Monday, August 31, 2015












ఉద్యమ విజయం

ఉద్యమ విజయం

Posted On Mon 31 Aug 22:41:25.17831 2015
         భూసేకరణ చట్టానికి ప్రతిపాదించిన వివాదాస్పద సవరణలను నరేంద్ర మోడీ ప్రభుత్వం విరమించుకోవడం రైతుల ప్రతిఘటనకు విజయం. కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా, పార్లమెంట్‌ ప్రక్రియను కాదని అత్యవసర ఆదేశాలు (ఆర్డినెన్స్‌) జారీ చేసి, ఆ తర్వాత వాటికి ఆమోదం పొందవచ్చనుకున్న బిజెపి సర్కారు కుటిల పన్నాగం బెడిసికొట్టింది. సోమవారంతో కాలం తీరిపోతుందన్న ఆర్డినెన్స్‌ స్థానంలో మరో ఆర్డినెన్స్‌ జారీ చేయబోమని ఆదివారం ఆకాశవాణిలో నిర్వహించిన 'మన్‌కీ బాత్‌'లో ప్రధాని చేసిన ప్రకటన సాదాసీదాగా రాలేదు. రైతుల నుంచి మిన్నంటుతున్న నిరసనలు, ప్రతిపక్షాల ఐక్య ప్రతిఘటనల ఉక్కిరిబిక్కిరికి తాళలేకనే చివరి నిమిషంలో ఎన్‌డిఎ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రైవేటు పెట్టుబడులకు భూసేకరణ చట్టం ప్రతిబంధకంగా ఉందంటూ కేంద్రం మార్పులు ప్రతిపాదించింది. కార్పొరేట్లకై ఆర్రులు చాస్తున్న బిజెపి పాలిత రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ వంటివి సైతం భూసేకరణ చట్టానికి సవరణలు చేయాలనడంతో మోడీ సర్కారు దూసుకెళ్లింది. రాజ్యసభలో ఎన్‌డిఎకు మెజార్టీ లేదని తెలిసినా ఎనిమిది మాసాల్లో మూడుసార్లు ఆర్డినెన్స్‌లు జారీ చేసి పార్లమెంట్‌ ప్రతిష్టను మంటగలిపింది. సభ సమావేశం కాని రోజుల్లో ప్రభుత్వాలు ఆర్డినెన్స్‌లు జారీ చేస్తాయి. ఆరునెలల్లోపు పార్లమెంట్‌ ఉభయసభల ఆమోదం పొందితేనే అవి చట్టాలవుతాయి. లేకపోతే కాలం చెల్లిపోతాయి. ఈ చిన్న విషయం 'వికాస పురుషుడి'కి తెలియకేంకాదు. నయానో భయానో మిత్రపక్షాలను, ప్రతిపక్షాలను లోబర్చుకొని గట్టెక్కవచ్చనే ఆలోచనతోనే మోడీ సర్కారు ఒకసారి కాదు మూడుసార్లు ఆర్డినెన్స్‌లు ఇచ్చింది. మెజార్టీ ఉన్నందున లోక్‌సభలో సునాయాసంగా బిల్లు ఆమోదం పొందినప్పటికీ మెజార్టీ లేని రాజ్యసభలో ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిపక్షాలతోపాటు, కొన్ని ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలు సైతం వ్యతిరేకించడంతో చేసేదిలేక సవరణలకు మోడీ 'రాంరాం' చెప్పారు. అసలు వాస్తవం ఇది తప్ప రైతులపై ప్రేమ ఉండి కాదు.
యుపిఎ హయాంలో నోయిడా సహా దేశంలో పలు చోట్ల బ్రిటిష్‌ కాలంనాటి నిర్భంద భూసేకరణ చట్ట ప్రయోగాన్ని రైతులు, నిర్వాసితులు ప్రతిఘటించారు. దీంతో సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా సంవత్సరం ముందు కాంగ్రెస్‌ సర్కారు 2013-భూసేకరణ చట్టం తెచ్చింది. కొన్ని లొసుగులున్నప్పటికీ రైతుల ప్రయోజనాలను పరిరక్షించే పలు అంశాలు ఆ చట్టంలో ఉన్నాయి. అభివృద్ధి మాటున కార్పొరేట్లకు తేరగా భూములు అప్పగించేందుకు మోడీ సర్కారు రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టేందుకు వెనుకాడలేదు. సులభంగా భూములు లాక్కునేందుకు 2013- భూసేకరణ చట్టానికి 13 సవరణలు ప్రతిపాదించడమే కాకుండా ఆర్డినెన్స్‌లు జారీ చేసింది. పలు రంగాల కోసం భూసేకరణకు ముందు రైతుల అంగీకారం అవసరం లేదని, సామాజిక ప్రభావ అధ్యయనం చేపట్టాల్సిన అవసరం లేదంటూ వివాదాస్పద మార్పులు ప్రతిపాదించింది. ఈ రెండు ప్రధాన సవరణలూ రైతులు, వ్యవసాయ కార్మికుల మనుగడకు, ఉనికికి అత్యంత ప్రమాదమైనవి. అందుకే బిజెపి సవరణలపై రైతుల్లో నిరసనలు ఎగసిపడ్డాయి. ఆందోళనలకు దడిసే రాష్ట్రాలు సవరణలను వ్యతిరేకించాయి. చివరికి కేంద్రమే ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం కూడా భూసేకరణపై చేయని విన్యాసం లేదు. పైన ఎన్‌డిఎ సర్కారు అండతో రాజధాని ప్రాంతంలో రైతులు ఇష్టపడకున్నా బలవంతంగా వేలాది ఎకరాలను సేకరించేందుకు ఒంటికాలిపై లేచింది. నోటిఫికేషన్‌ సైతం జారీ చేసింది. కేంద్రం ఎప్పుడైతే సవరణలపై తోకముడుస్తోందని పసిగట్టిందో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వ్యూహం మార్చింది. భూసేకరణకు వ్యతిరేకంగా పవన్‌ కళ్యాణ్‌ రంగంలోకి రావడం, ఆయన ఒక వైపు ప్రభుత్వాన్ని పొగుడుతూనే భూసేకరణ ఆపాలని కోరడం, ప్రభుత్వం వెనుకడుగు వేయడం నాటకీయంగా జరిగి పోయాయి. అప్పటి వరకు రైతుల పక్షాన పోరాడుతున్న వైసిపి, వామపక్షాలు, ప్రజాసంఘాలకు పేరు రాకుండా చేయడానికి ప్రభుత్వం చేసిన విన్యాసంగా ఉందిది. కేంద్రం చట్టానికి సవరణలు చేయకుంటే మూడు పంటలు పండే రాజధాని ప్రాంతంలో భూసేకరణ అసాధ్యం కనుక ప్రభుత్వం ఈ విన్యాసాలకు పాల్పడింది. రైతులు భూములివ్వడానికి అస్సలు ఇష్టపడట్లేదు కనుక అంగుళం కూడా సేకరించేవీలుండదు. ఈ వాస్తవాలకు మసిపూసేందుకు భూసేకరణపై దోబూచులాట మార్గాన్ని ఎంచుకొని గందరగోళపరుస్తోంది. సమీకరణే తమ విధానమని పల్లవి ఎత్తుకుంది. బీహార్‌ ఎన్నికలు, నీతిఆయోగ్‌ సూచన, ప్రతిపక్షాలు, మిత్రపక్షాల వ్యతిరేకత, రాజ్యసభలో మైనార్టీ అన్నీ కలగలవడం వలన చట్ట సవరణలపై బిజెపి సర్కారు వెనుకంజ వేసింది. తాము పూర్తిగా వెనక్కిపోలేదనే వెంకయ్యనాయుడి ప్రకటన, సలహాలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామనే ప్రధాని వక్కాణింపు చట్ట సవరణ కత్తి ఇంకా వేలాడుతోందని హెచ్చరిస్తున్నాయి. ఈ సంకేతాలతో రైతులు, కూలీలు, ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, అభ్యుదయవాదులు చట్టసవరణపై అప్రమత్తంగా ఉండి ఆ ప్రయత్నాలను ఐక్యంగా తిప్పికొట్టాలి.
Taags :

సార్వత్రిక సమ్మె దిగ్విజయానికై వేలాదిగా నిరసన ప్రదర్శనలు జరపండి! Posted On Mon 31 Aug 22:41:01.980456 2015

సార్వత్రిక సమ్మె దిగ్విజయానికై వేలాదిగా నిరసన ప్రదర్శనలు జరపండి!

Posted On Mon 31 Aug 22:41:01.980456 2015
      దేశంలోని ప్రధాన కార్మిక సంఘాలన్నీ కలిసి కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక చర్యలను నిరసిస్తూ సెప్టెంబర్‌ 2వ తేదీన సార్వత్రిక సమ్మెకై మే 26న పిలుపునిస్తే కేంద్ర కార్మిక సంఘాలతో చర్చలు జరపడానికి కేంద్ర ప్రభుత్వానికి మూడు నెలలు పట్టింది. ఆగస్టు 26, 27 తేదీల్లో కేంద్ర ఆర్థిక శాఖ, కార్మిక శాఖ మంత్రులతోపాటు మరో కేంద్ర మంత్రి కలిసి కేంద్ర కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపారు. తూతూ మంత్రంగా ఈ చర్చలు ముగిశాయి. ఉద్యోగ, కార్మికుల సమస్యల పట్ల, వారి ఆందోళన పట్ల కేంద్ర ప్రభుత్వం చాలా ఉదాసీనంగా ఉండటమేగాక బాధ్యతారాహిత్యంగా కూడా వ్యవహరిస్తోందని ఈ చర్చలు స్పష్టం చేశాయి. కార్మిక సంఘాల 12 కోర్కెల్లో ఏడింటికి తాము సానుకూలంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్‌ సబ్‌కమిటీ ప్రకటించింది. కానీ వాస్తవమేమంటే ఏడు కాదు కదా ఒక్క కోర్కెను కూడా పరిష్కరించాలనే చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వం లేదు అన్నది ఈ చర్చల్లో స్పష్టమైంది.
సరళీకరణ ఆర్థిక విధానాల అనంతరం పారిశ్రామిక రంగంలో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికుల సంఖ్య విపరీ తంగా పెరిగిపోయింది. ప్రస్తుత చట్టంలో ఉండే సానుకూల అంశాలు కూడా అమలు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం పూనుకోకపోవడం వల్ల తీవ్రమైన శ్రమ దోపిడీకి కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు చిరునామాగా మారారు. శాశ్వతమైన స్వభావం కలిగిన ఏ పనిలో కూడా కాంట్రాక్టు కార్మికులను వినియోగించరాదని ప్రస్తుతమున్న కాంట్రాక్టు కార్మికుల చట్టం స్పష్టం చేస్తోంది. అంతేగాక ఒకే రకమైన పనిలో ఒక శాశ్వత కార్మికుడు, ఒక కాంట్రాక్టు కార్మికుడు పనిచేస్తే శాశ్వత కార్మికుడికి ఇచ్చే వేతనం, అలవెన్సులకు సమానంగా అదే పనిలో ఉన్న కాంట్రాక్టు కార్మికుడికి కూడా వర్తింపజేయాలని ప్రస్తుత చట్టం చెబుతోంది. కానీ, పై అంశాలు ఏవీ అమలు జరగనందువల్ల కాంట్రాక్టు కార్మికులు ఏ హక్కులూ లేని బానిసలుగానూ, వెట్టిచాకిరీ కార్మికులుగానూ మిగిలిపో యారు. ప్రస్తుత చట్టాన్ని కఠినంగా అమలు జరిపి శాశ్వతమైన పనుల్లో ఉన్న కాంట్రాక్టు కార్మికులను, ఉద్యోగులను క్రమబద్ధీ కరించాలని, సమానపనికి సమాన వేతనం అమలు చేయాలని కార్మిక సంఘాలు కోరగా కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీక రించడం ప్రస్తుతం చేయలేమని, ఈ విషయాన్ని మరింత లోతుగా పరిశీలించాల్సి ఉందని సబ్‌కమిటీ స్పష్టం చేసింది. కనీసం సమాన పనికి సమాన వేతనమైనా ఇచ్చేలా నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరగా నిర్ణయించిన కనీస వేతనం మాత్రమే అమలు జరిపించగలమని ప్రభుత్వ ప్రతినిధులు చెప్పడం అన్యాయం. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఖజానా నుంచి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండానే కోట్లాది మంది కార్మికులకు మేలు జరిగేలా ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా న్యాయం చేయవచ్చని చెప్పినా ప్రభుత్వం చెవిన వేసుకోలేదు.
అలాగే కనీస వేతనంగా నెలకు రూ.15,000 నిర్ణయించాలని కార్మిక సంఘాల డిమాండ్‌ పట్ల కూడా ప్రభుత్వం ఇదే వైఖరి తీసుకున్నది. 2012లో జరిగిన 44వ జాతీయ కార్మిక మహాసభలో ఆనాటి ప్రభుత్వం, 2015లో జరిగిన 46వ జాతీయ కార్మిక మహాసభలో ఈనాటి ప్రభుత్వం కనీస వేతనాలను శాస్త్రీయంగా నిర్ణయించేందుకు అవసరమైన ప్రాతిపదికను ఏర్పాటు చేయడానికి అంగీకరించాయి. ఆ ప్రాతిపదిక ప్రకారం లెక్కవేస్తే ఈనాటి ధరల్లో కనీస వేతనం రూ.20 వేలుగా నిర్ణయించాలి. అయినప్పటికీ కార్మిక సం ఘాలు కనీసం రూ.15,000 అయినా నిర్ణయించమని ప్రభు త్వానికి వివరించాయి. కానీ మంత్రివర్గ సబ్‌కమిటీ మాత్రం కనీస వేతనం నెలకు రూ.7 వేలకు మించి ఇవ్వబోమని స్పష్టం చేసింది. చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే ఇంతకంటే ఎక్కువ వేతనాన్ని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగ, కార్మి కులు పొందుతు న్నారు. ఈ విషయం సబ్‌కమిటీ దృష్టికి తెచ్చినా ఇంతకంటే పెంచలేమనే వైఖరి తీసుకోవడాన్ని బట్టి కార్మిక వర్గం పట్ల వారిలో దాగి ఉన్న వ్యతిరేకతను మనం అంచనా వేసుకోవచ్చు.
కార్మిక చట్టాలను ఏకపక్షంగా సవరించి కార్మిక సంఘాల రెక్కలు కత్తిరించి, సమ్మె హక్కును కూడా లేకుండా చేసి, సమిష్టి బేరసారాలను బలహీన పరిచి ''హైర్‌ అండ్‌ ఫైర్‌'' విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. అందుకొరకై కార్మిక చట్టాల సవరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తిచే యడానికై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్ని స్తున్నాయి. ఈ చట్ట సవరణలను నిలిపివేయాలని అన్ని కార్మిక సంఘాలూ ముక్తకంఠంతో కోరుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం అందుకు అంగీకరించలేదు. త్రైపాక్షిక సంప్ర దింపులకు అవసరమైతే ట్రేడ్‌ యూనియన్లను పిలుస్తామని, అక్కడ తమ అభిప్రాయాలు చెప్పవచ్చని ప్రభుత్వం చెబుతూ కార్మిక సంస్కరణలు మాత్రం కొనసాగు తాయని స్పష్టం చేయడం ఈ ప్రభుత్వ నయవంచ నను బహిర్గతం చేస్తోంది.
అసంఘటితరంగంలోని కోటాను కోట్ల కార్మికుల సంక్షేమం కోసం ఒక సమగ్రమైన చట్టాన్ని రూపొందించి వారిని ఆదుకోవాలని కార్మిక సంఘాలన్నీ కోరగా భవన నిర్మాణ కార్మికులకు ఇఎస్‌ఐ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పడం తప్ప మిగతా ఎలాంటి హామీనీ సబ్‌కమిటీ ఇవ్వలేదు. అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, తదితర కార్మికులను చట్టబద్ధంగా కార్మికులుగా గుర్తించాలని, కనీస వేతనాలు అమలు జరపాలని, వారి సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు కోరగా, వారిని కార్మికులుగా గుర్తించడానికి, కనీసవేతనం అమలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. సంక్షేమ చర్యల విషయం పరిశీలిస్తామని చెప్పింది. అంతేగాక, ఈ పథకాలకు క్రమంగా కేంద్ర ప్రభుత్వం నిధులు తగ్గించినందున రాష్ట్రాల్లో కూడా ఈ కార్మికులకు న్యాయం జరగడం లేదని, కనీసం కేంద్ర బడ్జెట్‌ నుంచి ఈ పథకాలకు నిధులు పెంచాలని కోరినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేదు. ప్రైవేటీకరణను, ప్రభుత్వరంగ పరిశ్రమల వాటాల అమ్మకాలను నిలిపిy ేయాలని, రైల్వేలు, రక్షణ రంగాల్లో విచ్చలవిడి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతించరాదని, పిఎఫ్‌లో సభ్యులుగా ఉన్నవారికి కనీస పెన్షన్‌ రూ.3 వేలు నిర్ణయించాలని, ధరలను తగ్గించాలని, సార్వత్రిక ప్రజా పంపిణీని బలపర్చి ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించాలని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు నిర్దిష్ట మైన చర్యలు తీసుకోవాలని కోరినప్ప టికీ కేంద్ర ప్రభుత్వం ఈ కోర్కెలను ఏ మాత్రం పట్టించుకోలేదు. ఎలాంటి సమాధానమూ చెప్పలేదు. బోనస్‌ సీలింగ్‌లో కొద్దిపాటి రాయతీలు ఇస్తామనే మాట తప్ప ఇతరత్రా హామీలు ఏ విషయంలోనూ ఇవ్వలేదు.
కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కార్పొరేట్‌ శక్తులకు లొంగిపోయి వ్యవహరిస్తోంది. అసోచామ్‌, ఫిక్కిలాంటి సంస్థలు ఇచ్చిన అజెండాను అమలు చేస్తోంది. దీని వల్ల రాబోయే కాలంలో ఉద్యోగ, కార్మికులకు మరిన్ని తీవ్ర సమస్యలు రాబోతున్నాయి. ప్రభుత్వమే స్వయంగా కార్మిక హక్కులపై దాడి చేసి, తీవ్రమైన శ్రమ దోపిడీని అనుమతించడమేగాక నిర్బంధ శ్రమ చేయించేందుకు కూడా యజమానులకు స్వేచ్ఛను ఇవ్వాలని భావిస్తోంది. ఈ దాడిని ఎదుర్కొనేందుకు కార్మిక వర్గం సమైక్యంగా పూనుకోకపోతే రాబోయేవి మరిన్ని గడ్డురోజులే. అందుకే సెప్టెంబర్‌ 2 సార్వత్రిక సమ్మెను దిగ్విజయం చేయడం ద్వారా, వేలు, లక్షల సంఖ్యలో కార్మికులను వీధుల్లో సమీకరించడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన జవాబు చెప్పేందుకు కార్మిక వర్గం సిద్ధం కావాలి. సమరశీల పోరాటాల ద్వారా మాత్రమే ప్రభుత్వ దాడిని ఎదుర్కోగలం. సమైక్యంగా కార్మిక వర్గాన్ని ఉద్యమాల్లోకి కదిలించడమే దీనికి పరిష్కారం. సమ్మె చేసిన ప్రతి కార్మికుడు, ప్రతి ఉద్యోగిని వీధుల్లోకి రప్పించి భారీగా నిరసన ప్రదర్శనలు నిర్వహించడం ద్వారానే ప్రభుత్వానికి తగిన పాఠం చెప్పగలం. సిఐటియు సంఘాలు, నాయకులు సెప్టెంబర్‌ 2 కార్యక్రమాల్ని దిగ్విజ యం చేయడం ద్వారా ప్రభుత్వ సవాల్‌ను ఎదుర్కొం టామని ప్రతిజ్ఞ తీసుకోవాలని సిఐటియు కోరుతోంది.
- యంఎ గఫూర్‌
(వ్యాసకర్త సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)

మల్లో మధ్యతరగతి భారతీయులు Posted On Mon 31 Aug 22:40:18.511572 2015

మల్లో మధ్యతరగతి భారతీయులు

Posted On Mon 31 Aug 22:40:18.511572 2015
        మధ్య తరగతి వర్గం చైనా, దక్షిణ అమెరికా, తూర్పు యూరప్‌ దేశాలలో ఎక్కువగా ఉన్నారు. దీనికి విరుద్ధంగా భారతదేశం, ఆఫ్రికా దేశాల్లో చాలా తక్కువగా ఉన్నారు. చైనాలో 2001లో 3 శాతం ఉండగా 2011 నాటికి గణనీయంగా 18 శాతానికి చేరుకున్నారు. అంటే 20 కోట్ల మంది చైనీయులు రోజుకు 10 డాలర్లకు మించి ఆదాయం సంపాదిస్తున్నారు. మధ్యతరగతి వర్గం వారు ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో 31 శాతం నుంచి 51 శాతానికి పెరిగారు. తూర్పు యూరప్‌లో 2001లో 21 శాతం ఉన్న మధ్యతరగతివారు 2011 నాటికి 53 శాతానికి చేరు కున్నారు. ఇక్కడ మధ్యతరగతి వారు 3.9 కోట్ల మంది అద నంగా వచ్చి చేరారు. దక్షిణ అమెరికా, మెక్సికోలో 6.3 కోట్లకు చేరుకున్నారు. భారతదేశంలోని పేద రికం 35 శాతం నుంచి 25 శాతానికి తగ్గినా, మధ్యతరగతి కుటుంబీకుల శాతం కేవలం 1 శాతం నుంచి 3 శాతానికి మాత్రమే పెరిగారు. ప్రపంచంలో మధ్యతరగతి వర్గం కేవలం 13 శాతంతో సరిపెట్టుకుంటూ, మనదేశానికి వచ్చేసరికి 3 శాతంతోనూ, ఎక్కువ శాతం జనాభా ఊహల ప్రపంచంలో ఉన్న మధ్యత రగతిగా చెప్పుకోవటం వాస్తవ విరుద్ధం, భ్రమ మాత్రమే అనేది పెవ్‌ పరిశోధనా సంస్థ అధ్యయనం ద్వారా తెలుస్తున్నది.
మన దేశంలో మధ్యతరగతిని దృష్టిలో పెట్టుకుని, విద్యావిధానంలో 80 శాతం వరకూ మెడిసిన్‌, ఇంజనీరింగ్‌ వంటి కోర్సులకు అధిక ప్రాధాన్యతనిస్తూ వృత్తి విద్యా కోర్సులకు, వొకేషనల్‌ కోర్సులకు తక్కువ ప్రాధాన్యతనిస్తూ అటు చదువుకున్న ఇంజనీర్లకు పరిశ్రమల్లో ఉద్యోగాలు లేక ఇటు చేతివృత్తులకు, గృహ పరిశ్రమలకు ఆదరణ కరువై భారతదేశ ఉత్పత్తి నైపుణ్యత నానాటికీ మందగిస్తోంది. రానురానూ బ్లూకాలర్‌ ఉద్యోగాలకు ప్రాధాన్యత తగ్గుతూ, సర్వీసు రంగానికీ, దళారులకూ ప్రాధాన్యత పెరుగుతూ ఉత్పత్తిచేసిన రైతుకు గిట్టుబాటు ధర దొరకక వ్యవసాయరంగం సంక్షో భంలోకి నెట్టబడుతోంది. విద్యా విధానం పిరమిడ్‌ వలే వృత్తి కోర్సులతో ప్రారంభమై పైకి వెళ్లే కొలదీ తక్కువ శాతంలో ఇంజ నీరింగ్‌ వంటి కోర్సులు ఉండాలి. కాగా మనదేశంలో తిరగ బడిన పిరమిడ్‌ వలే ఉండటం బాధాకరం.
పెవ్‌ పరిశోధనా సంస్థ బృందం నాయకుడు రాకేష్‌ కొచ్చర్‌ ''గ్లోబల్‌ మధ్యతరగతి మనం ఆలోచించే దానికన్నా చిన్నదనీ, ఇది మనం అనుకున్నంత ఐశ్వర్యవంతం కానిదనీ, దీనికి తోడు ప్రపంచంలో ఇది కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరి మితమైనదనీ'' అంటున్నారు. ప్రపంచ జనాభాలో 50 డాలర్ల కంటే దినసరి ఆదాయం ఎక్కువగా ఉండి, 7 శాతం ఉన్న అధిక ఆదాయం గల ధనవంతులు యూరప్‌, ఉత్తర అమెరికాల్లో ఉన్నారు. వీరిలో 87 శాతం ఈ దేశాల్లోనే ఉండటం గమనార్హం. విచారించదగ్గ, ఆలోచించదగ్గ విషయం ప్రస్తుతం పెట్టుబ డిదారీ ఆర్థికవ్యవస్థ ''పేదరికం, అల్పాదాయం'' ను 71 శాతం జనాభాకు ఇచ్చిన బహుమతి. ''ఈ పెట్టుబడిదారీ ఆర్థికవ్యవస్థ అత్యధిక ప్రజానీకానికి అవసరమైన ఆదాయాన్ని సమకూర్చ లేదనేది వాస్తవంకాగా, 20 డాలర్లకన్నా తక్కువ ఆదాయం గలవారిని కూడా కలిపితే మొత్తం 84 శాతం జనాభా ఈ అల్పా దాయ జాబితాకు వస్తారు'' అని ఆర్థిక విశ్లేషకుడు అండ్రేడామిన్‌ అంటు న్నారు. ఈ 84 శాతం ప్రజానీకానికి విద్య, వైద్యం భార మై, అధిక ధరలతో, నిరుద్యోగ సమస్యలతో నివాసయోగ్యంలేక సమస్యల వల యంలో చిక్కుకుపో తున్నారు.
1. పేదలు (రోజుకు 2 డాలర్ల కంటే తక్కువ ఆదాయం కల్గినవారు) : 161.7 కోట్ల నుంచి 94.9 కోట్లకు తగ్గారు (29 శాతం నుంచి 15 శాతానికి తగ్గారు)
2. అల్పాదాయం కలవారు (రోజుకు 2 డాలర్లకు ఎక్కువ 10 డాలర్లకు తక్కువ ఆదాయం కలవారు) : 275 కోట్ల నుంచి 344.4 కోట్లకు పెరిగారు. అనగా ప్రపంచ జనాభాలో 50 శాతం నుంచి 56 శాతానికి పెరిగారు. పేదలు, అల్పా దాయం కల్గిన ప్రజలు కలిసి 71 శాతం ఉన్నారు. ప్రపం చపు జనాభాలో సింహభాగం వీరిదే.
3. మధ్య తరగతి ఆదాయం కలవారు (10 డాలర్లకు ఎక్కువ 20 డాలర్లకు తక్కువ) : 39.9 కోట్ల నుంచి 78.4 కోట్లకు పెరిగారు. నలుగురు సభ్యులున్న కుటుంబంలో వార్షి కాదాయం 14,600 డాలర్ల నుంచి 29,900 డాలర్లు కలవారు.
4. ఉన్నత మధ్యతరగతి ఆదాయం కలవారు. (20 డాలర్లకు ఎక్కువ 50 డాలర్లకు తక్కవ ఆదాయం కలవారు) : 7 శాతం నుంచి 9 శాతానికి పెరిగారు. ఇది 40.8 కోట్ల జనా భా నుంచి 58.4 కోట్లకు పెరిగిన జనాభాతో సమానం.
5. ధనికవర్గం వారు. (రోజుకు 50 డాలర్ల పైబడిన ఆదాయం కలవారు) : వీరు 6 శాతం నుంచి 7 శాతానికి పెరిగారు. ఇది 39.9 కోట్ల నుంచి 42.7 కోట్ల ప్రపంచ జనాభాతో సమానం.
- బుడ్డిగ జమిందార్‌ 
(వ్యాసకర్త ప్రోగ్రెసివ్‌ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు)

కార్పొరేట్లపై ఉన్న ప్రేమ కష్టజీవులపై లేదు

కార్పొరేట్లపై ఉన్న ప్రేమ కష్టజీవులపై లేదు

Posted On Mon 31 Aug 22:39:35.584807 2015
         రండిబాబూ రండి... భారతదేశంలో యువకార్మిక శక్తి కారుచౌకగా లభిస్తుందంటూ దేశ విదేశాల్లో తిరుగుతూ ప్రధాని నరేంద్రమోడీ కార్పొరేట్లను ఆహ్వానిస్తున్నారు. భారత ప్రజలు అనేక త్యాగాలు చేసి నిర్మించుకున్న ప్రభుత్వ రంగం, అందులో ముఖ్యమైన సేవా రంగం, మరో అతి ముఖ్యమైన ప్రకృతి ఇచ్చిన సంపదలు ఉన్నాయి. ఎన్ని లక్షల ఎకరాల భూమి కావాలన్నా ఇస్తాం, అన్ని రకాల పన్ను రాయితీలు ఇస్తామంటున్నారు. కార్పొరేట్‌ శక్తుల సంపద పెంపు కోసం అన్నీ తానై అడిగిన వారికి లేదనక, అడగని వారికి పిలిచి వడ్డించే కలియుగ దానకర్ణుడిలా మోడీ మారారు. గత ఎన్నికల్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చారో గానీ బడా పారిశ్రామిక, వ్యాపారవేత్తల (కార్పొరేట్ల) లాభాలు పెంచేందుకే కంకణం కట్టుకున్నారు. మరోవైపు కార్మిక చట్టాలను సవరించి కార్మికులను యజమానులకు బానిసలుగా తయారు చేయబోతున్నారు. అనారోగ్యాల పాలైన కష్టజీవుల ఆకలి చావులు, కార్మికులకు కనీస వేతనాలు, అసంఘటిత రంగ కార్మికుల సమగ్ర చట్టం లాంటి సమస్యలపై గత 15 నెలల కాలంలో ఒక్క సభలో ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే ఎవరిపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. బ్రిటిష్‌ ప్రభుత్వం, ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ కాలంలో కంటే ఉద్యోగ, కార్మికులకు వ్యతిరేకంగా నిరంకుశమైన చట్టాలు చేయబోతున్నారు.
నయా ఉదారవాద విధానాల పాలనలో దోపిడీకి ప్రధాన లక్ష్యం శ్రామికులే. ఈ విధానాలను అతివేగంగా అమలు జరిపిన చరిత్ర నరేంద్ర మోడీకే దక్కుతుంది. ఈయన గారు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కార్పోరేట్లకు వేల ఎకరాల భూములు చట్ట వ్యతిరేకంగా కట్టబెట్టారు. అదానీ గ్రూపుకు ముద్ర పోర్టు, ముద్ర సెజ్‌ల ఏర్పాటుకు 2013-14లో 16,750 ఎకరాల భూమిని రైతుల నుంచి లాక్కొని చదరపు మీటరు రూ.30కి కొంత భూమి, రూపాయికి మరి కొంత భూమిని మోడీ ప్రభుత్వం అమ్మింది. అదానీ గ్రూపు సదరు భూమిని ప్లాట్లుగా మార్చి ప్రభుత్వరంగానికి, ప్రభుత్వానికి చమీ వేల రూపాయలకు విక్రయించింది. ఎస్‌ఆర్‌ గ్రూపు కంపెనీ, టాటా కంపెనీలతో మోడీ ప్రభుత్వం ప్రేమ పూర్వకంగా ఒప్పందాలు చేసుకొంది. ఈ ఒప్పందాల ప్రకారం కోస్టల్‌ రెగ్యులేటరీ జోన్‌లోను, నోటిఫైడ్‌ అడవీ ప్రాంతంలోనూ ఉన్న 2,07,60,000 చ.మీ భూభాగాన్ని కట్టబెట్టింది. ఆ భూమిలో ఎలాంటి అభివృద్ధీ చేయరాదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. మోడీ ప్రభుత్వం రూ.20 లక్షలు జరిమానా చెల్లించి పై రెండు కంపెనీలకు భూమిని అప్పజెప్పింది. నానో కార్ల కంపెనీ బెంగాల్‌ నుంచి గుజరాత్‌కు రాబట్టడం కోసం రూ.33 వేల కోట్ల రాయితీలు ఇచ్చింది. వ్యవసాయానికి లేకుండా సాగునీటిని కూడా టాటా కంపెనీకి ఇచ్చింది. ఎల్‌ అండ్‌ టి కంపెనీకి పూజారియ, సూరత్‌లలో చ.మీ. రూ.3,500 ఉన్న భూమిని కేవలం చ.మీ రూపాయికే వేలం లేకుండా ఇచ్చింది. ఈ విధంగా అనేక కార్పొరేట్‌ కంపెనీలకు భూమి, నీరు, ఇతర ప్రకృతి ఇచ్చిన సంపదను అతి తక్కువ రేట్లకు విక్రయించినందున గుజరాత్‌ ప్రభుత్వ ఖజానాకు లక్ష కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని విమర్శలు వచ్చాయి. మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కార్పొరేట్ల సంపద ఎప్పుడూ పెరగనంతగా పెరిగింది. ఉదాహరణకు మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు 2002లో అదానీ గ్రూపు సంపద విలువ రూ.2,816 కోట్లు మోడీ ప్రాపంకంలో ఏకంగా రూ.35,881 కోట్లకు పెరిగింది. అభివృద్ధి అంటే ఇదేనని దేశ ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కార్పొరేట్ల సేవకు అంకితమైన మోడీ దేశంలోని ఉద్యోగ, కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చేందుకు చట్ట సవరణలు చేయాలని ఆరాటపడుతున్నారు. దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ ఇలాంటి చట్ట సవరణలు చేస్తేనే పెట్టుబడులు వస్తాయని తన కార్యాలయం నుంచి ఉత్తరాలు పంపారట. మోడీ పరిపాలనలో కార్మికులు సమ్మె చేసినా, వారిని ప్రోత్సహించినా రూ.50 వేల నుంచి రూ.6 లక్షల జరిమానాతో పాటు జైళ్లకు పంపే చట్టం చేసి కార్పొరేట్ల మెప్పు పొందాలని చూస్తున్నారు.
దేశంలో ఈయన గారి సంవత్సర పాలనలో రైతుల ఆత్మహత్యలు 26 శాతం పెరిగాయి. ఈ ఆత్మహత్యలకు కారణమైన మోడీకి, ఆయన మంత్రివర్గానికి జరిమానాలు, జైలు శిక్షలు వేసేలా చట్టాలు చేస్తారా? ఒక నిమిషానికి ఐదుగురు, రోజుకు 7 వేలు, సంవత్సరానికి 25 లక్షల మంది భారతీయులు ఆకలితో చనిపోతున్నారని ఐరాస వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రాం చెప్పింది. ఆకలి, అనారోగ్య కోరల్లో చిక్కుకున్న కష్టజీవులను ఆదుకునేందుకు ఒక చట్టం కూడా చేయలేదు. ఆకలి సూచికలో 199 దేశాల్లో భారతదేశం 94వ స్థానానికి దిగజారింది. ప్రపంచ ఔషధ నివేదిక ప్రకారం దేశంలో 64.90 కోట్ల మంది ప్రజలకు అత్యవసరమైన మందులు అందుబాటులో లేవని చెప్పింది. ప్రజారోగ్య వ్యవస్థ నామమాత్రంగా ఉన్నందున కష్టజీవుల కుటుంబాల్లో ఏటా 56 వేలకు పైగా మహిళలు ప్రసవించే సమయంలో చనిపోతున్నారు. మరోపక్క మొత్తం ఉత్పత్తి అయ్యే నికర విలువలో కార్మికుల వ్యయం 1991కి ముందు 30 శాతానికి పైగా ఉండేది. నేడు 10 శాతానికి తగ్గింది. పరిశ్రమల రంగ యజమానులు దాదాపు 90 శాతం లాభాలను దండుకుంటు న్నారు. ఎన్ని సమస్యలు ఉన్నా సంపద సృష్టిలో పాల్గొంటున్న 40 కోట్ల అసంఘటిత రంగ కార్మికుల గురించి మోడీ ఒక్కమాటైనా మాట్లాడడు. దేశంలో కార్మికులు సృష్టిస్తున్న సంపదతో పాటు, ప్రకృతి ఇచ్చిన సంపదను, ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టే కార్పొరేట్లపై ఉన్న ప్రేమ కష్టజీవులపై లేనందునే సెప్టెంబరు 2న దేశవ్యాప్త సమ్మెలో అందరూ పాల్గొని మోడీ ప్రభుత్వం కళ్లు తెరిపించాలి.
- ఇరిగినేని పుల్లారెడ్డి

ల్యాండ్‌ ఆర్డినెన్స్‌పై వెనుకంజ అందరి విజయం

ల్యాండ్‌ ఆర్డినెన్స్‌పై వెనుకంజ అందరి విజయం

Posted On 7 hours 24 mins ago
ల్యాండ్‌ ఆర్డినెన్స్‌పై వెనుకంజ అందరి విజయం
-  విపక్షాల ఐక్యతతోనే సాధ్యమైంది: ఏఐకెఎస్‌ 
       న్యూఢిల్లీ: విపక్షాలన్నీ ఏకతాటిపై నిలచి పోరాడినందునే వివాదాస్పద ల్యాండ్‌ ఆర్డినెన్స్‌పై మోడి ప్రభుత్వం వెనక్కు తగ్గిందని ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ అభిప్రాయపడింది. ఈ మేరకు జాతీయ రైతాంగానికి, భూమిపై ఆధారపడి జీవించే కార్మికులందరికీ అభినందనలు తెలిపింది. ఇది అందరి విజయంగా కిసాన్‌ సభ అభివర్ణించింది. పార్లమెంటులో ఏకపార్టీ ఆధిపత్యం కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో విపక్షాలన్నీ ఏకమై భూసేకరణ బిల్లుపై ప్రభుత్వాన్ని బెంబేలెత్తించడం దేశంలో ఇదే తొలిసారని ఎఐకెఎస్‌ పేర్కొంది. మోడీ ప్రభుత్వం భూసేకరణ చట్టంతో కార్పొరేట్లకు లాభాలు చేకుర్చేందుకు తమ జీవన భద్రత, ఆహారభద్రతను తాకట్టు పెడుతుందన్న విషయాన్ని గ్రహించి విపక్షాలకు మద్దతు నిచ్చారని తెలిపింది. భూసేకరణ ఆర్డినెన్స్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత ఎఐకెఎస్‌ దేశవ్యాప్తంగా 300 జిలాల్లో దీనికి సంబంధించిన సమగ్ర విషయాలతో కూడిన ప్రతులను పంచిపెట్టింది. దానికి వందలాది స్వచ్ఛంద సంస్థలు, వ్యవసాయ కార్మికులు, ఆదివాసీలు, భూమిపై ఆధారపడి బ్రతికే కార్మికుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించినట్లు ఎఐకెఎస్‌ పేర్కొంది. దీనికి అనుంధానంగానే ఢిల్లీలో 2015 ఫిబ్రవరి 24న భూ ఆధార్‌ ర్యాలీని నిర్వహించినట్లు తెలిపింది. ఏప్రిల్‌ 2, 2015న అన్ని రాజకీయపక్షాలతో నిరసన ప్రదర్శన నిర్వహించామని తెలిపింది. రాష్ట్ర స్థాయిలో పాదయాత్రలు, ర్యాలీలు, ఇంటింటికి వెళ్లీ సంతకాల సేకరణ తదితర విధుల్ని నిర్వర్తించినట్లు వివరించింది. ప్రభుత్వ నిబంధనల సవరణ చేసి ప్రవేపెట్టేందుకు ప్రయత్నించినపుడు విపక్షాల నుంచి ఇదే తరహా నిరసనలు వెల్లువెత్తాయని ఎఐకెఎస్‌ వివరిం చింది. దీనికి భూమి అధికార్‌ ఆందోళన్‌ యాత్రే పునాధిని వేసినట్లు ప్రకటించింది. ఇది భూసేకరణ చట్టంపైనే కాకుండా, భూమిపై ప్రజల హక్కుల పోరాటంగా కూడా ఎఐకెఎస్‌ అభివర్ణించింది. మే 5న ప్రభుత్వ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన ర్యాలీ కూడా ఇదే కోవ కిందకు వస్తుందని తెలిపింది. పార్లమెంటు వెలుపలా, లోపల విపక్షాలన్నీ ఏకతాటిపై నిలిచి పోరాడినందునే ప్రభుత్వం భూసేకరణపై వెనక్కు తగ్గిందనీ ఎఐకెఎస్‌ అభిప్రాయ పడింది. భూమి అధికార్‌ అందోళన్‌లోని ఎఐకెఎస్‌ సహా అన్ని సంస్థలు ప్రతి అంశంపై విస్తృతంగా చర్చించా యని పేర్కొంది. రాష్ట్రపతికి వినతి పత్రం ఇవ్వడం, ఎమ్‌పీలకు లేఖలు రాయడం చేశామని తెలిపింది. ప్రభుత్వ ప్రతిపా దనలు భూమిపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులకు వ్యతిరే కంగా ఉన్నాయని ఎఐకెఎస్‌ ఎలుగెత్తింది. ఇప్పటికే రోడ్లు, రైళ్లు రావాణా విస్తరణ మార్గాలు, సెజ్‌ల పేరుతో లక్షలాది ఎకరాల ప్రజల భూమిని దోచుకున్న ప్రభుత్వం ఇంకా మిగిలి ఉన్న కొద్ది భూమిని కూడా కార్పొరేట్లకు వడ్డించేందుకు సిద్ధపడుతున్నట్లు ఎఐకెఎస్‌ విమర్శించింది. దేశవ్యాప్తంగా ఉన్న తన యూనిట్లకు భూసేకరణ చట్ట విజయ యాత్రా ర్యాలీలను నిర్వహించాల్సిందిగా పిలుప ునిచ్చింది. విపక్షాల ఐక్యత ఇలాగే కొనసాగాలని, అదే జాతి నిర్మాణానికి సరైన మార్గమనీ తెలిపింది. ప్రభుత్వం భవిష్యత్తులో ఎలాంటి వివాదాస్పద చట్టాన్ని తీసుకొచ్చేందుకు భయపడుతుందనీ ఎఐకెఎస్‌ పేర్కొంది.

Wednesday, August 26, 2015

me / Editorial / Neti Vyasam తీవ్రతరం కానున్న ప్రపంచ మాంద్యం Posted On Wed 26 Aug 23:06:10.459447 2015

తీవ్రతరం కానున్న ప్రపంచ మాంద్యం

Posted On Wed 26 Aug 23:06:10.459447 2015
          ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థలో సంక్షోభం మొదలై ఏడు సంవత్సరాలయింది. ఇప్పటికీ అది సంక్షోభం నుంచి కోలుకునే సూచనలు కన్పించడం లేదు. అంతేకాక ఆ సంక్షోభం మరింత తీవ్రతరమౌతోంది. అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలు సంక్షోభంలో కూరుకుపోయా యన్నది నిజం. ఆ సంక్షోభం నేడు ప్రపంచవ్యాప్తమౌతున్నది. మొదట్లో చైనా, భారత్‌ వంటి దేశాలు ఈ సంక్షోభ ప్రభావం నుంచి తప్పించుకున్నట్లు కన్పించినా అది ఈ దేశాలకు కూడా వ్యాపించింది. భారతదేశ స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు మందగిస్తున్నది. పారిశ్రామిక రంగంలో పూర్తి స్థాయి స్తబ్ధత నెలకొన్నది. 2014-15లో పారిశ్రామిక రంగ వృద్ధి రేటు 2.3 శాతం. ఇది చాలా తక్కువే అయినప్పటికీ 2013-14లోని -0.8 వృద్ధి రేటుతో పోల్చుకుంటే మెరుగైనదే. దీనినే సాధారణంగా కోలుకోవటంగా భావిస్తున్నారు. అయితే మనకు అంతిమంగా అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మే నెలలో వృద్ధి రేటు 2.2 శాతం ఉన్నది. చైనాలో కూడా స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు మందగిస్తున్నది. ఆ దేశంలోని పారిశ్రామిక రంగం చాలా కాలంపాటు బ్రహ్మాండమైన వృద్ధిని సాధించింది. లాటిన్‌ అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ముడిసరుకులు కొనే దేశంగా చైనా ఆవిర్భవించింది. చైనాలో పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుతుండటంతో ఆ దేశంలో ఏర్పడిన బూమ్‌ కారణంగా లాభపడిన తృతీయ ప్రపంచ దేశాలన్నీ ప్రతికూల ప్రభావానికి లోనవుతున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలు మెరుగుపడకపోవటంతో ఆర్థిక సంక్షోభం విశ్వవ్యాప్తమవుతున్నది. యూరో జోన్‌లో పరిస్థితి ఎలా ఉన్నదో అందరికీ తెలిసిందే. ఫ్రాన్స్‌తోపాటు దక్షిణ ఐరోపాను ఆర్థిక సంక్షోభం ముంచెత్తింది. కామెరాన్‌ ప్రభుత్వం విధిస్తున్న దారుణ పొదుపు విధానంతో బ్రిటన్‌ పడుతున్న క్షోభ కొనసాగుతున్నది.
తప్పు త్రోవ పట్టించే భావం
సంక్షోభానికి తాను అతీతమనే భావాన్ని అమెరికా కలిగిస్తున్నది. అయితే ఈ భావం తప్పుత్రోవ పట్టించేదే. 2015 జులైలో అమెరికాలో నిరుద్యోగం 5.3 శాతానికి తగ్గింది. సంక్షోభానంతరం అధికంగా పెరిగి, కార్మికుల సంఖ్యను బాగా కుదింపజేసిన 10 శాతంతో పోల్చినప్పుడు ఇది చాలా తక్కువ. అలా తగ్గటం మాంద్యం సంభవించిన కాలాలలో సహజం. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎటువంటి మెరుగుదలకు లోనైనప్పటికీ వాస్తవ నిరుద్యోగం రేటు చాలా ఎక్కువగా ఉంటూనే ఉన్నది. ఈ సంక్షోభానికి కొంచెం ముందు అమెరికాలో నిరుద్యోగం రేటు 5 శాతంగా ఉన్నది. జనాభాకు, ఉద్యోగితకు మధ్యగల నిష్పత్తి 63.3 శాతం ఉన్నది. అంటే జనాభాకు, కార్మికులకు మధ్య నిష్పత్తి 66.6 శాతంగా ఉంటుంది. ఈ సంఖ్యను అంగీకరిద్దాం. 2015 జులైలో జనాభాకు, ఉద్యోగితకు మధ్య నిష్పత్తి 59.2 శాతంగా ఉన్నది. సంక్షోభానికి కొంచెం ముందు జనాభాకు, ఉద్యోగితకు మధ్య నిష్పత్తి అంతే ఉన్నప్పుడు నిరుద్యోగం రేటు 11 శాతంగా ఉంటుంది! 11 శాతం నిరుద్యోగం రేటు ఉండవలసిన చోట 5.3 శాతం నిరుద్యోగం రేటు ఉండటం అనే వాస్తవం అనేకమంది కార్మికులు పని మానేసినట్లు తెలియజేస్తున్నది. క్లుప్తంగా చెప్పాలంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ కొద్దోగొప్పో మెరుగుపడినప్పటికీ అది సంక్షోభంలోనే ఉన్నది. గత ఏడు సంవత్సరాలుగా అమెరికన్‌ ఫెడ్‌(ఆర్థిక మంత్రిత్వ శాఖ) వడ్డీ రేటును సున్నాకు దగ్గరగా ఉంచినప్పటికీ పరిస్థితి ఇలాగే ఉన్నది. ఆర్థిక కార్యకలాపాల స్థాయిని పెంచేందుకు ఉద్దేశింపబడిన విత్త విధానాన్ని త్యజించారు. ద్రవ్య పెట్టుబడి ఆధిపత్యంలో ఉండి, 'విత్త బాధ్యత' చట్టంలేని, 'బంగారం'తో సమానమైన కరెన్సీ గల అమెరికా వంటి ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చటానికి విత్త విధానమే ఏకైక సాధనంగా ఉంటుంది. ఎందుకంటే అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెట్టుబడులు దేశం విడిచి వెళతాయనే భయం ఉండదు గనుక. అమెరికన్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ఈ సాధనంతో సాధ్యమైనదంతా చేసింది. అయినప్పటికీ ఆశ్చర్యకరంగా ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న సూచనలు ఏమీలేవు. అమెరికా ఆర్థిక వ్యవస్థ కొద్దోగొప్పో మెరుగుపడిందంటే దానికి గల కారణం చమురు ధరలు తగ్గటమే. మెరుగుదలకు ప్రధాన వనరు ప్రైవేటు వినియోగ వ్యయమే తప్ప ప్రభుత్వ వ్యయంగాని, ప్రయివేటు పెట్టుబడికానీ కాదు. ఈ భారీ ప్రైవేటు వినిమయ వ్యయం చమురు ధరలు పడిపోవటంతో ఉత్తేజితమైంది. చమురును ప్రైవేటుగా వినియోగిస్తూ, కార్లపై ఆధారపడే అమెరికా వంటి ఆర్థిక వ్యవస్థలో కుటుంబాలకు ఇదొక యాదృచ్ఛిక లాభం. ఈ అరుదైన అవకాశాన్ని వినియోగించుకుని అమెరికన్లు స్థానిక ఉత్పత్తులను, సేవలను కొంటున్నారు. అయితే ఉత్పత్తిలో ఈ పెరుగుదల వల్ల ప్రైవేటు పెట్టుబడులు అధికం కాకపోవటం ఆశ్చర్యం కలిగించే విషయం. అంటే ఈ పెరుగుదల కొనసాగుతుందనే నమ్మకం పెట్టుబడిదారులకు లేదనే సూచన దీనిలో ఉన్నది. కాబట్టి హారీ మాగ్‌డోఫ్‌ చెప్పినట్లుగా మనం 1930వ దశకం చివర్లో అమెరికాలో నెలకొన్న స్థితిని తలపింపజేసే పరిస్థితిలో ఉన్నాం.
ప్రాథమిక సరుకుల ఉత్పత్తిదారులపై విపరీత భారం
అమెరికాలో వినిమయ వ్యయం పెరగటం గురించి ఒక విషయాన్ని గమనించాలి. ఇది చమురు ధరతో ముడిబడి ఉన్నదని మనకు తెలుసు. అది తిరిగి ఇతర ప్రాథమిక సరుకుల ధరలతో విడదీయరాని సంబంధాన్ని కలిగి ఉంటుంది. అంటే దీని పర్యవసానంగా వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలు ఎగుమతి చేస్తున్న ఈ సరుకుల ధరలు తగ్గుతాయి. ఆ విధంగా అమెరికా ఆర్థిక వ్యవస్థలో జరిగే పరిమిత పునరుద్ధరణ భారం వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలపై తగ్గిన ప్రాథమిక సరుకుల ధరల రూపంలో పడుతుంది. అభివృద్ధిచెందిన దేశాలు తమ సంక్షోభ భారాన్ని వలస దేశాల ఆర్థిక వ్యవస్థల పైకి బదిలీ చేస్తాయనే ఆలోచన 1930వ దశకంలో కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌ సిద్ధాంతీకరణలో ప్రధాన పాత్రను పోషించింది. అయితే 'కీన్స్‌ విప్లవం'తో సమిష్టి డిమాండ్‌కు వచ్చిన ప్రాధాన్యత వల్ల ఇది కనుమరుగయింది. పారిశ్రామిక ఉత్పత్తులకు, ప్రాథమిక సరుకులకు మధ్య వ్యాపార షరతులు, అభివృద్ధి చెందిన దేశాలలోని సమిష్టి డిమాండ్‌ అనే ఈ రెండు సమస్యలను సైద్ధాంతికంగా అర్థవంతంగా జోడించలేకపోవటమే దీనికి కారణం. అయితే ప్రస్తుత సంధికాలం ఈ రెండు సమస్యల మధ్య సంబంధాన్ని బహిరంగపరుస్తున్నది. నేటి పరిస్థితులలో ప్రాథమిక సరుకులకు వ్యతిరేకంగా వ్యాపార షరతులు మారినప్పుడు అభివృద్ధిచెందిన దేశాలలో సమిష్టి డిమాండ్‌ పెరుగుతుంది. చమురు, ఇతర ప్రాథమిక సరుకులపై ఎక్కువగా ఖర్చుచేయనవసరం లేనందున ఈ దేశాలలోని వినియోగదారులు తమ దేశాల ఉత్పత్తులను కొనటానికి మొగ్గుచూపటంతో ఈ పెరుగుదల సంభవిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే అమెరికాలో ప్రస్తుతం పరిమితంగానైనా పునరుద్ధరింపబడిన డిమాండ్‌తో ప్రాథమిక సరుకుల ఉత్పత్తిదారులపై భారం పెరిగింది.
అయితే అమెరికాలో ప్రస్తుతం పరిమితంగా పునరుద్ధరింపబడిన ఈ డిమాండ్‌ కూడా ఎంతో కాలం నిలిచే అవకాశం లేదు. ఇంతకు ముందు వివరించిన ప్రాథమిక సరుకుల ధరలు ప్రపంచవ్యాప్తంగా పడిపోవటం వల్ల అమెరికా ఆందోళన చెందవలసిన విషయాలలో ద్రవ్యోల్బణం లేదు. ఏ కొంచెం ద్రవ్యోల్బణం వచ్చినా ద్రవ్య సంబంధిత ఆస్తుల విలువ తగ్గుతుందని భయపడే ద్రవ్య పెట్టుబడి ప్రమాణాలతో చూసినా అమెరికాలో ద్రవ్యోల్బణం 'ఆందోళన' చెందేంతగా లేదు. అమెరికన్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ప్రమాణాల ప్రకారం 'ద్రవ్యోల్బణ లక్ష్యం' 2 శాతం. ప్రస్తుతం అమెరికాలో ద్రవ్యోల్బణం 1.5 శాతం దరిదాపుల్లోనే ఉన్నది. అయినప్పటికీ వడ్డీ రేటు సున్నా, సున్నాకు సమీపంలో ఉండటం ద్రవ్య పెట్టుబడికి ఇష్టం ఉండదు గనుక వడ్డీ రేట్లను పెంచమని అది అమెరికన్‌ ఫెడ్‌పై ఒత్తిడి చేస్తున్నది. దీనిపై నిర్ణయాన్ని ఫెడ్‌ సెప్టెంబరు దాకా వాయిదా వేసింది. అయితే అప్పటికి వడ్డీ రేట్లను ఎంతో కొంత పెంచే అవకాశం ఉన్నది. అది జరిగినప్పుడు ప్రపంచ మాంద్యం మరింతగా తీవ్రతరమౌతుంది.
డాలరు బలోపేతం కావటం ఇప్పటికే మొదలయింది. అది మరింతగా బలోపేతమైతే విదేశీ చెల్లింపుల సమతూకం చెందిన అమెరికా కరెంటు ఖాతా లోటు పెరుగుతుంది. దానితో అమెరికాలో సమిష్టి డిమాండ్‌ తగ్గుతుంది. అమెరికాలో మాంద్యం తీవ్రతరమవుతుంటే మిగతా ప్రపంచంలో కూడా మాంద్యం తీవ్రతరమవుతుంది. ఎందుకంటే అమెరికాలో వడ్డీ రేట్లు పెంచిన దానికి ప్రతిస్పందనగా మిగిలిన దేశాలలో కూడా వడ్డీ రేట్లు పెంచవలసి ఉంటుంది కనుక, తత్ఫలితంగా డాలరుతో పోల్చినప్పుడు ప్రపంచ దేశాల కరెన్సీల విలువ సాపేక్షంగా తగ్గుతుంది. పర్యవసానంగా అమెరికాకు ప్రపంచ దేశాల నికర ఎగుమతులు పెరుగుతాయి. అయితే కరెన్సీల విలువ తగ్గడంతో జతై ఉండే ద్రవ్యోల్బణం వల్ల ప్రభుత్వాలు తమ వ్యయాన్ని తగ్గించుకోవాలనే ఒత్తిడికి గురవుతాయి. కరెంటు ఖాతా లోటును పూడ్చుకోవటానికి ఈ దేశాలు 'పొదుపు' చర్యలను చేపట్టవలసి ఉంటుంది.
క్లుప్తంగా చెప్పాలంటే పెట్టుబడిదారీ వ్యవస్థలో సంక్షోభం తీవ్రతరమయ్యే అవకాశం కనపడుతున్నది. ఈ సంక్షోభం మొదలైన తరువాత ఏడు సంవత్సరాలకు కూడా అది కొనసాగుతూనే ఉన్నది. ఈ కాలమంతా వడ్డీ రేట్లను సున్నాకు కుదించినప్పటికీ పరిస్థితి మారలేదు. ద్రవ్య పెట్టుబడి తెస్తున్న ఒత్తిడి వల్ల ఈ వడ్డీ రేట్లను పెంచబోతున్నట్లుగా తెలుస్తున్నది. దీనితో సంక్షోభం మరింతగా పెరగటం ఖాయం. చాలామంది వామపక్షవాదులతో సహా ఎక్కువమంది ఊహించేదానికంటే కూడా నేటి పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయినట్లు కన్పిస్తున్నది.
- ప్రభాత్‌ పట్నాయక్‌

కార్మిక సంక్షేమం గాలికొదిలేసిన ప్రభుత్వాలు Posted On Wed 26 Aug 23:05:31.654997 2015

కార్మిక సంక్షేమం గాలికొదిలేసిన ప్రభుత్వాలు

Posted On Wed 26 Aug 23:05:31.654997 2015
          కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వాలు కార్మికుల ఓట్లతో గెలిచి గద్దెనెక్కాయి. ఎన్నికల ముందు ఈ రెండు పార్టీల నాయ కులు అనేక హామీలు ప్రక టించి కార్మికులను నమ్మించారు. ఇప్పుడు కార్మికుల సమస్యలను విస్మరించి కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తు న్నారు. దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాయడానికి రంగం సిద్ధం చేశారు. దేశంలోకి విదేశీ పెట్టుబడులు రావడానికి కార్మిక చట్టాలు ఇబ్బందిగా ఉన్నాయనే నెపంతో పెట్టుబడిదారుల లాభాల కోసం వాటిని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ''మేక్‌ ఇన్‌ ఇండియా'' పేరుతో విదేశీ కంపెనీలకు తలుపులు బార్లా తెరిచి దాసోహమంటున్నారు. కార్పొరేట్లు మన కార్మికశక్తిని దోచుకోవడానికి మరిన్ని అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ విధానాల అమలును రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లలో ప్రారంభిం చారు. నేనే మొదటి కార్మికుడిని అని చెప్పుకున్న చంద్రబాబు గుట్టుచప్పుడు కాకుండా శాసనసభలో కార్మికవ్యతిరేక చట్టాలను ఆమోదింపచేసుకుని కార్మిక వ్యతిరేకి అని నిరూపించుకున్నారు.
మహిళా సాధికారత మాటల్లోనే...
మహిళా సాధికారత గురించి మాట్లాడే పాలకులు మరో వైపు దానికి తూట్లు పొడుస్తున్నారు. దీనితో ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడుతోంది. ప్రభుత్వ అనుమతి లేకుండానే పరిశ్రమలను మూసివేసేందుకు, లేఆఫ్‌ చేసేందుకు, కార్మికులను పని నుంచి తొలగించేందుకు యజమానులకు అధికారం కల్పించారు. పని గంటలు 8 నుంచి 12కు పెంచి నిర్బంధంగా పని చేయించుకుంటున్నా పట్టించుకునే నాథుడే లేడు. పని ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు లేక అనారో గ్యాలకు గురవుతున్నారు. శ్రమదోపిడి మరింత పెరిగి మహిళ లపై పనిభారం పెరిగిపోయి నానా అవస్థలు పడుతు న్నారు. మహిళా కార్మికులు కూడా రాత్రి షిఫ్ట్‌లలో పని చేయా లని సవరణ చేశారు. దీనితో మహిళలకు రక్షణ కరువైంది. మహిళా కార్మికుల పట్ల ప్రభుత్వాలకు చీమకుట్టినట్లు కూడా లేదు. పాలకుల ఉద్దేశంలో మహిళా సాధికారత అంటే అర్థం ఇదే కాబో లు? ప్రభుత్వ పథకాలలో రేయింబవళ్ళు పనిచేస్తున్న లక్షలాది మంది స్కీమ్‌ వర్కర్లను కూడా ప్రభుత్వం మోసం చేస్తోంది.
దీనావస్థలో అసంఘటిత కార్మికులు
కార్మికుల కష్టార్జితమైన పిఎఫ్‌, పెన్షన్‌ సొమ్మును షేర్‌ మార్కెట్లకు తరలిస్తున్నారు. ఆరోగ్య బీమా పథకం పేరుతో కార్మికులను మోసం చేయడానికి కుట్రలు పన్నుతున్నారు. అసంఘటిత కార్మికులకు సమగ్రచట్టం చేసి సామాజిక భద్రత కల్పించాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకుంటోంది. అసంఘటిత కార్మికుల సంక్షేమానికి నిధులు కూడా కేటాయించడం లేదు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రపంచ బ్యాంకు విధానాల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరల మీద ప్రభుత్వ నియంత్రణ ఎత్తేశారు. రైల్వేఛార్జీలు పెంచారు. మళ్ళీ ఆర్‌టిసి ఛార్జీలు పెంచడానికి పూనుకుంటున్నారు. అధిక ధరలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. 45వ ఇండియన్‌ లేబర్‌ కాన్ఫరెన్స్‌ ఏకగ్రీవంగా చేసిన ప్రతిపాదన ప్రకారం వీరందరికీ కనీస వేతనం, ఇతర సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఎలాంటి చర్యలూ తీసుకోకపోగా పారితోషికాలు, ప్రోత్సాహకాలు, గౌరవ వేతనాల పేరుతో వెట్టచాకిరీ చేయించుకుంటున్నారు. వీరికి కనీస వేతనాలు పెంచాలని అడిగిన ప్రతి సందర్భంలోనూ అరెస్టులతో, నిర్బంధాలతో పోరాటాలను అణచివేస్తున్నారు. మరోవైపు కార్పొరేట్‌ కంపెనీలకు వేల కోట్ల రూపాయలు రాయితీలు కల్పిస్తున్నారు. అయినా పట్టుదలతో ప్రభుత్వ దమణకాండను ఎదుర్కొని మునిసిపల్‌, ఆర్టీసీ, అంగన్‌వాడీ కార్మికులు జీతాలు పెంచుకుని విజయం సాధించారు.
పోరాడి విజయం సాధించాలి
కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్ర టిడిపి ప్రభుత్వం మొత్తం కార్మిక వర్గంపైనే దాడికి పూనుకుంటున్నాయి. యూనియన్‌ ఏర్పాటు చేసుకునే హక్కు హరిస్తూ, సమ్మె హక్కలను నిషేదించి యజమానుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బ్రతికేలా చేస్తున్నాయి. కాబట్టి కార్మికవర్గం సమస్య లకు నిజమైన కారణం ప్రభుత్వం అనుసరించే విధానాలు తప్ప వేరే కాదు. ప్రజాసంక్షేమం కన్నా పెట్టుబడి దారుల లాభాలకే అధిక ప్రాధాన్యతనిచ్చే నయా ఉదారవాద విధానాలకు వ్యతిరే కంగా కార్మికవర్గం పోరాటం చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానా లను తిప్పికొట్టాలి. కార్మిక చట్ట సవరణలను వ్యతిరేకరంగా కార్మికవర్గం ఏకతాటిపైకి రావాలి. ప్రభుత్వ రంగాన్ని నీరుగార్చే విదేశీ పెట్టుబడులపై ఆంక్షలు విధించాలి. దినదిన గండంగా బతుకుతున్న అసంఘ టిత కార్మికులకు సమగ్రచట్టం చేసి, కనీస వేతనం రూ.15 వేలు ఇవ్వాలని నినదించాలి. ఇటువంటి పోరాటాలను ఉదృం చేయాల్సిన అవసనం ఆసన్నమైంది. కార్మికులందరూ ఐక్యంగా సంపూర్ణశక్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలి.
- ఎ. కమల
(వ్యాసకర్త సిఐటియు కృష్ణాజిల్లా కార్యదర్శి)
Taags :

Tuesday, August 25, 2015

శలు ఆవిరి

Posted On 6 hours 8 mins ago
ఆశలు ఆవిరి
- హోదాపై ప్రతికూలమే
- చట్టంలోని అంశాలూ నీతి అయోగ్‌కు 
- మరికొంతకాలం తప్పని నిరీక్షణ
- మాజీ ప్రధాని హామీకి ప్రత్యామ్నాయం : జైట్లీ 
- హోదాకంటే ఎక్కువ సాయం : బాబు
- ఢిల్లీ పర్యటనలో మళ్ళీ హామీలే!
వినతులివి
- ప్రత్యేకహోదా ఇవ్వాలి. 

Monday, August 24, 2015

సాక్షి వ్యాససాలు




ప్రమాద ఘంటిక Posted On Mon 24 Aug 23:17:51.010455 2015

ప్రమాద ఘంటిక

Posted On Mon 24 Aug 23:17:51.010455 2015
        సోమవారంనాటి భారతీయ స్టాక్‌ మార్కెట్‌ భారీ పతనం రానున్న ఆర్థిక సంక్షోభ తీవ్రతకు ప్రమాద ఘంటిక. దేశ మార్కెట్‌ చరిత్రలో బ్లాక్‌ మండే. నష్టాల సునామీలో మదుపర్లకు చెందిన సుమారు ఏడు లక్షల కోట్ల రూపాయలు ఆవిరయ్యాయని అంచనా. సెన్సెక్స్‌ 1,621.51 పాయింట్లు కోల్పోయి 25,741.56 పాయింట్ల వద్ద, నిఫ్టీ 490.95 పాయింట్లు కోల్పోయి 7,809 పాయింట్ల వద్ద ముగిశాయి. గడచిన ఏడేళ్లలో స్టాక్‌ మార్కెట్లు ఇంత భారీగా పతనం కావడం ఇదే ప్రథమం. సెన్సెక్స్‌ చరిత్రలో చోటు చేసుకున్న భారీ పతనాల్లో మూడవది. 2008 జనవరి 21 తర్వాత అతి పెద్ద నష్టం. 26 వేల పాయింట్ల దిగువకు చేరడం సంక్షోభ తీవ్రతను తెలియజేస్తోంది. సెన్సెక్స్‌ అతిపెద్ద పది పతనాల్లో ఎనిమిది ప్రపంచ ఆర్థిక మాంద్యం సంభవించిన 2008లో నమోదయ్యాయి. మళ్లీ ఆ స్థాయికి మార్కెట్లు పడిపోయిన విషయాన్ని గమనించాలి. గెయిల్‌, ఒఎన్‌జిసి, రిలయన్స్‌ ఇండిస్టీస్‌ సహా పలు ప్రఖ్యాత సంస్థల షేర్లు తొమ్మిది నుంచి పదిహేను శాతం మేర నష్టపోయాయంటే ఇక సాదాసీదా కంపెనీల పరిస్థితేంటో ఊహించవచ్చు. ఇదే సమయంలో అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో భారతీయ కరెన్సీ, రూపాయి విలువ రెండేళ్ల కనిష్టానికి పడిపోవడం ఆందోళనకరం. ఒక్క రోజే 68 పైసలు విలువ కోల్పోయి రూ.66.64కు చేరింది. స్టాక్‌ మార్కెట్‌లో సంక్షోభం వారం రోజుల క్రితం ప్రారంభమై సోమవారానికి పరా కాష్టకు చేరింది. ఆగస్టు 19 నుంచి ఇప్పటి వరకు రూ.9,42,557 కోట్ల విలువ కోల్పోయింది. వరుసగా పతనమవుతున్న రూపాయి మరింత చతికిలపడింది. మన ఆర్థిక వ్యవస్థకు ఢోకా లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ రఘురాం రాజన్‌ ఇచ్చిన భరోసాలు, ప్రకటనలు స్టాక్‌ మార్కెట్ల పతనాన్ని ఆపలేకపోయాయి. చేసేదిలేక ప్రపంచ మార్కెట్లలో నష్టాల ప్రభావం భారత్‌ మీద కూడా పడిందంటూ సన్నాయి నొక్కులు అందుకున్నారు. పరిస్థితులను సమీక్షించి, తగు చర్యలు తీసుకుంటామంటూ అనివార్యంగా సంక్షోభాన్ని అంగీకరించాల్సి వచ్చింది.
మన దేశమే కాదు ప్రపంచ మార్కెట్లు అమాంతం కుదేలు కావడానికి అమెరికా, చైనా, యూరప్‌ దేశాలు చేపట్టిన కరెన్సీ వార్‌ ప్రధాన కారణం. కరెన్సీ విలువ తగ్గించుకొని ఎగుమతులు పెంచుకుంటేనే మనుగడ సాగించగలమనే నిర్ణయానికొచ్చాయి ఆ దేశాలు. ఆర్థిక వ్యవస్థలో స్తబ్ధతను నివారించేందుకు చైనా తన కరెన్సీ యువాన్‌ విలువను వారం క్రితం తగ్గించింది. అక్కడి ప్రభుత్వం స్టాక్‌ మార్కెట్లకు మద్దతు ఇచ్చేందుకు పెన్షన్‌ నిధులను ఈక్విటీల్లో పెట్టుబడి పెడుతున్నట్లు వార్తలొచ్చాయి. ఆ ప్రభావం ఆసియా మార్కెట్లపై పడింది. షాంఘై, హాంగ్‌సెంగ్‌, నిక్కీ, తైవాన్‌, తదితర మార్కెట్లు సోమవారం ఒత్తిడికి గురయ్యాయి. అభివృద్ధికి చిరునామాగా తనకు తాను కీర్తించుకునే అమెరికాలో ఈ కాలంలో తయారీ రంగంలో వృద్ధి మందగించింది. ఈ ఏడాది ఆగస్టులో ఆ దేశ తయారీ రంగం రెండేళ్ల కనిష్టానికి పడిపోయిందన్న అంచనాలతో వాల్‌స్ట్రీట్‌ నష్టాలకు గురవుతోంది. ఈ పరిణామాలు భారత్‌ వంటి వర్ధమాన దేశాల మార్కెట్లను మరింత దిగజారుస్తున్నాయి. ఇక గ్రీసులో నెలకొన్న రాజకీయ అనిశ్చితి ప్రభావం ప్రపంచ మార్కెట్లను పతనం వైపు నెడుతోంది. ఆ దేశం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థకు అప్పు చెల్లించాల్సిన గడువు దగ్గర పడుతుండటంతో మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడుతోంది. మరోవైపు అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో భారీగా ధరలు పడిపోతున్నాయి. తాజా ప్రపంచ పరిణామాలతో ముడిచమురు ధర బ్యారెల్‌కు 40 డాలర్ల దిగువకు దిగజారింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎగుమతిదారుగా ఉన్న చైనా సరఫరాలో మందగమనం చమురు ధర పతనానికి కారణమైంది.
శరవేగంగా మారుతున్న ప్రపంచ ఆర్థిక పరిణామాలు మరోసారి 1939 నాటి ఆర్థిక సంక్షోభం తప్పదనే సంకేతాలిస్తున్నాయి. 2008 ప్రాంతంలో ఆర్థిక మాంద్యం వచ్చినప్పటికీ బెయిలవుట్‌ వంటి కాయకల్ప చికిత్సలతో అమెరికా, యూరప్‌ దేశాలు నెట్టుకొచ్చాయి. సంక్షోభం సమసిపోయిందంటూ నిర్వహిస్తున్న ప్రచారంలో నిజం లేదని ప్రస్తుత పరిణామాలు తెలియజేస్తున్నాయి. ఈ పరిణామాలు నయా-ఉదారవాద ఆర్థిక విధానాల బండారాన్ని బయటపెడుతున్నాయి. ఈ విధానాలవల్లే మన దేశం, ప్రపంచం ఒక సంక్షోభం నుండి మరో సంక్షోభంలోకి వెళుతున్నా పెట్టుబడిదారీ ఆర్థిక పండితులు అవే విధానాలను మరింత లోతుగా అమలు చేయాలని కోరుతున్నారు. అంటే వారు మరింత తీవ్ర సంక్షోభాన్ని ఆహ్వానిస్తున్నారన్నమాట. ప్రభుత్వరంగాన్ని నిర్వీర్యం చేసి, ద్రవ్యపెట్టుబడిపై ఆధారపడితే సంక్షోభాన్ని కొనితెచ్చుకున్నట్లేనని ప్రపంచ అనుభవంతోనైనా తెలుసుకోవాలి. ఎఫ్‌ఐఐలు, ఎఫ్‌డిఐలు, వాటిపై ఆధారపడ్డ మేక్‌ ఇన్‌ ఇండియా జన బాహుళ్యం అభివృద్ధికి, ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఎంతమాత్రం పనికి రాదని మోడీ సర్కారు ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది.
Taags :

ప్రత్యేక హోదా సాధనతోనే రాష్ట్రాభివృద్ధి Posted On Mon 24 Aug 23:17:26.733116 2015

ప్రత్యేక హోదా సాధనతోనే రాష్ట్రాభివృద్ధి

Posted On Mon 24 Aug 23:17:26.733116 2015
           పరిశేష ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందటానికి ప్రత్యేకహోదాను సాధించటం అవసరం. ఉమ్మడి రాష్ట్రంలో 60 శాతానికి పైగా ఆదాయాన్నిచ్చే రాజధాని నగరం హైదరాబాద్‌ తెలంగాణకు రాజధానిగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధానిని నిర్మించుకోవాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా లోటులో ఉంది. రాష్ట్ర బడ్జెట్‌లో రూ.16,000 కోట్ల లోటు ఉంది. విశాఖపట్నం, తిరుపతి లాంటి చోట్ల మినహా పారిశ్రామికాభివృద్ధి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇటువంటి స్థితిలో రాష్ట్రం ఆభివృద్ధిని సాధించాలంటే రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించటం తప్పనిసరి. రాష్ట్ర విభజన సమయంలో ఆనాడు అధికారంలో ఉన్న యుపిఎ ప్రభుత్వం రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు ప్రత్యేకహోదా ఇస్తామని ప్రకటించింది. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న బిజెపి ఐదు సంవత్సరాలు కాదు. పది సంవత్సరాలు ప్రత్యేకహోదా కావాలని డిమాండు చేసింది. ఆనాడు రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న టిడిపి ప్రత్యేకహోదాతో పాటు రాజధాని నిర్మాణానికి ఐదు లక్షల కోట్ల రూపాయలు కావాలని డిమాండు చేసింది.
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అధికార, ప్రతిపక్షాల స్థానాలు మారాయి. ఆనాడు కేంద్రంలో ప్రతిపక్షంగా ఉన్న బిజెపి ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న టిడిపి ఇప్పుడు అధికారంలో ఉంది. ఆనాడు ప్రత్యేకహోదా ఐదు సంవత్సరాలు చాలదు, పది సంవత్సరాలు కావాలన్న బిజెపి ఇప్పుడు ప్రత్యేకహోదా ఇవ్వటం సాధ్యం కాదని చెబుతున్నది. ప్రత్యేకహోదాతో పాటు ఐదు లక్షల కోట్ల రూపాయలు కావాలని కోరిన టిడిపి ఆ రెండింటినీ పక్కన పెట్టి ప్యాకేజీ కావాలని అడగటానికి పరిమితమైంది. కేంద్రం ప్రత్యేకహోదా ఇవ్వదని స్పష్టమయింది. గతంలో ఒకసారి రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వటం సాధ్యం కాదని బిజెపి చెప్పింది. తిరిగి జులై 30వ తేదీన స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రోగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌ సహాయ మంత్రి రావు బీరేంద్రసింగ్‌ ఏ రాష్ట్రానికీ ప్రత్యేకహోదా ఇవ్వటం లేదని పార్లమెంటులో ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి స్పష్టమైన తర్వాత కూడా టిడిపి ప్రభుత్వం ప్రత్యేకహోదా సాధన కోసం రాష్ట్ర ప్రజానీకాన్ని పోరాటానికి సన్నద్ధం చేయటం కాకుండా ప్రజలను మభ్యపెట్టటానికి పూనుకున్నది. ఒకవైపున ఆ పార్టీ తరఫున కేంద్రమంత్రిగా ఉన్న సుజనాచౌదరి కొద్ది రోజుల్లో ప్రత్యేకహోదాపై ప్రకటన వస్తుందని చెబుతుండగా, మరోవైపున రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకహోదాతోనే అన్ని సమస్యలూ పరిష్కారం కావని, ప్యాకేజీయే మంచిదని చెబుతున్నారు. ప్రత్యేకహోదా ఇవ్వటం సాధ్యం కాదని చెబుతున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి ప్రజలను సన్నద్ధం చేయటానికి మారుగా, ప్రజలకు మాయమాటలు చెబుతూ మోసగించటానికి టిడిపి ప్రభుత్వం పూనుకున్నది. ఈ విధంగా ప్రత్యేకహోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ రాష్ట్ర ప్రజలను కలిసికట్టుగా మోసం చేయటానికి పూనుకున్నాయి.
ప్రత్యేకహోదా సాధన వల్ల ప్రయోజనాలు
ప్రత్యేకహోదాకు బదులుగా ప్యాకేజీ ఇస్తే ఎక్కువ ఉపయోగమని రాష్ట్ర ముఖ్యమంత్రి, టిడిపి నాయకులు ప్రచారం చేస్తున్నారు. ప్యాకేజీకి ఉండే విలువ ఏమిటి? అది ప్రభుత్వ ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. బీహార్‌లో ఎన్నికలు జరగనున్న సందర్భంగా ప్రధాని ఆ రాష్ట్రానికి రూ.1,25,000 కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. ఇది బీహార్‌ ఎన్నికలలో ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాన మంత్రి మోడీ చేసిన వాగ్దానం. పార్లమెంటు ఎన్నికలకు ముందు ప్రస్తుత ప్రధాని దేశ ప్రజలకు చాలా వాగ్దానాలు చేశారు. అవినీతిని రూపుమాపుతామని, విదేశాలలోని నల్లడబ్బును వెనక్కు తెప్పించి, ఒక్కొక్కరికి లక్షల రూపాయలు బ్యాంకులలో వేస్తామని చెప్పారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తామని, ఆర్థికలోటును భర్తీ చేస్తామని, రాజధాని నిర్మాణానికి సహాయం చేస్తామని చెప్పారు. వీటిలో ఏ ఒక్కదానికీ బిజెపి కట్టుబడి లేదు. అధికారాన్ని చేపట్టి సంవత్సరం దాటే సరికే అవినీతిలో కాంగ్రెస్‌ను తలదన్నింది. ఆర్థిక నేరస్తుడైన లలిత్‌మోడీ విదేశాలకు తప్పించుకొని వెళ్ళటానికి ఆ పార్టీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధరీ రాజే చట్ట విరుద్ధంగా సహకరించినట్లు స్పష్టమైంది. మధ్యప్రదేశ్‌లో జరిగిన వ్యాపం కుంభకోణంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భాగస్వామిగా ఉన్నారు. మహారాష్ట్రలో బిజెపి మంత్రులు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు. నల్లధనం వెనక్కు తెప్పించటం గురించి మాట్లాడటం లేదు. కొన్ని వేల కోట్ల రూపాయలు దాచుకున్నవారి వివరాలు చెప్పి ఇంతకన్నా చేసేదిలేదని చెబుతున్నారు. మన రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి, ఇప్పుడు సాధ్యం కాదంటున్నారు. ఆర్థికలోటు భర్తీ చేస్తామన్నారు. వివిధ రకాల పద్దుల కింద కొంత మొత్తాన్ని సర్దుబాటు చేయటం మినహా లోటు భర్తీ చేయటానికి నిధులు ఇవ్వలేదు. రాష్ట్రానికి నూతన రాజధాని నిర్మాణానికి సహాయం చేస్తామనేది వట్టిమాటగానే మిగిలింది. వీటితోపాటు ఇంకా అనేక వాగ్దానాలు వాగ్దానాలుగానే మిగిలాయి. ఎన్నికల వాగ్దానాలకే బిజెపి కొత్త అర్థం చెబుతున్నది. ఎన్నికల వాగ్దానాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలలో నెరవేర్చాలనే దానికి బదులుగా ఎన్నికలలో అధికారాన్ని సాధించటానికి సాధనాలుగా వినియోగించుకొని వదిలివేయటం అనే కొత్త అర్థాన్ని చెబుతున్నది. బీహార్‌కు ప్రకటించిన లక్షా 25 వేల కోట్ల రూపాయల ప్యాకేజీ కూడా ఎన్నికలలో బిజెపి అధికార సాధనకు వినియోగించుకోవటానికి మినహా ఆ రాష్ట్ర అభివృద్ధిపై బిజెపికి ఏ మాత్రం శ్రద్ధలేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత బీహారుకు ఇస్తామని చెబుతున్న ప్యాకేజీకి ఆంధ్రప్రదేశ్‌కు చేసిన వాగ్దానాలకు పట్టిన గతే పట్టినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.
రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేకహోదా తోడ్పడుతుంది. దాన్ని సాధిస్తే కేంద్రం నుంచి ఎక్కువ నిధులు గ్రాంటుగా వస్తాయి. రాష్ట్రాలకు కేంద్ర సాయం మూడు విధాలుగా జరుగుతుంది. మొదటిది, సాధారణ కేంద్ర సాయం. రెండవది, అదనపు కేంద్ర సాయం. మూడవది ప్రత్యేక కేంద్ర సాయం. రాష్ట్రాలకు సాధారణ కేంద్ర సాయం ద్వారానే ఎక్కువ వనరులు వస్తాయి. కేంద్రం ఇచ్చే నిధులలో ప్రత్యేకహోదా పొందిన రాష్ట్రాలకు 90 శాతం గ్రాంటుగానూ, 10 శాతం రుణంగానూ అందజేస్తారు. మిగతా రాష్ట్రాలకు 30 శాతం గ్రాంటుగానూ, 70 శాతం రుణంగానూ అందుతుంది. అందువలన ప్రత్యేకహోదా సాధిస్తే కేంద్ర నిధులు ఎక్కువ భాగం గ్రాంటుగా రావటం వలన రాష్ట్ర రుణభారం తగ్గుతుంది. కష్టమ్స్‌ సుంకాలు, ఎక్సైజ్‌ డ్యూటీలు, ఆదాయపు పన్ను, కార్పొరేట్‌ పన్నులలో రాయితీలు లభిస్తాయి. ఫలితంగా పారిశ్రామికాభివృద్ధికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ఈ రాయితీలను ఉపయోగించుకొని వెనుకబడిన ప్రాంతాలుగా ఉన్న ఉత్తరాంధ్ర, రాయలసీమలను పారిశ్రామికంగా అభివృద్ధి చేసే ప్రయత్నం చేయవచ్చు. పెరిగే ప్రభుత్వ ఆదాయాన్ని వెనుకబడిన ప్రాంతాలకు సాగు, తాగునీటిని అందించే ప్రాజెక్టులను ప్రాధాన్యతా ప్రాతిపదికపై పూర్తి చేయవచ్చు.
కానీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకహోదా సాధించటం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటానికి బదులుగా కేంద్రంతో బేరసారాలు జరపటం, రైతుల భూములు లాక్కొని పారిశ్రామికవేత్తలకు ఇవ్వటం ద్వారా పారిశ్రామికాభివృద్ధిని, రాష్ట్రాభివృద్ధిని సాధిస్తానని చెబుతున్నది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వటం సాధ్యం కాదని ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటిస్తే, ప్రత్యేకహోదా సాధిస్తామని చెబుతున్నారు. వాస్తవాలేమిటో ప్రజలకు చెప్పకుండా మభ్యపెడుతున్నారు. కేంద్రంతో ఘర్షణకు దిగే విధంగా ప్రకటనలు చేయవద్దని ముఖ్యమంత్రి మంత్రులను, పార్టీ నాయకులను హెచ్చరిస్తున్నారు. కేంద్ర ప్రతికూల వైఖరికి, వాగ్దాన భంగానికి వ్యతిరేకంగా ప్రజలను, రాజకీయపార్టీలను ఏకం చేసి కేంద్రంపై పోరాటం చేయాల్సిన ముఖ్యమంత్రి ఈ విధంగా వ్యవహరించటంలో అర్థమేమిటి? రాష్ట్ర ముఖ్యమంత్రికి, మంత్రులకు, టిడిపి నాయకులకు రాష్ట్రాభివృద్ధికన్నా తమ వ్యక్తిగత ప్రయోజనాలు నెరవేర్చుకోవటమే ప్రధానంగా ఉంది. పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారులుగా ఉన్నవారి ప్రయోజనాలు కేంద్రంతో ముడిబడి ఉన్నాయి. అందువల్లనే వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేంద్రంతో ఘర్షణ పడటానికి సిద్ధంగా లేరు. కేంద్రంతో ఘర్షణ పడటానికి బదులుగా అభివృద్ధి సాధించటానికనే పేరుతో రైతుల భూములు లాక్కోవటానికి ప్రభుత్వం పూనుకున్నది. రైతులలో భయాందోళనలు రేకెత్తించటం ద్వారా రాజధాని నిర్మాణానికి భూములు సమీకరించటంతో పాటు, పారిశ్రామికాభివృద్ధి కోసం ప్రతి జిల్లాలోనూ లక్ష ఎకరాల భూమిని సమీకరిస్తానని చెబుతున్నారు. ఏ పరిశ్రమ ఎప్పుడొస్తుందో తెలియకుండా భూములు సేకరించటం రాష్ట్రాభివృద్ధికి విఘాతం కలిగిస్తుంది. వ్యవసాయరంగానికి వినాశకరంగా పరిణమిస్తుంది. అందువలన రైతుల భూములు లాక్కొని అభివృద్ధి సాధిస్తామని ముఖ్యమంత్రి చెప్పేమాట రాష్ట్రాభివృద్ధికి దారితీయదు. దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు ప్రభుత్వంలోని ముఖ్యులు, పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులు భూములను, రాష్ట్ర సంపదను తమలో తాము పంచుకోవటానికి ఉపయోగపడుతుంది.
అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మార్గం రాష్ట్రాభివృద్ధికి దోహదం చేయదు. రాష్ట్రానికి ప్రత్యేకహోదాను సాధించటానికి ఈ ప్రభుత్వం కృషి చేయదు. ప్రజలు, రాజకీయ పార్టీలు కదిలి ఐక్యంగా కృషి చేయటం ద్వారానే ప్రత్యేకహోదా సాధించటం సాధ్యమౌతుంది. ఆ విధంగానే రాష్ట్రాభివృద్ధిని సాధించగలం.
- ఎ కోటిరెడ్డి
Taags :

పరిశ్రమాధిపతులకు డికెటి భూములు Posted On Mon 24 Aug 23:16:36.610241 2015

పరిశ్రమాధిపతులకు డికెటి భూములు

Posted On Mon 24 Aug 23:16:36.610241 2015
          చిత్తూరు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి పేరు మీద 1,60,938 ఎకరాలకు పైగా భూములను సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నది. ఇందులో ప్రధానంగా ఎస్‌సి, ఎస్‌టి, బలహీనవర్గాలు సాగుచేసుకుంటున్న డికెటి (అసైన్డ్‌) భూములపై కేంద్రీకరించి వివరాలను సేకరిస్తోంది. ఈ భూములు ఒకే దగ్గర వందల, వేల ఎకరాలు ఉంటున్నాయి. పాత చట్టాల ఆధారంగా ప్రభుత్వ అవసరాలకు తీసుకోవచ్చని భయపెట్టి తీసుకుంటున్నారు. దళితులు, గిరిజనులు, బలహీనవర్గాల వారు సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వకుండా, అది ప్రభుత్వ స్థలంగా చూపి లాక్కోవాలని చూస్తున్నారు. మొత్తం చిత్తూరు జిల్లాలో 66 మండలాలుండగా, అందులో 22 మండలాల నుంచి 1,60,938.58 ఎకరాల భూమి సేకరణకు సిద్ధంగా ఉన్నట్లు ఎపిఐఐసి వెబ్‌సైట్‌లోనూ, లాండ్‌ బ్యాంక్‌ ఖాతాలోనూ పొందుపరిచారు. ఇందులో డికెటి భూములే ప్రధానంగా ఉన్నాయి. పరిశ్రమాధిపతులను ఆకర్షించడానికి బాగా పంటలు పండే తూర్పు నియోజకవర్గాలైన శ్రీకాళహస్తి, సత్యవేడు మీద కేంద్రీకరించి సేకరిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే శ్రీసిటీ సెజ్‌కు 12 వేల ఎకరాలను సేకరించారు. ప్రస్తుతం 65 వేల ఎకరాలు సేకరించడానికి సిద్ధపడుతున్నారు. రేణిగుంట-చెన్నరు విమానాశ్రయం, కృష్ణపట్నం పోర్టు, కోల్‌కతా-చెన్నరు జాతీయ రహదారి, అంతర్గత రహదారులు, తెలుగుగంగ నీరు, భూగర్భ జలాలు అందుబాటులో ఉండటం పెద్దలకు వరంగా, పేదలకు శాపంగా మారింది. సోమశిల, స్వర్ణముఖి లింక్‌ కెనాల్‌ కూడా ఈ ప్రాంతంలో రాబోతోంది. నగరి-గాలేరు ద్వారా కొంత భాగం సాగవుతుంది. రెండు, మూడు పంటలు పండే భూములను విదేశీ, స్వదేశీ బడా పారిశ్రామికవేత్తలకు అప్పగించనున్నారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని నాలుగు మండలాలను గుర్తించారు. శ్రీకాళహస్తి మండలంలో 29 బ్లాక్‌ల్లో 8,836.92 ఎకరాలను గుర్తించారు. ఇందులో ఏడు కంప్యాక్ట్‌ బ్లాక్‌లుగా గుర్తించారు. వాంపల్లి, పోలి, ఎంపేడు, వెంగళాపల్లి, వేలవేడు, ఓబులాయపల్లి, రెడ్డిపల్లి కలిపి ఒక కంప్యాట్‌ బ్లాక్‌గా నిర్ణయించారు. ఇందులో 4,627.34 ఎకరాల భూమిని గుర్తించారు. ఇందులో 3,802.61 ఎకరాల డికెటి భూములున్నాయి. మిగిలింది ప్రభుత్వ భూమి. గ్రామాలుగా చూసినప్పుడు కూడా వేలవేడు సర్వే నెంబర్‌ 2లో 980 ఎకరాలు ఉంది. ఇందులో 880 ఎకరాలు డికెటి భూమి కాగా వంద ఎకరాలు ప్రభుత్వ భూమి. అదేవిధంగా వేలవేడు గ్రామంలో 2,016.85 ఎకరాల భూమి ఉంది. అందులో డికెటి 1,789.37 ఎకరాలు, ప్రభుత్వ భూమి 227.48 ఎకరాలు. అక్కుర్తి సర్వే నెంబర్‌ 302లో 600 ఎకరాలు డికెటి ఉంది. రామాపురం సర్వే నెంబర్‌ 1లో 790 ఎకరాలు డికెటి ఉంది. అదేవిధంగా ఇనగలూరు, పోలి, వెలంపాడు, ఎంపేడు, తదితర గ్రామాలున్నాయి. ఏర్పేడు మండలంలో ఇప్పటికే ఐఐటికి, ఐఐఎస్‌ఇఆర్‌కు వెయ్యి ఎకరాల భూమిని మేర్లపాక, పంగూరు గ్రామాల్లో సేకరించారు. మండలంలోని తొమ్మిది గ్రామాల్లో మొత్తం 9,212 ఎకరాలు ఉంది. అలాగే రేణిగుంట మండలంలో 17,877.89 ఎకరాలు (ఫారెస్టు భూమి 17,393.29), తొట్టంబేడు మండలంలో 2,262.26 ఎకరాలు, సత్యవేడు నియోజకవర్గంలోని ఏడు మండలాలకు గాను ఆరు మండలాల్లో 24,674.24 ఎకరాలను భూ సేకరణ చేపట్టనున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని చంద్రగిరి మండలంలో 4,291.72 ఎకరాలు సేకరించడానికి పూనుకున్నారు. కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లిలో 1,454.91 ఎకరాలు, శాంతిపురంలో 273.71 ఎకరాలు, 388.67 ఎకరాలు, ఇవిగాక రామకుప్పం, శాంతిపురంలలో విమానాశ్రయానికి 1,200 ఎకరాలు సేకరించాలని సర్వేకు పూనుకున్నారు. పీలేరు నియోజకవర్గంలో ఒక్క వాయల్పాడు మండలంలో నిమ్జ్‌ కొరకు 12,818.51 ఎకరాలను సేకరించనున్నారు. కలికిరిలో 1,650 ఎకరాలు, గుర్రంకొండలో 1,036 ఎకరాలు సేకరించనున్నారు. పలమనేరు నియోజకవర్గంలో గంగవరం మండలంలో 1,290 ఎకరాలు సేకరించనున్నారు.
పై లెక్కలన్నీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినవి. ఇప్పటికే పల్లెల్లో పాసుపుస్తకాలు, ఆధార్‌కార్డులు, బ్యాంక్‌ అకౌంట్‌ నెంబర్లు సేకరిస్తున్నారు. ఎదిరిస్తేనే భూములు కాపాడుకుంటామని, తమ భూములను కాపాడుకోవాలంటే ప్రతిఘటన తప్ప మరోమార్గం లేదని పేదలు గ్రహించారు. అక్రమ కేసులు పెడితే ఐదు గంటల పాటు పోలీసు స్టేషన్‌ను ముట్టడించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు పర్యటించినప్పుడు సాదరంగా ఆహ్వానించి జేజేలు పలికారు. తమకు అండగా ఉన్నందుకు ఆనందాన్ని వ్యక్తపరిచారు. కమిటీగా ఏర్పడి, సర్వేలు కూడా చేయనీయమని పేర్కొన్నారు. ఏర్పేడు మండలంలో జాతీయ రహదారిని దిగ్బంధనం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం, సిపిఎం చేపట్టే ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వ కపట బుద్ధిని అర్థం చేసుకుని ఎదిరిస్తున్నారు. భవిష్యత్‌లో ఈ పోరాటాలు ఉధృతమవుతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.
- వందవాసి నాగరాజు
(వ్యాసకర్త వ్యవసాయ కార్మిక సంఘం చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి)
Taags :

ఆత్మహత్యల భారతం Posted On Mon 24 Aug 23:15:54.271967

ఆత్మహత్యల భారతం

Posted On Mon 24 Aug 23:15:54.271967 2015
          నేడు భారతదేశంలో ప్రతి 42 నిమిషాలకు ఒక రైతన్న ఆత్మహత్య చేసుకుంటున్నాడు. 'అచ్ఛే దిన్‌'. జాతీయ నేరాల రికార్డు బ్యూరో(ఎన్‌సిఆర్‌బి) ప్రకారం 2014లో దేశంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్య 12,360. రైతుల ఆత్మహత్యల సంఖ్య తక్కువ చేసి చూపించటానికి ఎన్‌సిఆర్‌బి తక్కువ ప్రయత్నమేమీ చేయలేదు. నిజాన్ని మరుగుపర్చటానికి రైతుల ఆత్మహత్యలను రెండు భాగాలుగా విభజించింది. ఒకటి రైతు, రెండోది వ్యవసాయ కార్మికులు. దీనివల్ల రైతు ఆత్మహత్యల సంఖ్య 67 శాతం తగ్గిపోయింది. కానీ జరుగుతున్నదేమంటే చారిత్రకంగానే వ్యవసాయ కార్మికులు కూడా రైతులలో భాగంగానే పరిగణించబడతారు. 6,050 మంది రైతులు, 6,310 మంది వ్యవసాయ కార్మికులు. ఈ రెండు గణాంకాలూ కలిపితే 2014లో రైతు ఆత్మహత్యల సంఖ్య 12,360 అయింది. 2013తో పోలిస్తే 5 శాతం ఎక్కువ. రైతు ఆత్మహత్యల ఈ మృత్యు ఊరేగింపు నిజానికి భయంకరమైన వ్యవసాయ సంక్షోభానికి నిదర్శనం. ఇది గత కొన్ని దశాబ్దాలుగా ధారావాహికగా కొనసాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తామని వాగ్దానాలెన్ని కురిపించినా ఈ కీలకమైన రంగం అత్యంత నిర్లక్ష్యానికి గురైంది. కానీ వ్యవసాయంతోనే జనాభాలో 60 శాతం మంది జీవితం ముడిబడి ఉంది. రైతులను రెండు రాజకీయ ఉద్దేశాల కోసమే వాడుకోవటం జరుగుతోంది. అవి రెండు బ్యాంకులు. ఒకటి ఓటు బ్యాంకు, రెండోది భూమి బ్యాంకు. నేడు ఇక కేవలం విదర్భ లేక మహారాష్ట్రలోనే కాదు, మహమ్మారిలా ఆత్మహత్యల సంఘటనలు ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక, పంజాబ్‌, హర్యానాలకు వ్యాపించాయి. 2014 ఎన్‌సిఆర్‌బి గణాంకాల ప్రకారం ఆత్మహత్యలు చేసుకున్న వారిలో ప్రతి ముగ్గురిలో ఒకరు మహారాష్ట్రకు చెందిన వారు. అక్కడ ఆత్మహత్యల సంఖ్య 4,004. 1,347 మందితో తెలంగాణ రెండోదిగా ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో 2011లో ఆత్మహత్యలు సున్నా, 2012లో నలుగురు, 2013లో మరలా సున్నా. గత ఏడాది మాత్రం ఒక్కసారిగా 755కు పెరిగిపోయింది.
ఆత్మహత్యల లెక్కింపు పద్ధతి గురించి చాలా ప్రశ్నలున్నాయి. ఉదాహరణకు రైతు కుటుంబంలో మహిళల ఆత్మహత్యను లెక్కలోకి తీసుకోవటంలో ఎన్నో సమస్యలున్నాయి. ఎందుకంటే ఎక్కువ సందర్భాల్లో భూమి పట్టా వారి పేర ఉండదు. ఆత్మహత్యల కారణాల్లో అగ్ర స్థానాన ఉన్నది రుణాలు. వాటి బరువుకు రైతులు కుదేలవటం. చండీగఢ్‌ కేంద్రంగా పని చేసున్న రీసెర్చ్‌ ఇన్‌ రూరల్‌ అండ్‌ ఇండిస్టియల్‌ డెవలప్‌మెంట్‌(సిఆర్‌ఆర్‌ఐడి) సంస్థ ఒక సమీక్షలో పంజాబ్‌లో గత దశాబ్దంలో సగటు వ్యవసాయ రుణాలు పెరిగి 22 ఇంతలు అయినాయి. 2004లో ప్రతి కుటుంబం సగటున రూ.25 వేల రుణం కలిగి ఉండగా, 2014లో అది పెరిగి ప్రతి కుటుంబానికీ రూ.5,60,000 అయింది. జాబితాలో అగ్ర స్థానంలో ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌ ఉంది. అక్కడ సగటు కుటుంబ రుణం రూ.7,54,000. తరువాత రూ.6,48,000లతో కర్ణాటక ఉంది. పంజాబ్‌లో గ్రామీణ కుటుంబాల్లో 98 శాతం రుణ భారంతో చితికి పోయే పరిస్థితిలో ఉన్నట్లు సిఆర్‌ఆర్‌ఐడి ఒక సమీక్షలో పేర్కొంది. వారి సగటు రుణం సగటు కుటుంబ ఆదాయానికి 96 శాతంగా ఉంది.
రోజులు మంచో చెడ్డో. వ్యవసాయ రంగంలోనైతే సంక్షోభం పరుగుపెడుతోంది. స్వాతంత్య్రం తరువాత సాగుకి పనికొచ్చే భూమి విస్తీర్ణం తగ్గడం ఇదే ప్రథమం. సాగు చేసే భూమి పరిమాణం కూడా తగ్గుతున్నది. ఇది ఒక ఆత్మహత్యల ఆర్థిక వ్యవస్థ. వ్యవసాయం ఖర్చు పెరుగుతున్నది. ఎరువులు, విత్తనాలు, క్రిమి సంహారకాలు, ఇతర ఉపకరణాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. విద్యుత్తు ఖర్చు పెరుగుతున్నది. సబ్సిడీలు తగ్గుతున్నాయి. అన్నిటి కంటే కనీస మద్దతు ధర పెరుగుదల రేటు చాలా స్వల్పంగా ఉంటోంది. పంట ధర పడిపోతున్నది. రైతులు సాగు మానుకుంటున్నారు. గతి లేక వడ్డీ వ్యాపారస్తుల దగ్గర ఎక్కువ వడ్డీకి రుణం తీసుకోవాల్సి వస్తోంది. తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ ఆత్మహత్యల సంఖ్య పెరుగుతూనే పోతోంది. అకాల వర్షాల వల్ల 18 కోట్ల హెక్టార్ల భూమిలో పంట నష్టం జరిగింది. ప్రభుత్వం నిర్వికారంగా ఉంది. జిడిపి మత్తులో మునిగి ఉంది. రైతు పంట పండించటానికి అయ్యే ఖర్చుకు కనీసం 50 శాతం ఎక్కువ ధర ఇవ్వటం జరుగుతుందని మోడీ చెప్పారు. కానీ ఆ వాగ్దానం అంతర్థానమయింది. కార్పొరేటు మోజులో మైమరచి దాన్ని మరిచారు.
- వేదుల రామకృష్ణ
Taags :

వ్యాసం


పెట్టుబడిదారులకు వూడిగం చేస్తూ, పేదల పొట్టగొట్టుతున్న మన  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.
7లక్షలు కోట్లు రూపాయలు స్టాక్ మార్కెట్ నుండి తరలివెళింది. రూపాయ పతనమైంది. రూపాయ పతనానికి కారణం నేడు మన ప్రధాని మోడీ అనుసరిస్తున్న విధానాలే. డాలర్ శక్తిని పెంచుతున్న మోడీ.

Sunday, August 23, 2015

Sez nellore


Sri city

Tag: Sri City SEZ

Japanese hub to come up in Nellore district

A Japanese industrial cluster is expected to come up between Krishnapatnam and Sri City (near Tada) in the Nellore district of Andhra Pradesh. The Japanese cluster is expected to further catalyze already vibrant industrial scene in Nellore district. The region includes Menakur SEZ, Mambattu SEZ, Pantapalem Industrial Park and Ankulapur Industrial Park of APIIC apart from Sri City SEZ in the private sector.
japan-flag
The Government of India announced that Krishnapatnam will be made an industrial smart city and will be made part of the Chennai-Bengaluru industrial corridor, which is expected to receive substantial Japanese investments.

UK firm MMD to invest Rs 100 crore in Sri City SEZ near Nellore

MMD (India) Private Ltd, a subsidiary of UK-based MMD Mining Machinery Developments Ltd, has laid the foundation stone for its upcoming production facility at Sri City SEZ near Nellore. MMD offers mining machinery like mineral sizers, heavy duty apron plate feeders, caterpillar chains and rollers, and sizer stations. It serves cement, coal, industrial minerals, energy/oil, recycling, tunnelling, and precious metals industries, etc.
MMD-Logo mmd-primary-sizer
MMD is investing about Rs 100 crore to manufacture mining machinery from its Sri City plant which is expected to be commissioned by October 2014. The plant may provide employment to about 200 people. MMD is the fifth major industry from the UK to select Sri City SEZ as its manufacturing base.

Nittan Valves setting up a Rs100 crore factory at Sri City SEZ near Nellore

Nittan Valve Co Ltd, the Japanese auto component maker, is setting up its first Indian manufacturing facility at the Sri City SEZ near Nellore in Andhra Pradesh. Nittan makes valves and other auto parts for Yamaha, Honda and other vehicle makers. It is investing Rs 100 crore to set up the facility in a seven acre plot in Sri City SEZ.
Nittan Valves Sri City SEZ Nellore

Nittan’s valve factory in India is expected to start commercial production by July 2014. Nittan established the Indian subsidiary Nittan India Tech Pvt. Ltd. in Mar 2013 to setup the valve manufacturing base in India.
http://www.niv.co.jp/eng.html

Kusakabe metal tubes/pipes made at Sri City SEZ, Nellore

Kusakabe India Pvt Ltd, a subsidiary of Kusakabe Japan is setting up a metal tube/pipe mill at Sri City SEZ near Tada in Nellore district. The Rs25 crore plant is expected to employ about 40 people. The 1/2″ to 20″ pipes made of steel, stainless steel, aluminium and copper find uses in automotive, oil pipelines, buildings, furniture, etc.
kusakabe sricity sez nellore


Nippon Seiki automotive instrument clusters plant at Sri City SEZ, Nellore

Nippon Seiki of Japan which manufactures automotive instrument clusters for 2 and 4 wheelers is setting up an auto components plant at Sri City SEZ near Tada in Nellore district. It already has two plants in Durainallur (Taminadu) and Manesar (Haryan) that manufacture instrument clusters for automobiles.
Nippon-Seiki-Sriicity SEZ Nellore
Nippon Seiki is also into manufacture of sensors, home appliances, LCD and OLED displays, etc. Established in 1946, Nippon Seiki operates through 21 local companies in over 11 countries.
■ NS Instruments India Private Ltd.
Survey No:139 to 157/2, Durainallur Village, Puduvoyal Post,Ponneri Taluk, Tamilnadu – 601 206
No.35-1, New No.4-1, 9th Street, U-Block, Anna Nager, Chennai – 600 040
Tel: +91-44-28304123 (Office)
Fax: +91-44-28262447 (Office)
■ JNS Instruments Ltd.
Plot No.4 Imt Manesar, Gurgaon, Haryana, INDIA
Tel: +91-124-2290731
Fax: +91-124-2290743