Tuesday, August 18, 2015

ఢిల్లీలో రూ.80 న్యూఢిల్లీ

ఆకాశాన్నంటిన ఉల్లి ధరలు

Posted On 3 hours 58 mins ago
ఆకాశాన్నంటిన  ఉల్లి ధరలు
- ఢిల్లీలో రూ.80
                     న్యూఢిల్లీ: వినియోగ దారుల కష్టాలను ఉల్లిపాయ లు మరింత పెంచుతున్నాయి. సరఫరా తగ్గిపోవడంతో దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం వాటి ధర రూ. 80కి చేరుకుం ది. ధరలను అదుపు చేయాలని ప్రభుత్వం ప్రయత్నించినా సరే అవి పైపైకే పోతున్నాయి. సోమవారం ఆజాద్‌పూర్‌ హౌల్‌సేల్‌ మండీలో వాటి రేటు ఎక్కువలో ఎక్కువగా రూ. 48గా పలికింది. చిల్లర ధరలు మాత్రం పెరిగిపోయాయి. కొత్త పంట చేతికి రావడానికి ఇంకా సమయం ఉండడం వల్ల ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశముందని, కొన్ని వారాల వరకు ఈ పెరుగుదల కొనసాగుతుందని ఆజాద్‌పూర్‌ అగ్రికల్చర్‌ ప్రొడ్యూస్‌ మార్కెటింగ్‌ కమిటీ (ఏపిఎంసి) సభ్యు డు రాజేంద్ర శర్మ తెలిపారు. మహారాష్ట్రలోని లాసాల్‌గావ్‌ లోని ఆసియాలోనే అతి పెద్దదైన ఉల్లిపాయల మార్కెట్‌లో హౌల్‌సేల్‌ ధర కిలోకు రూ. 43కు పెరిగిందని, ఈ ఏడాది ఇంతవరకు అతి ఎక్కువ ధర ఇదేనని, పంట సరఫరా చాలా తక్కువగా ఉండడంతో ధర పెరిగిపోతోందని ఆయన పేర్కొన్నారు. హౌల్‌సేల్‌ ధరలో పెరుగుదల సహజంగానే చిల్లర ధరలో ప్రభావం చూపుతోందని శర్మ అన్నారు.

No comments:

Post a Comment