అంబానీ, అదానీ, టాటాలకే తప్ప దళితులకు, పేదలకు భూములివ్వరా?
-మీడియా ఇంటర్వ్యూలో జిగేశ్ మేవానీ
''మీరు మాకో 'ఉనా'నిస్తే.... 'ఉనా' మాకో 'జిగేశ్'నిచ్చింది....'' ఇదీ ఇప్పుడు గుజరాత్ దళితుల మాట! ఔను... చరిత్రను ప్రజలే నిర్మిస్తారు, కొందరు వ్యక్తులు కాదు. కానీ ఆయా చారిత్రక సన్నివేశాల్లో వ్యక్తులు నిరాకరించ వీలులేని తమవైౖన ముద్రలు వేస్తుంటారు.ఉనాలో చనిపోయిన ఆవు చర్మం వొలుస్తున్న దళిత యువకులను పట్టుకొని వాహనానికి కట్టేసి ఈడ్చుకెళ్లి ఒంటిపై చర్మం వూడిపోయేలా కొట్టిన దారుణ సంఘటన పై దళిత్ శోషణ్ మంచ్, దళిత సంఘాలు, ప్రజా సంఘాలన్నీ కలిసి ఉద్యమించాయి.
ఉనా ఉద్యమం నుంచి వెలుగులోకి వచ్చాడు రాష్ట్రీయ దళిత్ అధికార్ మంచ్ నాయకుడు మెవానీ. దళితులకు ఐదెకరాల భూమి కావాలన్నది ఆయన డిమాండ్. ప్రజా ఉద్యమ నేతలందరూ సాధారణంగా ఎదుర్కొనే రాజ్య నిర్బంధం ఇప్పుడు ఆయననూ 'పలకరిస్తోంది'. ఇప్పటికే ప్రభుత్వం పలుమార్లు అతన్ని అరెస్టు చేసి విడుదల చేసింది. ఈ నేపథ్యంలో, ఆయన 'ద హిందూ' పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ ఉద్యమ విశిష్టతకు సంబంధించిన పలు పార్శ్వాలను విశ్లేషించారు. ఆ విశేషాలు...
భూమిలేని ప్రతి దళిత కుటుంబానికీ ఐదెకరాల భూమి ఇవ్వాలని మీ ఉద్యమం ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. ఇది ఏ మేరకు వాస్తవికమైందని మీరనుకుంటున్నారు? అంత భూమి ఎక్కడి నుంచి వస్తుంది?
ప్రతి జిల్లాలోనూ, తాలూకాలోనూ ప్రభుత్వానికి చెందిన బంజరు భూములు చాలా వున్నాయి. వాటిని పంచవచ్చు. గుజరాత్ భూ సీలింగ్ చట్టాన్ని అమలు చేయడం ద్వారా వేలాది ఎకరాల భూములు లభ్యమవుతాయి. అట్లాగే ఎస్‌సీ/ఎస్‌టీ సబ్‌ప్లాన్‌లో ఒక నిబంధన ఉంది. భూమి లేనివారి కోసం ప్రభుత్వం భూముల్ని కొని ఇవ్వవచ్చు. టాటాలకు, అంబానీలకు, అదానీలకు, ఎస్‌ఈజెడ్‌లకు భూములు దొరుకుతాయి. దళితులకు, ఆదివాసీలకు, ఓబీసీలకు ఇచ్చేందుకు భూమి ఎందుకు దొరకదు? రాజకీయ సంకల్పం ఉంటే ఇది కచ్చితంగా సాధ్యమే.
కార్పొరేట్ సంస్థలకు భూములివ్వడం వల్ల ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. అందరికీ లాభం కలుగుతుంది. దళితులకు ఐదెకరాల బంజరు భూమినివ్వడం వల్ల లాభమేంటి?
భూసంస్కరణలు ప్రథమ పంచవర్ష ప్రణాళికలో భాగం. దేశాన్ని మరింత సమసమాజంగా మార్చడం, పేదల, భూమిలేని నిరుపేదల బతుకుల్లో వెలుగురేఖలు ప్రసరింపజేయడం దాని లక్ష్యం. దేశ జనాభాలో అత్యధికులు నేటికీ బతుకుదెరువు కోసం వ్యవసాయంపైనే ఆధారపడి వున్నారు. భూసంస్కరణలపై ఆధారపడిన ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా కావాలని మేం కోరుతున్నాం. భూమిని దానిపై శ్రమించేవారికి, అంటే దున్నేవారికి భూమిని పున్ణపంపిణీ చేయడం ద్వారా ఉత్పాదకతనూ, సంపద వృద్ధినీ సాధించవచ్చు.
సెప్టెంబర్ 16న మీరు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు తిరిగి రాగానే మిమ్మల్ని ఎందుకు అరెస్టు చేశారు?
నా అరెస్టు గుజరాత్ మోడల్‌కు, ఇక్కడ సాగే పాలనా తీరుకు మచ్చుతునక. దళితుల ఆందోళనతో గుజరాత్ ప్రభుత్వం ఎంతగా కలవరపడుతున్నదో దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు.
మీ అంచనా ప్రకారం దళిత రాజకీయాలు నేడు ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు ఏమిటి?
అది 'మనువాద్ ముర్దాబాద్' వంటి నినాదాల దగ్గరే ఎక్కడో తచ్చాడుతూ ఉండిపోయినట్టు నాకనిపిస్తుంది. దళిత రాజకీయాలు ఈ తరహా నినాదాల పరిధిని దాటి ముందుకు పోవాల్సింది. కానీ అవి అస్తిత్వవాద రాజకీయాల్లోనే కూరుకుపోయాయి. అస్తిత్వవాద రాజకీయాలనూ, భౌతిక (మెటీరియల్) రాజకీయాలతో మిళితం చేయడం అంటే సామాజిక న్యాయంతో పాటు ఆర్థిక న్యాయం కోసం కూడా పోరాడడమన్న మాట. సమిష్టి అభివృద్ధికన్నా వ్యక్తిగత పురోగతికే పెద్ద పీట వేస్తారనేది దళిత రాజకీయాలపె తరచూ వస్తున్న విమర్శ. దళితులెవరైనా అధికార పీఠానికి చేరుకుంటే చాలు దళితులు తమకు ప్రాతినిధ్యం లభించిందని సంతోషపడిపోతారు. కానీ జరుగుతున్నదేమిటంటే, వ్యక్తులుగా కొందరు దళితులకు లాభం జరిగినంత మాత్రాన మొత్తంగా దళిత సముదాయానికి భౌతిక ప్రయోజనమేదీ చేకూరడం లేదు.నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. పేదల, భూమిలేని నిరుపేదలకు సంబంధించిన రాజకీయాలెప్పుడూ విడివిడి వ్యక్తుల రాజకీయాలుగా ఉండలేవు. అవి ఎవరో ఒక నేత చుట్టూ తిరిగే రాజకీయాలుగా సాగలేవు. తప్పనిసరిగా అవి సమిష్టి రాజకీయాలే అయి ఉండాలి. దళిత కార్యకర్తలు లేదా దళిత రాజకీయ నేతలెవరైనా అధికార స్థానాలకు ఎన్నికయినట్టయితే, వారు తమ స్వప్రయోజనాలను నెరవేర్చుకోవడంపైనే ఎక్కువ ఆసక్తి చూపడం మనం చాలా ఏళ్లుగా చూస్తున్నదే. కానీ ఇప్పుడు దళితులు ప్రజా ఉద్యమాలు, సమష్టి కృషి ద్వారానే విజయం సాధించగలమనే విషయాన్ని అర్థం చేసుకునే క్రమం ఆరంభమైంది. తమ ప్రయోజనాలను తమ రాజకీయ ప్రతినిధులే ఆటోమెటిక్‌గా నెరవేరుస్తారని వారిప్పుడు ఆశించడం లేదు.
వామపక్షాల (లెఫ్ట్) పట్ల అనుసరించాల్సిన వైఖరి విషయంలో దళిత రాజకీయ శక్తులలో భిన్నాభిప్రాయాలున్నట్టు కనిపిస్తున్నాయి. కుల సమీకరణను వామపక్షాలు ఎల్లప్పుడూ నిర్లక్ష్యం చేశాయని అంబేద్కరైట్లలో ఒక సెక్షన్ బలంగా అభిప్రాయపడుతోంది. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి?
వామపక్షాలు కచ్చితంగా మిత్రపక్షాలేనని నా అభిప్రాయం. అసలిది వామపక్షాలు దళితులలో చేరడం లేదా దళితులు వామపక్షాల్లో చేరడానికి సంబంధించిన విషయం కాదు. ఇది దళితులు వామపక్షంగా మారడానికి సంబంధించిన అంశం. అంటే వర్గ పోరాటాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడమని నా అభిప్రాయం. మనం వర్గరహిత సమాజాన్ని నిర్మించలేకపోయినా, కనీసం ప్రస్తుతం సమాజం కన్నా అంతరాలు తక్కువగా ఉండే సమాజాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి. 'ఆవు తోకను నువ్వే ఉంచుకో, మా భూమిని మాకిచ్చెరు' అనే నినాదం ద్వారా మేం సంఫ్‌ు పరివారపు మతతత్వ, విచ్ఛిన్నకర అజెండాను తోసిపుచ్చుతున్నాం. దళిత ఉద్యమంలో భాగంగానే భౌతిక అంశాలను లేవనెత్తుతున్నాం. కావాలనుకుంటే మీరు దీన్ని వామపక్ష దృక్పథంగా పిలవొచ్చు.
నిజమే, చారిత్రకంగా చూసినప్పుడు భారతదేశంలో వామపక్షాలు పొరపాట్లు చేశాయి. అంబేద్కరైట్ రాజకీయాలు కూడా పెద్ద పొరపాట్లు చేశాయి. మేం వామపక్షాల పొరపాట్లనూ, లోపాలనూ విమర్శిస్తాం. అయితే వారు మా ఉద్యమంలో భాగం కావడానికి ముందుకొస్తే వారిని వద్దని ఆపబోం. ఏ రాజకీయ ఉద్యమానికైనా కనీసం ఈ మాత్రం స్పష్టత తప్పక ఉండాలి. మాకది ఉంది. వామపక్షాలు ఎంత ఎక్కువ నిలకడగా, సీరియస్‌గా దళితుల సమస్యలను లేవనెత్తితే, దళితులు వామపక్షాలను అంత ఎక్కువగా విశ్వసిస్తారు.
మీరు చాలా సార్లు దళిత-ముస్లిం ఐక్యతకున్న ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. అదంత సులువైందేమీ కాదుగా?
ఔను. రాజకీయంగా ఇదొక క్లిష్టమైన పని అని నాకు తెలుసు. కానీ కనీసం దాన్నో ఆలోచనగానైనా సరే ముందుంచగలిగితే, తప్పనిసరిగా ఏదో మేరకు ఫలితం వస్తుంది. 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లలో దళితులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో కానప్పటికీ వారు పాల్గొన్నారు. ఒక దళితుడిగా అందుకు నేను సిగ్గుతో తలవంచుకుంటున్నా. దళితుల కాషాయీకరణను కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రక్రియను అడ్డుకోవాలన్నా దళిత-ముస్లిం ఐక్యత అనే రాజకీయ ప్రాజెక్టు అవసరమైందే. ఇది ముస్లింల, దళితుల ఇద్దరి ప్రయోజనాలకూ అవసరమైందే. నేనోసారి సభలో మాట్లాడుతూ, నాకు ఇద్దరు చెల్లెండ్లు ఉండి ఉంటే ఒకరిని వాల్మీకీ సముదాయంలోకి, మరొకరిని ముస్లింల ఇంటికి ఇచ్చికి పెళ్లి జరిపించాలని ఆశించేవాడినని చెప్పాను. దళితుల్లో కులాంతర, మతాంతర వివాహాలు సాధారణం కావాలి. ఇప్పుడు ఇదంతా ఊహాజనితంగా అనిపించవచ్చు కానీ ఏదో ఒక రోజున వాస్తవంగా మారుతుందని నా నమ్మకం.
దళితులు సంఫ్‌ు పరివార్‌లో చేరడాన్ని మీరెలా చూస్తారు?
క్షమించండి, అటువంటి తెలివిమాలిన పనుల గురించి నేను వివరించలేను.
మీ భవిష్యత్ పథకాలేమిటి?
మేం గుజరాత్‌లోనూ, గుజరాత్ వెలుపల కూడా ఆర్‌ఎస్‌ఎస్ వ్యతిరేక రాజకీయాలను అభివృద్ధి చేయాలనుకుంటున్నామనేది తేటతెల్లం. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. సెప్టెంబర్ 27న మేం గుజరాత్‌లో ఒక పెద్ద ప్రదర్శన నిర్వహించబోతున్నాం. సంఫ్‌ు పరివార్, బిజెపిలకు వ్యతిరేకంగా ఒక విశాల కూటమిని ఏర్పాటు చేసేందుకు ఓబీసీలు, ఆదివాసీలు, ముస్లింలు, రైతులు, ట్రేడ్ యూనియనిస్టులు అందరూ ఒక వేదికపైకి రాబోతున్నారు. గుజరాత్ మోడల్‌ను బట్టబయలు చేసేందుకు మేం సాంస్కృతిక, భౌతిక అంశాలను లేవనెత్తుతాం. భూమిలేని దళితులకూ, ఆదివాసులందరికీ 5 ఎకరాల భూమి ఇవ్వాలనే డిమాండ్‌తో నరేంద్రమోడీ నియోజకవర్గమైన అహ్మదాబాద్‌లోని మణినగర్‌లో అక్టోబర్ 1న రైల్ రోకో నిర్వహించబోతున్నాం.

No comments:
Post a Comment