విస్తరిస్తున్న గ్లోబల్ ఫైనాన్స్ సుడిగాలి
Posted On Wed 19 Aug 23:13:21.978378 2015
ప్రపంచవ్యాప్తంగా గత మూడు దశాబ్దాలుగా అసమానతలు పెరుగుతున్నాయని చాలా స్పష్టంగా నిర్ధారణయింది. పెట్టుబడిదారులు తమకు తామే అసాధారణమైన వేతనాలు, బోనస్‌లు ప్రకటించుకుంటూ ఉండడంతో ఈ ధోరణి చాలా తరచుగా ఇదే స్థాయిలో పునరావృతమవుతోంది. హెడ్జ్ నిధులు, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులు వంటి ఆర్థిక సంస్థలు పెద్ద మొత్తాల్లో లాభాలను ఆర్జించగలిగే స్థితిలో ఉన్నాయి. అందుకే, అవి ఇంత పెద్ద మొత్తాల్లో నష్టపరిహార ప్యాకేజీలను భరిస్తున్నాయి. అయితే, ఈ ఆర్థిక లాభాలకు మూల వనరు ఏమిటి? పెరుగుతున్న ఆర్థిక లాభాలకు, పెరుగుతున్న సంపద/ఆదాయ అసమానతలకు మధ్య గల సంబంధం ఏమిటి? వీటికి సమాధానాలు తెలుసుకోవడానికి ముందు అసలు ఈ అసాధారణ ధోరణిని సందర్భానుసారంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ముందుగా, పెరుగుతున్న అసమానతలు, అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్న ఆర్థిక లాభాలకు సమాంతరంగా అంతర్జాతీయ పెట్టుబడి అభివృద్ధి లేదా ద్రవ్యీకరణ చెందుతోంది. దీనివల్ల వాస్తవ ఆర్థిక కార్యకలాపాల్లోకి ఫైనాన్స్ పెట్టుబడులు చొచ్చుకురావడం కూడా పెరుగుతోంది. ప్రముఖ ఆర్థిక భౌగోళికవేత్త పాల్ లాంగ్లే తన పుస్తకం 'ది ఎవ్విరి డే లైఫ్ ఆప్ గ్లోబల్ ఫైనాన్స్'లో గ్లోబల్ ఫైనాన్స్ అంటే సామాన్య అభిప్రాయం ఎలా ఉంటుందో వివరించారు. మరోవైపు, డబ్బు గురించి మన ఆలోచనలు, నిర్వహణ తీరు వంటి సాధారణ మార్గాలను అంతర్జాతీయ పెట్టుబడుల దృక్పథం ప్రాథమికంగా మారుస్తుందని వాదిస్తున్నారు.
1980వ దశకం వరకు భవిష్యత్తు అంటే అనిశ్చితిగా భావించేవారు. భవిష్యత్తులో ఏదైనా హాని లేదా ప్రమాదం జరుగుతుందనుకుంటే దాని కోసం పొదుపు మొత్తాలు, బీమా పాలసీలు చేసేవారు. అంటే అనిశ్చితి, ముప్పుగా మారుతున్నప్పుడే ద్రవ్యీకరణ కార్యకలాపాలు ఆవిర్భవిస్తాయి. మనం ముప్పును ఎలా ఉంటుందని భావిస్తామో దాన్ని బట్టే మన డబ్బు వినియోగం లేదా ఖర్చు కూడా ఉంటుంది. లాంగ్లే సూత్రీకరణ ప్రకారం, నష్టాన్ని భవిష్యత్తులో కలిగే ప్రమాదంగా ఊహించి వ్యవహరిస్తే దానికి వర్తమానంలో విశ్వసనీయత ఉండాల్సిన అవసరముంది. ఇది పొదుపు వైపుకు దారి తీస్తుంది. అయితే, దీన్నొక అవకాశంగా పరిగణిస్తే మాత్రం మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. దీన్నొక దృక్పథంగా లేదా వైఖరిగా అనుసరిస్తే పొదుపు మొత్తాలన్నీ పెట్టుబడుల రూపంలోకి మారతాయి.
మీ పిఎఫ్ ఇంకేమాత్రం పొదుపు కాదు...
నేడు మనందరం ప్రత్యక్షంగానో లేక మ్యూచువల్ ఫండ్ల ద్వారానో లేదా ఇన్సూరెన్స్ లేదా పెన్షన్ నిధుల ద్వారానో ద్రవ్య పెట్టుబడిదారులమే. ఉద్యోగుల పెన్షన్ నిధులను స్టాక్ మార్కెట్‌లోకి పెట్టుబడులుగా మళ్ళించేందుకు ఇటీవల అనుమతించడం వల్ల ఈ వ్యవహారం వ్యక్తుల చేతుల్లోంచి వెళ్ళిపోతోంది. కేవలం సంపన్నులు, మధ్య తరగతివారు మాత్రమే గాక పేదలు కూడా పెట్టుబడిదారులుగా మారుతున్నారు. నిత్యావసర వస్తువుల సరఫరా స్థానే నగదు బదిలీలను ప్రవేశపెట్టడం వెనుక గల కీలకమైన అంశం ఇదే. జనధన్ యోజన వంటి పథకాల ద్వారా పేదలను కూడా ఆర్థిక చట్రంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం తాపత్రాయపడడం వెనుక గల తర్కం ఇదే. అయితే అవసరమైనప్పుడు ఈ పొదుపు మొత్తాలు ఉపయోగపడడం కన్నా కూడా ద్రవ్య మార్కెట్లకు అదనపు ద్రవ్యాన్ని అందించడమే ఈ సామాజిక బీమా పథకాల ప్రధాన లక్ష్యం. పిఎఫ్ మొత్తాన్ని 75 శాతం వరకు ముందుగానే విత్‌డ్రా చేసుకోవాలని అందరూ ఎందుకు భావిస్తున్నారు? ఎందుకంటే పిఎఫ్ పొదుపు మొత్తాలన్నీ పెట్టుబడుల మార్కెట్లోకి వెళ్ళిపోతున్నాయి కాబట్టి.
పొదుపు అంటే పెట్టుబడి పెట్టడం వంటిది కాదు. పొదుపు మొత్తాలంటే వినియోగించని ఆదాయాలు. పెట్టుబడులంటే లాభాలు ఆర్జించే లక్ష్యంతో మూలధనంగా మారే పొదుపు మొత్తాలు. ఇపిఎఫ్‌ఒలో సామాన్యులు దాచుకున్న పొదుపు మొత్తాన్ని ఈక్విటీల్లో పెట్టుబడిగా పెడితే లేదా బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే బదులు మ్యూచువల్ ఫండ్‌లో పెట్టాల్సిందిగా బ్యాంక్ మేనేజర్ మిమ్మల్ని కోరితే, ఇంటి కోసం కాకుండా పెట్టుబడిగా గృహ రుణాన్ని తీసుకుంటే గ్లోబల్ ఫైనాన్స్‌లో మీరూ ఏదో ఒక రకంగా భాగస్వాములైనట్లే. అంటే నష్టాన్ని భరించేందుకు సిద్ధపడటం ద్వారా ఉత్పత్తి చేయకుండానే లాభాలు ఆర్జించడమన్న మాట. ఇంకా సరళంగా చెప్పుకో వాలంటే, ద్రవ్యీకరణ క్రమం అంటే బ్యాంకుల వంటి పెట్టుబడి దారులు లేదా ప్రభుత్వం నుంచి ఈ భారాన్ని మొత్తంగా వ్యక్తిగత కార్మికులకు లేదా కుటుంబాలకు మళ్ళించడమే. నష్టాన్ని అంచనా వేయడం ద్వారా బడా బ్యాంకులు తాము సంక్షోభం నుంచి బయటపడేలా తెలివైన నిర్ణయాలు తీసుకుంటాయి. కానీ, సామాన్యుడికి మాత్రం అలాంటి అవకాశం లేదు. ప్రైవేటు ఆర్థిక సంస్థలు చేసిన తప్పులకు, పొరపాట్లకు అధిక పన్నుల రూపంలో, ప్రజా సౌకర్యాల కోత రూపంలో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటోంది.
గ్రీక్ ఆర్థికవేత్త కోస్టాస్ లాపావిత్సాస్ ''ఉత్పత్తి చేయకుండానే లాభం పొందడం : ఫైనాన్స్ మనందరినీ ఎలా దోపిడీ చేస్తోంది'' అనే తన పుస్తకంలో ద్రవ్యీకరించిన ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన మూడు లక్షణాలను నిర్వచించారు. అందులో మొదటిది : ద్రవ్యేతర సంస్థలకు, బ్యాంకులకు మధ్య దూరం పెరగడం, రెండోది : బ్యాంకులు ఫైనాన్షియల్ మార్కెట్ల నుంచి మరింత ఆదాయాన్ని కోరడం, పరిశ్రమలకు గాక వ్యక్తులకు రుణాలుగా ఇవ్వడం, మూడోది : వ్యక్తిగత ఆదాయాలు, గ్లోబల్ ఫైనాన్స్ నెట్‌వర్క్‌ల మధ్య పెరుగుతున్న చొరబాటును పెంచడం. ఈ మూడూ భారత్‌లో కనిపిస్తున్నాయని బిజినెస్ జర్నలిస్టు వివేక్ కౌల్ పేర్కొంటున్నారు. భారత్‌లో బ్యాంకులు రుణాలిచ్చే క్రమం మొత్తంగా మందగించింది. కానీ గృహ రుణాలు మాత్రం అదే స్థాయిలో పెరుగుతున్నాయి. 2013 మేతో ముగిసిన ఏడాది కాలంలో మొత్తం బ్యాంకు రుణాల్లో గృహ రుణాలు 11 శాతం ఉండగా అదే 2015 మేతో ముగిసిన కాలానికి ఈ రుణాలు ఏకంగా 19.6 శాతానికి పెరిగాయి. ఈ ఒక్క అంశమే లాపావిత్సాస్ ప్రతిపాదనలను ధృవీకరిస్తోంది. గృహ రుణాలు విస్తరిస్తున్నాయంటే అర్థం భారత్‌లో బ్యాంకులు లాభాల కోసం భవిష్యత్ వ్యక్తిగత ఆదాయాల వైపు దృష్టి సారించడం పెరుగుతోంది. అలాగే కంపెనీలు తమ పెట్టుబడులను పెంచుకోవడం కోసం బ్యాంకు రుణాలపై తక్కువగా ఆధారపడుతున్నాయని, పెట్టుబడుల మార్కెట్‌కు వెళ్ళడానికి ప్రాధాన్యతనిస్తునాయని అర్థం. వాస్తవానికి, ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో, భారత కంపెనీలు మార్కెట్ నుంచి సేకరించిన నిధులు రూ.1.73 లక్షల కోట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే కాలంతో పోల్చుకుంటే రెట్టింపు కన్నా ఎక్కువ. చివరగా, పెట్టుబడుల మార్కెట్ల నుంచి బ్యాంకులు తమ మొత్తాలను పెంచుకుంటున్న నేపథ్యంలో ద్రవ్య లాభాలు, వ్యక్తుల భవిష్యత్ ఆదాయాల మధ్య సంబంధం పెరగడం అనివార్యంగా ఉంది.
ద్రవ్యీకరణ అనేది సంపూర్ణమైన ద్రవ్య ధోరణి కాదనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని చూస్తే దీనివల్ల వాస్తవికమైన సామాజిక పర్యవసానాలు ఉంటాయి. ఒకవేళ మనం దీంతో ప్రారంభిస్తే ద్రవ్య లాభాలకు మూలం ఏమిటి? ఉత్పాదక పెట్టుబడికి లాభం వనరులగా ఉంటే అది అదనపు విలువను సృష్టిస్తుందని మనకు తెలుసు. బ్యాంకింగ్ పెట్టుబడులకు లాభం అంటే వడ్డీ. కానీ ద్రవ్య పెట్టుబడుల విషయంలో అలా కాదు. అంటే ఈ లాభమంతా కూడా ఎక్కడ నుంచి వస్తోంది? ఇక్కడ ఆర్థిక లాభాలు ప్రధానంగా రెండు మార్గాల నుండి వస్తాయని లాపావిత్సాస్ చెబుతారు. ఒకటి, ఉత్పాదకత పెట్టుబడుల ద్వారా సృష్టించబడిన మిగులు విలువలో కొంత దోపిడీ చేయడం, రెండు, కార్మికులు (వారు పెట్టుబడిదారులుగా లేదా రుణగ్రహీతలుగా మారుతున్నారు) సంపాదించిన వ్యక్తిగత ఆదాయంలో కొంత భాగాన్ని దోపిడీ చేయడం. అంటే సాధారణ వ్యక్తికి దీనర్థం ఏమిటి? పెరుగుతున్న రుణ భారంతో కూడిన భవిష్యత్తు. ద్రవ్య పెట్టుబడుల వల్ల వచ్చే లాభాలను దోపిడీ చేయబడటం. ఉత్పాదకత పెట్టుబడిని పెట్టుబడిగా ఎంపిక చేసుకోవచ్చు. కానీ ఉపాధి నుంచి నిరవధికంగా ప్రతిఘటించే అవకాశం శ్రమకు ఉండదు. అందువల్లే పెట్టుబడిదారీ సమాజంలో ద్రవ్య దోపిడీ అంతిమంగా వేతన జీవులను మూల్యం చెల్లించేలా చేస్తుంది. దీనివల్లే రుణ భారం పెరుగుతూ ఉంటుంది.
ఈ రుణ భారం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రెండు రకాలుగా ఉండవచ్చు. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీసు (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) వెలువరించిన గణాంకాలను పరిశీలిస్తే 2002-2012 మధ్య కాలంలో గృహ రుణాలు పట్టణ భారతంతో ఏడు రెట్లు పెరగగా గ్రామాల్లో నాలుగు రెట్లు పెరిగాయి. ఈ రుణాల్లో పెద్ద మొత్తం విద్య, గృహ నిర్మాణ రుణాలే. రుణ భారం పరోక్షంగా కూడా ఉంటుందని చెప్పాం కదా. అభివృద్ధి కోసం ప్రభుత్వ పెట్టుబడులను ఉపయోగించడం కన్నా కూడా సార్వభౌమాధికారాన్ని రుణంగా మార్చడానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ప్రస్తుతం గ్రీస్‌లో జరుగుతున్నది ఇదే. ఈ రుణాల చెల్లింపులు కార్మిక వర్గం చెల్లించే పన్నుల ఆదాయం నుంచి చేస్తారు. కాబట్టి ద్రవ్యీకరణ క్రమం వేగంగా జరుగుతున్న ప్రస్తుత ప్రపంచంలో ఒక ఉద్యోగి తన ఉద్యోగ విరమణ అనంతరం కూడా తన భవిష్యత్తుకు భద్రత ఉందని భావించడం సాధ్యమేనా! ఎందుకంటే పొదుపు మొత్తాలు ద్రవ్య పెట్టుబడులుగా మారితే తప్ప వాటికి విలువ లేకుండా పోతోంది. ఇటువంటి తరుణంలో భవిష్యత్తు భద్రతను ఆశించడం సాధ్యమేనా? ఇప్పుడు ఇటువంటి పరిస్థితే ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉంది. అలాగే, పెట్టుబడుల్లో అంతర్లీనంగా ఇమిడివున్న ముప్పులకు సంబంధించి నష్టాల భయం ఎప్పుడూ ఉంటూనే ఉంటుందా? బహుశా ఉండదేమో. కానీ, మనమున్న ఈ కాలాన్ని రిస్క్ సొసైటీగా తరచూ ఎందుకు అభివర్ణిస్తున్నామో ఇది వివరించవచ్చు.
- జి సంపత్
(హిందూ సౌజన్యంతో)

No comments:
Post a Comment