Saturday, August 1, 2015

News.prajasakti

గతి తప్పిన న్యాయం..!

Posted On 22 hours 5 mins ago
గతి తప్పిన న్యాయం..!
-  న్యాయమూర్తి జోసెఫ్‌ వాదనను పట్టించుకోలేదు
-  మాలెగావ్‌ సంఝౌతా కేసుల మాటేమిటి?
-  మెమన్‌ ఉరిశిక్షపై సిపిఎంఇండియా
న్యూస్‌నెట్‌వర్క్‌, న్యూఢిల్లీ:
            యాకూబ్‌ మెమన్‌ను ఉరితీయటం ద్వారా న్యాయం గతి తప్పిందన్న భావనకు ఆస్కారం ఏర్పడుతున్నదని సిపిఎం అధికార పత్రిక పీపుల్స్‌ డెమొక్రసీ వ్యాఖ్యానించింది. ఉరిశిక్షపడిన వ్యక్తికి శిక్షను మినహాయించేందుకు అనువైన పరిస్థి తులున్నా అతడిని ఉరితీయటంపై వ్యాఖ్యానిం చేందుకు ఇంతకన్నా మాటలు దొరకటం లేదని పీపుల్స్‌డెమొక్రసీ తన తాజాసంచిక సంపాద కీయంలో ఆవేదన వ్యక్తంచేసింది. ముంబయి పేలుళ్లలో దాదాపు 257 మంది ప్రణాలను బలి తీసుకున్న ఘటనలో యాకూబ్‌ మెమన్‌ దోషి అనేందుకు ఎటువంటిసందేహం అవసరం లేదని, అయితే ఈ నేరంలో అతడి పాత్ర మరణశిక్ష విధించాల్సినంత తీవ్రత కన్పించటం లేదని పీపుల్స్‌ డెమొక్రసీ అభిప్రాయపడింది. ఈ కేసులో పోలీసులు అరెస్ట్‌ చేసిన 11 మందిలో పదిమందికి న్యాయ వ్యవస్థ మరణశిక్షను రద్దుచేసి యావజ్జీవిత శిక్షగా మార్చిన విషయాన్ని ప్రస్తావించిన పత్రిక సంపా దకుడు ప్రకాశ్‌ కరత్‌ మెమన్‌కు కూడా యావజ్జీవిత శిక్షను విధించి వుంటే అటు బాధితులకు, ఇటు నేరస్తులకు కూడా న్యాయం జరిగిందన్న భావన కలిగేదన్నారు. ఈ కుట్రకు ప్రధాన సూత్రధారులైన యాకూబ్‌ సోదరుడు టైగర్‌ మెమన్‌, దావూద్‌ ఇబ్రహీంల నుండి చట్టం అతడిని ఏకాకిని చేసిందని ఈసంపాదకీయం వ్యాఖ్యానించింది. యాకూబ్‌ మెమన్‌ పాకిస్తాన్‌ నుండి తిరిగి వచ్చి అధికారులకు లొంగిపోవటం ద్వారా వారికి సహకరించేందుకు సిద్ధమయ్యాడని, కుట్రదారులకు పాకిస్తాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ ఏ విధంగా సహకరించిందో అమూల్యమైన ఆధారాల ద్వారా వివరించాడని, ఈ వాస్తవాన్ని మాజీ సీనియర్‌ ఇంటెలిజెన్స్‌ అధికారి బి రామన్‌ కూడా అంగీకరించారని గుర్తు చేసింది. ఈ వాస్తవాలను పట్టించుకోకుండా సుప్రీంకోర్టు యాకూబ్‌ రివిజన్‌ పిటిషన్‌ను కొట్టివేయటం విచారక రమని పేర్కొంది. అంతేకాక యాకూబ్‌ దాఖలు చేసిన క్యూరేటివ్‌ పిటిషన్‌ను కూడా ముగ్గురు సభ్యుల ధర్మాసనం కొట్టివేయటం, ముఖ్యంగా విధానపరమైన లోపాలపై ధర్మాసనంలో సభ్యుడైన న్యాయమూర్తి కురియన్‌ జోసెఫ్‌ లేవనెత్తిన అభ్యంతరాలను సర్వోన్నత న్యాయస్థానం పట్టించుకోకపోవటం దురదృష్టకరమని పీపుల్స్‌ డెమొక్రసీ సంపాదకీయం విచారం వ్యక్తం చేసింది. కనీసం రాష్ట్రపతి అయినా రాజ్యాంగంలోని 72వ అధికరణం ద్వారా తనకు లభించిన అసాధారణ అధికారాలను వినియోగించి మరణ శిక్షను రద్దుచేసి వుంటే యాకూబ్‌ కుటుంబ సభ్యులకు కొంత ఊరట లభించి వుండేదని, దురదృష్టవశాత్తూ ఇది కూడా చేయలేదని పత్రిక పేర్కొంది. యాకూబ్‌కు ముందు గతంలో అఫ్జల్‌ గురును 2013 మార్చిలో ఉరితీసిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పటికీ శిక్ష అమలుపై చూపిన ఆరాటం దాని అసలు ఉద్దేశాలను తెలియజేస్తోందని వివరించింది. మరణశిక్షలపై దాఖలైన అప్పీళ్ల విషయంలో సర్వోన్నత న్యాయస్థానం తీసుకున్న కొన్ని నిర్ణయాలు, ధర్మాసనంలో సభ్యులైన న్యాయ మూర్తులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు అసమగ్రంగా వున్నాయని వ్యాఖ్యానించింది. గత ఏడాది కూడా సుప్రీంకోర్టు ఉగ్రవాద సంబంధిత కొన్ని ప్రధాన కేసుల్లో విదించిన మరణశిక్షలను రద్దు చేసిందని, ముఖ్యంగా మాజీ ప్రధాని రాజీవ్‌ హత్యకేసువంటి అతి ప్రధానమైనకేసుల్లో సైతం దోషులకు మరణ శిక్షను రద్దుచేసి యావజ్జీవిత శిక్షగా మార్చిందని కరత్‌ తన సంపాదకీయంలో గుర్తుచేశారు. తరువాత ఉగ్రవాద సంబంధిత పేలుడు కేసులో అరెస్టయిన దేవేందర్‌పాల్‌సింగ్‌ భుల్లార్‌ కూడా మరణశిక్ష నుండి మినహాయింపు పొంది యావజ్జీవిత ఖైదీగా మారిపోయాడని వివరించింది. ఈ రెండు కేసుల్లోనూ తమిళనాడు, పంజాబ్‌ల నుండి రాజ కీయంగా వచ్చిన గట్టి వత్తిడి కారణంగానే ఈ మిన హాయింపు లభించిందని తెలిపింది. వాస్తవానికి 2004 నుండి గడచిన పదకొండేళ్ల కాలంలో ఇప్పటి వరకూ ముగ్గురు ఖైదీలు మాత్రమే ఉరికంబం ఎక్కారని, పాకిస్తాన్‌ జాతీయుడైన అజ్మల్‌ కసబ్‌ను మినహాయిస్తే మిగిలిన ఇద్దరూ అఫ్జల్‌ గురు, యాకూబ్‌ మెమన్‌ ముస్లింలేనని గుర్తుచేసింది. మన దేశ న్యాయవ్యవస్థలో తాము వివక్షకు గురవు తున్నామన్న భావనకు ఈ వాస్తవం మూలకారణ మవుతున్నదని దీనిని ఒవైసీ వంటి వారు మతోద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు ఉపయోగిం చుకుంటున్నారని వివరించింది. ఉగ్రవాద నిందితుల పట్ల బిజెపి, శివసేన తదితరులు ప్రదర్శిస్తున్న రక్త దాహం ఇందుకు భిన్నమైనదని ఈ సంపాదకీయం పేర్కొంది. అజ్మీరీ షరీఫ్‌, మాలేగావ్‌, సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ పేలుళ్ల వంటి ఘటనలను పరిశీలిస్తే హిందూత్వ ఉగ్రవాదం మనకు కన్పిస్తుందని, ఇందు లో ప్రమేయం వున్న నిందితులకు మరణశిక్ష మాట అటుంచితే కనీసం శిక్షలైనా పడతాయా అన్నది సందేహాస్పదమేనని పత్రిక వ్యాఖ్యానించింది. మరణ శిక్షలను రద్దు చేయాలని సిపిఎం దీర్ఘకాలంగా చేస్తున్న డిమాండ్‌ ప్రాధాన్యతను యాకూబ్‌మెమన్‌ ఉదంతం మరోసారి మన కళ్లకు కడుతోందని పీపుల్స్‌ డెమొక్రసీ గుర్తు చేసింది. మరణశిక్ష అన్నది ఏకపక్షమైనదని, అత్యంత అరుదైన ఈ ప్రక్రియకు న్యాయమూర్తులు విభిన్న భాష్యాలు చెబుతున్నారని వివరించింది. ఢిల్లీలోని నేషనల్‌ లా యూనివర్శిటీ నిర్వహించిన అధ్యయనం ప్రకారం మరణశిక్షకు గురవుతున్న వారిలో అధికశాతం మంది సామా జికంగా అణచి వేతకు గురవుతున్న వర్గాలకు చెందినవారేనని తెలుస్తు న్నదని పత్రిక తన సంపాదకీయంలో పేర్కొంది. అనేక మంది మాజీ న్యాయమూర్తులు కూడా మరణశిక్షకు వ్యతిరేకంగా గొంతు విప్పుతున్న ప్రస్తుత తరుణంలో ఈశిక్షను రద్దు చేయాలన్న డిమాండ్‌కు ప్రజాభిప్రాయాన్ని, పార్టీల మద్దతును కూడగట్టటం అవసరమని, సిపిఎం ఈ దిశగా తన వంతు కృషిని కొనసాగిస్తుందని పీపుల్స్‌ డెమొక్రసీ ఉద్ఘాటించింది.

No comments:

Post a Comment