Tuesday, September 27, 2016

కార్మికులను దోచుకుంటున్నారు

Sakshi | Updated: September 25, 2016 23:16 (IST)
కార్మికులను దోచుకుంటున్నారు
 
  • సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి గఫూర్‌
గూడూరు : ఆంధ్రాలో టీడీపీ, తెలంగాణాలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు కార్మికుల శ్రమను దోచుకుని పెట్టుబడిదారి వర్గాలకు కొమ్ముకాస్తున్నాయని సీఐటీయూ ఏపీ జనరల్‌ సెక్రటరీ ఎంఏ గఫూర్‌ అన్నారు. గూడూరు రూరల్‌ పరిధిలోని చెన్నూరులోని శ్రీ కటాలమ్మ దేవాలయ కల్యాణమండపంలో అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం 32వ మహాసభలు ఆదివారం ప్రారంభమయ్యాయి. గఫూర్‌ మాట్లాడుతూ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేమంటున్న టీడీపీ ప్రభుత్వం 2015– 16 సంవత్సరాల్లో కార్పొరేట్‌ వర్గాలకు పన్ను రాయితీ రూ.లక్ష కోట్లకు పైగా ఇవ్వడం జరిగిందన్నారు. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ది సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ సెక్రటరీ జనరల్‌ ఎం.కష్ణన్‌ మాట్లాడుతూ తపాలా శాఖలో ఇప్పటివరకు పోరాటాల్లో పోస్టుమన్, ఎంటీఎస్‌ల పాత్రే కీలకమన్నారు. సమావేశంలో పోస్టుమన్, ఎంటీఎస్‌ ప్రధాన కార్యదర్శి సీతాలక్ష్మి, పోస్టుమన్‌ ఎంప్లాయీస్‌ అసిస్టెంట్‌ జనరల్‌ సెక్రటరీ కె.చంద్రశేఖర్, హుమయున్, ప్రసాద్, విద్యాసాగర్, సంఘం డివిజనల్‌ కార్యదర్శి సుధాకర్, పురుషోత్తం పాల్గొన్నారు. 

No comments:

Post a Comment