Wednesday, September 14, 2016

ఎన్‌టిఆర్‌ వైద్యసేవల పేరుతో మెడాల్‌ సంస్థకు ప్రభుత్వం అప్పనంగా దోచిపెడుతోంది. ప్రభుత్వ ల్యాబ్‌లను నిర్వీర్యం చేస్తోంది. ప్రభుత్వాస్పత్రుల్లోని రోగులకు రక్త, మూత్ర పరీక్షలు నిర్వహించేందుకు మెడాల్‌ సంస్థకు ప్రభుత్వం నెలకు సుమారు రూ.16 కోట్ల వరకూ చెల్లిస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ పరీక్షలను ప్రభుత్వమే నిర్వహిస్తే రూ.ఆరు కోట్లలోపే ఖర్చవుతుందని ఉద్యోగ సంఘాలంటున్నాయి. మెడాల్‌ సంస్థ ఇస్తోన్న రక్తపరీక్షల రిపోర్టుల్లో తేడాలుంటున్నాయనే విమర్శలూ ఉన్నాయి. రిపోర్టులు ఇవ్వడంలోనూ జాప్యం జరుగుతుండటంతో రోగులు ఇబ్బంది పడాల్సి వస్తోంది.

No comments:

Post a Comment