నీటితో వాహనాలు ఎందుకు నడవవు?
Posted On Sat 01 Aug 22:27:52.745226 2015
వాహనాలు నడిచేపుడు వాటిలో యాంత్రికశక్తి (ఎవషష్ట్రaఅఱషaశ్రీ వఅవతీస్త్రy) ఉంటుంది. ఆగిన వాహనంలో ఈ యాంత్రిక శక్తి ఉండదు. మరోమాటలో చెప్పాలంటే వాహనాన్ని నడపడం అంటే మనం ఆ వాహనానికి యాంత్రికశక్తిని ఇచ్చినట్టే. మరి ఆ యాంత్రికశక్తి ఎక్కడి నుండి వచ్చింది? శక్తి ఏ రూపంలో ఉన్నా ఆ శక్తిని ఏమాత్రం శూన్యం నుంచి ఉత్పత్తి చేయలేము. లేదా ఉన్న శక్తిని ఏ సాధనం ద్వారా కూడా నశింపజేయలేము. మనం లేదా ప్రకృతి చేయగలిగిందల్లా ఒక రూపంలో ఉన్న శక్తిని మరో రూపంలోకి మార్చడమే. ఉదాహరణకు కరెంటును ఉపయోగించి బల్బును వెలిగిస్తున్నామనుకుందాం. అందులో విద్యుచ్ఛక్తి, కాంతిశక్తి, ఉష్ణశక్తిగా మారిందన్న మాట. లెక్కల్లో చెప్పాలంటే ఉదాహరణకు 100 ప్రమాణాల విద్యుచ్ఛక్తి ఖర్చయితే అందులో 40 ప్రమాణాలు మనకు వెలుగును ఇచ్చే కాంతిశక్తిగా, మరో 60 ప్రమాణాలు మనకు వేడినిచ్చే ఉష్ణశక్తిగా మారిందన్న మాట. అంతేగానీ, ఆ 100 ప్రమాణాల విద్యుచ్ఛక్తి ఏ 50 ప్రమాణాల కాంతిశక్తిగా, 70 ప్రమాణాల ఉష్ణశక్తి (వెరసి మొత్తం 120 ప్రమాణాలు) గా మారలేదు. లేదా ఆ 100 ప్రమాణాల విద్యుచ్ఛక్తి ఏ 30 ప్రమాణాల కాంతిశక్తిగా, 40 ప్రమాణాల ఉష్ణశక్తిగా (వెరసి మొత్తం 70 ప్రమాణాలు) గా మారదు.
వాహనాలు నడవాలంటే వాటికి అవసరమయిన యాంత్రికశక్తి కూడా ఎక్కడి నుంచైనా లక్ష్యం కావాలి. అది పెట్రోలు, డీజిల్ వంటి సాధానాలలో రసాయనికశక్తి మాత్రమే పెట్రోలును గాలిలోని ఆక్సిజన్‌తో కలిపి మండిస్తే అది చాలా త్వరితంగా మండి పెద్ద మొత్తంలో ఉష్ణశక్తి వెలువడుతుంది. ఈ ఉష్ణశక్తిని సరియైన పద్ధతిలో వాహనాలు ఇంజన్లో యాంత్రికశక్తిగా మార్చుకొని, వాహనాన్ని నడుపుతారు. కాబట్టి ఇంధన ద్రవాలయిన పెట్రోలు, డీజిల్ లేదా ఎల్‌పిజి వంటి ఇంధన వాయువుల్లోని రసాయనిక శక్తిని వాహనాల ఇంజన్లలో ఉన్న అంతర్దాహన యంత్రం (×అ్‌వతీఅaశ్రీ జశీఎbబర్‌ఱశీఅ జుఅస్త్రఱఅవ) అనే సిలిండర్లలో యాంత్రికశక్తిగా మార్చుకోవడం ద్వారానే వాహనాలు నడుస్తాయి.
నీటిలో అలాంటి అధికస్థాయి రసాయనిక శక్తి లేదు. శక్తిపరంగా చూస్తే ఇంధనాలు అధికస్థాయిలో ఉన్నట్టు అర్థం. పైగా నీటికి, గాలిలోని ఆక్సిజన్‌కు రసాయనిక చర్యలు లేవు. వాటి రెండింటిని కలపడం ద్వారా ఏ విధమైన శక్తిని ఉత్పత్తి చేసే రసాయనిక ప్రక్రియలు లేవు. కాబట్టి వాహనాల ఇంజన్లలో నీటిని పోస్తే అవి చెడిపోవడం తప్ప నడిచేవి కావు.
అయితే సౌరశక్తి, మామూలు విద్యుచ్ఛక్తిని ఉపయోగించి నీటిలో ఉన్న ఆక్సిజన్‌ను, హైడ్రోజన్‌ను విడగొట్టితే ఏర్పడే హైడ్రోజన్ వాయువు గొప్ప ఇంధనంగా ఉపకరించగలదు. ఇక్కడ మనం ఏమి చేశాము. శక్తి విహీనంగా ఉన్న నీటి అణువులను కాంతి లేదా విద్యుచ్ఛక్తితో నింపి ఆ అణువుల్ని శక్తియుతమైన హైడ్రోజన్, ఆక్సిజన్ వాయువులుగా సంపన్నవంతం చేశాము. ఇలా పోగుపడిన అధికశక్తిని తిరిగి అంతర్దాహన యంత్రాలలో యాంత్రికశక్తిగా మార్చుకొని, వాహనాలను నడపగలము. పెట్రోలు, డీజిల్ వంటి కర్బన్ ఇంధనాల బదులు కర్బన రహిత హైడ్రోజన్ ఇంధనం వాడకం పర్యావరణ పరిరక్షణ రీత్యా అభిలషణీయం!
ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జనవిజ్ఞాన వేదిక.

No comments:
Post a Comment