కార్పొరేట్లపై ఉన్న ప్రేమ కష్టజీవులపై లేదు
Posted On Mon 31 Aug 22:39:35.584807 2015
రండిబాబూ రండి... భారతదేశంలో యువకార్మిక శక్తి కారుచౌకగా లభిస్తుందంటూ దేశ విదేశాల్లో తిరుగుతూ ప్రధాని నరేంద్రమోడీ కార్పొరేట్లను ఆహ్వానిస్తున్నారు. భారత ప్రజలు అనేక త్యాగాలు చేసి నిర్మించుకున్న ప్రభుత్వ రంగం, అందులో ముఖ్యమైన సేవా రంగం, మరో అతి ముఖ్యమైన ప్రకృతి ఇచ్చిన సంపదలు ఉన్నాయి. ఎన్ని లక్షల ఎకరాల భూమి కావాలన్నా ఇస్తాం, అన్ని రకాల పన్ను రాయితీలు ఇస్తామంటున్నారు. కార్పొరేట్ శక్తుల సంపద పెంపు కోసం అన్నీ తానై అడిగిన వారికి లేదనక, అడగని వారికి పిలిచి వడ్డించే కలియుగ దానకర్ణుడిలా మోడీ మారారు. గత ఎన్నికల్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చారో గానీ బడా పారిశ్రామిక, వ్యాపారవేత్తల (కార్పొరేట్ల) లాభాలు పెంచేందుకే కంకణం కట్టుకున్నారు. మరోవైపు కార్మిక చట్టాలను సవరించి కార్మికులను యజమానులకు బానిసలుగా తయారు చేయబోతున్నారు. అనారోగ్యాల పాలైన కష్టజీవుల ఆకలి చావులు, కార్మికులకు కనీస వేతనాలు, అసంఘటిత రంగ కార్మికుల సమగ్ర చట్టం లాంటి సమస్యలపై గత 15 నెలల కాలంలో ఒక్క సభలో ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే ఎవరిపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. బ్రిటిష్ ప్రభుత్వం, ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ కాలంలో కంటే ఉద్యోగ, కార్మికులకు వ్యతిరేకంగా నిరంకుశమైన చట్టాలు చేయబోతున్నారు.
నయా ఉదారవాద విధానాల పాలనలో దోపిడీకి ప్రధాన లక్ష్యం శ్రామికులే. ఈ విధానాలను అతివేగంగా అమలు జరిపిన చరిత్ర నరేంద్ర మోడీకే దక్కుతుంది. ఈయన గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కార్పోరేట్లకు వేల ఎకరాల భూములు చట్ట వ్యతిరేకంగా కట్టబెట్టారు. అదానీ గ్రూపుకు ముద్ర పోర్టు, ముద్ర సెజ్‌ల ఏర్పాటుకు 2013-14లో 16,750 ఎకరాల భూమిని రైతుల నుంచి లాక్కొని చదరపు మీటరు రూ.30కి కొంత భూమి, రూపాయికి మరి కొంత భూమిని మోడీ ప్రభుత్వం అమ్మింది. అదానీ గ్రూపు సదరు భూమిని ప్లాట్లుగా మార్చి ప్రభుత్వరంగానికి, ప్రభుత్వానికి చమీ వేల రూపాయలకు విక్రయించింది. ఎస్‌ఆర్ గ్రూపు కంపెనీ, టాటా కంపెనీలతో మోడీ ప్రభుత్వం ప్రేమ పూర్వకంగా ఒప్పందాలు చేసుకొంది. ఈ ఒప్పందాల ప్రకారం కోస్టల్ రెగ్యులేటరీ జోన్‌లోను, నోటిఫైడ్ అడవీ ప్రాంతంలోనూ ఉన్న 2,07,60,000 చ.మీ భూభాగాన్ని కట్టబెట్టింది. ఆ భూమిలో ఎలాంటి అభివృద్ధీ చేయరాదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. మోడీ ప్రభుత్వం రూ.20 లక్షలు జరిమానా చెల్లించి పై రెండు కంపెనీలకు భూమిని అప్పజెప్పింది. నానో కార్ల కంపెనీ బెంగాల్ నుంచి గుజరాత్‌కు రాబట్టడం కోసం రూ.33 వేల కోట్ల రాయితీలు ఇచ్చింది. వ్యవసాయానికి లేకుండా సాగునీటిని కూడా టాటా కంపెనీకి ఇచ్చింది. ఎల్ అండ్ టి కంపెనీకి పూజారియ, సూరత్‌లలో చ.మీ. రూ.3,500 ఉన్న భూమిని కేవలం చ.మీ రూపాయికే వేలం లేకుండా ఇచ్చింది. ఈ విధంగా అనేక కార్పొరేట్ కంపెనీలకు భూమి, నీరు, ఇతర ప్రకృతి ఇచ్చిన సంపదను అతి తక్కువ రేట్లకు విక్రయించినందున గుజరాత్ ప్రభుత్వ ఖజానాకు లక్ష కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని విమర్శలు వచ్చాయి. మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కార్పొరేట్ల సంపద ఎప్పుడూ పెరగనంతగా పెరిగింది. ఉదాహరణకు మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు 2002లో అదానీ గ్రూపు సంపద విలువ రూ.2,816 కోట్లు మోడీ ప్రాపంకంలో ఏకంగా రూ.35,881 కోట్లకు పెరిగింది. అభివృద్ధి అంటే ఇదేనని దేశ ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కార్పొరేట్ల సేవకు అంకితమైన మోడీ దేశంలోని ఉద్యోగ, కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చేందుకు చట్ట సవరణలు చేయాలని ఆరాటపడుతున్నారు. దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ ఇలాంటి చట్ట సవరణలు చేస్తేనే పెట్టుబడులు వస్తాయని తన కార్యాలయం నుంచి ఉత్తరాలు పంపారట. మోడీ పరిపాలనలో కార్మికులు సమ్మె చేసినా, వారిని ప్రోత్సహించినా రూ.50 వేల నుంచి రూ.6 లక్షల జరిమానాతో పాటు జైళ్లకు పంపే చట్టం చేసి కార్పొరేట్ల మెప్పు పొందాలని చూస్తున్నారు.
దేశంలో ఈయన గారి సంవత్సర పాలనలో రైతుల ఆత్మహత్యలు 26 శాతం పెరిగాయి. ఈ ఆత్మహత్యలకు కారణమైన మోడీకి, ఆయన మంత్రివర్గానికి జరిమానాలు, జైలు శిక్షలు వేసేలా చట్టాలు చేస్తారా? ఒక నిమిషానికి ఐదుగురు, రోజుకు 7 వేలు, సంవత్సరానికి 25 లక్షల మంది భారతీయులు ఆకలితో చనిపోతున్నారని ఐరాస వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం చెప్పింది. ఆకలి, అనారోగ్య కోరల్లో చిక్కుకున్న కష్టజీవులను ఆదుకునేందుకు ఒక చట్టం కూడా చేయలేదు. ఆకలి సూచికలో 199 దేశాల్లో భారతదేశం 94వ స్థానానికి దిగజారింది. ప్రపంచ ఔషధ నివేదిక ప్రకారం దేశంలో 64.90 కోట్ల మంది ప్రజలకు అత్యవసరమైన మందులు అందుబాటులో లేవని చెప్పింది. ప్రజారోగ్య వ్యవస్థ నామమాత్రంగా ఉన్నందున కష్టజీవుల కుటుంబాల్లో ఏటా 56 వేలకు పైగా మహిళలు ప్రసవించే సమయంలో చనిపోతున్నారు. మరోపక్క మొత్తం ఉత్పత్తి అయ్యే నికర విలువలో కార్మికుల వ్యయం 1991కి ముందు 30 శాతానికి పైగా ఉండేది. నేడు 10 శాతానికి తగ్గింది. పరిశ్రమల రంగ యజమానులు దాదాపు 90 శాతం లాభాలను దండుకుంటు న్నారు. ఎన్ని సమస్యలు ఉన్నా సంపద సృష్టిలో పాల్గొంటున్న 40 కోట్ల అసంఘటిత రంగ కార్మికుల గురించి మోడీ ఒక్కమాటైనా మాట్లాడడు. దేశంలో కార్మికులు సృష్టిస్తున్న సంపదతో పాటు, ప్రకృతి ఇచ్చిన సంపదను, ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టే కార్పొరేట్లపై ఉన్న ప్రేమ కష్టజీవులపై లేనందునే సెప్టెంబరు 2న దేశవ్యాప్త సమ్మెలో అందరూ పాల్గొని మోడీ ప్రభుత్వం కళ్లు తెరిపించాలి.
- ఇరిగినేని పుల్లారెడ్డి

No comments:
Post a Comment