ఆధిపత్యం కోసమే 'అణు' దాడి
Posted On Wed 05 Aug 22:35:32.849057 2015
- హిరోషిమాపై అమెరికా అణు బాంబు దాడికి 70 ఏళ్ళు
ఆగస్టు ఆరు, తొమ్మిదితో జపానులోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అణు బాంబుల దాడి జరిగి డెబ్బై ఏళ్ళు పూర్తవుతాయి. ఇంతవరకు సాధారణంగా మనకు చెబుతూ వస్తున్నది, మనకు తెలిసినది, మన పాఠ్య పుస్తకాలు చెప్పేవి ఏమిటంటే అమెరికా జరిపిన అణు బాంబుల దాడుల వల్లనే జపాను యుద్ధ విరమణ చేసి మిత్ర రాజ్యాలకు లొంగిపోయింది. ఆ విధంగా రెండవ ప్రపంచయుద్ధం పరిసమాప్తమైంది. అప్పటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమాన్ మొదటి బాంబును హిరోషిమాపై వేసిన తర్వాత మాట్లాడుతూ ''అది ఒక అణు బాంబు. దానిని ప్రయోగించడం చరిత్రలో ఒక గొప్ప విషయం'' అని వర్ణించాడు. ఆ తరువాత మాట్లాడుతూ ''హిరోషిమా, నాగసాకి సాధారణ పౌరులపై అణు బాంబులు వేయకుండా ఉండే ప్రత్యామ్నాయాలు ఏవీ అమెరికాకు లేకున్నాయి. వాటిని గనక వేయకుండా ఉండినట్లయితే ఉన్మాద జపనీయులు లొంగిపోయి ఉండేవారు కాదు. జపాన్ దీవులను అధీనంలోకి తీసుకునే ప్రయత్నంలో లక్షల కొలది అమెరికా వీర సైనికులు ప్రాణత్యాగం చేయవలసి వచ్చేది'' అని అన్నాడు. కనుక అణు బాంబు దాడులు సరైనవే అని ట్రూమన్ ప్రపంచం ముందు సమర్థించుకున్నాడు.
కానీ ఇవి చారిత్రక వాస్తవాలు కావు. అణు బాంబుల దాడికి, రెండవ ప్రపంచ యుద్ధం ముగియడానికి ఎటువంటి సంబంధం లేదు! అణు బాంబుల దాడులను అమెరికా ఉద్దేశపూర్వకంగానే చేసింది. దాని వెనుక రాజకీయాలు వేరే ఉన్నాయనే అంశాలు ఇప్పుడు మనం కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరముంది. ఆ మేరకు చరిత్ర, ఇతర పాఠ్యపుస్తకాలలో సవరణలు చేసి వాస్తవ చరిత్రను ముందు తరాలకు అందించాల్సిన అవసరముంది. ఇటీవలి కాలం వరకు అత్యంత గోప్యంగా ఉంచబడిన రెండవ ప్రపంచ యుద్ధం నాటి నిర్ణయాలకు సంబంధించిన పలు కీలక దస్తావేజులు నేడు సులభంగా ఇంటర్నెట్‌లో లభ్యమౌతున్నాయి. వీటిలోని చారిత్రక సత్యాల ద్వారా హిరోషిమా, నాగసాకి అణు బాంబు దాడుల చరిత్రను కొత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరముంది.
అణుబాంబును రూపొందించే ప్రక్రియ అమెరికాలో 1942లో అత్యంత గోప్యంగా మొదలైంది. జర్మనీలో నాజీలు అణు బాంబును రూపొందిస్తున్నారని, అది ప్రపంచానికి అత్యంత ప్రమాదకరమని, దాన్ని వారు రెండవ ప్రపంచ యుద్ధంలో వాడబోతున్నారని, దాని వల్ల మిత్ర రాజ్యాలు ఓటమి పాలయ్యే అవకాశాలు ఉండవచ్చునని చెప్పారు. కావున నాజీ జర్మనీని ఎదుర్కోవాలంటే అమెరికా కూడా అణుబాంబును తయారుచేయాలని బయటి ప్రపంచానికి నమ్మబలికారు. కానీ ప్రముఖ అమెరికా రచయిత మికిజడ్ (మిఖాయెల్ జేజిమ) ఇటీవల ఒక వ్యాసంలో అసలు నాజీ అణు బాంబు అనేదే ఒక బూటకమని తేల్చేశారు. 1945 ఏప్రిల్ 30న హిట్లర్ తన మిలిటరీ బంకర్లోనే ఆత్మహత్య చేసుకోవడంతో జర్మనీ ఓటమీ మరింత ప్రస్ఫుటమైంది. దీనితో నాజీ జర్మనీ అణు బాంబు భయం కూడా తేటతెల్లమైంది. అనుకున్న భయం తొలగిపోయిన తర్వాత అణు బాంబు కార్యక్రమం కొనసాగించ వలసిన అవసరం లేకున్నా అమెరికా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకు పోయింది. అమెరికా ఎలాగైనా నూతన బాంబును తయారుచేసి దానిని ప్రయోగించి ప్రపంచానికి, ముఖ్యంగా అప్పటి సోవియట్ యూనియన్‌కు తన మేటి సైనిక సత్తాను ప్రదర్శించి ఒక ముందస్తు హెచ్చరిక జారీ చేయాలనుకుంది. జపాన్ లొంగుబాటు తథ్యమని తెలిసినా ఆ దేశంపై బాంబు దాడికి ముందుకెళ్ళింది. తొలుత ప్రధాన లక్ష్యం క్యోటో నగరంగా ఉంది. అయితే ఆ నగరంపై పూర్తిగా దట్టమైన మేఘాలు అలముకొని ఉండటంతో రెండవ లక్ష్యమైన హిరోషిమాపై ఆగస్టు 6న అణు బాంబును ప్రయోగించారు. దాంతో ఆగకుండా మూడవ రోజు తరువాత ఆగస్టు 9న మరో బాంబు నాగసాకిపై ఎందుకు ప్రయోగించ వలసి వచ్చింది? కారణం జపాన్‌ను దారికి తీసుకు రావడమో, యుద్ధాన్ని అంతమొందించడమో అనుకుంటే పొరబాటే అవుతుంది. అమెరికా అంతకు ముందే తీసుకున్న నిర్ణయం ప్రకారం రెండు వేరు వేరు రకాల రసాయనాలతో రూపొందించిన అణు బాంబులను వాస్తవ పరిస్థితులలో ప్రయోగించి వాటి శక్తి సామర్థ్యాలను అంచనా వేయడం, రెండింటి ప్రభావాలను తులనాత్మకంగా అధ్యనం చేయడమే. అందుకు ముగింపుకు చేరుకున్న రెండవ ప్రపంచ యుద్ధ కాలాన్ని ఆసరాగా తీసుకుని, ప్రయోగశాలగా జపాన్ భూభాగాన్ని, ప్రయోగ వస్తువులుగా జపాన్ ప్రజలను వ్యూహాత్మకంగా వాడుకోవడం అమెరికా ప్రధాన ఉద్దేశం. హిరోషిమా బాంబు యురేనియం-235 ద్వారా ఒక సులభమైన కెమికల్ డిజైన్‌తో తయారు చేశారు. దానికి భిన్నంగా నాగసాకిపై వేసిన బాంబును ప్లూటోనియం-239 ద్వారా అత్యంత సంక్లిష్టమైన కెమికల్ డిజైనుతో రూపొందించారు. హిరోషిమా బాంబుతో యురేనియం-235 బాంబు పాటవం, ప్రభావం ఏమిటో తెలిసింది. మరింత శక్తివంతమైన ప్లూటోనియం-239 పాటవం, ప్రభావం ఏమిటో తెలియాలి కదా? అందుకని అమెరికా నాగసాకిపై మరో బాంబు ప్రయోగించింది. నిజానికి రెండవ అణు బాంబు ప్రయోగానికి ఎంచుకున్న మొదటి టార్గెట్ కొకూర. అక్కడ కూడా క్యోటో వలెనే పొగమంచుతో సాధ్యం కాలేదు. ఈ లోపు విమాన ఇంధనం తగ్గుతుండటంతో సమీపంలోని నాగసాకి నగరంపై జార విడిచారు. నిజానికి ఇది హిరోషిమా బాంబు కంటే ఎక్కువ శక్తివంతమైంది. దీని ప్రభావం ఎక్కువగా ఉరకామి లోయల పర్వతాల వైపు వ్యాపించడంతో హిరోషిమాతో పోలిస్తే కొంత తక్కువ ప్రాణ నష్టం జరిగింది.
నేడు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మరో నాలుగు అణు బాంబుల దాడులకు అమెరికా అధ్యక్షుని అనుమతితో సైన్యం సన్నాహాలు చేసినట్టు తెలుస్తోంది. మూడవ దాడికి ఆగస్టు 19వ తేదీని ఖరారు కూడా చేసింది. మిగతా దాడులు సెప్టెంబర్ మాసంలో చేయడానికి నిర్ణయించుకుంది. అయితే ఆ అణు బాంబు దాడుల ప్రణాళికను ఉపసంహరించు కోవడంతో జపాన్‌లో అణు బాంబుల ఘోరకలి అంతటితో ఆగింది. కావున ఇప్పుడు లభ్యమౌతున్న హిరోషిమా, నాగసాకి అణు బాంబు ఘటనల సమాచారం ప్రకారం అణు బాంబుల ప్రయోగం అమెరికా హవాయి దీవులలోని పెర్ల్ హార్బర్‌పై 1941 డిసెంబర్ 7న జరిగిన జపాన్ దాడులకు ప్రతీకారంగానో, జపాన్‌ను దారికి తెచ్చి రెండవ ప్రపంచ యుద్ధం ముగించడానికో కాదు. అసలు కారణాలు ప్రబలంగా ముందుకొస్తున్న సోవియట్ యూనియన్‌ను తన నూతన అణు బాంబుల శక్తిని నిరూపించి కట్టడి చేయడం, ప్రచ్ఛన్నయుద్ధం వైపు దానిని ఉసిగొల్పడం, రెండవ ప్రపంచ యుద్ధానంతరం అమెరికాయే ప్రపంచ సైనిక శక్తి అని ప్రపంచానికి చాటి చెప్పడం, తద్వారా ప్రపంచ రాజకీయాలలో తన ఆధిపత్యాన్ని కొనసాగించడం, తన రాజకీయ, ఆర్థిక, ఇతరత్రా ఆసక్తులను కాపాడు కోవడమే.
కానీ నేడు సోవియట్ యూనియన్ లేదు. రెండవ ప్రపంచ యుద్ధ కాలం నుంచి మొదలైన ప్రచ్ఛన్న యుద్ధమూ అంతరించింది. అయినా ప్రపంచానికి అణు బాంబుల ప్రమాదం పోలేదు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికాతో మొదలైన అణు బాంబులు తరువాత రష్యా, ఇంగ్లండు, ఫ్రాన్సు, చైనాలకు వ్యాప్తి చెందాయి. ప్రచ్ఛన్న యుద్ధం అంతరిస్తే వీటి సమస్య తీరి పోతుందని భావించిన శాంతికాముక శక్తులకు నిరాశే మిగిలింది. నేడు వినాశనకర అణు బాంబులు మరిన్ని దేశాలకు వ్యాప్తి చెందాయి. అన్ని దేశాలతో కలిపి నేడు మొత్తం 16,000 అణు బాంబులు ఉన్నాయని ఒక అంచనా. వీటిలో సింహభాగం (14,700) కేవలం రెండు దేశాలు-అమెరికా, రష్యాల వద్దనే ఉన్నాయి. వీటి మొత్తం శక్తిసామర్థ్యంతో పూర్తి ప్రపంచాన్ని ఒక్కసారి కాదు పలు మార్లు భస్మీ పటలం చేయవచ్చును. కావున నేడు ప్రపంచంలో ఎక్కువ శాతం శాంతిని కోరుతున్న రాజ్యాలు సైతం నిర్మాణ శక్తి కంటే విధ్వంస శక్తికే పోటీ పడాల్సి వస్తోంది.
(వ్యాసకర్త ఉస్మానియా విశ్వ విద్యాలయం ప్రొఫెసర్)
ప్రొఫెసర్
- ఎమ్ చెన్న బసవయ్య

Taags :
No comments:
Post a Comment