తీవ్రతరం కానున్న ప్రపంచ మాంద్యం
Posted On Wed 26 Aug 23:06:10.459447 2015
ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థలో సంక్షోభం మొదలై ఏడు సంవత్సరాలయింది. ఇప్పటికీ అది సంక్షోభం నుంచి కోలుకునే సూచనలు కన్పించడం లేదు. అంతేకాక ఆ సంక్షోభం మరింత తీవ్రతరమౌతోంది. అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలు సంక్షోభంలో కూరుకుపోయా యన్నది నిజం. ఆ సంక్షోభం నేడు ప్రపంచవ్యాప్తమౌతున్నది. మొదట్లో చైనా, భారత్ వంటి దేశాలు ఈ సంక్షోభ ప్రభావం నుంచి తప్పించుకున్నట్లు కన్పించినా అది ఈ దేశాలకు కూడా వ్యాపించింది. భారతదేశ స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు మందగిస్తున్నది. పారిశ్రామిక రంగంలో పూర్తి స్థాయి స్తబ్ధత నెలకొన్నది. 2014-15లో పారిశ్రామిక రంగ వృద్ధి రేటు 2.3 శాతం. ఇది చాలా తక్కువే అయినప్పటికీ 2013-14లోని -0.8 వృద్ధి రేటుతో పోల్చుకుంటే మెరుగైనదే. దీనినే సాధారణంగా కోలుకోవటంగా భావిస్తున్నారు. అయితే మనకు అంతిమంగా అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మే నెలలో వృద్ధి రేటు 2.2 శాతం ఉన్నది. చైనాలో కూడా స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు మందగిస్తున్నది. ఆ దేశంలోని పారిశ్రామిక రంగం చాలా కాలంపాటు బ్రహ్మాండమైన వృద్ధిని సాధించింది. లాటిన్ అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ముడిసరుకులు కొనే దేశంగా చైనా ఆవిర్భవించింది. చైనాలో పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుతుండటంతో ఆ దేశంలో ఏర్పడిన బూమ్ కారణంగా లాభపడిన తృతీయ ప్రపంచ దేశాలన్నీ ప్రతికూల ప్రభావానికి లోనవుతున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలు మెరుగుపడకపోవటంతో ఆర్థిక సంక్షోభం విశ్వవ్యాప్తమవుతున్నది. యూరో జోన్‌లో పరిస్థితి ఎలా ఉన్నదో అందరికీ తెలిసిందే. ఫ్రాన్స్‌తోపాటు దక్షిణ ఐరోపాను ఆర్థిక సంక్షోభం ముంచెత్తింది. కామెరాన్ ప్రభుత్వం విధిస్తున్న దారుణ పొదుపు విధానంతో బ్రిటన్ పడుతున్న క్షోభ కొనసాగుతున్నది.
తప్పు త్రోవ పట్టించే భావం
సంక్షోభానికి తాను అతీతమనే భావాన్ని అమెరికా కలిగిస్తున్నది. అయితే ఈ భావం తప్పుత్రోవ పట్టించేదే. 2015 జులైలో అమెరికాలో నిరుద్యోగం 5.3 శాతానికి తగ్గింది. సంక్షోభానంతరం అధికంగా పెరిగి, కార్మికుల సంఖ్యను బాగా కుదింపజేసిన 10 శాతంతో పోల్చినప్పుడు ఇది చాలా తక్కువ. అలా తగ్గటం మాంద్యం సంభవించిన కాలాలలో సహజం. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎటువంటి మెరుగుదలకు లోనైనప్పటికీ వాస్తవ నిరుద్యోగం రేటు చాలా ఎక్కువగా ఉంటూనే ఉన్నది. ఈ సంక్షోభానికి కొంచెం ముందు అమెరికాలో నిరుద్యోగం రేటు 5 శాతంగా ఉన్నది. జనాభాకు, ఉద్యోగితకు మధ్యగల నిష్పత్తి 63.3 శాతం ఉన్నది. అంటే జనాభాకు, కార్మికులకు మధ్య నిష్పత్తి 66.6 శాతంగా ఉంటుంది. ఈ సంఖ్యను అంగీకరిద్దాం. 2015 జులైలో జనాభాకు, ఉద్యోగితకు మధ్య నిష్పత్తి 59.2 శాతంగా ఉన్నది. సంక్షోభానికి కొంచెం ముందు జనాభాకు, ఉద్యోగితకు మధ్య నిష్పత్తి అంతే ఉన్నప్పుడు నిరుద్యోగం రేటు 11 శాతంగా ఉంటుంది! 11 శాతం నిరుద్యోగం రేటు ఉండవలసిన చోట 5.3 శాతం నిరుద్యోగం రేటు ఉండటం అనే వాస్తవం అనేకమంది కార్మికులు పని మానేసినట్లు తెలియజేస్తున్నది. క్లుప్తంగా చెప్పాలంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ కొద్దోగొప్పో మెరుగుపడినప్పటికీ అది సంక్షోభంలోనే ఉన్నది. గత ఏడు సంవత్సరాలుగా అమెరికన్ ఫెడ్(ఆర్థిక మంత్రిత్వ శాఖ) వడ్డీ రేటును సున్నాకు దగ్గరగా ఉంచినప్పటికీ పరిస్థితి ఇలాగే ఉన్నది. ఆర్థిక కార్యకలాపాల స్థాయిని పెంచేందుకు ఉద్దేశింపబడిన విత్త విధానాన్ని త్యజించారు. ద్రవ్య పెట్టుబడి ఆధిపత్యంలో ఉండి, 'విత్త బాధ్యత' చట్టంలేని, 'బంగారం'తో సమానమైన కరెన్సీ గల అమెరికా వంటి ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చటానికి విత్త విధానమే ఏకైక సాధనంగా ఉంటుంది. ఎందుకంటే అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెట్టుబడులు దేశం విడిచి వెళతాయనే భయం ఉండదు గనుక. అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ ఈ సాధనంతో సాధ్యమైనదంతా చేసింది. అయినప్పటికీ ఆశ్చర్యకరంగా ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న సూచనలు ఏమీలేవు. అమెరికా ఆర్థిక వ్యవస్థ కొద్దోగొప్పో మెరుగుపడిందంటే దానికి గల కారణం చమురు ధరలు తగ్గటమే. మెరుగుదలకు ప్రధాన వనరు ప్రైవేటు వినియోగ వ్యయమే తప్ప ప్రభుత్వ వ్యయంగాని, ప్రయివేటు పెట్టుబడికానీ కాదు. ఈ భారీ ప్రైవేటు వినిమయ వ్యయం చమురు ధరలు పడిపోవటంతో ఉత్తేజితమైంది. చమురును ప్రైవేటుగా వినియోగిస్తూ, కార్లపై ఆధారపడే అమెరికా వంటి ఆర్థిక వ్యవస్థలో కుటుంబాలకు ఇదొక యాదృచ్ఛిక లాభం. ఈ అరుదైన అవకాశాన్ని వినియోగించుకుని అమెరికన్లు స్థానిక ఉత్పత్తులను, సేవలను కొంటున్నారు. అయితే ఉత్పత్తిలో ఈ పెరుగుదల వల్ల ప్రైవేటు పెట్టుబడులు అధికం కాకపోవటం ఆశ్చర్యం కలిగించే విషయం. అంటే ఈ పెరుగుదల కొనసాగుతుందనే నమ్మకం పెట్టుబడిదారులకు లేదనే సూచన దీనిలో ఉన్నది. కాబట్టి హారీ మాగ్‌డోఫ్ చెప్పినట్లుగా మనం 1930వ దశకం చివర్లో అమెరికాలో నెలకొన్న స్థితిని తలపింపజేసే పరిస్థితిలో ఉన్నాం.
ప్రాథమిక సరుకుల ఉత్పత్తిదారులపై విపరీత భారం
అమెరికాలో వినిమయ వ్యయం పెరగటం గురించి ఒక విషయాన్ని గమనించాలి. ఇది చమురు ధరతో ముడిబడి ఉన్నదని మనకు తెలుసు. అది తిరిగి ఇతర ప్రాథమిక సరుకుల ధరలతో విడదీయరాని సంబంధాన్ని కలిగి ఉంటుంది. అంటే దీని పర్యవసానంగా వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలు ఎగుమతి చేస్తున్న ఈ సరుకుల ధరలు తగ్గుతాయి. ఆ విధంగా అమెరికా ఆర్థిక వ్యవస్థలో జరిగే పరిమిత పునరుద్ధరణ భారం వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలపై తగ్గిన ప్రాథమిక సరుకుల ధరల రూపంలో పడుతుంది. అభివృద్ధిచెందిన దేశాలు తమ సంక్షోభ భారాన్ని వలస దేశాల ఆర్థిక వ్యవస్థల పైకి బదిలీ చేస్తాయనే ఆలోచన 1930వ దశకంలో కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ సిద్ధాంతీకరణలో ప్రధాన పాత్రను పోషించింది. అయితే 'కీన్స్ విప్లవం'తో సమిష్టి డిమాండ్‌కు వచ్చిన ప్రాధాన్యత వల్ల ఇది కనుమరుగయింది. పారిశ్రామిక ఉత్పత్తులకు, ప్రాథమిక సరుకులకు మధ్య వ్యాపార షరతులు, అభివృద్ధి చెందిన దేశాలలోని సమిష్టి డిమాండ్ అనే ఈ రెండు సమస్యలను సైద్ధాంతికంగా అర్థవంతంగా జోడించలేకపోవటమే దీనికి కారణం. అయితే ప్రస్తుత సంధికాలం ఈ రెండు సమస్యల మధ్య సంబంధాన్ని బహిరంగపరుస్తున్నది. నేటి పరిస్థితులలో ప్రాథమిక సరుకులకు వ్యతిరేకంగా వ్యాపార షరతులు మారినప్పుడు అభివృద్ధిచెందిన దేశాలలో సమిష్టి డిమాండ్ పెరుగుతుంది. చమురు, ఇతర ప్రాథమిక సరుకులపై ఎక్కువగా ఖర్చుచేయనవసరం లేనందున ఈ దేశాలలోని వినియోగదారులు తమ దేశాల ఉత్పత్తులను కొనటానికి మొగ్గుచూపటంతో ఈ పెరుగుదల సంభవిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే అమెరికాలో ప్రస్తుతం పరిమితంగానైనా పునరుద్ధరింపబడిన డిమాండ్‌తో ప్రాథమిక సరుకుల ఉత్పత్తిదారులపై భారం పెరిగింది.
అయితే అమెరికాలో ప్రస్తుతం పరిమితంగా పునరుద్ధరింపబడిన ఈ డిమాండ్ కూడా ఎంతో కాలం నిలిచే అవకాశం లేదు. ఇంతకు ముందు వివరించిన ప్రాథమిక సరుకుల ధరలు ప్రపంచవ్యాప్తంగా పడిపోవటం వల్ల అమెరికా ఆందోళన చెందవలసిన విషయాలలో ద్రవ్యోల్బణం లేదు. ఏ కొంచెం ద్రవ్యోల్బణం వచ్చినా ద్రవ్య సంబంధిత ఆస్తుల విలువ తగ్గుతుందని భయపడే ద్రవ్య పెట్టుబడి ప్రమాణాలతో చూసినా అమెరికాలో ద్రవ్యోల్బణం 'ఆందోళన' చెందేంతగా లేదు. అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ ప్రమాణాల ప్రకారం 'ద్రవ్యోల్బణ లక్ష్యం' 2 శాతం. ప్రస్తుతం అమెరికాలో ద్రవ్యోల్బణం 1.5 శాతం దరిదాపుల్లోనే ఉన్నది. అయినప్పటికీ వడ్డీ రేటు సున్నా, సున్నాకు సమీపంలో ఉండటం ద్రవ్య పెట్టుబడికి ఇష్టం ఉండదు గనుక వడ్డీ రేట్లను పెంచమని అది అమెరికన్ ఫెడ్‌పై ఒత్తిడి చేస్తున్నది. దీనిపై నిర్ణయాన్ని ఫెడ్ సెప్టెంబరు దాకా వాయిదా వేసింది. అయితే అప్పటికి వడ్డీ రేట్లను ఎంతో కొంత పెంచే అవకాశం ఉన్నది. అది జరిగినప్పుడు ప్రపంచ మాంద్యం మరింతగా తీవ్రతరమౌతుంది.
డాలరు బలోపేతం కావటం ఇప్పటికే మొదలయింది. అది మరింతగా బలోపేతమైతే విదేశీ చెల్లింపుల సమతూకం చెందిన అమెరికా కరెంటు ఖాతా లోటు పెరుగుతుంది. దానితో అమెరికాలో సమిష్టి డిమాండ్ తగ్గుతుంది. అమెరికాలో మాంద్యం తీవ్రతరమవుతుంటే మిగతా ప్రపంచంలో కూడా మాంద్యం తీవ్రతరమవుతుంది. ఎందుకంటే అమెరికాలో వడ్డీ రేట్లు పెంచిన దానికి ప్రతిస్పందనగా మిగిలిన దేశాలలో కూడా వడ్డీ రేట్లు పెంచవలసి ఉంటుంది కనుక, తత్ఫలితంగా డాలరుతో పోల్చినప్పుడు ప్రపంచ దేశాల కరెన్సీల విలువ సాపేక్షంగా తగ్గుతుంది. పర్యవసానంగా అమెరికాకు ప్రపంచ దేశాల నికర ఎగుమతులు పెరుగుతాయి. అయితే కరెన్సీల విలువ తగ్గడంతో జతై ఉండే ద్రవ్యోల్బణం వల్ల ప్రభుత్వాలు తమ వ్యయాన్ని తగ్గించుకోవాలనే ఒత్తిడికి గురవుతాయి. కరెంటు ఖాతా లోటును పూడ్చుకోవటానికి ఈ దేశాలు 'పొదుపు' చర్యలను చేపట్టవలసి ఉంటుంది.
క్లుప్తంగా చెప్పాలంటే పెట్టుబడిదారీ వ్యవస్థలో సంక్షోభం తీవ్రతరమయ్యే అవకాశం కనపడుతున్నది. ఈ సంక్షోభం మొదలైన తరువాత ఏడు సంవత్సరాలకు కూడా అది కొనసాగుతూనే ఉన్నది. ఈ కాలమంతా వడ్డీ రేట్లను సున్నాకు కుదించినప్పటికీ పరిస్థితి మారలేదు. ద్రవ్య పెట్టుబడి తెస్తున్న ఒత్తిడి వల్ల ఈ వడ్డీ రేట్లను పెంచబోతున్నట్లుగా తెలుస్తున్నది. దీనితో సంక్షోభం మరింతగా పెరగటం ఖాయం. చాలామంది వామపక్షవాదులతో సహా ఎక్కువమంది ఊహించేదానికంటే కూడా నేటి పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయినట్లు కన్పిస్తున్నది.
- ప్రభాత్ పట్నాయక్

Taags :
No comments:
Post a Comment