Wednesday, August 12, 2015

రామ మందిరం పేరిట నిధుల స్వాహా Posted On Wed 12 Aug 22:54:07.940627 2015

రామ మందిరం పేరిట నిధుల స్వాహా

Posted On Wed 12 Aug 22:54:07.940627 2015
          లూటీ బృందం రాముణ్ణి కూడా వదిలి పెట్ట లేదు. రాముడి పేరుతో భావోద్వేగపరులై గందరగోళంలో ఉన్న ప్రజల నుంచి వసూలు చేసిన విరాళాలను విశ్వ హిందూ పరిషత్‌ నాయకులు బొక్కారు. గల్లంతైన సొమ్ము ఏకంగా రూ.1,400 కోట్ల కంటే ఎక్కువ. కేవలం డబ్బే కాదు, టన్నుల కొద్ది బంగారు ఇటుకలను కూడా విహెచ్‌పి నాయకులు తినేశారు. ఈ అభియోగం మోపింది ప్రతిపక్షాలు కాదు. సంఘ పరివారానికే చెందిన సంస్థ అఖిల భారతీయ హిందూ మహాసభ. అయితే విహెచ్‌పి నాయకులు ఈ అభియోగాన్ని 'చెత్త' అని తోసిపుచ్చారు. రామ మందిరం నిర్మాణానికి రూ.4 కోట్లు సరిపోతాయని హిందూ మహాసభ అధికార ప్రతినిధి దేవేంద్ర పాండే ఈ మధ్యే తెలియచేశారు. బిజెపి పోషకురాలైన ఆర్‌ఎస్‌ఎస్‌కు వేరే లెక్కలు ఉన్నాయి. హిందూత్వను నిధుల సేకరణకు ఉపయోగించుకున్నారు. 1989 సంవత్సరం నుంచి దేశ విదేశాల నుంచి పుష్కలంగా నిధులు 'విరాళాల' రూపంలో వారు సేకరిస్తూ వస్తున్నారు. అలా విరాళాల రూపంలో వచ్చిన డుబ్బ రూ.1,400 కోట్ల కంటే కూడా ఎక్కువ. చాలామంది హిందూత్వ భావావేశంతో విరాళంగా బంగారంతో తయారైన టన్నుల కొద్దీ ఇటుకలు పంపించారు. కానీ అలా వసూలైన నిధులన్నింటినీ బంగారు ఇటుకలతో సహా విహెచ్‌పి నాయకులు భోంచేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్‌, విహెచ్‌పి పోషకుడు అశోక్‌ సింఘాల్‌, ప్రధాని నరేంద్ర మోడీకి తాను లేఖలు రాసినట్లు దేవేంద్ర పాండే చెప్పారు. దానికి సింఘాల్‌ జవాబిచ్చారు. తనకు పాండే లేఖ అందినట్లు మోహన్‌ భగవత్‌ తెలియజేశారు. కానీ ప్రధాని లేక అయన కార్యాలయం నుంచి ఎలాంటి సమాచారం అందలేదు.
దేవేంద్ర పాండే లేఖకు జవాబుగా అశోక్‌ సింఘాల్‌ అన్ని అభియోగాలనూ తోసిపుచ్చారు. 1989లో కేవలం రూ.8.25 కోట్ల నగదు మాత్రమే విరాళంగా వచ్చిందని చెప్పారు. అశోక్‌ సింఘాల్‌ ఎక్కడా దొరకలేదు. కానీ విహెచ్‌పి ప్రతినిధి సురేంద్ర జైన్‌ ఇవన్నీ బాధ్యత రాహిత్య అభియోగాలని ఆరోపించారు. 'కరసేవక్‌పురం'లో రామ జన్మభూమి ట్రస్టు కార్యాలయంలో లెక్కలన్నీ ఉన్నాయన్నారు. ఎవరైనా వాటిని చూడవచ్చని సురేంద్ర జైన్‌ చెప్పారు. గత జూన్‌ 16న అశోక్‌ సింఘాల్‌ సమక్షంలోనే రామ జన్మభూమి ట్రస్టు సమావేశం జరిగిందని కూడా తెలిపారు. ఆ సమావేశంలో మందిరం కట్టటానికి మరలా మతపరమైన ఉద్వేగాలను రెచ్చగొట్టి విరాళాలు సేకరించాలనే నిర్ణయం జరిగింది. అయోధ్య పరిశీలకుల అభిప్రాయం ప్రకారం రామ మందిరం ఎల్లప్పుడూ బంగారు బాతుగానే మిగుల్తుంది. దీనికి ఏ ఉనికీ లేదు. కానీ రాముని పేరుతో నేడు కూడా చాలామంది మతపరంగా భావోద్వేగానికి లోనౌతారు. రెండు చేతులా విరాళాలిస్తారు. కొన్నేళ్ళ అనంతరం కూడా ఇలా విరాళాలు వస్తూ ఉంటే సంఫ్‌ు పరివారం నాయకులే కోటీశ్వరులవుతూ ఉంటారు. అఖిల భారతీయ హిందూ మహాసభ నాయకులకు అందులో భాగం దక్కకపోవడంతో వారు నిజాలు బయట పెట్టారు. తమ జేబులు నిండితే బహుశా వారు కూడా నోరెత్తరు.
- వేదుల రామకృష్ణ

No comments:

Post a Comment