నిజంగా సొతంత్రమొచ్చిందా?
Posted On Fri 14 Aug 22:21:00.956801 2015
రచ్చబండ సర్వాంగసుందరంగా ముస్తాబయ్యింది. ఊరు నడిబొడ్డున వీధివీధిలో జెండా వందనాలు జరుగు తున్నాయి. రచ్చబండ మీద ఖాళీలేక రాంపండు చెరువు గట్టు మీద కూర్చున్నాడు. మైకులు దేశభక్తి గీతాల్ని ఊదరగొడుతున్నై. అప్పలకొండ కొత్త ఖద్దరు పంచె కట్టుకొని.. పల్చటి జుబ్బా మీద బంగారు జరీ కండువా వేసుకొని ఎక్స్‌ప్రెస్ స్పీడులో వచ్చి రాంపండు చేతిలో గుప్పెడు మిఠాయిలుంచాడు.
''ఏట్రయ్యా ఇసేసం?'' తాపీగా అడిగాడు రాంపండు.
''నాతోటి ఇగటాలాడతన్నావేట్రా.. ఇయ్యాల సొసంత్రం వొచ్చిన్రోజురా.. ఇయ్యిగో మిఠాయిలు పంచినారు.. తినరా బాబూ!''
రాంపండు మౌనంగా ఉండిపోయాడు.
''బెల్లంకొట్టిన రాయినాగా అలాగుండ ిపోనావేటోరు.. ఏటైందిరా నీకియ్యాల?''
''కడుపులో దేవీసునట్టుందిరా!''
''ఇకారంగా ఉంతే నాలుగు తులసాకులు నవిలీనేకపోనావా?''
''గూబగుర్యు.. మనిపించీగల్నురొరేరు.. మనకి సొసంత్రం ఎలాగొచ్చినాదిరా?''
''గాందీగోరు తెచ్చినారు!''
''ఎంత మంది పేనాలు పోనాయిరా?''
''నానుగాని సూసినానేట్రా.. నీనాటోలు సెప్తే ఇనడం తప్ప.. ఆ పోయినోల్తో పనేటోరు..!''
''నీలాగానే అనుకుంతన్నార్రా ఈ నాయకులూ.. అందుకే మన బతుకులు ఎదుగూ బొదుగూ నేకండా గొర్రితోక బెత్తెడునా గుండిపోనాది!''
''నువ్వేటోర్రాంపండూ.. సీటికీ మాటికీ గాలి తీసేత్తావ్.. ఇయ్యాల అందరి నోల్లూ ఎందుకు తీపిసేత్తండ్రు.. సంతోసంగా ఉండాలని కదా!''
''మరున్నాం కదా..''
''యెదవ కబుర్లాడకోరు.. ఒక పక్క సొసంత్రవొచ్చినప్పుడ్నించీ.. ఇయ్యాల దాకా మన దేస.. సరి అద్దుల్లో సైనికులు పేనాలు పోతానే ఉన్నాయి.. ఎవులెప్పుడొచ్చి పడిపోతారో తెల్దు.. మనకుండడాన్ని ఇరవై తొమ్మిది రాస్ట్రాలున్నాయి. ఏ రాస్ట్రం బాగుందంతే ఏటి సెప్పగలంరా గుండె మీద సెయ్యేసుకొని.. నానడుగుతుంది కాకి లెక్కలూ, పేపరు ప్రెకటనలూ కాదు.. ప్రెజలు సెప్పాల! సెప్పగలరా?''
''మరెందుకు సెప్పనేకపోతన్నారు?''
''ప్రెజలు మత్తులో ఉన్నార్రా.. సీపు లిక్కరూ.. సీకులూ.. సిల్లరకీ అలవాటుపడి వొట్లేసినంత కాలం మన బతుకు అంతే! మరొక పక్క ఉగ్రవాదం పేట్రేగి పోడంనేదూ? దిల్లీలో గద్దినెక్కిన ప్రెతి ఒక్కడూ ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో తొక్కెత్తా మంతారు.. సివరికి తుస్సుమని పించెత్తారు! ఏటంతావూ?''
''మరాముక్క నిజవే కదేట్రా!''
''దేసం ఎక్కడికో ఎల్లిపోతందని పేపరు ప్రెకటనలిచ్చుకుంతారు.. ఒక్కంగులం దాటి ముందుకెల్లిందిరా.. వొక వేల ముందుకెల్తే ఈ దేసం నించి.. కొన్ని కోట్లు మంది ఎందుకు వొలస పోతార్రా? అప్పనంగా వొచ్చిన ప్రెతిదానీ అమ్ముకుంతన్నాం.. ఇందుకోసవేనట్రా సొసంత్రమొచ్చింది?''
అప్పలకొండ క్వశ్చన్ మార్కు ముఖం పెట్టాడు.
''మరి మన్నాయకులు గల్లి నించి దిల్లీ దాకా ఎవులూ ఆలోసించనేదంతావా?''
''ఆలోసన కాదురోరప్పలకొండా ఆసరణ కావాల! నచ్చా తొంబై కౌర్లు మైకు ముందు సెప్తే ఏం సుఖం..''
''మరేటి సెయ్యిమంతావై?''
''ఓరప్పలకొండా.. సేసే ఖలేజా ఉండాలగాని ఏదైనా సేయొచ్చు.. ఎన్నైనా సెయ్యొచ్చు.. మరి మన సొసైటీలో బడుగు, బలహీన, దళిత వొర్గాల వోరికి.. ఇంతవొరుకు ఏటి సేసినాం? ఇక ముందు ఏం సెయ్యాలనుకుంతన్నాం అని నాయకులు ఆలో సించుకుంతన్నారా? మాటల్లో కాదు.. సేతల్లో..''
''నిజాయితీగా పెజాసేవ సేసీటోడికి.. పది మందితో పనే ఉందిరా.. గతంలో మన సుందరయ్యగోరు ఆస్తిపాస్తులమ్మీసుకొని.. పిల్లాజెల్లా వొద్దనుకొని ప్రెజాసేవ సెయ్యినేదా? ఇప్పుడు ఎవుడైనా మన రెక్కొటుకొని నెగదీత్తండా? ఎక్కడ సూసినా.. కులం.. మతం.. ప్రేంతం.. సొంత మనుసులూ.. భజిపరులూ ఈల్లకే పదవులు.. ఎందుకురా ఈ ఉచ్చవ ఇగ్రహాల్లాంటోల్ని వోట్లేసి గెలిపించడం? నచ్చలాది మంది పేనాలు దారపోసి.. ఇలాంటోల్లకోసవా సొసంత్రం తీసుకొచ్చింది? శ్రీశ్రీగోరెపుడో సెప్పినాడు.. సొసంత్రమొచ్చిందని సెంకలు గుద్దీసుకొని సంబరాలు సేసీసుకోవొద్దూ.. పదవీ యామోహాలూ.. కులమత బేదాలూ.. బాషా దేసాలు సెలరేగెనేడూ.. ప్రెతి మడిసీ మరియొకనీ దొసుకొనేవాడే.. తన బాగ్గం.. తన సౌక్కం సూసుకొనేటోడే.. సోర్దమె అనర్దదాయకం.. అది సంపుకొనుట సేమదాయకం.. అని అప్పుడెప్పుడో సొసంత్రమొచ్చిన కొత్తలో అన్నాడు.. ఇయ్యాల్టికీ ఎక్కడేసిన గొంగలక్కడే ఉంది. ఈ రాజకీయ నాయకులు పారిటీలు మర్సిపోయి.. ప్రెజల సుఖం కోసం.. దేసం సేమం కోసం పాటు పడిన రోజెత్తే.. అదే నిజవైన సొసంత్ర దినం. ఆరోజు పండుగు సేసుకుందాం!''అన్నాడు రాంపండు ఆవేశంగా.
''ఆ రోజొత్తుందంతావా?'' అనుమానంగా అడిగాడు అప్పలకొండ.
''రావాలనే కోరుకుందాం!'' కొండంత ఆశతో అన్నాడు రాంపండు.
- ఇమంది రామారావు

Taags :
No comments:
Post a Comment