నోట్ల రద్దు - ప్రజావ్యతిరేక చర్య
నవంబర్ 8వ తేదీ రాత్రి 8 గంటల ప్రాంతంలో జాతీయ టెలివిజన్ ఛానల్ ముందుకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఆ రోజు అర్ధరాత్రి నుండే.. అంటే మరికొన్ని గంటల సమయంలో నే 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో నల్లధనం జాడ లేకుండా చేయడానికి ఈ అసాధారణ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆయన సమర్థించుకున్నారు. మరో వాదన కూడా ఆయన వినిపించారు.
ఉగ్రవాదుల ద్వారా దేశంలోకి ప్రవ హిస్తున్న నకిలీ కరెన్సీని కూడా ఈ చర్యతో నిరోధించవచ్చని చెప్పారు. మోడీ ఈ ప్రకటన చేసిన తరువాత ఉత్సాహవంతులైన కొందరు ప్రభుత్వ మద్దతు దారులు ఈ చర్యను మెరుపు దాడి (సర్జికల్ స్ట్రైక్)తో పోల్చారు. ఉగ్రవాదంపై చేసిన మెరుపు దాడిగా వారు దీనిని అభివర్ణించారు.
నకిలీ కరెన్సీ విషయానికి తరువాత వద్దాం. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా సంప్రదాయాలను వదిలి మరీ ప్రచారం కల్పించిన నల్లధనం విషయాన్ని ముందుగా పరిశీలిద్దాం. రూ.500, 1000 నోట్ల రద్దుతో దేశంలో నల్లధనం లేకుండా పోతుందన్న వాదన కేవలం అవగాహన లేకుండా చేసేదే. నల్లధన స్వభావం, దాని విస్తృతిని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేని వారే ఈ తరహా వాదనను ముందుకు తెస్తున్నారు. వాస్తవానికి నల్లధనం చంచలమైన స్వభావం కలది. ఇది ఒకే చోట స్థిరంగా ఉండదు. ట్రంకు పెట్టెల్లో, పరుపుల్లో, నేలమాళిగల్లో దాచి పెట్టిన సొమ్ము కట్టలు, కట్టలుగా పెద్ద నోట్ల రద్దుతో బయటకు వస్తుందని ప్రభుత్వ వాదనను సమర్థించేవారి భావన. ఈ ఆలోచనతోనే 500, 1000 రూపాయల నోట్లు రద్దు అయిన తరువాత, వాటి మార్పిడి కోసం నల్లధనాన్ని నిలువ ఉంచుకున్న వాళ్లు ఆ భారీ మొత్తం మార్పిడి కోసం బ్యాంకులకు వస్తారని, సరైన లెక్కలు లేకుండా పెద్ద మొత్తంలో రద్దయిన నోట్లను తీసుకువచ్చే వారిని బ్యాంకులు అనుమానించి పన్నుల శాఖ అధికారులకు తెలియచేస్తే, ఆ నల్ల ధనానికి పన్ను వేసి దోషులను శిక్షిస్తారని వారు చెబుతున్నారు. ఈ విధంగా నల్లధనం తొలగి పోవడంతో పాటు, భవిష్యత్తులో ఇటువంటి పని మళ్లీ చేయకుండా ఉంటారని వారు చెబుతున్నారు.
ఈ వాదనలోని రెండవ భాగాన్ని పరిశీలిద్దాం ఒక వ్యక్తి 20 కోట్ల రూపాయల నల్ల ధనాన్ని 500, వెయ్యినోట్ల రూపంలో తన ఇంట్లోనే ఉంచుకున్నాడనుకుందాం. కొత్తగా చట్ట బద్ధమైన నగదు రూపంలోకి మార్చుకోవడానికి ఆ 20 కోట్ల రూపాయలను ఒకేసారి ఆయన బ్యాంకు వద్దకు తీసుకురాడు. (అలా తీసుకురావాలని భావించినా చట్టం ఒప్పుకోదు) దానికి బదులుగా ఆ భారీ మొత్తాన్ని చిన్నచిన్న భాగాలుగా విభజించి బ్యాంకు వద్దకు పంపుతాడు. డిసెంబర్ 30వ తేదిలోపు చిన్న మొత్తాలను మార్చుకోవడానికి అవకాశం ఉంది. ఈ సుదీర్ఘమైన ప్రక్రియ కూడా అవసరం లేదు. ఆ పని చేయడానికి త్వరలోనే కొత్త దళారీ వ్యవస్థ తెరపైకి వస్తుంది. పాత నోట్లను తీసుకుని కొత్త నోట్లను అందించడమే వీరి పని. దీనికి గాను వారు కొంత మొత్తాన్ని తమ సేవల ఫీజుగా తీసుకుంటారు. వాస్తవానికి ఈ తరహా దళారీ వ్యవస్థ చిన్న స్థాయిలో ఇప్పటికే ప్రారంభమైనట్లు వార్తలు వస్తున్నాయి. భవిష్యత్తులో అది మరింతగా వ్యవస్థీకృతమై భారీ మొత్తంలో మార్పిడికి కూడా సిద్ధమౌతుంది. ఈ పరిమితులను దృష్టిలో ఉంచుకునే పలువురు నిపుణులు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం స్వల్ప ఫలితాలనే చూపుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమైన విషయమేమిటంటే, నల్లధనం అన్న పదమే అసంబద్ధమైనది. బహిరంగంగా చూపలేని, బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయడానికి సాధ్యం కాని, రహస్యంగా నోట్ల కట్టల రూపంలో పరుపుల్లోనో, కంటైనర్లలోనో పెట్టి భూమిలో దాచి పెట్టడమనే అర్థాన్ని ఈ పదం ఇస్తోంది. నిజానికి నల్లధనం అంటే అన్ని రకాల చట్ట విరుద్ధమైన ఆర్థిక కార్యక్రమాలు మన మనసులోకి రావాలి. స్మగ్లింగ్, డ్రగ్ వ్యాపారం, ఉగ్రవాద కార్యక్రమాల కోసం ఆయుధాలు సంపాదించడం, చట్టబద్ధంగా అనుమతించిన దాని కన్నా ఎక్కువ తీసుకోవడం, పన్నులు చెల్లించక పోవడం తదితరాలన్నీ ఈ కోవలోకి రావాలి.
ఉదాహరణకు 100 టన్నుల ఖనిజాన్ని వెలికితీసి, పన్ను తగ్గించుకోవడం కోసం 80 టన్నులుగానే లెక్క చూపితే నల్లధనం కిందకే వస్తుంది. 100 డాలర్లకు విలువైన సరుకును ఎగుమతి చేసి, 80 డాలర్లగానే లెక్క చూపి మిగిలిన 20 డాలర్లను విదేశాల్లోని స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసినా అది చట్ట వ్యతిరేకంగా జమ చేసిన నల్లధనమే అవుతుంది. రూపాయలను హవాలా పద్ధతుల్లో విదేశీ కరెన్సీలోకి మార్చి ఇతర దేశాల్లో డిపాజిట్ చేసినా నల్లధనమే! ఒక్క మాటలో చెప్పాలంటే బహిరంగంగా ప్రకటించని ఆర్థిక కార్యకలాపాలన్నీ నల్లధనం కిందకే వస్తాయి.
నల్లధనం అనేది ఒక ప్రవాహం, కదలిక లేని జడ పదార్ధం ఏ మాత్రం కాదు. దానికి బదులుగా ఇది నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. రూపాలను మార్చుకుంటూ ఉంటుంది. నోట్లను కట్టలు, కట్టలుగా ఒక దగ్గర పడేసినందువల్ల ఎటువంటి ప్రయోజనమూ లేదు. అది లాభాలను సృష్టించదు. దానిని దాచిన వారికీ అది ఉపయోగపడదు. వాణిజ్య కార్యకలాపాలను విశ్లేషించిన కారల్‌మార్క్స్ ఈ తరహా నల్ల వ్యవహారాల పైనా వ్యాఖ్యానించారు. 'నగదును నిలువ చేసినందువల్ల లాభాలు రావు. లాభం కోసం నగదును చలామణిలో ఉంచాలి. దీనిలో మొదటి దానిని (నగదును నిలువ ఉంచడం) పిసినారి చేస్తారు. చలామణిలోకి తెచ్చి లాభాలు ఆర్జించాలని పెట్టుబడిదారులు భావిస్తారు. అందువల్ల నల్ల కార్యక్రమాల్లో నిమగమయ్యేది, నల్ల ధనాన్ని నిలువ చేసేది పెట్టుబడిదారులే కానీ పిసినారులు కాదు.
వ్యాపారంలో స్వల్ప, దీర్ఘకాలిక అవసరాల కోసం కొంత ధనాన్ని నిలువ చేసుకునే విషయం నిజమే! కానీ అది చట్టబద్ధమైన డబ్బు విషయంలోనే! నల్ల ధనం విషయంలో దీనికి భిన్నం. చలామణిలో చట్టబద్ధమైన నగదు మాత్రమే ఉంటుందని, నల్లధనం ఉండదనేది పూర్తిగా అవాస్తవం. నిజానికి చట్టబద్ధమైన నగదు చలామణిలో ఉన్నప్పుడు మాత్రమే నల్లధనం కూడా మారగలుగుతుంది. చలామణిలో ఉన్న కరెన్సీని నిలిపి వేయడమంటే రెండు రకాల నగదును అడ్డుకోవడమే! వాస్తవానికి నల్లధనాన్ని వెలికి తీయడమంటే నగదు నిల్వలపై దాడి చేయడం కాదు. నల్ల కార్యకలాపాలను నిర్వహించే వారిని పట్టుకోవడం. దీనికి చిత్తశుద్ధి, నిజాయతీ, బాధ్యతాయుతమైన వ్యవస్థ, నిష్ఫక్షపాతంగా వ్యవహరించే దర్యాప్తు బృందం కావాలి.
కంప్యూటర్లు వినియోగంలోకి రావడానికి చాలా రోజుల ముందు, బ్రిటిష్ ఇంటర్నల్ రెవిన్యూ సర్వీసెస్ అనే సంస్థకు ఆ దేశంలో పన్ను ఎగవేతదారులను పట్టుకోవడంలో మంచి పేరు ఉండేది. పూర్తి స్థాయి దర్యాప్తుతో ఆధారాలతో సహా ఆ సంస్థ ఆ పని చేసేది. భారత్‌తో పోలిస్తే బ్రిటన్ చాలా చిన్న దేశం. పన్నుల యంత్రాంగం పెద్దదిగా ఉండి, అవసరాలకు తగినట్టుగా ఉంటే నల్లధనాన్ని కనీసం ఆ దేశంలో నియంత్రించగలమని ఈ ఉదాహరణ రుజువు చేస్తోంది. సమర్థమైన పన్నుల విధానం, ఒపికతో దర్యాప్తు చేసే యంత్రాంగం ఉంటే, దీనిని ఏ దేశమైనా సాధించవచ్చు.
నల్ల కార్యకలాపాల్లో గణనీయమైన భాగం విదేశాల్లోని బ్యాంకుల ద్వారా నిర్వహిస్తున్నారు. నిజానికి ఇదే పెద్ద మొత్తంలో ఉంటుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. నరేంద్రమోడీ తన ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్నే లేవనెత్తారు. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తీసుకువస్తానని ఆయన ప్రకటించారు. అప్పట్లో మోడీ కూడా నల్లధనమనే పదాన్ని విస్తృత అర్థంలో వాడలేదు. నగదు నిల్వలను దృష్టిలో ఉంచుకునే ఆయన ఆ హామీ ఇచ్చారు. విదేశీ బ్యాంకుల్లోనే నల్ల కార్యకలాపాలకు ఉపయో గించే నగదు నిల్వలు భారీగా ఉన్న విషయం నిజమైతే 500, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసినందువల్ల వచ్చే ఫలితానికన్నా సామాన్యులు ఎదుర్కొనే కష్టాలే ఎక్కువ.
భారతదేశంలో కరెన్సీ నోట్లను రద్దు చేయడం ఇదే మొదటిసారి కాదు. 1946లో వెయ్యి, పదివేల రూపాయల నోట్లను రద్దు చేశారు. 1978లో మొరార్జీ దేశారు ప్రభుత్వం వెయ్యి, 5 వేలు, పదివేల రూపాయలనోట్లను జనవరి 16 అర్ధరాత్రి నుండి రద్దు చేసింది. ఆ రెండు సందర్భాల్లోనూ సామాన్య ప్రజలు ఎటువంటి కష్టాలకూ గురి కాలేదు. నిజానికి ఆ రోజుల్లో సామాన్యులకు ఆ నోట్లు అందుబాటులో ఉండేవి కావు. వారు వాటిని చూసే అవకాశం తాజాగా మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం నల్లధనంపై ఎటువంటి ప్రభావమూ చూపే అవకాశం లేదు. అయితే, సామాన్య ప్రజలకు మాత్రం తీవ్ర స్థాయిలో కష్టాలను మిగిల్చింది.
పెద్దనోట్ల రద్దు నల్లధనంపై అసలు ప్రభావం చూపదా అని కొందరు ప్రశ్నిస్తుంటారు. అది భారత్ వంటి నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుండి దూరంగా జరిగే తరలింపును సూచిస్తుంది. నగదు రహిత వ్యవస్థను సృష్టించినప్పటికీ, విదేశీ బ్యాంకులు కేంద్రంగా నల్ల కార్యక్రమాలు నిర్వహించేవారు తప్పించుకుంటూనే ఉంటారు. అసలు నగదు రహిత భారతదేశమనే ఊహే నేల విడిచి సాము చేసే ప్రక్రియ. సామాన్యుల కష్టాల మీద (నరేంద్ర మోడీ ప్రజలందరికీ బ్యాంకు సేవలు అందుబాటులోకి తెస్తామని ఎంతగా చెప్పినప్పటికీ) ఏ మాత్రం అవగాహనలేని వారే ఇటువంటివి ప్రతిపాదిస్తారు. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ సామాన్యులకు అదనపు భారంగానూ, వారి కష్టాలను మరింత పెంచేదిగానూ మారుతుంది.
ఇక టెర్రరిస్టుల ద్వారా దేశంలోకి వచ్చే నకిలీ కరెన్సీకి కళ్లెం పడుతుందన్న వాదనను పరిశీలిస్తాం. ఇది కొత్తగా ముద్రించే నోట్లలో వినియోగించే సాంకేతికను బట్టి ఉంటుంది కాబట్టి, ఆ వాదనను ప్రస్తుతానికి అంగీకరిద్దాం. అయితే, ప్రస్తుత కరెన్సీని రద్దు చేసి కొత్తగా ప్రవేశపెట్టే నోట్లు సైతం కాల క్రమేణా నకిలీల బారిన పడక తప్పదు. నకిలీ నోట్లు చలామణీలో ఉన్నాయన్న సంగతి ప్రభుత్వానికి అప్పటికప్పుడు తెలిసిన విషయమేమీ కాదు. అటువంటప్పుడు నవంబర్ 8వ తేదీ రాత్రి చేసిన ఆకస్మిక ప్రకటనతో ప్రభుత్వం ఆశించిందేమిటి? సామాన్య ప్రజల భద్రత, సౌకర్యాలపై అనూహ్య, ఆశ్చర్యకరమైన, రీతిలో సాగిన సామూహిక దాడిన ప్రభుత్వం ఆపడానికి ప్రభుత్వం ఎందుకు సిద్ధపడలేదు?
ఆధునిక భారత చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా మోడీ ప్రభుత్వం సామాన్యులపై దాడి చేసింది. వలస ప్రభుత్వం కూడా సామాన్యుల ప్రజల సౌకర్యాల విషయలో మోడీ ప్రభుత్వం కన్నా విచక్షణతో వ్యవహరించింది. ఆ ప్రభుత్వం సమాజంలో అతి కొద్ది మందిగా ఉన్న సూపర్ ధనవంతులకు అందుబాటులో ఉన్న నోట్లను మాత్రమే రద్దు చేసింది. ప్రస్తుత ఈ అత్యవసర చర్య మోడీ ప్రభుత్వం చేపడుతున్న అనేక ఇతర అంశాల మాదిరే అప్రకటిత ఎమర్జన్సీ లాంటిది. ఇది ఎంతగా తెలివి మాలిన చర్యో ప్రజలకు అంతగా వ్యతిరేకమైనది.
- ప్రభాత్ పట్నాయక్

No comments:
Post a Comment