Wednesday, November 30, 2016

 'నోట్ల రద్దు' నిరంకుశత్వం
ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్‌ గ్రహీత అమర్త్యసేన్‌ ||
కేంద్రప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం నిరంకుశ చర్య అని ప్రముఖ ఆర్థికవేత్త, భారతరత్న, నోబెల్‌ గ్రహీత అమర్త్యసేన్‌ అభివర్ణించారు. కొంతకాలంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థను మోడీ మళ్లీ వెనక్కి తీసుకెళ్లారని ఆయన విమర్శించారు. అమర్త్యసేన్‌ బుధవారం ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు. కేంద్రం నిర్ణయం నమ్మకంపై ఆధారపడిన ఆర్థిక మూలా లకు అడ్డుకట్ట వేసే చర్య అని అన్నారు. బ్యాంకులతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని మోడీ నిర్ణయం బలహీనప రిచిందని, ప్రజల ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసిందని తెలిపారు. మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో భారత ఆర్థిక వ్యవస్థకు పెను విపత్తుగా మారే ప్రమాదమున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్టుబడిదారీ విధానానికి తానేమీ అనుకూలం కాదని ఆయన స్పష్టం చేశారు. నల్లధనంపై పోరాటాన్ని అందరితో పాటు తాను కూడా స్వాగతిస్తానని చెప్పారు. నల్లధనం అతి కొద్ది మంది చేతుల్లోనే ఉన్నదని, దానిని వెలికి తెచ్చేందుకు చిన్న చర్య చేపడితే చాలన్నారు. కానీ దేశ ప్రజలందరినీ ఇబ్బందులకు గురి చేసేలా మోడీ తీసుకున్న నిర్ణయం సరికాదన్నారు. నల్లధనంపై జరిగే పోరాటం తెలివైనదిగా, మానవత్వం కలిగినదిగా ఉండాలన్నారు. కానీ కేంద్రం తీసుకున్న నిర్ణయం వెనుక ఇవేమీ లేవన్నారు. నోట్ల రద్దుతో నల్లధనం బయటికొస్తుందని, అవినీతి అంతమవుతుందని తాను నమ్మడం లేదని చెప్పారు. విదేశాల్లో దాచిన నల్లధనాన్ని త్వరలోనే వెనక్కి రప్పిస్తామని మోడీ గతంలో చెప్పారని, ఆ విషయంపై ఇంతవరకు పురోగతి లేదని చెప్పారు. నోట్ల రద్దు నేపథ్యంలో మోడీ ఇస్తున్న హామీలది కూడా ఇదే పరిస్థితి అని తెలిపారు. కేంద్రం నిర్ణయంతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment