ వల్ల ప్రజల ఆరోగ్యం అభివృద్ధి కాలేదు. ఇప్పటికే ఎన్‌టిఆర్ ఆరోగ్యసేవ పేరుతో ప్రాథమిక వైద్య కేంద్రాలకు కేటాయించవలసిన నిధులు కార్పొరేట్ ఆస్పత్రులకు మళ్ళించింది. దీనివల్ల ప్రాథమిక వైద్యం పూర్తిగా దెబ్బతింటున్నది. ప్రాథమిక వైద్యాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రాథమిక వైద్య కేంద్రాల్లో డాక్టర్లు, సిబ్బందిని నియమించడం లేదు. సరైన మందులు సరాఫరా చేయడం లేదు. వైద్య పరీక్షలు చేసే పరికరాలు లేవు. అందువల్ల ప్రయివేట్ వైద్యం మీద సామాన్య ప్రజలు ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడింది. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్యం అందక మిగిలిన ప్రాంతాల కంటే హెచ్చు సంఖ్యలో చనిపోతున్నారు. ఇతర దేశాల కంటే భారత్‌లో ప్రజలు తమ వైద్య ఖర్చు కోసం అప్పులుచేసి ఎక్కువ చేతి డబ్బులు పెట్టుకోవలసి వస్తున్నది. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మందుల కంపెనీల దోపిడీ బాగా పెరిగింది. 76 రకాల ప్రాణాంతక మందులపై గతంలో ఉన్న కస్టమ్స్ పన్ను మినహాయింపు బిజెపి ప్రభుత్వం విరమించింది. దీనివల్ల మందులపై 22 శాతం పన్నులు పెరుగుతున్నాయి. జనరిక్ మందులు అందుబాటులోకి తీసుకొస్తామన్న ప్రభుత్వ ప్రకటనలు అమలుకాలేదు. కిడ్నీ వ్యాధులకు ప్రతి జిల్లాలో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో చెప్పింది అమలుకాలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వీడి ప్రభుత్వ వైద్యరంగాన్ని బలోపేతం చేసినప్పుడే ప్రజారోగ్యాన్ని కాపాడుకోగలం.
- సిహెచ్ నరసింగరావు. (వ్యాసకర్త సిపియం ఎపి ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర కమిటీ కన్వీనర్)

No comments:
Post a Comment