సార్వత్రిక సమ్మె దిగ్విజయానికై వేలాదిగా నిరసన ప్రదర్శనలు జరపండి!
Posted On Mon 31 Aug 22:41:01.980456 2015
దేశంలోని ప్రధాన కార్మిక సంఘాలన్నీ కలిసి కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక చర్యలను నిరసిస్తూ సెప్టెంబర్ 2వ తేదీన సార్వత్రిక సమ్మెకై మే 26న పిలుపునిస్తే కేంద్ర కార్మిక సంఘాలతో చర్చలు జరపడానికి కేంద్ర ప్రభుత్వానికి మూడు నెలలు పట్టింది. ఆగస్టు 26, 27 తేదీల్లో కేంద్ర ఆర్థిక శాఖ, కార్మిక శాఖ మంత్రులతోపాటు మరో కేంద్ర మంత్రి కలిసి కేంద్ర కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపారు. తూతూ మంత్రంగా ఈ చర్చలు ముగిశాయి. ఉద్యోగ, కార్మికుల సమస్యల పట్ల, వారి ఆందోళన పట్ల కేంద్ర ప్రభుత్వం చాలా ఉదాసీనంగా ఉండటమేగాక బాధ్యతారాహిత్యంగా కూడా వ్యవహరిస్తోందని ఈ చర్చలు స్పష్టం చేశాయి. కార్మిక సంఘాల 12 కోర్కెల్లో ఏడింటికి తాము సానుకూలంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ సబ్‌కమిటీ ప్రకటించింది. కానీ వాస్తవమేమంటే ఏడు కాదు కదా ఒక్క కోర్కెను కూడా పరిష్కరించాలనే చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వం లేదు అన్నది ఈ చర్చల్లో స్పష్టమైంది.
సరళీకరణ ఆర్థిక విధానాల అనంతరం పారిశ్రామిక రంగంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల సంఖ్య విపరీ తంగా పెరిగిపోయింది. ప్రస్తుత చట్టంలో ఉండే సానుకూల అంశాలు కూడా అమలు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం పూనుకోకపోవడం వల్ల తీవ్రమైన శ్రమ దోపిడీకి కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు చిరునామాగా మారారు. శాశ్వతమైన స్వభావం కలిగిన ఏ పనిలో కూడా కాంట్రాక్టు కార్మికులను వినియోగించరాదని ప్రస్తుతమున్న కాంట్రాక్టు కార్మికుల చట్టం స్పష్టం చేస్తోంది. అంతేగాక ఒకే రకమైన పనిలో ఒక శాశ్వత కార్మికుడు, ఒక కాంట్రాక్టు కార్మికుడు పనిచేస్తే శాశ్వత కార్మికుడికి ఇచ్చే వేతనం, అలవెన్సులకు సమానంగా అదే పనిలో ఉన్న కాంట్రాక్టు కార్మికుడికి కూడా వర్తింపజేయాలని ప్రస్తుత చట్టం చెబుతోంది. కానీ, పై అంశాలు ఏవీ అమలు జరగనందువల్ల కాంట్రాక్టు కార్మికులు ఏ హక్కులూ లేని బానిసలుగానూ, వెట్టిచాకిరీ కార్మికులుగానూ మిగిలిపో యారు. ప్రస్తుత చట్టాన్ని కఠినంగా అమలు జరిపి శాశ్వతమైన పనుల్లో ఉన్న కాంట్రాక్టు కార్మికులను, ఉద్యోగులను క్రమబద్ధీ కరించాలని, సమానపనికి సమాన వేతనం అమలు చేయాలని కార్మిక సంఘాలు కోరగా కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీక రించడం ప్రస్తుతం చేయలేమని, ఈ విషయాన్ని మరింత లోతుగా పరిశీలించాల్సి ఉందని సబ్‌కమిటీ స్పష్టం చేసింది. కనీసం సమాన పనికి సమాన వేతనమైనా ఇచ్చేలా నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరగా నిర్ణయించిన కనీస వేతనం మాత్రమే అమలు జరిపించగలమని ప్రభుత్వ ప్రతినిధులు చెప్పడం అన్యాయం. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఖజానా నుంచి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండానే కోట్లాది మంది కార్మికులకు మేలు జరిగేలా ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా న్యాయం చేయవచ్చని చెప్పినా ప్రభుత్వం చెవిన వేసుకోలేదు.
అలాగే కనీస వేతనంగా నెలకు రూ.15,000 నిర్ణయించాలని కార్మిక సంఘాల డిమాండ్ పట్ల కూడా ప్రభుత్వం ఇదే వైఖరి తీసుకున్నది. 2012లో జరిగిన 44వ జాతీయ కార్మిక మహాసభలో ఆనాటి ప్రభుత్వం, 2015లో జరిగిన 46వ జాతీయ కార్మిక మహాసభలో ఈనాటి ప్రభుత్వం కనీస వేతనాలను శాస్త్రీయంగా నిర్ణయించేందుకు అవసరమైన ప్రాతిపదికను ఏర్పాటు చేయడానికి అంగీకరించాయి. ఆ ప్రాతిపదిక ప్రకారం లెక్కవేస్తే ఈనాటి ధరల్లో కనీస వేతనం రూ.20 వేలుగా నిర్ణయించాలి. అయినప్పటికీ కార్మిక సం ఘాలు కనీసం రూ.15,000 అయినా నిర్ణయించమని ప్రభు త్వానికి వివరించాయి. కానీ మంత్రివర్గ సబ్‌కమిటీ మాత్రం కనీస వేతనం నెలకు రూ.7 వేలకు మించి ఇవ్వబోమని స్పష్టం చేసింది. చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే ఇంతకంటే ఎక్కువ వేతనాన్ని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగ, కార్మి కులు పొందుతు న్నారు. ఈ విషయం సబ్‌కమిటీ దృష్టికి తెచ్చినా ఇంతకంటే పెంచలేమనే వైఖరి తీసుకోవడాన్ని బట్టి కార్మిక వర్గం పట్ల వారిలో దాగి ఉన్న వ్యతిరేకతను మనం అంచనా వేసుకోవచ్చు.
కార్మిక చట్టాలను ఏకపక్షంగా సవరించి కార్మిక సంఘాల రెక్కలు కత్తిరించి, సమ్మె హక్కును కూడా లేకుండా చేసి, సమిష్టి బేరసారాలను బలహీన పరిచి ''హైర్ అండ్ ఫైర్'' విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. అందుకొరకై కార్మిక చట్టాల సవరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తిచే యడానికై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్ని స్తున్నాయి. ఈ చట్ట సవరణలను నిలిపివేయాలని అన్ని కార్మిక సంఘాలూ ముక్తకంఠంతో కోరుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం అందుకు అంగీకరించలేదు. త్రైపాక్షిక సంప్ర దింపులకు అవసరమైతే ట్రేడ్ యూనియన్లను పిలుస్తామని, అక్కడ తమ అభిప్రాయాలు చెప్పవచ్చని ప్రభుత్వం చెబుతూ కార్మిక సంస్కరణలు మాత్రం కొనసాగు తాయని స్పష్టం చేయడం ఈ ప్రభుత్వ నయవంచ నను బహిర్గతం చేస్తోంది.
అసంఘటితరంగంలోని కోటాను కోట్ల కార్మికుల సంక్షేమం కోసం ఒక సమగ్రమైన చట్టాన్ని రూపొందించి వారిని ఆదుకోవాలని కార్మిక సంఘాలన్నీ కోరగా భవన నిర్మాణ కార్మికులకు ఇఎస్‌ఐ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పడం తప్ప మిగతా ఎలాంటి హామీనీ సబ్‌కమిటీ ఇవ్వలేదు. అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, తదితర కార్మికులను చట్టబద్ధంగా కార్మికులుగా గుర్తించాలని, కనీస వేతనాలు అమలు జరపాలని, వారి సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు కోరగా, వారిని కార్మికులుగా గుర్తించడానికి, కనీసవేతనం అమలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. సంక్షేమ చర్యల విషయం పరిశీలిస్తామని చెప్పింది. అంతేగాక, ఈ పథకాలకు క్రమంగా కేంద్ర ప్రభుత్వం నిధులు తగ్గించినందున రాష్ట్రాల్లో కూడా ఈ కార్మికులకు న్యాయం జరగడం లేదని, కనీసం కేంద్ర బడ్జెట్ నుంచి ఈ పథకాలకు నిధులు పెంచాలని కోరినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేదు. ప్రైవేటీకరణను, ప్రభుత్వరంగ పరిశ్రమల వాటాల అమ్మకాలను నిలిపిy ేయాలని, రైల్వేలు, రక్షణ రంగాల్లో విచ్చలవిడి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతించరాదని, పిఎఫ్‌లో సభ్యులుగా ఉన్నవారికి కనీస పెన్షన్ రూ.3 వేలు నిర్ణయించాలని, ధరలను తగ్గించాలని, సార్వత్రిక ప్రజా పంపిణీని బలపర్చి ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించాలని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు నిర్దిష్ట మైన చర్యలు తీసుకోవాలని కోరినప్ప టికీ కేంద్ర ప్రభుత్వం ఈ కోర్కెలను ఏ మాత్రం పట్టించుకోలేదు. ఎలాంటి సమాధానమూ చెప్పలేదు. బోనస్ సీలింగ్‌లో కొద్దిపాటి రాయతీలు ఇస్తామనే మాట తప్ప ఇతరత్రా హామీలు ఏ విషయంలోనూ ఇవ్వలేదు.
కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కార్పొరేట్ శక్తులకు లొంగిపోయి వ్యవహరిస్తోంది. అసోచామ్, ఫిక్కిలాంటి సంస్థలు ఇచ్చిన అజెండాను అమలు చేస్తోంది. దీని వల్ల రాబోయే కాలంలో ఉద్యోగ, కార్మికులకు మరిన్ని తీవ్ర సమస్యలు రాబోతున్నాయి. ప్రభుత్వమే స్వయంగా కార్మిక హక్కులపై దాడి చేసి, తీవ్రమైన శ్రమ దోపిడీని అనుమతించడమేగాక నిర్బంధ శ్రమ చేయించేందుకు కూడా యజమానులకు స్వేచ్ఛను ఇవ్వాలని భావిస్తోంది. ఈ దాడిని ఎదుర్కొనేందుకు కార్మిక వర్గం సమైక్యంగా పూనుకోకపోతే రాబోయేవి మరిన్ని గడ్డురోజులే. అందుకే సెప్టెంబర్ 2 సార్వత్రిక సమ్మెను దిగ్విజయం చేయడం ద్వారా, వేలు, లక్షల సంఖ్యలో కార్మికులను వీధుల్లో సమీకరించడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన జవాబు చెప్పేందుకు కార్మిక వర్గం సిద్ధం కావాలి. సమరశీల పోరాటాల ద్వారా మాత్రమే ప్రభుత్వ దాడిని ఎదుర్కోగలం. సమైక్యంగా కార్మిక వర్గాన్ని ఉద్యమాల్లోకి కదిలించడమే దీనికి పరిష్కారం. సమ్మె చేసిన ప్రతి కార్మికుడు, ప్రతి ఉద్యోగిని వీధుల్లోకి రప్పించి భారీగా నిరసన ప్రదర్శనలు నిర్వహించడం ద్వారానే ప్రభుత్వానికి తగిన పాఠం చెప్పగలం. సిఐటియు సంఘాలు, నాయకులు సెప్టెంబర్ 2 కార్యక్రమాల్ని దిగ్విజ యం చేయడం ద్వారా ప్రభుత్వ సవాల్‌ను ఎదుర్కొం టామని ప్రతిజ్ఞ తీసుకోవాలని సిఐటియు కోరుతోంది.
- యంఎ గఫూర్
(వ్యాసకర్త సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)

No comments:
Post a Comment