- వేలం నుంచి తప్పుకున్న కంపెనీ
ముంబై : విజయ్ మాల్యా నుంచి రావలసిన బకాయిలు వసూలు చేసుకోవడంలో సర్వీస్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కూ చుక్కలు కనిపిస్తున్నాయి. మాల్యా నుంచి స్వాధీనం చేసుకున్న లగ్జరీ విమానాన్ని అమ్మి సొమ్ములు రాబట్టుకోవడం కూడా ఈ శాఖకు కష్టంగా మారింది. ఎవరైనా ముందుకొచ్చినా కనీస రిజర్వు ధర చెల్లించేందుకు కూడా ముందుకు రావడం లేదు. గత నెల 18న జరిగిన వేలంలో మాల్యా ఉపయోగించిన ఎయిర్‌బస్ ఎ 319 విమానం కోసం ఎస్‌జిఐ కామెక్స్ అనే కంపెనీ రూ.27.39 కోట్లకు కొనేందుకు బిడ్ వేసింది. రూ.152 కోట్ల కనీస ధర నిర్ణయిస్తే మరీ ఇంత తక్కువా? అని సర్వీస్ టాక్స్ డిపార్ట్‌మెంట్ నో చెప్పింది. దీంతో బిడ్డింగ్ నుంచి తప్పుకునేందుకు అనుమతించాలని కంపెనీ ముంబై హైకోర్టును ఆశ్రయించింది. సోమవారం ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మాల్యా లగ్జరీ విమానాన్ని మళ్లీ వేలం వేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. అపుడైనా ఎవరైనా సర్వీస్ టాక్స్ డిపార్ట్‌మెంట్ ఆశిస్తున్న ధర పెట్టి కొనేందుకు ముందుకు వస్తారా? అనేది అనుమానమే అంటున్నారు నిపుణులు.
డిఆర్‌టి మధ్యంతర ఉత్తర్వులు
మరోవైపు బెంగుళూరులోని డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డిఆర్‌టి) కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించి మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయబోతోంది. 2005లో కిం గ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు విమానాల సరఫరా కో సం ఎయిర్‌బస్ కంపెనీకి చెల్లించిన రూ.196 కోట్ల బకాయిల వసూలు కోసం ఒబిసి, కార్పొరేషన్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా డిఆర్‌టిని ఆశ్రయించాయి. ఈ మొత్తా న్ని ఇండిగో, గోఎయిర్ సంస్థలు ఎయిర్‌బస్ సంస్థకు చెల్లించాల్సిన బకాయిల నుంచి మినహాయించి తమకు చెల్లించేలా ఆదేశించాలని కోరాయి. ఈ కేసుకు సంబంధించి తీవ్ర ఒత్తిడి ఉన్నందున మంగళవారం దీనిపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తానని ట్రిబ్యునల్ ప్రిసైడింగ్ అధికారి కె శ్రీనివాసన్ ప్రకటించారు.
No comments:
Post a Comment