రైతు ఆత్మహత్యల లెక్కల తకరారు
Posted On Mon 10 Aug 23:08:32.129915 2015
దాదాపు మూడు లక్షల మందికి పైగా రైతులు 1995 నుంచి 2014 వరకూ గడిచిన రెండు దశాబ్దాల కాలంలో ఆత్మహత్యలు చేసుకున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే 2014 జాతీయ నేరగణాంకాల బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) లెక్కలు పరిశీలిస్తే ఈ ఆత్మహత్యల సంఖ్య గణనీ యంగా తగ్గటం మనకు కన్పిస్తుంది. 2014లోని గణాంకాలను, అంతకు ముందు 19 సంవత్సరాల వాటితో పోల్చుకుంటే గత ఏడాది రైతుల ఆత్మహత్యలు దాదాపు సగానికి సగం తగ్గిపోయాయి. 2013లో మొత్తం 11,772 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా 2014లో ఇది కేవలం 5,650గా నమోదయింది. ఈ తకరారుకు ప్రధాన కారణం నమోదు ప్రక్రియలో మారిన కొలబద్దలేనని చెప్పక తప్పదు. ఇప్పటి వరకూ ఆత్మహత్యల్లో 'ఇతరుల' కేటగిరీ తక్కువగా ఉండేది. మారిన కొలమానాల నేపథ్యంలో రైతుల ఆత్మహత్యలు తగ్గి 'ఇతరుల' ఆత్మహత్యల సంఖ్య భారీగా పెరిగిపోయింది. గత ఏడాది కాలంలో 323 మంది రైతుల ఆత్మహత్యలతో కర్నాటక దేశంలో రెండో స్థానంలో నిలిచింది. అంతకు ముందు ఏడాది నమోదైన 1,403తో పోల్చుకుంటే గత ఏడాది రైతుల ఆత్మహత్యలు భారీగా తగ్గిపోయినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇదే ఏడాది కాలంలో 'ఇతరుల' ఆత్మహత్యలు దాదాపు 245 శాతం మేర పెరిగాయి. దేశంలో రైతుల ఆత్మహత్యల్లో ముందంజలో ఉన్న ఐదు రాష్ట్రాల్లో సగటున 'ఇతరుల' ఆత్మహత్యలు 128 శాతం మేర పెరిగాయి. అంతేకాదు గత ఏడాది ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులను ఎన్‌సిఆర్‌బి నివేదిక 'వ్యవసాయ కార్మికుల' కేటగిరీలో చూపింది. అధికారికంగా రైతుల ఆత్మహత్యల తగ్గుదలకు ఇది కూడా మరో ప్రధాన కారణం. ఈ 'అధికారిక' గణాంకాలకు ఎటువంటి క్రమబద్ధత, పరిశీలనా లేదని ఎన్‌సిఆర్‌బి స్వయంగా అంగీకరిస్తుండటం విశేషం. ఇక మరో 12 రాష్ట్రాలు, ఆరు కేంద్రపాలిత ప్రాంతాలలో రైతుల ఆత్మహత్యలు పూర్తిగా నిలిచిపోయాయని ఎన్‌సిఆర్‌బి లెక్కలు తెలుపుతున్నాయి. ఇందులో బెంగాల్, రాజస్థాన్, బీహార్ వంటి మూడు పెద్ద వ్యవసాయ రాష్ట్రాలుండటం విశేషం. 2010లో ఇందుకు విరుద్ధంగా ఒక్క పెద్ద రాష్ట్రం కూడా ఆత్మహత్యలు నిలిచిపోయిన కేటగిరీలోకి రాకపోవటం గమనార్హం. కేవలం మూడు కేంద్ర పాలిత ప్రాంతాలకు మాత్రమే ఈ కేటగిరీలో స్థానం దక్కింది. 2014లో ఆత్మహత్యలు చేసుకున్న లక్షలాది మందిలో రైతులు కూడా ఉన్నారంటూ ఈ రాష్ట్రాలు ఇప్పుడు చేతులు దులుపుకుంటున్నాయి. 1995 నుంచి 2014 వరకూ జరిగిన రైతుల ఆత్మహత్యలు 3,02,116కు చేరినప్పటికీ మారిన పరిమితుల నేపథ్యంలో ఇవన్నీ నిరాశ, నిస్పృహలకు లోనైన వారు చేసుకున్న ఆత్మహత్యలేనని రాష్ట్రాలు తేల్చిచెబుతున్నాయి. ఈ పోలికలు, మార్పులు అన్నీ బూటక మని అనుకున్నా వ్యవసాయ సంబంధిత ఆత్మహత్యలు సగటున ఏడాదికి 12,336గా నమోదవుతున్నాయి. 2013లో నమోద యిన సంఖ్యకు ఇది కొంచెం ఎక్కువ కావటం విశేషం. రైతుల ఆత్మహత్యలకు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్(తెలంగాణాతో కలిపి), మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాలు 'బిగ్ 5'గాపేరు తెచ్చుకున్నాయి. దశాబ్ద కాలంలో దేశంలో జరిగిన ఆత్మహత్యల్లో మూడింట రెండొంతులు ఈ రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. ఇప్పుడు కొత్త లెక్కల ప్రకారం 2014లో రైతుల ఆత్మహత్యలు ఈ రాష్ట్రాలలో 90 శాతం మేర నమోద య్యాయి. వాస్తవానికి ఎన్‌సిఆర్‌బి అన్నది సమాచార సేకరణ యంత్రాంగం కాదు. రాష్ట్రాల నుంచి గణాంకాల రూపంలో అందే సమాచారాన్ని సంకలనం చేసి విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియలో సమాచార వక్రీకరణ 2011లో ఛత్తీస్‌గఢ్ నుంచే ప్రారంభమైంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం తన సొంతంగా సేకరించిన గణాంకాల ప్రకారం 2006-10 మధ్య కాలంలో ఏటా 1,555 రైతు ఆత్మహత్యలు నమోదయ్యాయి. అందరికీ ఆశ్చర్యం కలిగిస్తూ 2011లో ఈ సంఖ్య సున్నాగా నమోదయింది. 2012లో నాలుగు, మళ్లీ 2013లో సున్నా ఆత్మహత్యలు నమోదైనట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2012 నుంచి బెంగాల్, ఆ తరువాత ఇతర రాష్ట్రాలు కూడా ఇదే బాట పట్టాయి.
రాజకీయ ప్రభావం
రైతుల ఆత్మహత్యలు ఇప్పుడు రాజకీయంగా తీవ్ర ప్రభావాన్నే చూపుతున్నాయి. ఈ ఆత్మహత్యలు ఆయా రాజకీయ పార్టీల ప్రతిష్టను దెబ్బతీస్తుండటంతో ఆయా పార్టీల ఆధ్వర్యంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సంఖ్యను వీలైనంత తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆత్మహత్యల నమోదులో సొంత భూమి ఉన్న రైతులు, కాంట్రాక్ట్/కౌలు వ్యవసాయదారులు, వ్యవసాయ కార్మికులు వంటి కొత్త కేటగిరీలకు స్థానం కల్పిం చాయి. ఇది 'పునర్వర్గీకరణ' కాదని, కేవలం గత 19 ఏళ్ల వివరా లను విడిగా నమోదు చేసే ఏర్పాటు మాత్రమేనని ఎన్‌సిఆర్‌బి చెబుతోంది. 'వ్యవసాయంలో స్వయం ఉపాధి పొందుతున్న' వారు అన్న కేటగిరీలో రైతులను చేర్చారు. గతం లో ఎన్‌సిఆర్‌బి గణాంకాలలో 'స్వయం ఉపాధి పొందే వారి' వివరాలకు చోటు దక్కలేదు. ఇక వ్యవసాయ కార్మికులకు ఈ 'స్వయంఉపాధి' వర్గంలో స్థానం దక్కలేదు. వారు పని కోసం దేశవ్యాప్తంగా సంచరిస్తుంటారంటూ వారిని ఈ వర్గంలోకి చేర్చలేదు.
జిల్లాల్లో పరిస్థితి మరీ దారుణం
జిల్లా స్థాయిలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే అతడు రైతో, వ్యవసాయ దారుడో, కౌలు రైతో, భూ యజమానో, వ్యవసాయ కార్మికుడో తేల్చేది పోలీస్ స్టేషన్‌లోని ఒక సాధారణ కానిస్టేబుల్ మాత్రమే. సుశిక్షితుడైన ఒక సర్వేయర్‌కు ఇది కష్టసాధ్యమైన విషయం. తాము సేకరించే సమాచారం అంతా పోలీస్ స్టేషన్లలోని అధికారిక రికార్డుల ఆధారంగా సేకరించిందేనని ఎన్‌సిఆర్‌బి చెబుతోంది. అసహజ మరణాల సంఖ్యను జిల్లా స్థాయి క్రైమ్ రికార్డుల బ్యూరో(డిసిఆర్‌బి)లకు, తరువాత రాష్ట్ర స్థాయి బ్యూరోలకు పంపితే వారు అక్కడ క్రమబద్ధీకరించి జాతీయ బ్యూరోకు అందజేస్తారు. అయితే ఈ గణాంకాలు సేకరించే వారికి తాము వివిధ స్థాయిల్లో కఠోర శిక్షణ ఇస్తున్నామని ఎన్‌సిఆర్‌బి చెబుతోంది. కానీ వాస్తవంగా అదెక్కడా జరగటంలేదు. రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా నమోదవుతున్న మహారాష్ట్రలోని విదర్భ, కర్ణాటకలోని మాండ్యా వంటి ప్రాంతాలలో పోలీస్ స్టేషన్ల అధికారులను ఈ విషయమై ప్రశ్నించినపుడు వారు జవాబు చెప్పేందుకు తికమకపడ్డారు. ఆత్మహత్యల సమాచారాన్ని ఈ విధంగా సేకరించాలి, ఈ కేటగిరీల్లో నమోదు చెయ్యాలంటూ తమకు ఎటువంటి సర్క్యులర్లూ అందలేదని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెబుతున్నారు. ఇక తెలంగాణలో అయితే ఆత్మహత్యలను వర్గీకరించాల్సింది కానిస్టేబుల్ కాదని, అది తాసిల్దార్ పని అని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఎవరు రైతో, ఎవరు కాదో చెప్పాల్సింది రెవెన్యూ విభాగమేనని, ఆత్మహత్యను నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ కాపీని తాము తాసిల్దార్‌కు అందజేస్తామని ఆయన వివరించారు. అంటే ఆత్మహత్యల వర్గీకరణ కేవలం రెవెన్యూ విభాగం లేదా రాష్ట్ర స్థాయి నేర గణాంకాల బ్యూరోల పని అన్న విషయం స్పష్టమవుతోంది. ఇందులో ఎటువంటి సందేహం వచ్చినా ఆ కేసును 'ఇతరుల' కేటగిరీలో నమోదు చేస్తారు. రైతుల ఆత్మహత్యల్లో అధిక శాతం అధికారికంగా నమోదు కాకపోవటానికి ప్రధాన కారణాల్లో దీనిని కూడా చేర్చవచ్చు. ప్రస్తుతం రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్న కర్ణాటకలో కొత్త సమాచార వర్గీకరణ విధానంపై తమకు ఎటువంటి ఆదేశాలూ లేవని అక్కడి పోలీసు అధికారులు చెబుతున్నారు. ఇక మధ్యప్రదేశ్‌లో తమకు తెలిసినంత వరకూ ఇటువంటి సమాచారాన్ని సేకరించే బాధ్యతను క్షేత్రస్థాయిలో కానిస్టేబుల్‌కు అప్పగించిన దాఖలాలు లేవని అక్కడి పోలీసు అధికారులు చెబుతున్నారు. ఇటువంటి కారణాలతోనే ఎన్‌సిఆర్‌బి గణాంకాలు అయోమయానికి తావిస్తున్నాయన్నది నిష్టుర సత్యం. ఇక కౌలు రైతుల విషయం తీసుకుంటే వీరంతా ఇతరులకు చెందిన భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తారు. అంగీకరించిన కౌలు ప్రతిఫలాన్ని నగదు లేదా పంట రూపంలో యజమానులకు చెల్లిస్తారు. మనదేశంలో ఈ కౌలు ఒప్పందాలన్నీ కేవలం నోటి మాటగా చేసుకునేవే తప్ప అధికారికంగా నమోదు కావటం లేదు. ఇందువల్లే కౌలు రైతులు బ్యాంకు పరపతి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద రుణాలు తీసుకుని రుణభారంలో కూరుకుపోయి అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వీరికి ఇప్పటి వరకూ ఎక్కడా అధికారిక గుర్తింపు లభించలేదు. కౌలు రైతులను కూడా వ్యవసాయ కార్మికులతో సమానంగా పరిగణిస్తున్నారు. ఈ సమస్య ఎన్‌సిఆర్‌బికి కూడా తెలుసు. కేవలం అధికారికంగా కౌలు ఒప్పందాలను కుదుర్చుకున్న వారిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని సీనియర్ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రానికీ రాష్ట్రానికీ మారే ఈ కౌలు హక్కులపై సమగ్ర అధ్యయనం నిర్వహించాలన్న ఆలోచన ఎన్‌సిఆర్‌బికి ఇప్పటి వరకూ రాకపోవటం గమనార్హం. అందువల్లే కౌలు రైతులకు సంబంధించిన అధికారిక గణాంకాలు నమోదు కావటం లేదు. గత ఏడాది అనేక మంది కౌలు రైతులను వ్యవసాయ కార్మికుల పేరుతో ఎన్‌సిఆర్‌బి తప్పుడు వర్గీకరణ చేసిందని అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి చెప్పారు. కిసాన్ సభ ఒత్తిడితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2011లో కౌలు రైతులను అధికారికంగా గుర్తించేందుకు ఆంధ్రప్రదేశ్ లైసెన్స్‌డ్ కల్టివేటర్స్ యాక్ట్‌ను అమలులోకి తెచ్చింది. వీరికి బ్యాంకు రుణ సాయం అందేందుకు వీలుగా రుణ అర్హత కార్డులను కూడా జారీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని 32 లక్షల మంది కౌలు రైతుల్లో ఇప్పటికీ 90 శాతం మందికి ఈ కార్డులు అందలేదని మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం రైతుల్లో మూడో వంతు మంది కౌలు రైతులేనని కిసాన్‌సభ స్పష్టం చేస్తోంది. గత ఏడాది మొదటి ఏడు నెలల కాలంలో రాష్ట్రంలో నమోదైన రైతు ఆత్మహత్యల సంఖ్య ఎన్‌సిఆర్‌బి వార్షిక నమోదు కన్నా మించిపోయిందని కిసాన్ సభ వివరించింది.
ఇతరుల్లో 'ఇతరులు'
సాధారణంగా ఇతరులు అంటే ఏ వర్గానికీ చెందని వారన్న అర్థం స్ఫురిస్తుంది. ఈ పదానికి విస్తృత చరిత్ర ఉందని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో 1997-2000 మధ్య కాలంలో నమోదైన 1,061 ఆత్మహత్యలను ఆ జిల్లా నేరగణాంకాల బ్యూరో 'అనారోగ్యం' కేటగిరీలో నమోదు చేసింది. ఇందులో కూడా అధిక శాతం 'భరించలేని కడుపు నొప్పి' అన్న కారణంతో నమోదయ్యాయి. వాస్తవానికి ఇవన్నీ పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్న రైతులకు సంబంధించినవే. పురుగుల మందు తాగితే మరణానికి ముందు విపరీతమైన కడుపు నొప్పి వస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కారణాల వల్లే అనంతపురం జిల్లాలో ఈ మూడేళ్ల కాలంలో నమోదైన ఆత్మహత్యలన్నీ 'ఇతరులు', 'అనారోగ్య కారణాల'తో నమోదయ్యాయి. దీనితో పాటు మహిళా రైతుల ఆత్మహత్యలను పరిగణనలోకి తీసుకోకపోవటం కూడా 'అధికారిక రైతు ఆత్మహత్యల' తగ్గుదలకు మరో కారణం. సంప్రదాయకంగా మన సమాజం మహిళలను రైతులుగా పరిగణనలోకి తీసుకోదు. కొన్ని సందర్భాలలో మాత్రం భూ యాజమాన్య పత్రాలు, పట్టాలు వారిపేరుతో ఉంటాయి. ఫలితంగా 'గృహిణుల' కేటగిరీలో ఉన్న వీరు ఆత్మహత్యలు చేసుకున్నా రైతుల కేటగిరీలోకి రావటం లేదు. కొన్ని రాష్ట్రాల్లో మహిళల ఆత్మహత్యల్లో దాదాపు 70 శాతానికి పైగా 'గృహిణుల' ఆత్మహత్యలే ఉన్నాయి. ఇక రైతు ఆత్మహత్యల్లో ప్రాధాన్యత వహించే మరో అంశం కులం. దళితులు, ఆదివాసీలకు అరుదైన సందర్భాలలో మాత్రమే భూ యాజమాన్య హక్కులు ఉంటాయి. తరచుగా వారు 'ఆక్రమణదారుల' జాబితాలోనే కొనసాగుతుంటారు. ఈ కారణంగానే వారి ఆత్మహత్యలు అత్యంత అరుదుగా రైతుల ఆత్మహత్యలుగా నమోదవుతుంటాయి.
- పి సాయినాథ్
(హిందూ సౌజన్యంతో సంక్షిప్తానువాదం)

Taags :
No comments:
Post a Comment