జలశ్రీ సర్వే సత్వరం పూర్తి చేయాలి: పీడీ
నెల్లూరు(సంక్షేమం), న్యూస్‌టుడే: ఎన్టీఆర్ జలశ్రీ కింద బోర్ల ఏర్పాటుకు భూగర్భ జల శాఖ సర్వేలను త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా డ్వామా పి.డి. హరిత పేర్కొన్నారు. నెల్లూరు డ్వామా కార్యాలయంలో భూగర్భజలశాఖ అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాకు 15249 బోర్లు మంజూరయ్యాయని, ఎం.పి.డి.ఒ.లు అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలన్నారు. ఉపాధి హామీ సిబ్బంది సమన్వయంతో బోర్ల కోసం కొత్త దరఖాస్తులు మీ సేవా ద్వారా తీసుకోవాలన్నారు. అర్హులైన రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో భూగర్భజలశాఖ ఉప సంచాలకులు రమేష్, అడిషనల్ పి.డి. ప్రభాకర్, జియాలిజిస్టులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment