Home » AndhraPradesh
కార్పొరేట్ కాలేజీలో ఘోరం
Posted On 17 hours 10 mins ago

- ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య
- తీవ్ర ఒత్తిడి ఫలితమే
- కళాశాలపై బంధువుల దాడి
కడప జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కార్పొరేట్ చదువులు ఇద్దరు విద్యార్థినుల ఉసురు తీశాయి. తమ పేరు ప్రతిష్టల కోసం యాజమాన్యం తీసుకున్న ఒత్తిడి చర్యల ఫలితంగా కోటి ఆశలతో కాలేజీలో అడుగుపెట్టిన ఇద్దరు విద్యార్థినులు బలవన్మరణానికి గురయ్యారు. ఈ ఘోరం చింతకొమ్మదిన్నె మండలం కృష్ణాపురం సమీపంలోని ఒక ప్రముఖ కార్పొరేట్ జూనియర్ కళాశాల హాస్టల్‌లోని ఒకే గదిలో సోమవారం చోటుచేసుకుంది.
ప్రజాశక్తి - చింతకొమ్మదిన్నె (కడప జిల్లా)
కడపకు చెందిన మనీషా(16), సిద్దవటం మండలం భాక్రాపేటకు చెందిన నందిని(16) ఒక ప్రముఖ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. సోమవారం తరగతులకు హాజరైన వీరిద్దరూ కళాశాల ముగియకముందే హాస్టల్ గదికి చేరుకున్నారు. కళాశాల ముగిసిన తర్వాత తోటి విద్యార్థినులు గదిలోకి వెళ్లి చూడగా ఇద్దరూ ఉరేసుకుని వేలాడుతూ కనిపించారు. దీంతో కళాశాల యాజమాన్యానికి సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల నిర్వహించిన ప్రైమరీ పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తాయనే భయంతోనే వారు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని తోటి విద్యార్థినులు చెబుతున్నారు. అయితే వారి ఆత్మహత్యకు వేరే కారణాలేమైనా ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది. వారేమైనా సూసైడ్ నోట్ రాశారా, డైరీలున్నాయా... అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
మృతుల బంధువులు, విద్యార్థి సంఘాల ఆగ్రహం
ఆత్మహత్య విషయం తెలుసుకున్న మృతుల తల్లిదండ్రులు, బంధువులు, పలు విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల వద్దకు చేరుకున్నారు. పోలీసులు వారిని కళాశాల లోపలికి అనుమతించకపోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కళాశాల యాజమాన్యం ఒత్తిడి వల్లే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ పిల్లల చావుకు కళాశాల యాజమాన్యమే బాధ్యత వహించాలన్నారు. విద్యార్థినుల మృతదేహాలను చూసిన వారి బంధువులు ఆగ్రహం పట్టలేక కళాశాల అద్దాలు పగులగొట్టారు. ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్‌పి నవీన్‌గులాఠీ, జాయింట్ కలెక్టర్ రామారావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులూ చోటుచేసుకోకుండా పోలీసు బలగాలను కళాశాల వద్ద మోహరింపజేశారు. ఇంతజరుగుతున్నా సంఘటనపై కళాశాల యాజమాన్యం నోరుమెదపకపోవడం గమనార్హం.

No comments:
Post a Comment